ఆంధ్రప్రదేశ్ పోలీసులు వరుస పెట్టి వివాదాల్లో ఉంటున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నేతల పై పోలీసుల వైఖరి, డీజీపీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. ఎన్ని విమర్శలు వచ్చినా, కోర్టుల్లో మొట్టికాయల పడినా, పోలీసులు లెక్క చేయటం లేదు. తాజాగా హైకోర్టు మరోసారి పోలీసులు పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి దియ్యా రామకృష్ణ కేసులో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జరీ చేసింది. పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేసారు అంటూ, దియ్యా రామకృష్ణ హైకోర్టులో కేసు వేసారు. కోర్టులో అరెస్ట్ చేయవద్దు అంటూ స్టే ఇచ్చినా, పిడుగురాళ్ల  పోలీసులు అరెస్ట్ చేసారని కోర్టుకు తెలిపారు. న్యాయవాదులు కోర్టు దిక్కరణ కేసుతో పాటుగా, పరువు నష్టం కేసు కూడా దాఖలు చేసారు. దీంతో పోలీసులు తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటీషనర్ వాదన వింటాం అని, వారి వాదన నిజ్కం అని తేలితే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది అంటూ, పోలీసులను హైకోర్టు హెచ్చరించింది.

మా ఎన్నికలు అయిపోయి, రెండు వారాలు అవుతున్నా, ఇంకా ఆ వేడి కొనసాగుతూనే ఉంది. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వైసిపి పార్టీ ప్రమేయం పై సంచలన ఆధారాలను ప్రకాష్ రాజ్ బయట పెట్టారు. నిన్న ప్రకాష్ రాజ్ చేసిన ఫిర్యాదుతో మరో వివాదం చెలరేగింది. మా ఎన్నికల సమయంలో, పోలింగ్ బూత్ లో, జగ్గయపేటకు చెందిన వైసీపీ నేత, క్రిమినల్ రికార్డు ఉన్న నూకల సాంబశివరావు అనే వ్యక్తి పోలింగ్ సమయంలో లోపల ఉన్నట్టు, ప్రకాష్ రాజ్ వీడియో ఆధారాలు బయట పెట్టారు. ఇలాంటి వైసిపి రౌడీ షీటర్లను అక్కడ పెట్టటం వల్లే, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయాని, దీన్ని చూస్తూ మీరు ఏ విధంగా నిర్లక్ష్యం చేసారు, ఏ విధంగా చూస్తూ వదిలేసారు అని చెప్పి, ప్రకాష్ రాజు, ఎన్నికల కమీషనర్ ని ప్రశ్నిస్తూ, ఒక లేఖ రాసారు. దానికి సంబందించిన ఫోటోలును ప్రకాష్ రాజ్ మీడియాకు విడుదల చేసారు. అయితే దీని పై ప్రకాష్ రాజ్ కోర్టుకు కూడా వెళ్తారని తెలుస్తుంది. అయితే దీని పై స్పందించిన ఎన్నికల అధికారి, మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చని, కోర్టుకు వెళ్లి తేల్చుకోవచ్చు అంటూ, ఆయన లేఖను విడుదల చేసారు. అయితే దీని పై ప్రకాష్ రాజ్ త్వరలోనే కోర్టుకు వెళ్తున్నారని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే, వైసిపి నేతల ఫోటోల పై చర్చ జరుగుతుంది.

