నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, బురద చల్లటం, విమర్శలు చేయటం అనేది వైసీపీకి బాగా అలవాటు. అందులో నిజం ఉందా, లేదా, వాస్తవం ఎంత అనేది చూడరు. బురద చల్లటమే కావాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అధికార పక్షంలో కానీ, కేవలం బురద చల్లటం మీదే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, వీళ్ళు నడుపుతున్న హెరిటేజ్ పైన కూడా బురద వేసారు. అయితే చంద్రబాబు, లోకేష్ అంటే రాజకీయంగా పడతారు కానీ, వందలాది మంది ఇన్వెస్టర్స్, ఖాతాదారులు, రైతులు ఉన్న హెరిటేజ్ అనే లిస్టెడ్ కంపెనీని అంటే ఎందుకు పడతారు ? అందుకే ఇలాగే లూజ్ మాటలు మాట్లాడిన వైసీపీ నేతల పై పరువు నష్టం కేసు వేసారు. అయితే ఈ రోజు ప్రజాప్రతినిధుల కోర్టులో, హెరిటేజ్ వేసిన పరువునష్టం కేసు పై విచారణ జరిగింది. వైసిపీ మంత్రి కన్నబాబు, అంబటి రాంబాబు విచారణకు గైర్హాజరవడంతో, ఇద్దరి పైన నాన్ బెయిలబుల్ వారంట్ అమలు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది ప్రజాప్రతినిధుల కోర్టు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్‌బీఐ షాక్ ఇచ్చింది. సుమారుగా, 6,500 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వడానికి ఎస్‌బీఐ ఒప్పుకోలేదు. సీఎస్ఎస్ పథకాలు, అంటే కేంద్ర భాగస్వామ్యం ఉన్న పధకాలకు సంబంధించి, మ్యాచింగ్ గ్రాంట్ కోసం ఎస్‌బీఐని, ఓవర్ డ్రాఫ్ట్ కోసం ఏపి ప్రభుత్వం కోరింది. కానీ, ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వటం కుదరదు అంటూ, ఎస్‌బీఐ తేల్చి చెప్పింది. సీఎస్ఎస్ పథకాలకు సంబంధించి, కేంద్రం ఈ సంవత్సరం నుంచి, కొన్ని కొత్త నిబంధనలు తీసుకుని వచ్చింది. ఇప్పటి వరకు కూడా సీఎస్ఎస్ పథకాలకు సంబందించిన నిధులను కొన్ని రాష్ట్రాలు తమ తమ అవసరాలకు వాడుకుంటున్నాయని, సొంత అవసరాలకు రాష్ట్రాలు ఉపయోగించుకోకుండా, కొత్త నిబంధనలు పెట్టింది. ఈ సీఎస్ఎస్ నిధులను పీడీ ఖాతాలకు మళ్ళించకుండా, కొత్త నిబంధనలు పెడుతూ సీఎస్ఎస్ పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వలకు విడుదల చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ నుంచి రాష్ట్రాలకు ఇవి చేరుతాయి. ఈ నిధులు రిజర్వ్ బ్యాంక్ కు చేరిన తరువాత, 21 రోజుల్లో నోడల్ ఏజెన్సీ ద్వారా, ఖాతాలకు బదలాయించాలి. కేంద్రం తన వాటా విడుదల చేసిన 40 రోజుల్లోగా రాష్ట్రం తన వాటాని విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని కూడా ఈ సింగల్ నోడల్ ఏజెన్సీ ఖాతాల్లోనే వేయాల్సి ఉంటుంది.

