వ్యవసాయ రంగానికి కీలకమైన నీటి వనరుల నిర్వహణలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆధునిక దేవాలయాలైన సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసి, లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా చోద్యం చూస్తోందని టీడీపీనేత, తెలుగురైతు రాష్ట్రఅధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ప్రాజెక్టుల నిర్వహణార్థం తీసుకొచ్చిన క్రాంతి పథకంతో ఉమ్మడి రాష్ట్రంలో ఒకరకమైన హరిత విప్లవమే వచ్చిందన్నారు. కానీ తనకు తానే రాజుగా భావించుకున్న రాష్ట్రముఖ్యమంత్రి పాలనలో పరిస్థితి పూర్తిగా తలకిందులైందన్నారు. గతంలో రాజులు, చక్రవర్తులు బయటకు వచ్చినప్పుడు విప్లవకారులు, ఆందోళనకారులను, సంఘవిద్రోహ శక్తులను సైన్యం కట్టడి చేయడం జరిగేదని, ఇప్పుడు రాష్ట్రంలో కూడా అదే విధమైన నిర్బంధాలు కొనసాగుతున్నాయని, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన ప్రతిసారీ వేలమంది పోలీసులు, న్యాయంకోసం, సమస్యల కోసం రోడ్లెక్కే వారిని తమ ఖాకీయిజంతో అణచివేస్తున్నారని మర్రెడ్డి స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఒక మానసికమైన వ్యాధితో బాధపడుతూ, రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో క్షామపీడిత ప్రాంతంగా మార్చేదిశగా ప్రయాణిస్తున్నా డన్నారు. సాగునీటి నిర్వహణ, కాలువల్లో పూడికతీత, మురుగునీటి కాలువల ఆధునికీకరణ వంటి పనులు ఎక్కడా జరిగిన దాఖలాలు లేవన్నారు. అనేక ప్రాంతాల్లో పంటలు ముంపునకు గురవుతున్నాయని, వర్షపునీరు కూడా బయటకు పోని పరిస్థితులు కళ్లముందే కనిపిస్తున్నాయన్నారు. అలానే అవసరమైనప్పు డు ప్రాజెక్టుల గేట్లు కిందికి దిగవని, కొన్ని ప్రాజెక్టుల్లో గేట్లు కొట్టుకుపోతుంటాయని మర్రెడ్డి ఎద్దేవాచేశారు. ప్రధాన ప్రాజెక్టుల నిర్వహణ అనేది ఈ ప్రభుత్వానికి ఇప్పటికీ కొరుకుడు పడని పదార్థమే అయ్యిందన్నారు. నీటిపారుదల శాఖా మంత్రి అసమర్థత, ముఖ్యమంత్రి బాధ్యతారాహత్యం వెలసి, రాష్ట్ర రైతులకు కన్నీళ్లే మిగులుస్తున్నాయని మర్రెడ్డి వాపోయారు.

అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు ఎత్తితే అవి కిందకు దిగకపోవడంతో నీరంతా సముద్రం పాలైందన్నారు. పులిచింతల ప్రాజెక్ట్ గేటుకొట్టుకుపోయి, నీరంతా వృథాగా కడలి పాలైందన్నారు. ప్రాజెక్టుల నిర్వహణను చూసే అధికారులకు అవసరమైన వసతులు, పరికరాలు, ఇతర యంత్ర సామగ్రిని కూడా ప్రభుత్వ అందించలేక పోతోందన్నారు. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు కూడా పెట్టలేని దుస్థితిలో ప్రభుత్వముండటం దారుణమన్నారు. తన చేతగాని తనాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకుంటూ, ప్రాజెక్టులపై పెత్తనాన్నికేంద్ర ప్రభుత్వానికి అప్పగించిన ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని ఏం చేస్తాడనే సందేహం ప్రతి ఒక్కరినీ పట్టి పీడిస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై అధికారాన్ని కేంద్రానికి అప్పగించడం ద్వారా, ఏపీలో ఎక్కడైనా రైతులకు అవసరమైన నీటిని సాధించడ మనేది చాలా కష్టసాధ్యం అవుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి, అనిల్ కుమార్ ల అసమర్థత, దద్దమ్మ ప్రభుత్వం కారణంగా, రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిధిలోని సుభిక్షమై నప్రాంతాలన్నీ బీడు భూములుగా మారే పరిస్థితిని మన కళ్లతో మనమే చూడబోతున్నామన్నారు. ప్రాజెక్టుల నిర్వహణను లోపభూయిష్టంగా మార్చిన ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనక పోతే, రైతులు కళ్లముందే ఎండిపోతున్న పైర్లను చూడలేక అసువులు బాసే ప్రమాదం పొంచి ఉందన్నారు. బంగారం పండే నేలలన్నీ నెర్రలు బారకముందే జగన్ ప్రభుత్వం కళ్లు తెరవాలని మర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రాణాధారమైన ప్రాజెక్టుల నిర్వహణను ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్వహించాలని, చేతగాని పాలకులు, అవసరమైతే ప్రతిపక్షం, సాగునీటిరంగ నిపుణుల సలహాలు, సూచనలతో ముందుకెళ్లాలని శ్రీనివాసరెడ్డి హితవు పలికారు.

సెక్రటేరియట్ లోని 32 శాఖలకు సంబంధించిన అధికారులు, ప్రధాన కార్యదర్శుల కు ప్రభుత్వప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలు చూస్తుంటే, ప్రభుత్వ నిర్వహణలోని వ్యవస్థలు ఎంతలా దిగజారిపోయాయో అర్థమవుతోందని, అన్ని శాఖల అధికారులు విధిగా కార్యాలయాలకు రావాలని సీఎస్ చెప్పడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టంచేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! గ్రామస్థాయి నుంచి సచివాలయం వరకు ప్రభుత్వశాఖల పనితీరుకి చీఫ్ సెక్రటరీ చేసిన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. సాధారణంగా కలెక్టర్లు, లేదా ప్రధాన శాఖాధిపతులు ఆ విధమైన ఆదేశాలు ఉద్యోగులకు ఇస్తుంటారు. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారే సచివాలయంలోని శాఖాధిపతులతో అందరూ విధిగా కార్యాలయాలకు రావాలని చెప్పడం రాష్ట్ర చరిత్రలో ఇప్పుడే వింటున్నాం. గతంలో ప్రతిపక్షం తరుపున తాము విజ్ఞాపనలు ఇవ్వడానికి, సచివాలయానికి వెళ్లినప్పుడు కూడా అనేక మంది అధికారులు గైర్హాజరవడాన్ని గమనించాం. అక్కడున్నవారిని అడిగితే, సదరు అధికారి వేరేచోట ఉన్నారని, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నారని చెప్పిన సందర్భాలు అనేకమున్నాయి. వివిధ శాఖాధిపతులు సచివాలయంలోలేని రోజులు అనేకం ఉన్నాయి. ఈ వ్యవహారంపై సదరు శాఖాధిపతులు తమకు పెద్దగా పైస్థాయిలో పనిలేదని చెబుతున్నారు. అంతా గ్రామ స్థాయిలోనే జరుగుతోందని, తమదాకా ఏ వ్యవహారము రావడంలేదని కూడా చెబుతున్నారు. ప్రభుత్వానికి పరిపాలన అంటే ఏమిటో కూడా తెలియడం లేదు. ఇటీవల స్త్రీ సంక్షేమం విభాగంకింద నియమితులైన మహిళా ఉద్యోగులను, మహిళాకానిస్టేబుళ్లుగా మారుస్తామని ప్రభుత్వం చెప్పడమే అందు కు రుజువు. స్త్రీసంక్షేమం కింద నియమితులైన ఆడపిల్లలు, ఆయా విభాగంలో పనిచేయడానికి ఇష్టపడతారు కానీ, ఒక యూనిఫామ్ వేసుకొని మహిళా పోలీసు కానిస్టేబుళ్లుగా పనులుచేయడానికి ఇష్టపడరు. వారినే భవిష్యత్ లో పోలీస్ శాఖ నియామకాల్లో చూపి, సదరుశాఖలో ఎలాంటి మహిళ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం చేసేప్రమాదముంది. ఇటీవలే డీజీపీ చెప్పారు.. సంవత్సరానికి ఏడువేల పోస్టులు భర్తీచేస్తామని. స్త్రీ శిశుసంక్షేమశాఖ కింద నియమించినవారిని మహిళా కానిస్టేబుళ్లుగా నియమించడమనేది చట్టప్రకారం జరిగిందా? లేక ప్రభుత్వం చేతిలో పవర్ ఉంది కదాఅని ఇష్టమొచ్చినట్లు చేస్తోం దా? గ్రామసచివాలయాల్లోని ఉద్యోగులు ఎందరు.. వారికున్న అధికారాలు ఏమిటనేది తెలియడంలేదు. వాలంటీర్లు, సచివాలయాల్లోని ఉద్యోగులద్వారానే రిజిస్ట్రేషన్లు చేయడమనేది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు.