prakash 231020212

అసలు వైసిపి రౌడీ షీటర్ అక్కడకు ఎందుకు ఉన్నాడు ? జగ్గయ్య పేటకు చెందిన ఈ వ్యక్తి రౌడీ షీటర్. జగన్ తో కలిసి దిగిన ఫోటోలు కూడా ప్రకాష్ రాజ్ విడుదల చేసారు. అసలు ఈ రౌడీ షీటర్ కు అక్కడ ఏమి పని ? ఎవరు తీసుకుని వచ్చారు ? ఎవరు వెళ్ళమంటే వెళ్లారు అనే చర్చ జరుగుతుంది. మోహన్ బాబు ఇప్పటికే జగన్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మెగా క్యాంప్ కు చెక్ పెట్టటానికి, సిని ఇండస్ట్రీ పై ఆధిపత్యం కోసం, జగన్ మోహన్ రెడ్డి మోహన్ బాబుకు సహకారం అందించారనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు ఏకంగా వైసిపి నేతలు పాల్గునట్టు, ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ప్రకాష్ రాజ్ ఈ ఫోటోలు విడుదల చేసారు. అంతే కాకుండా, ఎన్నికల జరిగిన రోజు, కౌంటింగ్ జరిగిన రోజు, మొత్తం సిసి ఫూటేజ్ మొత్తం ఇవ్వాలని ఆయన ఇప్పటికే డిమాండ్ చేసారు. ఇప్పటికే పోలీసులకు కూడా కంప్లైంట్ చేసారు. మొత్తం మీద ఇప్పుడు ఈ ఎన్నికల్లో వైసిపి హ్యాండ్ ఉందని తేలటంతో, ఈ ఎన్నికలు ఇప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.

2019 ఎన్నికలకు ముందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరీ ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి అన్నీ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటారు అనే పేరు ఉండేది. నిజంగానే చాలా సెల్ఫ్ గోల్స్ వేసుకుని, రాజకేయంగా నష్టం చేకుర్చుకున్నారు కూడా. అయితే ఎన్నికల్లో గెలవటంతో, ఈ సెల్ఫ్ గోల్స్ అన్నీ సైడ్ అయిపోయాయి. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, గుండ్రంగా ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా వైసిపి వేసుకున్న సెల్ఫ్ గోల్ తో, రాజకీయంగా మరింతగా దిగజారే స్టెప్ అనే చెప్పాలి. పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి, నక్కాఆనంద బాబుగారికి నోటీసులు ఇచ్చిన విషయంలో, సజ్జల ఇదంతా చేపిస్తున్నారు అంటూ, సజ్జలను ఒక మాట అన్నారు. ఇదే ప్రెస్ మీట్ లో జగన్ ని ఉద్దేశించి ఆయన అన్నది, పబ్జీ దొర అని మాత్రమే. అయితే జగన్ మోహన్ రెడ్డిని ఎవరు తప్పుదోవ పట్టించారో తెలియదు కాని, పట్టాభి ఆ వ్యాఖ్యలు చేసింది నన్నే అంటూ జగన్ మోహన్ రెడ్డి, నిన్న ఆ పదం చెప్పి, ఆ పదానికి అర్ధం చెప్తూ బూతులు వినిపించారు. ఒక ముఖ్యమంత్రి నోటి వెంట ఆ పదాలు విని అందరూ ఆశ్చర్య పోయారు. అసలు తనని అనని మాటలు, తనకు ఆపాదించుకుని, అర్ధం చెప్పి, తన తల్లిని లాగి, జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అందరూ షాక్ తిన్నారు. అసలు జగన్ మోహన్ రెడ్డిని ఎవరు తప్పుదోవ పట్టించారు అనేది తెలియదు.