sbi 30092021 2

ఒక పధకం నిధులు అన్నీ ఒకే బ్యాంకులో ఉండాలని, వాటి వినియోగం , ఖర్చు పై కూడా మ్యాపింగ్ జరగాలని కేంద్రం నిర్దేశించింది. నిర్దిష్ట సమయంలో కనుక, కేంద్ర రాష్ట్ర వాటాల నిధులు కలిపి ఖర్చు చేస్తేనే, తదుపరి నిధులు కూడా విడుదల అయ్యే విధంగా, కొత్త విధానాలను మార్చింది. ఈ రాష్ట్ర వాటా నిధులు భారాంయించేందుకే ఇప్పుడు ఏపి ప్రభుత్వం అనేక మార్గాల కోసం చూస్తుంది. ఇదే విషయం పై 6,500 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కావాలని, ఎస్‌బీఐకి ఇటీవల రాష్ట్రానికి సంబంధించిన అధికారులుకోరగా, ఎస్‌బీఐ, రాష్ట్ర అధికారులకు తిరిగి షాక్ ఇచ్చే విధంగా లేఖ రాసింది. సీఎస్ఎస్ పథకాలకు సంబంధించిన ఖాతాలు మీ బ్యాంక్ లో తెరుస్తాం అని, అయితే మూలదానంగా ఉండే 6,500 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ కింద ఇవ్వాలని ప్రభుత్వం కోరగా, ఎస్‌బీఐ మాత్రం తాము ఇంత ఓవర్ డ్రాఫ్ట్ కింద మీకు ఇవ్వలేం అని చెప్పటంతో, రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అవమానం అనే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి పై నమ్మకం లేకే, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, ఈ నిర్ణయం ప్రకటించి ఉండవచ్చని, ఆర్ధిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన కేసులో ఈ రోజు సుప్రీం కోర్టులో విచరణ జరిగింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ముందు ఈ పిటీషన్ రాగా, జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగటం లేదు అంటూ పిటీషన్ దాఖలు అయ్యింది. అయితే ఇదే పిటీషన్ ను హైకోర్టులో దాఖలు చేసినప్పుడు, హైకోర్టు ఆ పిటీషన్ ను కొట్టివేసింది. హైకోర్టు కొట్టివేసిన పిటీషన్ పైన, పిటీషన్ దారుడు సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు. ఈ కేసులో విచారణ సందర్భంగా, ఈ రోజు జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆగమశాస్త్రం ప్రకారం పూజలు జరగటం లేదా అని ఆరా తీస్తూ, అలా ఒక వేళ జరగక పొతే, వెంకటేశ్వర స్వామి ఎవరినీ ఉపేక్షించరని, వెంకటేశ్వర స్వామి మహిమలు ఏమిటో అందరికీ తెలుసని, తాను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడునే అని, తనతో పాటు ఇతర జడ్జిలను చూపిస్తూ, వీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులే అని అన్నారు. స్వామి వారి సేవల్లో ఎటువంటి అన్యాయం జరగదని, ఒకవేళ జరిగితే మాత్రం, వాళ్ళు శిక్షార్హులు అవుతారని అన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగటం లేదు అంటూ వచ్చిన పిటీషన్ పై జస్టిస్ ఎన్వీ రమణ, టిటిడిని కూడా వివరణ అడిగారు.