శాఖాధిపతులకు, మంత్రులకే తెలియకుండా కింది స్థాయిలో పాలన జరుగుతోందంటే, అది ఎవరికి నష్టమో ప్రభుత్వం ఆలోచించాలి. సీపీఎస్ ను ప్రభుత్వం రద్దు చేయలేదు.. పీఆర్సీ ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. డీఏలు బకాయిలు జీపీఎఫ్ ఖాతాకు మళ్లించినట్టే, మళ్లించి తిరిగి వెనక్కు తీసుకున్నారు. ఇంత జరిగినా ఉద్యోగ సంఘాల నాయకులు మౌనవ్రతం పాటిస్తున్నారు తప్ప, ప్రభుత్వాన్ని , ముఖ్యమంత్రిని నిలదీయడం లేదు. ఈ ప్రభుత్వమున్నంత కాలం ఉద్యోగ సంఘాల నేతలు మౌనాన్నే నమ్ముకున్నట్లు అనిపిస్తోంది. పెన్షనర్లకు అందాల్సిన డీఏలు అందడం లేదు. పింఛన్లు తీసుకునేవారు ఏవైనా ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నా, వారి వినతులు మూడు నుంచి ఆరు నెలల వరకు పెండింగ్ లోనే ఉంటున్నాయి. ప్రభుత్వం కట్టించుకునే ఏపీజీఎల్ఐ (ఇన్సూరెన్స్ పథకం) లో ఈరోజుకి రూ.71కోట్ల వరకు క్లెయిమ్స్ పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ విధంగా ఉద్యోగులు, పింఛన్ దారులు అందరూ ఇబ్బందుల పడుతూనే ఉన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థికపరమైన అసమానతలు, బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం వెరసి పాలన గాడితప్పింది. అధికారులు తమకేమీ పట్టనట్టే నిస్తేజంగా వ్యవహరిస్తున్నారు. రౌతుని బట్టే గుర్రం ఉంటుంది. మామూ లు గుర్రాన్ని కూడా నేర్పరి అయిన రౌతు బ్రహ్మండంగా పరిగెత్తించగలడు.

