ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు, సినిమాలు ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టి అధికారంలోకి రావటం, తరువాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ పార్టీలు పెట్టినా ప్రజల మద్దతు పొందలేక పోవటం తెలిసిందే. ఇక బాలయ్య, రోజా, ఇలా అనేక మంది సినీ తారలు రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏపిలో సినిమా పరిశ్రమను తోక్కేస్తున్నారు అనే వివాదం నడుస్తుంది. కావాలని సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కేవలం కొంత మంది చిరంజీవిని వేసుకుని, వాళ్ళ స్వర్ధ్య ప్రయోజనాలు చూసుకుంటున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. సినిమా టికెట్లను మేము కాదు, చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్ళు అమ్మమంటేనే అమ్ముతున్నాం అని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ క్రమంలో, నిన్న జరిగిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తన ప్రసంగం మొత్తం వైసీపీని టార్గెట్ చేసుకుని మాట్లాడారు. సినిమా టికెట్లను ప్రభుత్వం అమ్మటం, సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండటం, ఇలా అనేక అంశాల పై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్, రాజకీయ అంశాలు కూడా కలిపి, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, అలాగే కొంత మంది వైసీపీకి అతిగా మద్దతు ఇచ్చే వారిని కూడా విమర్శలు చేసారు. పవన్ ప్రసంగం రాజకీయంగా పెద్ద బాంబు అనే చెప్పాలి. పవన్ ని టార్గెట్ చేస్తూ, ఇప్పుడు వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

mudragada 26092021 2

మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలు చూస్తే, ఆయన ముద్రగడను టార్గెట్ చేసారనే అభిప్రాయం ఉంది. టిడిపి హాయాంలో, కాపు రిజర్వేషన్ అంటూ ప్రతి రోజు హడావిడి చేసిన వాళ్ళు, ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు అంటూ పవన్ వేసిన ప్రశ్న, డైరెక్ట్ గా ముద్రగడను ఉద్దేశించే. మరి దీని పై ముద్రగడ ఏమి సమాధానం చెప్తారో చూడాలి. అలాగే పవన్ కళ్యాణ్ కోడి క-త్తి కేసు పైనా, ఇడుపులపాయ నేలమాళిగలు పైన, ఇలా అనేక అంశాల పై మాట్లాడారు. మంత్రి పేర్ని నానిని సన్నాసి అని, అవంతిని అరగంట విధ్వంసుడని, సంబోధించారు. అలాగే మోహన్ బాబుని కూడా టార్గెట్ చేసారు. వైసీపీ మీ చుట్టాలు అని చెప్పుకుంటారు కదా, మరి సినిమా టికెట్ల విషయంలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇప్పుడు సినిమా టికెట్లు, రేపు మీ విద్యా సంస్థల వరకు వస్తే, ఇలాగే చూస్తూ ఊరుకుంటారా అని పవన్ ప్రశ్నించారు. అయితే రాజకీయంగా చూసుకుంటే పవన్ ప్రసంగం హాట్ హాట్ గా ఉన్నా, ఈ మొత్తం అంశానికి కారణం అయిన చిరంజీవిని మాత్రం పవన్ వదిలేసారు. జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి కలిసి, శాలువాలు కప్పుకుని, ఫోటోలు దిగి, చివరకు ప్రభుత్వం చిరంజీవి చెప్పారనే సినిమా టికెట్లు మేము అమ్ముతున్నాం అని చెప్పినా, అసలు సమస్యకు కారణం అయిన చిరంజీవిని మాత్రం, పవన్ ఏమి అనకవపోవటం హైలైట్. ఏది ఏమైనా పవన్ ప్రసంగం రాజకీయంగా సూపర్ హిట్ అనే చప్పాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత మంత్రులకు షాక్ ఇస్తూ, జగన్ మోహన్ రెడ్డి బంధువు, అలాగే మంత్రి కూడా అయిన బాలినేని శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రెండున్నర ఏళ్ళు తరువాత, మొత్తం మంత్రులను మార్చుతాను అంటూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలంగా ఈ చర్చ జరుగుతున్నా, పెద్దగా మార్పులు ఉండవని, కొంత మందిని మాత్రమే మారుస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు బాలినని మాట్లాడుతూ, రెండున్నరేళ్ళ తరువాత, జగన్ మోహన్ రెడ్డి వంద శాతం మంత్రులను మారుస్తారని, ఆ నిర్ణయానికి తాను కూడా కట్టుబడి ఉంటానని మంత్రి బాలినేని చెప్పారు. మంత్రి బాలినేని మాట్లాడుతూ, మొత్తం మంత్రులను మార్చేస్తారు అంటూ చెప్పిన వ్యాఖ్యలతో, మిగతా మంత్రులు షాక్ తిన్నారు. నిన్నటి వరకు అందరినీ మార్చలే అనే ధీమాతో ఉన్నా, జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన బాలినేని చెప్పటంతో, మిగతా మంత్రులు షాక్ తిన్నారు.

