ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిదీ వింతగానే ఉంటుంది. ఈ రాష్ట్రంలో జరిగే పనులు అన్నీ ఎప్పుడూ చూడని పనులు జరుగుతూ ఉంటాయి. మాస్కు అడిగితే డాక్టర్ ని పిచ్చోడు అంటారు, ఎంపీ పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు, ప్రతిపక్ష నాయకులే బాధితులు అయినా, వారి పైనే ఎదురు కేసులు పెడతారు. అదేమీ అంటే, భావప్రకటనా స్వేఛ్చతో అధికార పార్టీ వాళ్ళు చేస్తే, దానికి ఎదురు ఎలా చెప్తారని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎన్నో ఎన్నో వింతలూ విడ్డూరాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇందులో ఏకంగా ఉన్నత స్థాయి అధికారులు కూడా భాగస్వామ్యం అవ్వటం, హైలైట్ అని చెప్పాలి. సహజంగా డీజీపీ అంటే, రాష్ట్రంలో అందరికీ డీజీపీనే. సహజంగానే కొంత ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడైనా సర్వ సాధారణం. ఎక్కడైనా ప్రభుత్వ పాలసీలకు తగ్గట్టు ఉండాలి కాబట్టి, కొంత అనుకూలంగా పని చేసినా, లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం, ఎవరినీ ఉపెక్షించరు. గతంలో ఇలాంటి డీజీపీలను చూసే వాళ్ళం. ప్రస్తుతం ఏపిలో ఉన్న గౌతం సవాంగ్ గారికి మంచి పేరే ఉండేది. గతంలో విజయవాడ కమీషనర్ గా, చంద్రబాబు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటంతో, టిడిపి వారిని కూడా స్పేర్ చేయలేదు. అయితే ఇప్పుడు మాత్రం, డీజీపీ వ్యవహార శైలి పై, అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

dgp 15102021 2

ముఖ్యంగా డీజీపీ గారు ఈ మధ్య తరుచూ ప్రెస్ మీట్లు పెడుతూ, వైసీపీ అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారు అనే అభిప్రాయం వస్తుంది. టిడిపి పార్టీ నాయకులను, ప్రతిపక్షం అని సంబోధించటం పలువురుని ఆశ్చర్య పరుస్తుంది. పోలీసులకు ప్రతిపక్షం, అధికార పక్షం ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా హెరాయిన్ వ్యవహారం ఏపిని కుదిపేస్తుంది. ఎన్ఐఏ వచ్చి విజయవాడలో సోదాలు చేయటంతో, ఇది మరో టర్న్ తీసుకుంది. అయితే టిడిపి నేతలు ప్రభుత్వం పై, ప్రభుత్వంలోని కొంత మంది పెద్దల పై అనేక ఆరోపణలు చేసారు. అయితే దీనికి ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి కాని, అనూహ్యంగా డీజీపీ రియాక్ట్ అయ్యి, ఆరోపణలు చేస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడుకి లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణలు చెప్పాలని కోరారు. అసలు ప్రతిపక్ష నేతలపై డీజీపీ స్థాయి అధికారి, ఇలా లీగల్ నోటీసులు పంపించటం, దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఆరోపణలు చేసింది ప్రభుత్వ పెద్దల పై అయితే, డీజీపీ స్పందించటం, ప్రతిపక్షాలు మాట్లాడకూడదు అంటూ లీగల్ నోటీసులు పంపించటం పై పలువురు ఆశ్చర్యపోతున్నారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ రెండున్నరెళ్ళలో అన్నీ ప్రజలను ఇబ్బంది పెట్టే పనులే చేస్తూ వచ్చింది. ప్రజలు కూడా విసిగి వేసారి ఉన్నారు. అభివృద్ధి అనే మాటే లేదు. అయితే సంక్షేమం చేస్తున్నాం అంటూ ఊదరగొడుతున్నా, అది నామమాత్రం అనే చెప్పాలి. హడావిడి తప్ప విషయం లేదు. అయితే ఒక్క విషయంలో మాత్రం, జగన్ ప్రభుత్వం పై సానుకూలత ఉంది. అదే అమ్మ ఒడి పధకం. గతంలో ఇచ్చే అనేక పధకాలు ఆపేసి, ఆ డబ్బు మొత్తం ఒకేసారి ఇస్తూ ఉండటంతో ప్రజలు కూడా ఈ పధకానికి కనెక్ట్ అయ్యారు. గత రెండేళ్లుగా సంక్రాంతి పండుగ రోజున ఈ పధకం ఇస్తారు. దీంతో ప్రజలు కూడా, ఈ డబ్బు తీసుకుని స్కూలు ఫీజులు కట్టటం, సొంత అవసరాలకు ఉపయోగించుకోవటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఇప్పుడు ఈ పధకాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. తాజాగా జగన్ చేసిన సమీక్షలో అమ్మఒడి పధకం పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి అమ్మఒడి జనవరి నెలలో కాకుండా, జూన్ నెలలో ఇస్తాం అంటూ ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెనుక ప్రభుత్వ ఆర్ధిక కష్టాలు ఉన్నయనే ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక కష్టాల్లో ఉండటంతో, ప్రస్తుతం జీతాలకు కూడా డబ్బులు వెతుక్కోవాల్సిన పరిస్థితి.

