సినిమా టికెట్లు అమ్ముతాం అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రకటన పై, రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్, వైసీపీ ప్రభుత్వం అనేక విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీని పై ఎదురు పవన్ కళ్యాణ్ పైన కూడా వైసీపీ విమర్శలు చేసింది. ఆ విమర్శలు ఇంట్లో ఆడవాళ్ళని తిట్టే వరకు వెళ్ళాయి. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ కు, అటు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి కానీ, ఇటు సొంత కుటుంబం నుంచి కానీ ఎలాంటి మాద్దటు లభించ లేదు. సినీ పరిశ్రమ అంటే, ప్రభుత్వంతో అవసరాలు ఉంటాయి కాబట్టి, భయ పడ్డారు అనుకోవచ్చు. కానీ సొంత కుటుంబం చిరంజీవి లాంటి పెద్ద హీరో కానీ, అన్నిట్లో దూరి రచ్చ రచ్చ చేసే నాగబాబు లాంటి వాడు కానీ, ఇప్పటికీ ఈ విషయం పై స్పందించలేదు. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళని తిడుతున్నా, చివరకు తల్లిని లాగినా, చిరు ఫ్యామిలీ స్పందించక పోవటం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ రోజు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ రోజు అనూహ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చిన సినీ పెద్దలు, బందర్ వెళ్లి మరీ పేర్ని నానిని కలిసారు. దిల్ రాజు ఆధ్వర్యంలో, ఈ మీటింగ్ జరిగింది. ఏ సెక్రటేరియట్ లోనో కాకుండా, బందర్ వెళ్లి మరీ పేర్ని నాని కార్యాలయంలో కలిసారు.

perni 29092021 2

మీటింగ్ అనంతరం పేర్ని నాని మాట్లాడుతూ, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల పై చిరంజీవి తనతో ఫోన్ చేసి మాట్లాడారని అన్నారు. చిరంజీవి ఎంతో విచారం వ్యక్తం చేసారని పేర్ని నాని అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ, పవన్ మాట్లాడిన మాటలతో తాము ఏకీభావించటం లేదని, ఇప్పటికే ఏపి ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేస్తుందని, తాము ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని, తాను షూటింగ్ లో వేరే ఊరిలో ఉన్నాని, షూటింగ్ అయిన తరువాత, వచ్చి మాట్లాడతా అని చెప్పినట్టు నాని చెప్పారు. పక్కన ప్రెస్ మీట్ లో దిల్ రాజు కూడా ఉన్నారు. అంటే, చిరంజీవి ఈ వ్యాఖ్యలు నిజంగా చేసినట్టే అనుకోవాలి. ఒక పక్క పవన్ కళ్యాణ్, ఈ స్థాయిలో, సినిమా టికెట్లు విషయం పై, ప్రభుత్వంతో పోరాటం చేస్తుంటే, చిరంజీవి మద్దతు ఇవ్వకపోగా ఇలా మాట్లాడటం షాక్ అనే చెప్పాలి. ఏమి మాట్లడతకుండా తటస్థంగా ఉన్నా, చిరంజీవికి హుందాతనం పెరిగేది. మరి నిజంగా పేర్ని నాని చేసిన ఈ వ్యాఖ్యలు, చిరంజీవి చేసారా ? లేదా అనేది చిరంజీవి స్పందించిన తరువాత తెలుస్తుంది.