balineni 25092021 2

అంతే కాదు మంత్రి బాలినేని ద్వారా జగన్ మైండ్ గేం ఆడుతున్నారు. మంత్రి బాలినేని చేత, తాను జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పటం ద్వారా, ఇతర మంత్రులను కూడా అదే విధంగా మాట్లాడాలని చెప్పిస్తున్నట్టు ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎక్కడా అసంతృప్తులు లేకుండా జాగ్రత్త పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అలాగే త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది అనే సంకేతాలు ఇచ్చారు. దసరా నాటికి ఏమైనా విస్తరణ ఉంటుందా అనే ప్రచారం జరుగుతుంది. ఇక అసవహులు కూడా ఇప్పటికే అన్ని రూట్లలో తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే మొన్నటి వరకు కేవలం పని తీరు ఆధారంగా కొంత మందినే మారుస్తారనే ప్రచారం నుంచి, ఇప్పుడు వంద శాతం మార్చేస్తారని అర్ధం అవుతుంది. రాజకీయంగా కూడా ఇది మంచిది అవుతుంది అంటూ జగన్ భావిస్తున్నారని. అనేక మంది మంత్రుల పై అవినీతి ఆరోపణలు కూడా ఒక కారణంగా చెప్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల కోసమే, మంత్రులు ఎంపిక ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

జగన్ ముఖ్యమంత్రయ్యాక ఆంధ్రప్రదేశ్ అరాచాకాంధ్రప్రదేశ్ గా మారిందని, వైసీపీ నేతల వ్యవహారశైలితో విదేశాల్లో సైతం మన రాష్ట్ర ప్రతిష్టదిగజారుతోందని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు ద్వజమెత్తారు. శనివారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో ఆషే ట్రేడింగ్ అనే కంపెనీ పేరుతో అక్రమంగా రవాణా అవుతున్న రూ. 72 వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్ లో పట్టుబడితే దానిపై కనీసం విచారణ జరపకుండా దీంతో రాష్ట్రానికి సంబందం లేదని, దీనిపై ప్రతిపక్షాలు వక్రీకరించి పోలీసులు మాట్లాడటం బాధాకరం. ఏపీలో ఉన్న కంపెనీ‎ పేరుతో డ్రగ్స్ రవాణా అవుతోందని జాతీయ మీడియా‎ సైతం కోడైకూస్తోంది. వైసీపీ నేతలు రాష్ట్ర పరువు, ప్రతిష్ట దిగజార్చుతుంటే ప్రతిపక్షంగా మాట్లాడే బాధ్యత మాకు లేదా? ఇంత పెద్దమెత్తంలో డ్ర-గ్స్ పట్టుబడితే డీజీపీ బాద్యత లేకుండా ప్రభుత్వాన్ని కాపాడేందుకు దీనితో రాష్ట్రానికి సంబందం లేదని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? దీనిపై ప్రతిపక్ష నేతలు వక్రీకరించి మాట్లాడుతున్నారని డీజీపీ అనటం సరికాదు. వైసీపీ మాదిరి ఆదారాలు లేకుండా ఎదుటి వారిపై బురదచల్లే అలవాటుకు టీడీపీకి లేదు. గతంలో పింక్ డైమండ్ పై అసత్య ప్రచారం చేసింది ఎవరు? మేం ఆదారాలు లేకుండా ఏదీ మాట్లాడం. ఆధారాలుంటేనే మేం మాట్లాడుతాం తప్ప గాలి కబుర్లు చెప్పం. ఆషీ ట్రేడింగ్ అనే కంపెనీ చిరునామా మాత్రమే రాష్ర్టంలో ఉందని దాని కార్యకలాపాలు ఇక్కడ లేవని డీజీపీ చెప్పారు. కానీ ఆ కంపెనీ పేరుతో ఉన్న జీఎస్టీ వివరాలు చూస్తే గత 9 నెలలుగా జీఎస్టీ చెల్లిస్తున్నట్టుగా ఉంది,దీనికి డీజీపీ సమాధానం చెబుతారు? ముఖ్యమంత్రి ఇంటి పక్కనే పెద్ద మెత్తంలో డ్ర-గ్స్ వ్యాపారం నడుస్తుంటే దాని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? దీనిపై కనీస విచారణ చేయకుండా ఎలాంటి ఆదారాలు లేకుండా పోలీసులు వాస్తవాలు వక్రీకరించి ఎందుకు మాట్లాడుతున్నారు?

