అద్దంకి టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కు, సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గొట్టిపాటి రవికుమార్ కూడా చెందిన కిషోర్ గ్రానైట్ కంపెనీకి ఏపి ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీస్ పై సుప్రీం కోర్టు ధర్మాసనం స్టే విధించింది. కిషోర్ గ్రానైట్ కంపెనీలో అవకతవకలు జరిగాయి అంటూ ఏపి ప్రభుత్వం విజిలెన్స్ డిపార్టుమెంటు ఇచ్చిన నివేదిక ఆధారంగా, ఆ కంపెనీని మూసివేయాలని, అలాగే 50 కోట్లు జరిమానా విధించాలి అంటూ, ఏపి ప్రభుత్వం , గొట్టిపాటి రవికి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అయితే ఆ షోకాజ్ నోటీస్ ను గొట్టిపాటి రవి కోర్టులో సవాల్ చేయగా, హైకోర్టు సింగల్ జడ్జి బెంచ్ కొట్టేసింది. అయితే ఆ తరువాత ఏపి ప్రభుత్వం డివిజనల్ బెంచ్ ని ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ ఏపి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఏపి ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ చెల్లుతుందని, ప్రభుత్వం చెప్పినట్టు 50 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. దీంతో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుని, గొట్టిపాటి రవి కుమార్ సుప్రీం కోర్టులో సవాల్ చేసారు. దీని పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ తరుపున హాజరు అయిన సీనియర్ న్యాయవాది, విజిలెన్స్ కమిషన్ కు, ప్రభుత్వం ఇచ్చిన నోటీస్ కు సంబంధం లేదని కోర్టు ముందు వాదించారు.

gottpati 25102021 2

అసలు ఈ విషయంలో అవకతవకలు ఉన్నాయి అంటూ, దీని పై నివేదిక ఇవ్వటానికి, సిఫార్సు చేయటానికి వారికి అధికారం లేదని గొట్టిపాటి రవికుమార్ తరుపు న్యాయవాది శ్యాం దివాన్ కోర్టు ముందు వాదనలు వినిపించారు. శ్యాం దివాన్ వాదనలు విన్న తరువాత సుప్రీం కోర్ట్ ధర్మాసనం, గొట్టిపాటి రవి కుమార్ కు ఉపసమనం కల్పించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుని పక్కన పెడుతూ, ఏపి ప్రభుత్వం ఇచ్చినటువంటి, షోకాజ్ నోటీస్ ని సస్పెండ్ చేస్తూ స్టే విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది అనే చెప్పాలి. అయతే ప్రభుత్వం వచ్చిన కొత్తలో, టిడిపి ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కోవటానికి వైసిపి అనేక ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలు ఫలించి, కరణం బలరాం, వంశీ, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్ లాంటి వాళ్ళు పార్టీ మారారు. అయితే గొట్టిపాటి రవి, ఏలూరు సాంబశివరావు పై అనేక ఒత్తిడులు వచ్చినా, వారు మాత్రం పార్టీ మారలేదు. ఏదైనా న్యాయ ప్రకారం తేల్చుకుంటాం అని, పార్టీ మాత్రం మారం అంటూ, కోర్టులో పోరాడారు.

గత రెండు నెలలుగా ఏపిలో కరెంటు బిల్లులు చూసి, షాక్ అవ్వని వారు ఎవరూ లేరు. చిన్నా, పెద్దా, పేద, గొప్ప అనే తేడా లేకుండా, అందరికీ వాయించి పడేసారు. ఆ బిల్లులు చూసి, లబో దిబో అన్న వారే కానీ, ఎవరూ సంతోషంగా లేరు. దీనికి కారణం ట్రూఅప్ చార్జీలు. ట్రూఅప్ చార్జీలు అంటే గత ఏడాదిలో విద్యుత్ సంస్థల నిర్వహణ ఖర్చులు, సర్దుబాటు చేసి, ఆ ఖర్చు వినియోగదారుడి మీద వేయటం. అయితే గతంలో విద్యుత్ కొనుగోలు యూనిట్ కు నాలుగు నుంచి ఆరు రూపాయల వరకు ఉండేది. దానికే ఏపి ప్రభుత్వం, ట్రూఅప్ చార్జీలు కింద యూనిట్ కు రూపాయి 23 పైసల వరకు మన మీద బాదింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత రావటంతో, ఏమి చేయాలో అర్ధం కాక ప్రభుత్వం వెనక్కు తగ్గింది. తాత్కాలికంగా ఈ ట్రూఅప్ చార్జీలును వెనక్కు తీసుకుంటున్నాం అని చెప్పారు. మళ్ళీ ఎప్పుడూ బాది పడేస్తారు. అయితే ఈ విషయం పక్కన పెడితే, ప్రస్తుతం రాష్ట్రంలో బొగ్గు కొరత భారీగా ఉంది. దాదాపుగా విద్యుత్ సంక్షోభం వచ్చేసిందని అందరూ అనుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వర్షాలు పడటం, చలి కాలం మొదలు కావటంతో, ఒకేసారి విద్యుత్ వాడకం పడిపోవటంతో, ప్రభుత్వానికి వెసులుబాటు వచ్చింది. అయితే బొగ్గు కొరత కారణంగా, బయట నుంచి అధిక ధరకు విద్యుత్ కొంటున్నారు.