క-రో-నా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న సమయంలో, ఏపి ప్రజల్లో హాట్ టాపిక్ గా నిలిచారు, కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య. ఆయన తాయారు చేసే మందు తీసుకుంటే, క-రో-నా రాదని, అలాగే వచ్చిన వారికి నయం అయిపోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాగే ఆక్సిజన్ తగ్గిన వారికి కూడా కంట్లో చుక్కల మందు వేస్తే వెంటనే ఆక్సిజన్ పెరుగుతుంది అని కూడా ప్రచారం జరిగింది. ప్రచారం మాత్రమే అయితే ఫెయిల్ అయ్యేది, ప్రజలు ఇక్కడకు వచ్చి, ఆ మందు తీసుకుని, నయం అయిన వారు కూడా ఉండటంతో, ప్రజల్లో విశ్వాసం పెరిగింది. తండోపతండాలుగా వచ్చారు. మరో పక్క అయన రూపాయి తీసుకోకుండా ఈ మందు ఇవ్వటం, ఎక్కడా డబ్బు ప్రస్తావన కూడా లేకపోవటంతో, ఆయన మందుకు క్రెడిబిలిటీకు ప్రజల్లో వచ్చింది. మరో పక్క సైన్స్ పరంగా కొంత మంది వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు. అయితే ప్రజల్లో ఉన్న ఆదరణ చూసిన ప్రభుత్వం, రంగంలోకి దిగింది. తరువాత కొన్ని రోజులు మందు పంపిణీ ఆగిపోయింది. ప్రభుత్వ పెద్దలు బ్లాక్ లో తయారు చేసి అమ్మించారు అని కూడా ప్రచారంలోకి వచ్చింది. మొత్తం మీద ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. కోర్టు జోక్యంతో, ఎలాంటి హాని లేదని తేలటంతో, అనుమతులు ఇచ్చారు.

anandayya 28092021 2

అయితే ఇప్పుడు క-రో-నా తగ్గటం, వ్యాక్సిన్ లు కూడా జోరుగా సాగుతూ ఉండటంతో, ఈ మందు నెమ్మదిగా కనుమరుగు అయిపొయింది. ఇప్పుడు తాజాగా మరోమారు ఆనందయ్య వార్తల్లోకి ఎక్కారు. తాజాగా విజయనగరం జిల్లాలో యాదవుల సమీక్షా సమావేశానికి వచ్చిన ఆనందయ్య, మీడియాతో మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. తన మందు ప్రజలకు ఇవ్వనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుందని అన్నారు. ఒకానొక సమయంలో తనను అరెస్ట్ చేయటానికి కూడా ప్రభుత్వం వెనుకాడ లేదని అన్నారు. కృష్ణపట్నం ప్రజలను చూసి పోలీసులు వెనక్కు తగ్గారని అన్నారు. ఇప్పటికీ తన మందు క-రో-నా తగ్గిస్తుందని నమ్ముతానని అన్నారు. ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ, యాదవులకు సరైన ప్రాతినిధ్యం రావటం లేదని అన్నారు. రాజకీయంగా బీసిలు ఎదగాలని అన్నారు. రాజ్యాధికారం దిశగా పని చేస్తామని, కొత్త పార్టీ కూడా ఒకటి పెడతాం అంటూ, మీడియాకు తెలిపారు. ఏపి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన ఆనందయ్య మరోసారి వార్తల్లో నిలిచారు.

రాయలసీమ రైతాంగం పరిస్థితి నానాటికీ హీనంగా తయారవుతోందని, ఒకవైపు ప్రకృతిశాపం, మరోపక్క పాలకుల నిర్లక్ష్యం, సగటురైతుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా తయారవ్వడంతో గతేడాది సీమ ప్రాంతంలో దాదాపు 17లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగుచేసిన రైతులకు దు:ఖమే మిగిలిందని టీడీపీ సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి కాలవశ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‍కు ఎండిపోయిన వేరుశనగ పంటలను కొరియర్ పార్సిల్ చేసారు కాలువ శ్రీనివాసులు. కొరియర్ లో సీఎం కు పంపిన వేరుశనగ పంట చూసి అయినా రైతులను ఆదుకోవాలని కోరారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! గతేడాది ఆశాజన కంగా వర్షాలుకురవడంతో రైతులు వేరుశనగ సాగుచేశారు. పైరుబాగా పెరిగి, కాయలు వచ్చేసమయంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల ఏర్ప డ్డాయి. కాయలు సరిగా రాక, పంట తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ఏడాది కూడా రైతులు సంశయంతోనే వేరేగత్యంతరంలేక తిరిగి వేరుశనగనే సాగు చేశారు. మరీముఖ్యంగా అనంతపురం జిల్లాలో దేశంలోనే ఎక్కువగా వేరు శనగను సాగుచేస్తారు. ఒకజిల్లాలో 13 లక్షలఎకరాల్లోవేరుశనగ సాగు చేయడమనేది అనంతపురం జిల్లాకే సాధ్యమైంది. గతేడాది 12లక్షల 20వేలఎకరాల్లో వేరుశనగసాగుచేసిన రైతులు దాదాపు రూ.3వేలకోట్ల విలువైనపంటను నష్టపోయారు. అంతతీవ్రంగా నష్టంజరిగితే జగన్ ప్రభుత్వం రైతులకు కనీసం రూ.300కోట్లు కూడా పరిహారం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో కూడా తెలియడంలేదు. దాంతో దిక్కుతోచని రైతాంగం ఈ ఏడాది వేరుశనగ సాగువిస్తీర్ణాన్ని తగ్గించింది. కేవలం 11లక్ష లఎకరాలకే పరిమితంచేసింది. రాయలసీమవ్యాప్తంగా ప్రస్తుతం అతిత క్కువగా 6లక్షల15వేలహెక్టార్లలో మాత్రమే వేరుశనగను సాగుచేశారు. గత సంవత్సరంతో పోలిస్తే,2.50లక్షల ఎకరాల విస్తీర్ణం తగ్గింది. ప్రభుత్వం సహకరించకపోవడం, గతంలోసాగుకోసం తీసుకున్న అప్పులు చెల్లించక పోవడంతో విస్తీర్ణం బాగాతగ్గింది. ఈ సంవత్సరం కూడా వేరుశనగ పైరు పరిస్థితి ఆశాజనకంగా లేదు. సాగుచేసినదానిలో దాదాపు 15లక్షలఎక రాల్లోని వేరుశనగ పైరు ఎండిపోతోంది. ఇంతనష్టం జరుగుతున్నా ప్రభుత్వంనుంచి స్పందన లేదు.