tdp 22102021 21

సజ్జలని అంటే, జగన్ రియాక్ట్ అయ్యారు. అంటే టిడిపి కార్యాలయాల పై దా-డు-లు చేసింది కూడా, జగన్ ని ఆ పదం అన్నారనే. ఇంత రచ్చ జరిగింది, జగన్ ని తప్పుదోవ పట్టించినందుకే. అందుకే విశ్లేషకులు ఇది సెల్ఫ్ గోల్ అంటున్నారు. ఏమి లేని దానికి ఇంత చేసి, అసలు మాకు బూతులు అంటే ఏంటో తెలియవు, మా మీద ప్రేమ ఉన్న వాళ్ళు బీపీ పెరిగి చేసారు అంటూ, చేసిన వ్యాఖ్యలు అందరూ విన్నారు. అయితే ఇదే సమయంలో టిడిపి శ్రేణులు అన్నీ ఆక్టివ్ అయ్యాయి. రాష్ట్రం నలు మూలల నుంచి, టిడిపి శ్రేణులు కదం తొక్కాయి. మంగళగిరి పోలీస్ ఆఫీస్ కి జనం పోటెత్తారు. ఈ రెండేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా టిడిపిలో ఊపు వచ్చింది. మహానాడు ముందే వచ్చిందా అన్నట్టు, కోలాహలం నెలకొంది. జగన్ మోహన్ రెడ్డి వేసిన అడుగులు వల్లే, ఈ రోజు టిడిపిలో ఈ జోష్ వచ్చిందని, అనవసరంగా చిన్న విషయాన్ని, కెలికి పెద్దది చేసి, చివరకు టిడిపికి మొత్తం ప్లస్ అయ్యే విధంగా జగన్ మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించి సెల్ఫ్ గోల్ వేసుకున్నారని అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న హైకోర్టులో పట్టాభి బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. దీని పై ఈ రోజు విచారణ చేపడతామని హైకోర్టు ఆదేశించింది. ఉదయం ప్రభుత్వం న్యాయవాది తనకు మంగళవారం వరకు కౌంటర్ దాఖలు చేయటానికి సమయం ఇవ్వాలని కోరారు. ఎలాగూ ఇది బెయిల్ వచ్చే కేసు అని ప్రభుత్వానికి తెలుసు కాబట్టి, ఎక్కువ రోజులు సాగాదీసి పట్టాభిని జైల్లో ఉంచాలని ప్లాన్ వేసారు. అయితే ఈ ఎత్తుగడను కోర్టు అంగీకరించలేదు. ఈ రోజు మధ్యానం రెండు గంటలకు, లంచ్ అనంతరం విచారణ చేపతాడమని, సిద్ధం కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. వాదనలకు సిద్ధం కావాలని, ఈ లోపు సమాచారం తెప్పించుకోవాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. లంచ్ మోషన్ పిటీషన్ పై వెంటనే విచారణ చేపట్టాల్సిన అవసరం కూడా ఉందని, నిబంధనలు కూడా ఇవే చెప్తున్నాయని హైకోర్టు పెర్కుంది. ఈ రోజు విచరణ ప్రారంభం అయిన వెంటనే, ఇటు ప్రభుత్వ నుంచి, పట్టాభి వైపు నుంచి న్యాయవాదులు వాదనలు వినిపించారు.

pattabhi 23102021 2

ప్రధానంగా, పట్టాభి పై నమోదు చేసిన కేసులకు సంబంధించి, సెక్షన్లు అన్నీ కూడా ఏడు ఏళ్ల లోపు సెక్షన్లు కావటంతో 41ఏ నోటీస్ ఇచ్చి, ఆయన వివరణ తీసుకున్న అనంతరం ఆయన్ను వదిలి వేయాలని, విధాన పరమైన ప్రొసీజర్ ని పోలీసులు ఎక్కడా ఫాలో కాలేదని పట్టాభి న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. కింద కోర్టు కూడా ఇదే అంశాన్ని రికార్డు చేసి, ఆయన్ను రిమాండ్ కు పంపించిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. నిన్ననే ఈ విషయం పై హైకోర్టు కూడా ప్రశ్నించింది. ముఖ్యమంత్రి పై వ్యాఖ్యలు చేసారని, అందుకే అరెస్ట్ చేసాం అని చెప్పటం సమంజసం కాదని, వ్యక్తులు, హోదాలు, ఇక్కడ పని చేయవని అన్నారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి పట్టాభి చేసిన వ్యాఖ్యలు జడ్జి ముందు ప్లే చేసి చూపించారు. అయితే 41ఏ నోటీస్ ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు ప్రశ్నించగా, సరైన సమాధానం ప్రభుత్వం వైపు నుంచి రాలేదు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల నేపధ్యంలో,ఆయనకు బెయిల్ ఇస్తున్నాం అని కోర్టు తెలిపింది. అయితే ఇప్పటికే లేట్ అవ్వటంతో, పట్టాభి సోమవారం విడుదల అయ్యే అవకాసం ఉంది.

Advertisements

Latest Articles

Most Read