గత చంద్రబాబు ప్రభుత్వంలో, నవ్యాంధ్ర మొదటి చీఫ్ సెక్రటరీగా పని చేసిన వ్యక్తి ఐవైఆర్ కృష్ణారావు. అమరావతి లాంటి ప్రాజెక్ట్ లో కూడా, ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. రిటైర్డ్ అయిన తరువాత, ఆయనకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మెన్ పదవి కూడా చంద్రబాబు గారు ఇచ్చారు. అక్కడ వరకు బాగానే ఉంది. చంద్రబాబు గారు ఇంత గౌరవం ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ ఇచ్చారు, రిటైర్డ్ అయిన తరువాత కార్పొరేషన్ చైర్మెన్ ని చేసి, భారీ జీతం కూడా ఇచ్చారు. అలాంటి చంద్రబాబు గారి పై, కార్పొరేషన్ చైర్మెన్ గా ఉంటూనే, లేకిగా ఉండే పేటీయం ఎడిట్స్ పోస్ట్ చేస్తూ, చివరకు అవన్నీ బయట పడి పదవి పోగుతున్నారు. ఆయన ఇచ్చిన గౌరవాన్నికాపాడుకోకుండా, ఎవరో ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారు. తరువాత జగన్ మోహన్ రెడ్డికి డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వక పోయినా, ఆయన చెయ్యల్సింది ఆయన చేస్తూ, చంద్రబాబుని దించి, జగన్ ని ఎక్కించటంలో, ఆయనకు ఇచ్చిన పాత్ర ఆయన అద్భుతంగా పోషించారు. తరువాత బీజేపీలో చేరినా, అక్కడ వారు ఎవరి గెలుపు కోసం పని చేసారో అందరికీ తెలిసిందే. తమకు కావలసిన విధంగా జగన్ మోహన్ రెడ్డిని ఎక్కించారు. ఇప్పుడు రెండున్నరేళ్ళు అయ్యింది. అప్పుడప్పుడూ జగన్ పరిపాలన పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

iyr 20102021 2

ముఖ్యంగా మాజీ ఐఏఎస్ కావటంతో, పెన్షన్ టైంకి రావటం లేదు అంటూ, పోస్ట్ లు పెడుతూ ఉంటారు. అలాంటి ఐవైఆర్ కృష్ణారావు ఈ రోజు జగన్ పై విరుచుకు పడ్డారు. ఆయనకు ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయ్యిందో ఏమో కానీ, సమర్ధ నాయకత్వం ఉండాలి అంటూ, చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ఆయన ఈ రోజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి చుస్తే చాలా బాధగా ఉంది అంటూ, ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఉద్యోగులను కూడా ఇబ్బందులు పెడుతూ, వారి జీతాలు, పెన్షన్లు కూడా ఆలస్యం చేస్తున్నారని అన్నారు. చివరికి ఆసుపత్రులలో పరికరాలు కూడా సమకూర లేని పరిస్థితి ఉందని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా భూములు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చాం అని అన్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం అవుతుందని అన్నారు. ఇప్పటికి 5 లక్షల కోట్ల అప్పు చేసారని, ఈ అప్పు రాష్ట్రం నెత్తి మీద పెడితే, ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. సామర్ధ్యం ఉన్న నాయకుడు లేకపోవటం దురదృష్టకరం అని అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటికి పోలీసులు భారీగా చేరుకుంటున్నారు. నిన్న పట్టాభి ఇంటి పై వైసిపి గూండాలు మూకుమ్మడిగా వందలాది మంది వచ్చి ఇంటి మీదకు వెళ్లి, ఆయన ఇంట్లో ఫర్నిచర్ సహా, ఇంట్లోకి విలువైన వస్తువులు అన్నీ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే నిన్న పట్టాభి, నక్క ఆనంద బాబుకి నర్సీపట్నం పోలీసులు నోటీసులు ఇస్తూ, గంజాయిలో వైసీపీ నేతల ప్రమేయం గురించి అడిగిన నేపధ్యంలో, పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి, సజ్జల పై తీవ్ర ఆగ్రహం చేస్తూ వాడిన ఒక పదంతో, వైసీపీ ఈ గొడవ చేసింది.  అయితే పట్టాభి ఇంటి మీద దా-డి కాకుండా, ఆయన చేసిన వ్యాఖ్యల పై ఇప్పుడు పోలీసులు రియాక్ట్ అవుతున్నారు. ఈ నేపధ్యంలోనే, నిన్న జరిగిన ఘటనకు సంబధించి పోలీసులు పట్టాభి ఇంటికి చేరుకుంటున్నారు. కొద్ది సేపటి క్రితం కూడా డీజీపీ మీడియా సమావేశం పెట్టి, పట్టాభి వ్యాఖ్యల పైనే మాట్లాడారు కాని, ఇల్లు ధ్వంసం గురించి మాట్లాడలేదు. అయితే పట్టాభి భార్య నిన్న రాత్రి పటమట పోలీసులకు తమ ఇంటి పై జరిగిన దాడి పై ఫిర్యాదు చేసారు. అయితే ఇప్పుడు పట్టాభిని అరెస్ట్ చేయటానికి పెద్ద ఎత్తున పోలీసులు వస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టిడిపి శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పట్టాభి ఇంటికి వస్తున్నాయి. ఏ క్షణమైన పట్టాభి అరెస్ట్ అయ్యే అవకాసం ఉంది.