వ్యవసాయశాఖ మంత్రి ఏంచేస్తున్నారో కూడా తెలియదు. ఆయనకు తన శాఖకు సంబంధించిన సమస్యలు, విషయాలు తప్ప, అన్నీ అవసరమే. రైతులను ఆదుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏనాడూ చేసింది లేదు. జగన్మోహన్ రెడ్డికూడా రాయలసీమవాసే. అనంతపురం వేరుశనగ రైతు కళ్లల్లో నీళ్లు వస్తుంటే, ఈ ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లయినా లేదు. ఈ ముఖ్యమంత్రి ఎందుకింత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరి స్తున్నారు? గతంలో ప్రకృతి సహకరించకపోయినా, చంద్రబాబునాయుడు గారుముఖ్యమంత్రిగా వారంరోజలు అనంతపురంలోనే ఉండి, వేరుశనగ పైరును కాపాడటానికి శాస్త్రవేత్తలను పిలిపించి మాట్లాడారు. ఉన్నంతో నీటి వనరులను ఉపయోగించి, వేరుశనగ పైరుకు రక్షకతడులు అందించా రు. అయినా కూడా కాస్తోకూస్తో పంట నష్టం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచిన టీడీపీ ప్రభుత్వం, అనంతపురం జిల్లా వేరుశనగ రైతులకు రూ.1126కోట్ల సహాయం అందించింది. 2019 మేలో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి,అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. రూ.1800కోట్లవరకు రాయలసీమ రైతులకే పరిహారం ఇస్తున్నా మనిచెప్పాడు. అసెంబ్లీలో ఆయన చెప్పినమాట మాటగానే మిగిలింది తప్ప, రెండున్నరఏళ్లు పూర్తయినా సీమరైతులకు పరిహారం అందలేదు. ముఖ్యమంత్రి మాట చెల్లుబాటుకాలేదని చెప్పడానికి తమకే సిగ్గుగా ఉంది. రాయలసీమ రైతులను ఆదుకోవాలని కోరుతూ, వారికి జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్టు వివరిస్తూ, ముఖ్యమంత్రికి టీడీపీ తరుపున లేఖరాశాం. ఆయన ఇప్పటికైనా కళ్లుతెరిచి, సీమప్రాంత మరీ ముఖ్యంగా అనంతపురం వేరుశనగ రైతులను ఆదుకోవాలని పత్రికాముఖంగా కోరుతున్నాం. గతంలో వారికి అందాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం వెంటనే అందించాలని, వేరుశనగరైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ యంత్రాలు సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేస్తున్నాం. స్వయంగా ముఖ్యమంత్రి, వ్యవసాయమంత్రి రాయలసీమప్రాంతంలో పర్యటించి రైతుల సమస్యలను పరిష్కరించాలనికూడా డిమాండ్ చేస్తున్నాం. వారు స్పందించని పక్షంలో ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి వైఖరినినిరసిస్తూ, పెద్దఎత్తున రైతులను సమీకరించిప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఉద్యమిస్తుందని, రాజీలేని పోరాటంచేస్తుందని ప్రభుత్వాన్నిహెచ్చరిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఎటు వైపు ఉన్నాయో అర్ధం అవుతుంది కానీ, ఏపి బీజేపీ మాత్రం ఎవరికీ అర్ధం కాదు. వాళ్ళు తమ పార్టీ కోసం పని చేస్తున్నారో, జగన్ మోహన్ రెడ్డికి మేలు చేయటం కోసం పని చేస్తున్నారో, పజిల్ గానే ఉంటుంది. గతంలో టిడిపితో మిత్రపక్షంగా ఉన్నా, సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు, ప్రతి రోజు టిడిపి విమర్శిస్తూ, వైసీపీ ఆరోపణలకు బలం చేకూర్చే వారు. సోము వీర్రాజు మళ్ళీ టిడిపి బలంతోనే ఎమ్మెల్సీ అయ్యారు కూడా. అయినా ఆయన అప్పట్లో టిడిపిని కార్నర్ చేస్తూ, వైసీపీకి బెనిఫిట్ అయ్యే విధంగా ప్రవర్తించేవారు. ఇక జీవీఎల్ అయితే ప్రతి రోజు ఎదో ఒక అంశంతో వచ్చి రచ్చ రచ్చ చేసే వారు. అలాగే మీడియా చానల్స్ కు ఎక్కి విష్ణు వర్ధన్ రెడ్డి చేసే హడావిడి అంతా ఇంటా కాదు. ఇలా అందరూ మామూలు రచ్చ చేసే వాళ్ళు కూడా. ఇప్పుడు బీజేపీ, జనసేన కలిసి మిత్రపక్షంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్, ఎందుకు కలిసారో తెలియదు కానీ, కలిసిన దగ్గర నుంచి ఏపి బీజేపీ పై అసంతృప్తితోనే ఉన్నారు. అలాగే కార్యక్రమాలు కూడా, ఏ పార్టీకి ఆ పార్టీ చేసుకుంటుంది కాని, కలిసి మాత్రం చేయటం లేదు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, బీజేపీ, జనసేన ప్రభావం, ఏమి లేదు. ప్రధానంగా క్యాడర్ కలిసి పని చేసింది ఏమి లేదు.