jagan 14102021 2

ఈ పరిస్థితిలో ఒకేసారి ఆరు వేల అయుదు వందల కోట్లు కావాలి అంటే, అంత అప్పు పుట్టటం అనేది అసంభవం. అందుకే దీన్ని ప్రస్తుతానికి ఆరు నెలల పాటు వాయిదా వేసి, గండం గట్టెక్కించే ప్లాన్ వేసారు. అయితే మొదటి నుంచి అమ్మ ఒడి పై ప్రభుత్వం నాటకాలు ఆడుతూ వస్తుంది. ముందుగా ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మఒడి అని చెప్పారు. తరువాత కాదు కాదు అంటూ ఒక్కరికే పధకం అని చెప్పారు. సరే ఇది అయిపోయిన తరువాత పదిహేను వేలు కాదు అంటూ, ఒక వెయ్యి కట్ చేసి, కేవలం 14 వేలు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా 75శాతం హాజరు ఉండాలని మరో మెలిక పెట్టారు. అయితే ఈ రెండేళ్ళు క-రో-నా కావటంతో, ఈ నిబంధన వర్తించలేదు. ఇప్పుడు ఏకంగా పధకమే ప్రశ్నార్ధకం చేసారు. అయితే ఈ ఇంపాక్ట్ ప్రైవేటు స్కూల్స్ మీద పడనుంది. సకాలంలో ఫీజులు వస్తాయో రావో అనే పరిస్థితి వచ్హిది. మొత్తానికి, మొన్నటి వరకు ఎక్కడైతే జగన్ కు పాజిటివ్ ఉందో, అది కూడా నెగటివ్ అయి కూర్చుంది. అభివృద్ధి అయితే ప్రజలకు పట్టదు కానీ, తమకు వచ్చే పధకాలు ఇవ్వకపోతే మాత్రం, ఊరుకోరు మరి.

ఇప్పటికే తెలుగు అకాడమీలో భారీ స్కాం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఏపిలో మరో స్కాం బయట పడింది.  ఏపీ గిడ్డంగుల కార్పొరేషన్ నుంచి రూ.9 కోట్లను కేటుగాళ్లు కొట్టేసారు. కార్పొరేషన్ ఎఫ్ డీల నుంచి నిధులు గల్లంతు అయినట్టు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ, "కార్పొరేషన్ కు చెందిన మొత్తం రూ.32 కోట్లు ఎఫ్ డీల రూపంలో ఉన్నాయని అన్నారు. తెలంగాణ పోలీసుల నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు. భవానీపురం IOB లోని FD నుంచి 9 కోట్ల 60 లక్షలు కొట్టేశారని, మొత్తం 34FDలకు... IOBలో నగదు గల్లంతు అయినట్లు గుర్తించాం అని అన్నారు. బ్యాంక్ అధికారులతో మాట్లాడాం, విచారణ జరుగుతోంది అని అన్నారు.  ప్రభుత్వ FDలు గల్లంతు అవ్వడంతో విస్తుపోయాం అని అన్నార్. FDలు మెచ్యూర్ అవ్వడానికి ముందే నిధులు తరలించారని, అంతర్గత విచారణ ఉంటుందని,దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం అని అన్నారు. మేము చేసిన FD లు మొత్తం తిరిగి చెల్లించేందుకు IOB అధికారులు అంగీకరించారని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ తెలిపారు. అయితే ఇలా రోజుకి ఒక కార్పొరేషన్ లో స్కాం బయట పడటం, గమనించాల్సిన అంశం.

నేటి నుంచి మన పిలక కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. నేటి నుంచి కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ బోర్డుల పరిధి అమల్లోకి వస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి దశలో సమ్మతి తెలిపే ప్రాజెక్టుల బాధ్యతల స్వీకరణ చేస్తారని సమాచారం. తీర్మానించిన జాబితాను తెలుగు రాష్ట్రాలకు బోర్డులు అందించాయి. 15 అవుట్ లెట్ల జాబితాను కేఆర్ఎంబీ ప్రకటించింది. శ్రీశైలం పరిధిలో 7, నాగార్జునసాగర్ కింద 8 ప్రాజెక్టులను ప్రకటించారు. 15 అవుట్ లెట్లకు ఉత్తర్వులు తెలుగు రాష్ట్రాలు జారీ చేయాల్సి ఉంది. గోదావరిపై ఉన్న పెద్దవాగు ప్రాజెక్టును అప్పగించేందుకు అంగీకారం తెలిపాయి. పెద్దవాగు కింద ఏపీలో 85 శాతం, తెలంగాణలో 15 శాతం ఆయకట్టు ఉంది. అలాగే కృష్ణాకు సంబంధించి బోర్డుకు సమ్మతిని రెండు తెలుగు రాష్ట్రాలు ఇంకా తెలపలేదు. 15 అవుట్ లెట్లకు సంబంధించి సమ్మతిని ఇరు రాష్ట్రాలు తెలపాయి. విద్యుత్ కేంద్రాలు మినహాయించి ఉత్తర్వులిచ్చేందుకు తెలంగాణ యత్నం చేస్తుంది. అయితే ఉత్తర్వుల జారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేచి చూస్తుంది. తెలంగాణా ప్రకటించిన తరువాత, చూద్దాం అనే ధోరణితో ఉందని సమాచారం.

Advertisements

Latest Articles

Most Read