దీనిపై రాష్ర్ట పోలీసు వ్యవస్ధ విచారణ చేయాల్సిన అవసరం లేదా? రాష్ర్టాన్ని, ప్రజలను రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యత. కానీ డీజీపీ మాత్రం ప్రభుత్వంపై వచ్చే ఆరోపణల్లో జగన్ ని రక్షించేందుకు పనిచేస్తున్నారు. దీనిపై డీఆర్ఐ.విచారణ చేస్తే...రాష్ట్ర పోలీసులు ఏం చేస్తారు? విజయవాడలో కంపెనీ ఉన్నపుడు మీ బాధ్యతగా కనీస విచారణ చేయరా? డ్ర-గ్స్ ని ప్రోత్సహించటం అంటే జాతిని నిర్వీర్యం చేయటమే... తాలిబన్లతో సంబందాలు పెట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. టీడీపీ హయంలో అభివృద్ది, సంక్షేమానికి చిరునామాగా ఉన్న రాష్ట్రం నేడు మాఫియాకు నిలయంగా మారింది. ‎ ‎గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో లిక్కర్, డ్ర-గ్, హ-వా-లా మాపియా నడుస్తోంది. తిరుపతి శ్రీ వారి తలనీలాలు తరలిస్తుంటే..మయున్మార్ లో పట్టుకున్నారు, వైసీపీ మంత్రి తన అనుచరులతో హ-వా-లా డబ్బు తరలిస్తూ చైన్నైలో పట్టుబడ్డారు. టీడీపీ హయాంలో రాష్ట్రానికి రూ. 5 వేల కోట్లకుపైగా పెట్టుబడులు తెచ్చి కియా వంటి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాం, కానీ ‎జగన్ రెడ్డి పాలనలో రూ. 72 వేల కోట్ల పెట్టుబడితో హెరాయిన్ రాష్ర్టానికి వచ్చింది. ఈ కంపెనీ పేరుతో ఇప్పటివరకు రూ.1.96 లక్షల కోట్ల హెరాయిన్ పట్టుబడ్డ వార్తలొస్తున్నాయి.దీనిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదు? ప్రజలు ఏమనుకోవాలి. జగనే దీన్ని చేయిస్తున్నారనుకోవాలా లేక ‎ ఆయన చేతకాని తనం అనుకోవాలా? ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.

ఆషీ ట్రేడింగ్ కంపెనీ వెనకున్న..వారిపై చర్యలు తీసుకాలి. పట్టుబడ్డ వ్యక్తి సుధాకర్ కి, వైసీపీ నేతలకు సంబందాలున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు ఆ దిశగా విచారణ చేశారా? దీనిపై విచరాణ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఈవే బిల్సు ఎందుకు బయటపెట్టడం లేదు? పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండా స్టేమ్ మెంట్ ఇచ్చి మమ్మల్ని మాట్లాడొద్దంటే ఎలా? పోలీలసులు ప్రభుత్వానికి మద్దతుగా పలికి పోలిటికల్ వ్యవస్ధలా మారిపోయి మాట్లాడటం రాష్ట్రానికి మంచిది కాదు. అధికారులు జగన్ మాటలు విని రాష్ర్టానికి అన్యాయం చేయెద్దు..జగన్ గత చరిత్ర ఏంటో అధికారలు గమనించాలి. జగన్ , వైసీపీ నేతలు తమ బినామీలు, కుటుంబ సభ్యుల మద్యం కంపెనీల్లో మద్యం తయారు చేయిస్తూ పిచ్చిపిచ్చి బ్రాండ్లు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మద్యపాన నిషేదం చేస్తానన్న జగన్ ఎందుకు ఆ హమీని నిలబెట్టుకోవటం లేదు. అక్రమ సంపాదన కోసం డిక్టేటర్ లా వ్యవహరిస్తామంటే కాలం కచ్చితంగా సమాదానం చెబుతుంది. 151 సీట్లిస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారుం. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్, మత్తు ఆంధ్రప్రదేశ్, అత్యాచారాలాంధ్రప్రదేశ, అందకారాంధ్రప్రదేశ్, అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మార్చారని రామ్మోహన్ నాయుడు అన్నారు.