adityanadh 14082021 2

ముఖ్యమంత్రి అలా ఉంటే, అధికారులు, పాలన ఇలా ఉండక ఎలా ఏడుస్తుంది. సీఎం కేవలం రెండు పనులకు మాత్రమే బయటకొస్తాడు. బటన్లు నొక్కడానికి, రిబ్బన్లు కత్తిరించడానికి మాత్రమే ఆయన పనికొస్తాడు. ప్రభుత్వ విధానాలు, పాలన వ్యవహారాలపై మంత్రులు, ముఖ్యమంత్రే మాట్లాడాలి. సలహాదారులకు ఏం అధికారముంది.. వారికున్న విశ్వసనీయత ఏమిటి? రాష్ట్రంలో ఎందరు మంత్రులున్నారు.. వారి శాఖలేమిటోకూడా చాలామందికి తెలియదు. రాష్ట్రానికి హోంమంత్రి, రెవెన్యూ మంత్రి ఎవరనే ప్రశ్నలకు చాలా మంది ప్రజలకు సమాధానం తెలియదు. ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా 15 ఏళ్లవరకు వెనక్కు వెళ్లిందనేది వాస్తవం. బూతులు, అబద్ధాలు అలవోకగా మాట్లాడే మంత్రులు వారి ఛాంబర్లలో సచివాలయంలో ఎన్నాళ్లు కూర్చుంటున్నారో చెప్పగలరా? రాష్ట్రాన్ని, వ్యవస్థలను గాడిలోపెట్టడం అంతతేలికగా అయ్యేపనికాదు. పరిపాలనంటే అంతతేలిక కాదని ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు ఆలోచిస్తే మంచిది. ప్రభుత్వం, పరిపాలన గాడి తప్పాయని టీడీపీ ఘంటాపథంగా చెబుతోంది. ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచిస్తున్న ఉద్యోగసంఘాల నాయకులు పరిపాలనపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. లేకుంటే పరిస్థితి పూర్తిగా చేజారిపోతుంది. వ్యవస్థలను చక్కబెట్టి, పరిపాలన సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనేఉంది.

చిత్తూరు జిల్లాలో అమరరాజా కంపెనీపై , రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వేధింపులు గురించి, గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాలుష్యం పేరుతో అమరరాజా కంపెనీని టార్గెట్ చేసి, ఆ కంపెనీ మూసివేయాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తరువాత కంపెనీ హైకోర్టుకు వెళ్లి, ఆ ఆదేశాలు నిలిపుదల చేసినా, ప్రభుత్వం నుంచి వస్తున్న వేధింపులు ఆగక పోవటంతో, ఆ కంపెనీ చెన్నై తరలి వెళ్ళిపోతుంది అంటూ, వార్తలు వచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రెడ్ కార్పెట్ పరిచారని, అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించారు అని, త్వరలోనే కంపెనీ తరలి వెళ్ళిపోతుంది అంటూ పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కలకలం రేగింది. దీనికి తోడు రాష్ట్ర ప్రధాన సలహదారుగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి, వాళ్ళు వెళ్ళటం కాదు, మేమే గెంటేస్తున్నాం అని బహిరంగ ప్రకటన చేయటంతో, అందరూ ఉలిక్కి పడ్డారు. ఇంత పెద్ద పరిశ్రమ వెళ్లిపోతుంటే, ఇంత తేలికగా ఎలా ప్రకటన చేస్తారు అంటూ అందరూ ఆశ్చర్య పోయారు. అమరరాజా కంపెనీలో మొత్తం 18 వేల మంది వరకు పని ప్రత్యక్షంగా పని చేస్తున్నారు, అలాగే మరో 50 వేల మంది వరకు పరోక్షంగా పని చేస్తున్నారు. ఇంత మంది వెళ్లిపోతుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇంత సింపిల్ గా ఎలా చెప్తుంది అనేది అర్ధం కాలేదు.