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం పై, కేంద్రమంత్రి అమిత్ షా, గవర్నర్ కు చంద్రబాబు ఫోన్ చేసారు. వైసీపీ శ్రేణుల దాడుల విషయాన్ని చంద్రబాబు వివరించారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపుతప్పాయన్న చంద్రబాబువారికి చెప్పారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేసారు. అయితే అమిత్ షా కు చంద్రబాబు సంచలన విషయాలు చెప్పారు. పార్టీ ఆఫీసు దగ్గర జనం గుమికూడారని చంద్రబాబుకు నేతల సమాచారం ఇవ్వటంతో, పార్టీ నేతల సమాచారాన్ని డీజీపీకి ఫోన్‍లో చెప్పేందుకు చంద్రబాబు యత్నం చేసారు. అయితే తానే వేరే పనిలో ఉన్నానని చంద్రబాబుకు డీజీపీ సవాంగ్ తెలిపారు. డీజీపీ సరిగా స్పందించలేదని అమిత్‍షాకు చంద్రబాబు ఫోన్ లో వివరించారు. ఇది ఏపిలో జరుగుతున్న తీరు.

నిన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద, అలాగే పట్టాభి ఇంటి మీద, విశాఖ, తిరుపతి, హిందూపురం ఇలా అనేక చోట్ల ఏక కాలంలో కొంత మంది రౌడీలు దా-డి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా రాజకీయ కక్షతో వైసీపీ చేసిందని అందరికీ తెలిసినా, దీని పై ఆధారాలు అయితే లేవు. అయితే ఇప్పుడు కొద్ది సేపటి క్రితం ఏకంగా జగన్ మోహన్ రెడ్డి గర్వంగా, ఆ దా-డు-లు చేసింది మా మీద ఆప్యాయత ఉన్న వాళ్ళే అని ఆయన ప్రకటించటం సంచలనంగా మారింది. ఈ రోజు ఒక కార్యక్రమం ప్రారంభం చేసిన జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, " ప్రతిపక్షంతో పాటుగా, ఒక సెక్షన్ అఫ్ ఎల్లో మీడియా, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడు, జీర్ణించుకోలేని పరిస్థితిలో ఏ రకంగా తయారు అయ్యారో చూస్తూ ఉన్నారు. వీళ్ళే, బూతులు తిడతారు. ఎవరూ కూడా మాట్లాడలేని అన్యాయమైన మాటలు, అన్యాయమైన బూతులు మాట్లాడతారు. బహుసా నేను ప్రతిపక్షంలో ఉన్నాను. ఇలాంటి బూతులు, మాటలు ఎప్పుడూ కూడా మా పార్టీ వాళ్ళు మాట్లాడలేదు. ఏ రోజు కూడా ఇటువంటి మాటలు మా పార్టీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు. ఆ బూతులు తిట్టారని చెప్పి, వాళ్ళే బూతులు తిడతారు. అయితే మన మీద ఆప్యాయత చూపించే వాళ్ళు రియాక్ట్ అవుతారు"

jagan 20102021 2

మనల్ని అభిమానించే వాళ్ళో, మనలను ప్రేమించే వాళ్ళో, ఆ టీవీలు చూడలేక, ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక, ఎవరికో బిపి వచ్చి అభిమానస్తులు, ఆప్యాయత చూపించే వాళ్ళు, ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఆ రకంగా వైషమ్యాలు సృష్టించి, కావలని తిట్టించి, కావాలని కొట్టేలా చేసి తద్వారా లభ్ది పొందాలని ఆరాటం మన కర్మ కొద్దీ కనిపిస్తూ ఉంది" అంటూ జగన్ మొహన్ రెడ్డి అన్నారు. నిన్న దా-డి జరిగిన తరువాత చంద్రబాబే చేపించుకున్నాడు అంటూ కొంత మంది వైసీపీ నేతలు మాట్లాడటం, ఎవరు చేసారో తెలియదు అని చెప్పటం, ఇవన్నీ వింటున్నాం. అయితే ఈ రోజు ఏకంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన ముఖ్యమంత్రే అవును మా మీద అభిమానం, ప్రేమ, ఆప్యాయత ఉన్న వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దా-డు-లు చేసారని ఒప్పుకోవటం చూస్తుంటే, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుంది. ఎవరైనా ఇటువంటి వాటిని ఖండించాలి కాని, గర్వంగా మేమే చేసాం అని ఏకంగా ముఖ్యమంత్రి ఒప్పుకోవటం సంచలనంగా మారింది.

Advertisements

Latest Articles

Most Read