nvramana 30092021 2

దీని పై కౌంటర్ దాఖలు చేయాలని టిటిడి ఆదేశిస్తూ, తరువాత దీని పైన విచారణ జరుపుతాం అంటూ, తదుపరి విచారణను వారం రోజులు పాటు వాయిదా వేసారు. వెంకటేశ్వర స్వామి పైన తనకున్న భక్తిని, ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ చాటి చెప్పారు. ఇక ఇదే కేసులో టిటిడికి సంబంధించిన మరో అంశం అయిన, హిందూయేతర భక్తుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని అనే కేసు పై కూడా జస్టిస్ ఎన్వీ రమణ తన మార్క్ చూపించారు. సుప్రీం కోర్టు చరిత్రలో మరోసారి తెలుగులో సంబాషణలు చేస్తూ, కేసులో వాదనలు విన్నారు. పిటీషనర్ తో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలుగులో మాట్లాడారు. హిందూయేతర భక్తుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలనే ఆదేశాలు అమలు అయ్యేలా చూడాలి అంటూ పిటీషనర్ కోరారు. ఈ పిటీషన్ వేసింది శివారి దాదా. మొత్తానికి శ్రీవారి కేసు సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలుగులో మాట్లాడటమే కాదు, వెంకటేశ్వర స్వామి జోలికి రావద్దు అని, ఆయన జోలికి వస్తే, ఆయన ఉపెక్షించరు అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనం డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్. ఆయన ఒక దళిత డాక్టర్. నర్సీపట్నం లాంటి ఏజెన్సీ ప్రాంతంలో, ఆయన మత్తు డాక్టర్ గా పని చేస్తూ, ఎంతో సేవ చేసే వారు. అయితే ఇలాంటి మంచి పేరు ఉన్న డాక్టర్ కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, పిచ్చి వాడిగా ముద్ర వేసి, చివరకు మానసిక వేదన అనుభవించి చనిపోయారు. ఆయన చావుకి, ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ బాధ్యులు అనే చెప్పాలి. క-రో-నా మొదటి వేవ్ సమయంలో, ఎవరికీ సరైన క్లారిటీ లేదు. క-రో-నా అంటే భయపడి పోయే పరిస్థితి. ఫీల్డ్ లో పని చేసే డాక్టర్లు అయితే, మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. డాక్టర్ గా పని చేస్తున్న సుధాకర్, తమకు మాస్కులు కావలి అని అడిగారు. ఆయన్ను అవమానించారు. పక్కనే మీడియా ఉండటంతో, మీడియాతో బాధ పంచుకున్నారు. ఒక్క మాస్క్ అడిగితే ఇవ్వటం లేదని అన్నారు. అంతే ఈ వీడియో పిచ్చ వైరల్ అయ్యింది. ప్రభుత్వం కొడుకున్న డబ్బాకు , వాస్తవ పరిస్థితికి తేడా ఉండటంతో, ప్రభుత్వం తట్టుకోలేక పోయింది. వెంటనే ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆయన చేసిన తప్పు ఒక మాస్క్ అడగటం. సస్పెండ్ చేసిన వార్త కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఎందుకు ఇలా ప్రభుత్వం, ఒక దళిత డాక్టర్ పై వెంట పడుతుందో ఎవరికీ అర్ధం కాలేదు.

sudhakar 30092021 2

చివరకు ఒక రోజు ఆయన చొక్కా లేకుండా, రోడ్డు మీద పడి ఉన్న వీడియోలు వచ్చాయి. ఆయన్ను పోలీసులు కొడుతున్నారు. చివరకు అదే రోజు అయన్ను పిచ్చి వాడిగా ముద్ర వేసారు. పిచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో టిడిపి మహిళా నేత వంగలపూడి అనిత జరిగిన పరిణామాల పై హైకోర్టుకు లేఖ రాసారు. హైకోర్టు ఆ లేఖను పరిగణలోకి తీసుకుని, ఈ కేసు పై సిబిఐ విచారణ చేయాలని ఆదేశించింది. సిబిఐ విచారణ చేస్తున్న సమయంలోనే, తీవ్ర మానసిక వేదనలో ఉన్న సుధాకర్ చనిపోయారు. అయితే నిన్న సిబిఐ కోర్టుకు కొన్ని సంచలన విషయాలు చెప్పింది. ఈ కేసులో విచారణ పూర్తి చేసామని, చార్జ్ షీట్ వేయటానికి అనుమతి కోరింది. ఈ కేసులో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించామని, వారి పేర్లు చార్జ్ షీట్లో పెట్టామని, వారిని ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరతామని కోర్టుని కోరింది. అలాగే తుది నివేదికను కూడా కోర్టు ఇచ్చారు. కోర్టు అన్నీ పరిగణలోకి తీసుకుని, విచారణ వాయిదా వేసింది. ఇప్పుడు ఈ అధికారులను ప్రాసిక్యూట్ చేస్తే, అసలు ఈ అధికారులకు ఎవరు ఆదేశాలు ఇచ్చేరు అనే విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి సిబిఐ ఏమి చేస్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read