జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై అన్ని వైపుల నుంచి విమర్శలు ఎక్కువ అయిపోయాయి. కేవలం రెండున్నరేళ్ళకే, ఇలా అయిపోయిన ప్రభుత్వం, బహుసా ఇదేనేమో. ఒక పక్క అంత పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తున్నాం అని చెప్తున్నా, ఇక్కడ మాత్రం ప్రజలు అవేమి విశ్వసించటం లేదు. ముఖ్యంగా అప్పులు పాలు అవుతున్న రాష్ట్రం, పెరిగిపోతున్న రేట్లు, రాని పెట్టుబడులు, లేని ఉద్యోగులు, దారుణమైన రోడ్డులు, మహిళలకు లేని భద్రత, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏది చూసినా మొత్తం తేడాగానే ఉంది. ఆ వర్గం, ఈ వర్గం అని లేదు అన్ని వర్గాలది అదే పరిస్థితి. సొంత సామాజికవర్గం కూడా జగన్ కు దండం పెడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, జగన్ పై విరుచుకు పడ్డారు. 2014 తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న డీఎల్, 2019 ఎన్నికల సమయంలో జగన్ కు అనుకూలంగా పని చేసారు. అయితే అందరి లాగే, ఆయనకు కూడా ఇప్పుడు మొత్తం సినిమా అర్ధం అయ్యింది. జగన్ ప్రభుత్వ వైఖరి పై దుమ్మెత్తి పోశారు. రాష్ట్రంలో మంత్రులు అందరూ డమ్మీలుగా మారి పోయారని, అన్నిటికీ ఒక్కడే వచ్చి మాట్లాడుతున్నాడని పరోక్షంగా సజ్జల పై విరుచుకు పడ్డారు. చెంబు పట్టుకుని వెళ్ళే వారికి, చిన్నపటి స్నేహితులకు, సలహదారు పదవులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
తన వర్గం కూడా ఈ సారి మా రెడ్డి ప్రభుత్వం రావాలని ఊగిపోయమాని, ఇప్పుడు తమకు బుద్ధి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితితులు ఉన్నాయని అన్నారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతులను పట్టించుకునే వారే లేకుండా పోయారని అన్నారు. తన సొంత పొలాన్ని కౌలకు ఇద్దామని చూసినా ఎవరూ ముందు రాని పరిస్థితి ఉందంటే, పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. దొంగ ఆయిల్ వ్యాపారం చేసే అంబటి కృష్ణారెడ్డి లాంటి వారికి వ్యవసాయ శాఖ సలహాదారుడి పదవి ఇచ్చారని అన్నారు. తప్పు చేసిన ఎవడైనా జైలుకు పోక తప్పదని అన్నారు. సొంత ఖజానాను నింపుకోవటానికే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప, ప్రజల సమస్యలు పట్టటం లేదని అన్నారు. జరుగుతున్న దారుణాల పై చూస్తూ ఊరుకోలేక ముందుకు వచ్చానని, మీడియా కూడా ఈ దారుణాలని ప్రశ్నించాలని డీఎల్ డిమాండ్ చేసారు. రాష్ట్ర భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించాలని అన్నారు.