గత ఆరు నెలలుగా జగన్ మోహన్ రెడ్డికి అత్యంత గడ్డు కాలం నడుస్తుంది. అందరికీ సంక్షేమం ఇచ్చేసాం అని ఇన్నాళ్ళు డబ్బా కొట్టిన జగన్ ప్రభుత్వం, ఆసలు స్వరూపం ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తుంది. ఏదైతే తన బలం అని సంక్షేమాన్ని నమ్మాడో, ఆ సంక్షేమం కూడా బూటకం అని ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. వీటికి తోడు ప్రజలకు అసలు సినిమా కనిపించింది. అప్పులు ఒక పక్క, ఆ అప్పులు కవర్ చేసుకుంటానికి, మటన్ కొట్టులు, సినిమా టికెట్లు అమ్మటాలు, ఇలా అనేకం అనేకం ముందుకు తెచ్చారు. ఇది బాగా ప్రజల్లోకి వ్యతిరేకత తీసుకుని వచ్చింది. ఇక రోడ్డులు పరిస్థితి చెప్పే పనే లేదు. అలాగే మహిళల పై జరుగుతున్న ఘటనలు, దళితుల పియా జరుగుతున్న ఘటనలు, కరెంటు చార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, పెట్రోల్ చార్జీలు, ఇసుక, మద్యం, మైనింగ్, ఇలా ఒకటా రెండా, మొత్తం గందరగోళమే. రైతులకు మద్దతు ధర లేదు, ధాన్యం బాకీలు ఒక ఎత్తు. యువతకు ఉద్యోగాలు లేవు. ఇలా ఒకటి రెండు కాదు, మొత్తం అన్ని వర్గాలు జగన్ పాలనతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడే సెంటిమెంట్ అస్త్రం బయటకు తీసారు. ఈ మొత్తాన్ని అడ్డుకోవటానికి ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్తున్నారని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాల నేపధ్యంలో, అసలు వాస్తవం బయట పడింది.
తాజాగా సిఓటర్ సర్వే నిర్వహించిన సర్వేలో జగన్ మోహన్ రెడ్డి ఉలిక్కిపడే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోనే ఎమ్మెల్యేల పై భారీ వ్యతిరేకత ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. 2019లో ఎంత గొప్పగా మెజారిటీలోకి వచ్చిందో, అంతే త్వరగా రెండేళ్ళకే పతనం దిశగా వెళ్తుంది. జగన్ మోహన్ రెడ్డి పని తీరు మాత్రమే కాదు, వైసీపీ ఎమ్మెల్యేల పై కూడా రాష్ట్ర ప్రజలు తిరగబడుతున్నారు. దేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పై ఉన్న వ్యతిరేకతను వారి అవినీతి. వ్యక్తిత్వం, పరిపాలన, ప్రజలతో సంబంధాలు, ప్రభుత్వ కార్యక్రమాలు వంటి అంశాల ఆధారంగా సిఓటర్ సర్వే చేయగా, దేశంలోనే అత్యధికంగా 28.5 శాతం వ్యతిరేకత ఏపి ఎమ్మెల్యే పై ఉంది. ఇది ఎమ్మెల్యేలదే అని, జగన్ మోహన్ రెడ్డి పని తీరు పై సర్వే చేస్తే, ఇంకా ఎక్కువ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రోజు రోజుకీ పెరుగుతున్న ఈ ప్రభుత్వ వ్యతిరేకత, తాడేపల్లి ప్యాలెస్ ను చుట్టముట్టటం ఎంతో దూరంలో లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలే వచ్చిన ఒక సర్వేలో 46 మంది కచ్చితంగా ఓడిపోతారని సర్వే వచ్చిన సంగతి తెలిసిందే.