galla 14082021 2

అయితే ఈ ఘటన పై అమరరాజా కంపెనీ యాజమాన్యం కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈ విషయం కోర్టులో కూడా ఉంది. దీంతో నిన్న అమరరాజా కంపెనీకి చెందిన వారు ఎవరూ ఈ అంశం పై స్పందించలేదు. అయితే నిన్న అమరరాజ కంపెనీ చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు, అలాగే గల్లా జయదేవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు బాధ్యతలు నుంచి తప్పుకుంటున్న క్రమంలో, ప్రెస్ మీట్ పెట్టి, తన ప్రస్థానం గురించి చెప్పుకొచ్చారు. అయితే ఈ క్రమంలో విలేఖరులు చెన్నై తరిలి వెళ్లిపోతున్నారా అని అడగగా, దాన్ని ఖండించలేదు కానీ, భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఏమి చెప్పగలం, పరిస్థితిని బట్టి సంస్థను కాపాడే నిర్ణయాలు ఉంటాయి అంటూ చెప్పారు. అలాగే ప్రభుత్వం మీ సంస్థ , కాలుష్యం వెదజల్లుతుంది కదా అని చెప్పగా, దాని పై ఎలాంటి కామెంట్స్ చేయం అని, అది కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి, కోర్టుకే సమాధానం ఇస్తున్నాం అని, అది మీరు కూడా చూడవచ్చు అంటూ బదులు ఇచ్చారు. ప్రభుత్వ వేధింపుల గురించి అడగగా, ఇది సందర్భం కాదు అంటూ దాట వేసారు.

పరీక్షలు నిర్వహించనపుడు పరీక్ష ఫీజులు ప్రభుత్వం ఎందుకు వసూలు చేసింది అంటూ, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల నుంచి పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని, మరి విద్యార్ధుల ఫీజులు ఎందుకు వెనక్కివ్వరు అంటూ ప్రశ్నించారు. ఆయన మాటల్లోనే "ముఖ్యమంత్రి జగన్ తన అవినీతి దుబారాతో బ్యాంకుల దగ్గర అప్పులు చేయటమే కాక చివరకు విద్యార్ధుల దగ్గర నుంచి ఫీజుల రూపంలో డబ్బులు లాక్కోవటం దుర్మార్గం. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు,ప్రతిపక్ష పార్టీలు పరీక్షలు వద్దంటున్నా...గత ఏడాది మొండిగా 10 వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యార్ధుల దగ్గర నుంచి ప్రభుత్వం పెద్ద మొత్తంలో పరీక్ష ఫీజులు వసూలు చేసింది. కోర్టు మొట్టికాయలు వేయటంతో చివరి నిమిషంలో పరీక్షలు రద్దు చేశారు. పరీక్షలు రద్దు చేసినపుడు విద్యార్దులు కట్టిన ఫీజు తిరిగివ్వాలి కదా. ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? కరోనా సమయంలో పూట గడవటమే కష్టంగా ఉన్నప్పటికీ తమ పిల్లల భవిష్యత్ కోసం విద్యార్దుల తల్లితండ్రులు ఫీజులు కట్టారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్ధులు మెత్తం 10,65,156 మంది నుంచి ఒక్కో విద్యార్ది నుంచి రూ. 500 చొప్పున మొత్తం సుమారు రూ. 53 కోట్లకు పైగా ప్రభుత్వం వసూలు చేసింది. పదో తరగతి విద్యార్ధులు రాష్ర్టంలో 5 లక్షలమందికి పైగా ఉన్నారు. వారి నుంచి కూడా పెద్ద మెత్తంలో పరీక్ష ఫీజులు వసూలు చేశారు. కరోనాతో పరీక్షలు నిర్వహించలేదు కాబట్టి ప్రభుత్వం విద్యార్దులు కట్టిన ఫీజులు తిరిగివ్వకుండా ప్రభుత్వం ఎందుకు తన వద్ద ఉంచుకుంది? పెట్రోల్, డీజిల్ , నిత్యవసరాల ధరలు పెంచి, చెత్త పన్ను, ఆస్తి పన్ను అంటూ ప్రజలపై పన్నుల మీద పన్నులు మోపి రెండేళ్లలో ప్రజల దగ్గర నుంచి రూ. 70 వేల కోట్లు ముక్కుపిండి వసూలు చేశారు. మరి విద్యార్ధులు కట్టిన ఫీజులు ఎందుకు తిరిగివ్వరు? మూడు నెలల నుండి ప్రజలంతా లాక్ డౌన్ లో ఉండటం ద్వారా పేదవారైనా విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు పూట గడవడం కూడా చాలా దారుణంగా ఉంది. విధ్యార్ధులు కట్టిన ఫీజులు ప్రభుత్వం వెంటనే తిరిగివ్వాలి. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఫీజు లేకుండా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.