shock 25102021 2

యూనిట్ కు దాదాపుగా 15 నుంచి 20 రూపాయాల వరకు వెచ్చించి మరీ, కరెంట్ కొంటున్నారు. ఇప్పుడు ఈ భారం డిస్కాంల పై అధికంగా పడుతుంది. ఈ భారం అంతా వచ్చే ఏడాది రాష్ట్ర ప్రజల పైనే ఉంటుంది. 4-6 రూపాయలకు కొంటేనే, ఇంత భారీగా ట్రూఅప్ చార్జీల పేరుతో బాదేసారు. మరి ఇప్పుడు 15-20కి కొంటుంటే, ఎంత ట్రూఅప్ చార్జీలు బాదేస్తారో అర్ధం చేసుకోవచ్చు. ప్రతి రోజు ఇంత ఖర్చు కాకపోయినా, కొన్నప్పుడు భారం అయితే పడుతుంది. ఇక ఇక్కడ మరో విషయం, ప్రతి నేలా వినియోగదారుడు నుంచి రూపాయి, పైసలతో సహా ప్రభుత్వం కరెంటు బిల్లు వసూలు చేస్తుంది, కట్టకపోతే విద్యుత్ ఆపెస్తారు కుడా. మరి వినియోగదారుడు నుంచి వసూలు చేసిన డబ్బు అంతా ఏమి అవుతుంది ?డిస్కమ్‌ లకు సకాలంలో ఆ డబ్బు ప్రభుత్వం ఎందుకు చెల్లించటం లేదు అనే చర్చ జరుగుతుంది. దాదాపుగా రూ.11,000 కోట్ల బకాయలు ఉన్నాయి. మరి వినియోగదారుడు నుంచి వసూలు చేస్తుందని ఇచ్చేస్తే, ఈ బాకీలు ఎందుకు ఉంటాయి అని విద్యుత్ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

విశాఖపట్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విశాఖ జ్ఞానాపురంలో ప్రజలు రోడ్డు ఎక్కారు. ప్రభుత్వం ఏదైతే ఎయిడెడ్ పాఠశాలలను, కాలేజీలను మూసివేస్తాం అంటూ రెండు నెలల క్రితం ఒక జీవో విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక ఎయిడెడ్ పాఠశాలలను, కాలేజీలలు వరుసగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల రోజుల క్రితం, విజయవాడలో ఇలాగే మంటిసోరీ స్కూల్ ని కూడా ఇలాగే మూసివేయటంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, ఎయిడెడ్ అనేది ఉండదని, అయితే ప్రైవేటు అయినా ఉండాలి, లేకపోతే ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సామాన్యంగా ఎయిడెడ్ పాఠశాలలను, కాలేజీలలో ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు జాయిన్ అవుతారు. ప్రభుత్వం ఈ సంస్థలకు ఎయిడ్ ఇస్తూ వస్తూ ఉండటంతో, ఫీజులు కూడా తక్కువ ఉంటాయి. మంచి విద్య కూడా అందుతుంది. అందుకే ఎక్కువగా మధ్య తరగతి ప్రజలు ఇక్కడ జాయిన్ అవుతారు. ఇదే నేపధ్యంలో విశాఖలోని జ్ఞానాపురంలో సెయింట్ ఆన్స్, సెయింట్ జోసఫ్‍తో పాటు పలు ఎయిడెడ్ పాఠశాలలను ఇక మేము నడపలేం అని, ప్రభుత్వ నిర్ణయంతో, ఇక నడిపే అవకాసం లేదని, అందుకే మూసి వేస్తున్నాం అంటూ, ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి.

