టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చైర్మెన్ గా ఉన్న సంగం డెయిరీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ కుప్పి గంతులు అందరూ చూసారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు అముల్ కోసం, సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవాలని, ఎన్నో ప్రయత్నాలు చేసిన ప్రభుత్వం, చివరకు కోర్టుల్లో మొట్టికయాలు తింది. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను జైలు పాలు చేసమనే సంతోషం తప్పితే, సంగం డెయిరీని ఏమి చేయలేక పోయారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రూటు మార్చింది. మరోసారి ధూళిపాళ్ల నరేంద్రను ప్రభుత్వం టార్గెట్ చేసింది. గత కొన్నేళ్ళుగా, ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్ నడుస్తుంది. దీంతో ఇప్పుడు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్ ను ప్రభుత్వం టార్గెట్ చేసింది. దేవాదాయ శాఖ నుంచి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్ కు నోటీసులు వెళ్ళాయి. ఈ ట్రస్ట్ కార్యాలయం కూడా సంగం డెయిరీ ఆఫీస్ పరిసరాల్లోనే ఉంది. అయితే, దేవాదాయ శాఖ నుంచి వచ్చిన ఉన్నతాధికారులు, అక్కడకు వచ్చి నోటీసులు అంటించి వెళ్ళారు. దేవాదాయ శాఖ అంటించిన నోటీసుల్లో, పలు కీలక విషయాల గురించి సమాచారం కావాలని కోరారు. ముఖ్యంగా ట్రస్టు డీడ్ , మేనేజింగ్ ట్రస్టీ, ట్రస్టు ఆస్తులు, ఇతర ట్రస్టీల వివరాలు కావాలి అంటూ, నోటీసులో పేర్కొన్నారు.
వీటితో పాటు, ఈ ట్రస్ట్ స్థాపించిన వివరాలు, అలాగే గత మూడు ఏళ్ళ వార్షిక ఆదాయంతో పాటుగా, ఖర్చులకు సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలని ఆ నోటీసులో ఆదేశాలు జారీ చేసారు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, ఈ ట్రస్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి అంటూ, దేవాదాయ శాఖ నుంచి నోటీసులు పంపించారు. ఈ వివరాలు పది రోజుల్లో తమకు అందచేయాలని టైం కుడా పెట్టారు. వివరాలు కనుక తమకు ఇవ్వకపోతే, చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే గతంలోకి వెళ్తే, సంగం డెయిరీ వివాదం చెలరేగిన సమయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఈ ట్రస్ట్ పైనే ఎక్కువగా విమర్శలు చేసిన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ట్రస్ట్ ఎప్పుడో 1994లో ప్రారంభం అయ్యింది. ధూళిపాళ్ల నరేంద్ర తండ్రి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి, పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండే వారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే, ఒక పెద్ద హాస్పిటల్ కూడా ఉంది. రైతులకు, ఉద్యోగులకు ఈ హాస్పిటల్ లో సేవలు అందించే వారు. మరి ఇప్పుడు ప్రభుత్వం, ఎందుకు మళ్ళీ వివాదం రేపుతుందో అర్ధం కావటం లేదు.