విద్యావిధానంలో ఎయిడెడ్ వ్యవస్థను రద్దు చేయడం సబబు కాదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. శనివారం ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో విలేఖరుల సమావేశంలో మాట్లాడిన మాటలు మీ కోసం... రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ, విద్యా వ్యవస్థ, వైద్య విధాన పరిషత్ లు పూర్తిగా నాశనమయ్యాయి. రాష్ట్ర అభివృద్ధి శూన్యం. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం బాధాకరం. అనేక వ్యవస్థలు పాడైపోయాయి. మిణుకు మిణుకు మంటున్న విద్యా వ్యవస్థకు ఒక కార్పొరేట ఫెసిలిటీస్ కల్పిస్తానని చెప్పారు. విద్యా వ్యవస్థను నాశనం చేసే అంశం ప్రారంభమైంది. 1950 నుండి ఉన్న ఎయిడెడ్ వ్యవస్థను నేడుప్రభుత్వం రద్దు చేయడం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం 6 వేల కోట్లు పెట్టి నాడు నేడు చేశాం. ఇక ఎయిడెడ్ వ్యవస్థ ఎందుకని చెప్పడం విడ్డూరంగా ఉంది. రాష్ట్ర బడ్జెట్ లో ఎయిడెడ్ వ్యవస్థకు కేటాయించేది 565 కోట్లు మాత్రమే. ఎయిడెడ్ వ్యవస్థ రద్దుతో కేంద్రం ఇచ్చే 50 శాతం నిధులు ఆగిపోతాయి. ప్రభుత్వానికి అప్పగించము అని చెప్పిన 12 కాలేజీల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. 12 కాలేజీల లెక్చరర్లకు రఘురామకృష్ణరాజు కు ఇచ్చినట్లుగా కౌన్సలింగ్ ఇవ్వడం బాధాకరం. ఎయిడెడ్ కాలేజీల స్థలాలు, వాటి ఆస్తులను స్వాథీనం చేసుకొని అన్యాయానికి పాల్పడాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. 9వేల మంది టీచింగ్ స్టాఫ్, 5 వేల నాన్ టీచింగ్ స్టాఫ్ ని ప్రభుత్వం తీసుకుంటే ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నవారు రోడ్డున పడే పరిస్థితి ఉంది. కొత్త ఉద్యోగాలు భర్తీ చేయడంలేదు. ఎయిడెడ్ వ్యవస్థను రద్దు చేసినందుకుగాను విద్యా విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యముంటుంది కావున కేంద్రం కల్పించుకొని రాష్ట్రానికి న్యాయం చేయాలి.

rrr 25092021 2

అమ్మఒడి, జగనన్న విద్యా దివెన ఇస్తున్నాం,. ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు అనవసరమని చెప్పడం విడ్డూరం. టీచింగ్ స్టాఫ్ ని, ఆస్తులతో సహా అప్పగించాలని, అలా అప్పగించము అని చెప్పిన కాలేజీలను వదలిపెట్టబోమనడం దుర్మార్గం. ప్రభుత్వానికి అప్పగించకుండా ఆ కాలేజీల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ప్రభుత్వ అనుమతి కావాలనడం మరీ దుర్మార్గం. కొద్దో గొప్పో విద్యా వ్యవస్థ బాగుందనుకుంటే దాన్ని కూడా నాశనం చేస్తున్నారు. ఎయిడెడ్ వ్యవస్థను రద్దును వ్యతిరేకిస్తూ కోర్టుల్లో కేసులు వేసినవారికి టీడీపీ నైతిక మద్దతు ఇస్తుంది. మేనేజ్ మెంటుకు పొలిటికల్ సపోర్టు కావాలంటే ఇవ్వడానికి టీడీపీ సిద్ధం. విద్యార్థుల తరపున తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం సాగిస్తుంది. ఎయిడెడ్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తే పేరెంట్స్, మేనేజ్ మెంట్ నష్టపోతారు. వారి తరపున కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడం మంచిదికాదు. వ్యవస్థ దెబ్బతింటుంది. జీవో నెంబర్ 42ని రద్దు చేయాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎయిడెడ్ వ్యవస్థని యధాతథంగా ఉంచాలి. ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. మిగతా రాష్ట్రాల్లో ఉన్నట్లుగా సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాలి. టీడీపీ న్యాయ పోరాటం చేస్తుంది. ప్రస్తుతం ఉపాధ్యాయ సంఘాలు కూడా మాట్లాడాల్సిన అవసరముంది. ఎయిడెడ్ వ్యవస్థను రద్దు చేసినందుకు విద్యాశాఖమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు.

Advertisements

Latest Articles

Most Read