అక్రమ ఆస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామకృష్ణం రాజు వేసిన బెయిల్ రద్దు పిటీషన్ పై సిబిఐ కోర్టు, ఈ నెల 25న తీర్పు ఇస్తున్న సంగతి తెలిసిందే. దీని పై అందరికీ ఆసక్తి ఉన్న సమయంలో, ఈ రోజు వార్తల్లో కొన్ని లీకులు వచ్చాయి. జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నారని, ఆయన లండన్, ప్యారిస్ వెళ్లి వస్తారని, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఈ టూర్ కు వెళ్తున్నారని, అయుదు రోజుల పాటు ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారని లీకులు వచ్చాయి. మరి కకొన్ని మీడియా చానల్స్ లో మాత్రం, విదేశీ పర్యటన కాదని, రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు, కుటుంబంతో కలిసి వెళ్తున్నారు అంటూ వార్తలు ప్రచురించాయి. అయితే ఈ వార్తల పై పలువురు స్పందిస్తూ, ఒక పక్క బెయిల్ రద్దు తీర్పు వస్తుంటే, ఈయన ముందే ఎలా ప్లాన్ చేసుకుంటారు, బెయిల్ రద్దు అవ్వదు, తమ వాదనల్లో బలం ఉందని నమ్ముతున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొంత మంది మాత్రం, సిబిఐ కోర్టు బెయిల్ రద్దు చేసినా, పై కోర్టుకు వెళ్ళే వెసులుబాటు ఉంది కదా, అందుకే ఇవేమీ పట్టించుకోకుండా, జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన కోసం వెళ్తున్నరేమో అంటూ మాట్లాడుకుంటున్నారు.
news
ఏపి ప్రభుత్వం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. రెండు వారాల టైంతో, మొదలైన టెన్షన్...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై, హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ని సార్లు చెప్పినా నరేగా బిల్లులు చెల్లించక పోవటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాకుండా, రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించిన సుమారు 500 మంది పిటీషనర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. పైగా వీరి అందరికీ కూడా రెండు వారల లోపు బిల్లులు చెల్లించి తీరాలి అంటూ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. బిల్లులు చెల్లించకపోవటం వల్ల కాంట్రాక్టర్లు ఎవరు అయితే పనులు చేసారో, వాళ్ళు రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారం, జీవించే హక్కు కోల్పోతున్నారని, జీవించే హక్కు అంటే, గౌరవంతో జీవించటం అనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని కోర్టు పేర్కొంది. దీంతో పాటుగా, గతంలో అడ్వొకేట్ జనరల్ మాట్లాడుతూ, ఈ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఈ రోజు వరుకూ చెల్లించలేదని, కోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ కేసు విచారణను వాయిదా వేసుకునే మార్గం చూస్తుంది కానీ, బిల్లులు చేలించే మార్గాన్ని చూడటం లేదని, హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీంతో పాటు, ఈ బిల్లులు తాము ఇప్పటికే 70 మందికి చెల్లించామని, బిల్లులు చెల్లింపులకు సంబంధించి, ఇప్పటికే వారి ఎకౌంటుకు పంపామని కోర్టుకు ప్రభుత్వం చెప్పిన సమయంలో, కోర్టు ఆగ్రహించింది.
ఎవరెవరికి బిల్లులు చెల్లించారో, ఎంత చెల్లించారో చెప్పమని అడిగినా, ఎందుకు సమాచారం ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంలో కల్పించుకున్న పిటీషనర్ తరుపు న్యాయవాదులు, తమకు ఎవరికీ కూడా బిల్లులు చెల్లించలేదని, ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తుందని కోర్టు కు తెలిపారు. దీంతో న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బిల్లులు చెల్లించటం అంటే, పంచాయతీ ఎకౌంటు కు బిల్లులు ఇవ్వటం కాదు, ఎవరు అయితే కాంట్రాక్టులు చేసారో, వారి ఎకౌంటుకు బిల్లులు ఇవ్వాలి, ఆ వివరాలు తమకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసారు. అదే విధంగా బిల్లులు పెండింగ్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉండటంతో, ఈ బిల్లులకు వడ్డీతో పాటుగా, అదే విధంగా 20 శాతం వరకు బిల్లులు మినహాయిస్తున్నారో, దీని పై తుది తీర్పు ఇచ్చే సమయంలో, తగిన ఆదేశాలు ఇస్తామని కోర్టు చెప్పింది. అదే విధంగా నేరగా నిధులు కేంద్రం ఇవ్వాల్సిన 75 శాతం దాదపుగా 1900 కోట్లు , ఇప్పటికే తాము చెల్లించామని కోర్టుకు తెలిపారు. రెండు వారాల్లో బిల్లులు చెల్లించాల్సిందే అని కోర్టు చెప్తూ, రెండు వారాలకు వాయిదా వేసింది. మరి రెండు వారాల్లో ప్రభుత్వం అన్ని డబ్బులు ఎలా కట్టాలి అనే టెన్షన్ లో పడింది.