exams 14082021 2

విద్యార్ధుల సమస్యలను, విద్యావ్యవస్ధను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. టీడీపీ హయాంలో ఎన్‌టిఆర్‌ విద్యోన్నతి, అంబేద్కర్‌ ఓవర్సీస్‌ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు రూ.10 లక్షలకు ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వం కొత్తవి ఇవ్వకపోగా పాతవి నిలివేయడంతో విదేశీ విద్యకు వెళ్లిన విద్యార్థులు చదువు మధ్యలో ఆపేసి వచ్చేశారు. గ్రూప్‌ 1, 2, సివిల్స్‌ తదితర పోటీ పరీక్షలకు కోచింగ్‌కు అయ్యే ఫీజు చంద్రబాబు ప్రభుత్వం భరించింది. ఈ పథకాన్ని జగన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. గడిచిన 2 ఏళ్లల్లో విద్యా వ్యవస్థను సర్వనాశనం అయ్యింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క పథకంలోను విద్యా వ్యవస్థను బలోపేతం దిశగా అడగులు వేయడం లేదు. గత ప్రభుత్వం విద్యా వ్యాప్తి కోసం అందించిన 11 పథకాలను రద్దు చేశారు. ఐటీఐ నుండి పీజీ, ప్రొఫెషనల్‌ విద్యార్థులు 16 లక్షల మందికి చంద్రన్న ప్రభుత్వం ఫీజు రియింబర్స్ మెంట్ ఇస్తే జగన్ రెడ్డి అందులో 11 లక్షల మందికే పరిమితం చేసి మోసం చేశారు. విద్యార్థుల సంఖ్య తగ్గించడానికి 75% హాజరు, 300 యూనిట్ల కరెంటు బిల్లు, తమ్ముడికి ‘అమ్మ ఒడి’ వస్తే అన్నకు ఈ పథకం వర్తించదు లాంటి నిబంధలను పెట్టారు. 2019-20లో 32వేల కోట్లు కేటాయించి రూ.19వేల కోట్లకు మించి వ్యయం చేయలేదు. 2020-21 బడ్జెట్లో 25వేల కోట్లు కేటాయించి అందులో సగం కూడా వ్యయం చేయలేదు. ఈ ఏడాది 24,600 కోట్లు అంటే గత ఏడాది కంటే తక్కువ నిధులు కేటాయించారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారనడానికి బడ్జెటే సాక్ష్యం.ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన విద్యార్ధుల సంఖ్య కొరవడి మూతపడుతున్నాయి. ప్రైవేట్ కళాశాలలు విద్యార్ధులను దోపిడీ చేస్తున్న ప్రభుత్వం మాత్రం పట్టన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ఫీజ్ నియంత్రణ లేదు. ఓ వైపు సంక్షేమ పధకాల పేరుతో విద్యార్ధులకు డబ్బులిస్తున్నామని చెబుతున్నారు. కానీ మరో వైపు ప్రవేట్ కాలేజీలు ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని విద్యార్దుల నుంచి ఫీజుల కోసమని ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ఇకనైనా ముఖ్యమంత్రి విద్యా రంగంపై దృష్టి సారించి విద్యావ్యవస్ధను గాడిలో పెట్టాలి.

Advertisements

Latest Articles

Most Read