vizag 25102021 1

దీంతో ఒకేసారిగా ఆ సంస్థల్లో చదువుకునే పిల్లలు, తల్లిదండ్రులు ఒకేసారి రోడ్డు ఎక్కారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఇక మేము స్కూల్ నడపలేం అని చెప్పారని, వేరే స్కూల్ లో జాయిన్ చేసుకోమని చెప్పారు అంటూ, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎక్కడకి వెళ్ళాలని వాపోయారు. మాకు అమ్మఒడి, యూనిఫారం కాదని, ఇలాంటి స్కూల్స్ తమకు కావాలని, వీటిని మూసివేయవద్దు అంటూ, రోడ్డు మీద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అయితే ఇదే సందర్భంలో అక్కడకు ఎమ్మెల్యే రావటంతో, ఒకేసారి ఆయన్ను చుట్టుముట్టారు. ఎమ్మెల్యేలను అడ్డుకుని సమస్య పరిష్కారం చేయాలని కోరటంతో, ఆ ఎమ్మెల్యే ఏమి చేయలేక ఆటలో పారిపోయే ప్రయత్నం చేసారు. అయితే ఆయన్ను అడ్డుకుని, తమకు న్యాయం చేయాల్సిందే అని కోరారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావటం, జగన్ మోహన్ రెడ్డికి ఎదురు చెప్పే ధైర్యం లేకపోవటం, ఆ ఎమ్మెల్యేకు అక్కడ నుంచి వెళ్ళిపోవటం తప్ప వేరే ఆప్షన్ లేదు అనే చెప్పాలి. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

ఈ రోజు హైదరాబాద్ లోని హైటెక్స్ లో, టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ ని మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణా గురించి, తన పార్టీ గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఇక్కడ వరకు బాగానే కేసీఆర్, ఏపి పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఏపి పరిస్థితి రోజు రోజుకీ దిగజారి పోతూ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో చంద్రబాబును చూసి వచ్చిన కంపెనీలు ఇప్పుడు తెలంగాణాకు వెళ్ళిపోతున్నాయి. అలాగే ఏపిలో ఉన్న రియల్ ఎస్టేట్ మొత్తం తెలంగాణాకు వెళ్ళిపోతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏపిలోని అసమర్ధ ప్రభుత్వం వల్ల, ఏపిని నష్టం జరుగుతుంటే, తెలంగాణాకు లాభం జరుగుతుంది. ఈ రోజు కేసీఆర్ మాట్లాడుతూ, ఏపి తలసరి ఆదాయం గురించి, విద్యుత్ రంగం గురించి, పోలిక పెడుతూ, ఏపి ఎంత తక్కువగా ఉందో చూపించే ప్రయత్నం చేసారు. ఆయన మాట్లాడుతూ " తెలంగాణ అన్నపూర్ణగా అవతరించిందని అన్నారు. ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనం విడిపోయామో, ఈ రోజు ఆ ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటా ఇన్కం, లక్షా 70 వేల కోట్లు ఉంటే, తెలంగాణా పర్ క్యాపిటా ఇన్కం, రెండు లక్షలా 30 వేల కోట్లు."

kcr 25102021 2

"ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తెలంగాణాతో పోల్చుకుంటే. ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న సమైఖ్య ముఖ్యమంత్రి, ఎవరు అయితే మీకు చీకటి అయిపోతుంది, కరెంటు రాదు అని చెప్పారో, ఆ ఆంధ్రప్రదేశ్ లో కరెంటు లేక చీకట్లు ఉంటే, తెలంగాణాలో మాత్రం 24 గంటలు వెలుగులు ఉన్నాయి. ఇవి వాస్తవాలు" అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసిఆర్ వ్యాఖ్యలు విని ఆంధ్రులు బాధ పడుతున్నారు. 2014-2019 మధ్య గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పోటీ పడిన ఆంధ్రప్రదేశ్, నేడు తెలంగాణా చేతిలో కూడా చీత్కారాలు పడాల్సి వస్తుంది అంటూ వాపోతున్నారు. గతంలో కూడా హరీష్ రావు, కేటీఆర్ ఇలాగే ఏపి గురించి మాట్లాడారు. మరి ఈ వ్యాఖ్యల పై జగన్ మోహన్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారో చూడాలి. అనవసరమైన విషయాల పై రచ్చ చేసే వైసిపీ నేతలు ఇప్పుడు ఏమి స్పందిస్తారో చూడాలి. ఏపిలో కరెంటు కోతలు అంటే కేసులు పెడతాం అని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై కౌంటర్ ఇస్తుందో లేదో మరి.

Advertisements

Latest Articles

Most Read