లోకేష్ అలా చేయకూడదట... పోలీసు అధికారుల సంఘం తాజా ప్రకటనతో అంతా షాక్...
పోలీసు అధికారుల సంఘం చేసిన ప్రకటన నేర పోలీసుల్ని రక్షించుకోవడానికి చేసిన ప్రకటనలావుందని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు. ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ... గుంటూరు జిల్లా ఏటి అగ్రహారంలో రమేష్ అనే అతను మైనర్ బాలికపై అ-త్యా-చా-రం చేస్తే బాలిక కుటుంబీకులు రమేష్ కు దే-హ-శు-ద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ విషయం పత్రికల్లో వచ్చింది. దీన్ని చూసి స్పందించిన నారా లోకేశ్ శాం-తి-భ-ద్ర-త-లు కరువవుతున్నాయని, రోజూ ఏదో ఒక చోట అ-త్యా-చా-రా-లు జరుగుతున్నాయని, రక్షకులే బక్షకులౌతున్నారని మాట్లాడారు. ఇందులో పోలీసులకు తప్పు కనపడింది. పోలీసులే నేరస్థులయితే పోలీసు అధికారుల సంఘం వారిని వెనకేసుకరావడంలో అర్థం లేదు. పోలీసు అధికారులకు అన్యాయం జరిగినప్పుడు మాత్రమే వారు మాట్లాడాలి. పోలీసు ఉద్యోగస్థులకు రావాల్సిన రాయితీలు, పెన్షన్లు రానప్పుడు, ట్రాన్స్ఫర్లలో ఎక్కడైన అవినీతి జరిగినప్పుడు మాత్రమే వారు మాట్లాడాలి. సభ్యసమాజం తలదించుకునే పనిచేసిన ఓ పోలీసును వెనకేసుకురావడం తగదు. లోకేశ్ మాట్లాడటంలో అర్థముంది. పోలీసు వ్యవస్థని నీరుగార్చిన విధంగా లోకేశ్ మాట్లాడారని పోలీసు అధికారుల సంఘం నాయకులు మాట్లాడడంలో అర్థంలేదు. ఆయన స్పందించాల్సిన అవసరముంది కాబట్టి స్పందించారు. పత్రికల్లో, టీవీల్లో వస్తే చూసి మాట్లాడారే తప్ప ఆయన స్వయంగా ఏమీ కల్పించుకొని మాట్లాడలేదు. దాన్ని పోలీసు అధికారుల సంఘం నాయకులే చిలవలు, వలువలు చేస్తున్నారు. స్పందించాల్సిన వారే నేరస్థుడిని వెనకేసుకు రాకూడదు. నేర పోలీసులపట్ల అనుకూలంగా ఉండాలని ఎక్కడా లేదు. నేరస్థుడు నేరమే చేయనప్పుడు అతడిని సస్పెండ్ ఎందుకు చేశారు? అతనిపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకున్నారు? సామాన్య పౌరుడు నేరం చేసివుంటే ఇలా స్పందించేవారు కారుకదా? సమాజంలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఫలానావారికి ఫలానా వారు ఇబ్బందులపాలు చేశారని సమాజానికి తెలియపరచడం తప్పుకాదు.
మనోభావాలు దెబ్బతిన్నాయని పోలీసు అధికారుల సంఘం మాట్లాడటంలో అర్థంలేదు. దీన్నిబట్టి బాధితురాలి తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని అర్థమవుతోంది. పోలీసు వ్యవస్థలో ఉన్నవారు బెదిరించకూడదు. నేరస్థుడిని శిక్షించాలి. ఫిర్యాదు రాలేదంటున్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి ఎవరైనా భయపడతారు. భయపడకుండా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయమని వారిలో మనో ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత పోలీసు అధికారులకు ఉంటుంది. అలాంటిది ఈ సంఘటన బాధితురాలి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయవద్దని సూచించిట్లుంది. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలి. పోలీసులకొక చట్టం, సామాన్య పౌరులకు ఒక చట్టం ఉండకూడదు. డీజీపీనే ఏకపక్షంగా వ్యవహరిస్తు్న్నారు. ఆయన రాజకీయలు మాట్లాడకూడదు. టీడీపీలో ఉద్యోగాలు రాలేదని, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలొచ్చాయని మాట్లాడారు. డీజీపీ టీడీపీ కార్యకర్తల్ని, సామాన్య పౌరుల్ని ఒకలా, వైసీపీ కార్యకర్తల్ని మరోలా చూడటంతో ఆయన కోర్టు బోనెక్కి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసు అధికారులు తమ ప్రతిష్టను దిగజార్చుకోవద్దు. దిశ చట్టం లేనేలేదని, పార్లమెంటులో ఈ చట్టంకు ఆమోదం లేదని స్వయాన మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మగారే చెప్పారు. పోలీసు సంఘ నాయకులు గౌరవంగా ఉండాలి. చట్టాల్ని తమ చుట్టాలుగా మార్చుకోవద్దు. నారా లోకేశ్ మహిళలకు భరోసా ఇస్తున్నట్లుగా మాట్లాడారే తప్ప కించపరచేలా ఎక్కడా మాట్లాడలేదు. అధికారులు అధికారుల్లా ఉండాలే తప్ప రాజకీయ నాయకుల్లా ఉండకూడదు. పోలీసు అధికారుల సంఘం నారా లోకేశ్ గారిపై తప్పుడు ప్రకటనలు చేయడం మానుకోవాలి. పోలీసుల సంక్షేమం కోసం పాటుపడాల్సిందిగా టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు వివరించారు.