somu 28092021 2

ఇంకా ఆశ్చర్యకరంగా, కొన్ని చోట్ల, టిడిపి, జనసేన కలిసి పని చేసుకుని, గెలిచారు కూడా. ఈ నేపధ్యంలోనే, గత నెల రోజులుగా, బీజేపీతో పవన్ ఉండరు అనే చర్చ మీడియాలో నడుస్తుంది. ఈ అంశం పక్కన పెడితే, గత రెండున్నరేళ్ళుగా వైసీపీ పై పెద్దగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయని పవన్ కళ్యాణ్, మొన్న జరిగిన సినిమా ఫంక్షన్ లో వైసిపీ పై చెలరేగి పోయారు. వైసీపీ పై అనేక విమర్శలు చేసారు. అలాగే అటు వైపు వైసీపీ నుంచి కూడా అదే విధమైన విమర్శల దా-డి మొదలైంది. అయితే అనూహ్యంగా బీజేపీ వైపు నుంచి రియాక్షన్ లేదు. ఈ రోజు జీవీఎల్ ఒక ట్వీట్ చేసి దులుపుకున్నారు. మిత్రపక్షం అని చెప్పుకునే పవన్ పై ఇంత దా-డి జరుగుతున్నా, బీజేపీ సౌండ్ చేయటం లేదు. సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి అడ్డ్రెస్ లేరు. వైసీపీని బీజేపీ నేతలు ఎందుకు విమర్శలు చేయటం లేదో అర్ధం కావటం లేదు. మొత్తంగా బీజేపీ, జనసేన మధ్య సఖ్యత లేదు అనే విషయం, మరోసారి ఈ ఎపిసోడ్ తో తేలిపోయింది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read