అమరావతి కేసు వాయిదా వేయటం పై, సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స...
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మూడు ముక్కలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం పై, అమరావతి ప్రాంత రైతులు, ఇతరులు, హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు గత హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి విచారణ చేసారు. తీర్పు వస్తుంది అనుకున్న సమయంలో ఆయన బదిలీ పై వెళ్ళారు. అయితే కొత్త చీఫ్ జస్టిస్ రావటంతో, ఈ కేసు విచారణ మళ్ళీ మొదటి నుంచి మొదలైంది. అయితే ఈ కేసు విచారణ గతంలోనే జరగాల్సి ఉండగా, క-రో-నా సెకండ్ వేవ్ కారణంతో వాయిదా పడింది. అయితే ఈ రోజు, అంటే ఆగష్టు 23 నుంచి కేసు విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది. ఈ రోజు నుంచి రోజు వారీ విచారణ మొదలు కావాల్సి ఉంది. దీంతో ఈ రోజు హైకోర్టు ఫుల్ బెంచ్ ముందుకు, ఈ కేసు ఈ రోజు వచ్చింది. చీఫ్ జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలో ఈ బెంచ్ ఏర్పాటు అయ్యింది. అయితే కేసు విచారణ మొదలు కాగానే, పిటీషనర్ తరుపు న్యాయవాదులు వాయిదా కోరారు. ఢిల్లీ నుంచి అనేక మంది సీనియర్ న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే ఈ కేసు ఆన్లైన్ లో వాదించేది కాదని, బౌతికంగా వాదించాల్సి ఉందని, వాయిదా వేయాలని కోరారు. అనేక డాక్యుమెంట్లు ఎవిడెన్స్ లు గా చూపించాల్సి ఉందని అన్నారు. బౌతికంగా వాదనలు వినిపిస్తామని వాయిదా కావాలని కోరారు.
అయితే క-రో-నా థర్డ్ వేవ్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి అంటూ, కేంద్రం ప్రకటించిన నేపధ్యంలో, ఈ నాలుగు అయిదు వారాలు అత్యంత కీలకం అని, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో, బౌతిక విచారణ కష్టం అంటూ మరి కొంత మంది న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇదే సందర్భంలో ప్రభుత్వం వైపు నుంచి స్పందన అడగగా, పరిస్థితిని బట్టి కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా, తమకు అభ్యంతరం లేదని చెప్పారు. నిర్ణయాన్ని కోర్టుకే వదిలేసారు. ఈ నేపధ్యంలో, అందరి అభిప్రాయాలూ పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, ఈ కేసుని నవంబర్ 15కి వాయిదా వేసింది. ఇక కోర్టులో జరిగిన విషయాల పై మంత్రి బొత్సా సంచలన వ్యాఖ్యలు చేసారు. రోజు వారీ విచారణ చేస్తాం అని హైకోర్టు చెప్పి, ఇప్పుడు వాయిదా వేసారని, అసలు పిటీషనర్లు ఎందుకు వాయిదా అడిగారు అంటూ ప్రశ్నించారు. కేసు వేసిన వారే వాయిదా అడగటం వెనుక, ఏమైనా దురుద్దేశం ఉందా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఇదే సమయంలో, విశాఖకు వెళ్లి తీరుతాం అంటూ, కుండబద్దలు కొట్టారు. మరి ఇదే వాదన, హైకోర్టులో ప్రభుత్వం ఎందుకు వినిపించ లేదో అర్ధం కాలేదు. అక్కడ కోర్ట్ నిర్ణయానికి వదిలి పెట్టి, ఇక్కడ ఎందుకు ఇలా చేసారో మరి ?