వివేక కేసులో సిబిఐ 66వ రోజు విచారణ చేస్తుంది. కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ వేదికగా విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా పదిహేను రోజులు క్రిందట వాచ్మెన్ రంగన్న ఇచ్చిన స్టేట్మెంట్ తో మొత్తం సీన్ మారిపోయింది. అప్పటి వరకు సిబిఐ ఏమి చేయటం లేదు అనే విమర్శలు వచ్చాయి. అయితే రంగన్న సుపారీతో పాటు, కొంత మంది పేర్లు కూడా చెప్పారు అని చెప్పటంతో, ఈ కేసు మరో మలుపు తిరిగింది. తరువాత సునీల్ యాదవ్ అనే వ్యక్తి పారిపోవటం, అతన్ని అరెస్ట్ చేయటం, అలాగే మూడు రోజులు పాటు ఆయుధాల కోసం గాలించటం తెలిసిందే. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విమర్శ సిబిఐ పైన రావటానికి కారణం, సిబిఐ ఎక్కడా , వైఎస్ సునీత చెప్పిన వారిని ఇప్పటి వరకు ప్రశ్నించలేదు. పెద్ద వాళ్ళని వదిలేసి, చిన్న చిన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనే విమర్శలు వచ్చాయి. నిన్న సునీల్ యాదవ్ తండ్రి కూడా ఇదే విషయం పై సిబిఐని ప్రశ్నించారు. తమ కుమారుడు పై బలవంతం చేస్తున్నారని, నేరం ఒప్పుకోమని ఒత్తిడి తెస్తున్నారని, సునీత చెప్పిన అనుమానితులను ఎందుకు ప్రశ్నించటం లేదని ఆయన అడిగారు. దీంతో సిబిఐ పై ఒత్తిడి పెరిగిందో, లేదా తమ విచారణ క్రమంలో భాగంలోనో కానీ, సిబిఐ అధికారులు, ఇప్పుడు అసలు విషయం పై రంగంలోకి దిగారు.

cbi 11082021 2

నిన్న ఎంపీ అవినాష్ రెడ్డి పీఏని ఆరు గంటల పాటు విచారణ చేసారు. ఎంపీ అవినాష్ రెడ్డి పీఏలు రాఘవరెడ్డి, రమణారెడ్డితో పాటుగా, హోంగార్డు నాగభూషణం, వేంపల్లికి చెందిన రహంతుల్లా, బండి కేశవ, మల్లీ, సస్పెన్షన్‌లో ఉన్న సీఐ శంకరయ్యను సిబిఐ నిన్న విచారణ చేయటంతో ఒక్కసారిగా మళ్ళీ ఫోకస్ వచ్చింది. అంతే కాకుండా సిబిఐ అధికారులు అసలు పాయింట్ పట్టే పనిలో పడ్డారు. అసలు హ-త్య జరిగిన రోజున, గుండె పోటు వచ్చి చనిపోయారని మొదటి చెప్పింది ఎవరు అనే విషయం ఆరా తీయటం మొదలు పెట్టారు. ఒక ఛానల్ కు చెందిన విలేఖరిని కూడా ఈ విషయంలో ప్రశ్నిస్తున్నారు. అసలు గుండెపోటు వచ్చి పోయారని, ఎందుకు మిస్ లీడ్ చేసారు, ఎవరు చెప్పారు, ఎవరు చెప్పమన్నారు, ఎవరు బయటకు చెప్పారు అనే విషయం ఆరా తీసే పనిలో ఉన్నారు సిబిఐ అధికారులు. మొత్తంగా ఎంపీ అవినాష్‍రెడ్డి పీఏ దాకా విచారణ వెళ్ళటంతో, రేపో మాపో పెద్ద తలకాయాలను కూడా విచారణకు పిలిచే అవకాసం ఉనట్టు తెలుస్తుంది. మరి ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

ఈ రోజు రాజ్యసభలో, టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు, కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆపుల ఊబిలో క్రమక్రమంగా కూరుకుపోతూ ఉంది అనే విషయాన్ని, కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేయటం జరిగింది. అయితే ఇందులో విశేషం ఏమిటి అంటే, ఇది బడ్జెట్ యేతర అప్పుగానే కేంద్రం చెప్పింది. అంటే ఇది అసలు బడ్జెట్ లో చెప్పిన విధంగా కాకుండా, బడ్జెట్ యేతర అప్పులుగా కేంద్రం చెప్పటం విశేషం. అసలు ఇది బడ్జెట్ లో పేర్కొనని అప్పు. ఇతర కార్పోరేషన్లు, సంస్థలు, ఇలా వాటి అన్నిటినీ తనఖా పెట్టి, ఈ అప్పులు తీసుకున్నట్టుగా కేంద్రం పేర్కొంది. రాజ్యసభ సాక్షిగా కేంద్రం, అప్పుల లెక్కను చెప్పింది. మొత్తంగా బడ్జెట్ యేతర అప్పు, 2019-20 సంవత్సరానికి రూ. 56,076 కోట్లు అప్పుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మొత్తంగా 12 బ్యాంకుల నుంచి ఈ అప్పు తీసుకున్నారు. ఇందులో రూ. 56,076 కోట్లలో అత్యధికంగా, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా నుంచే రూ.15,000 వేల కోట్ల వరకు, అప్పుగా తీసుకోవటం జరిగింది. అలాగే తరువాత బ్యాంక్ అఫ్ బరోడా నుంచి రూ. 9వేల కోట్ల వరకు, బ్యాంక్ అఫ్ ఇండియా రూ. 7వేల కోట్లు, ఇలా దాదాపుగా 12 బ్యాంకుల నుంచి కూడా ఒక్క ఏడాదికి ప్రభుత్వం రూ. 56,076 కోట్లు అప్పు చేసింది.

jagan 10082021 2

ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఏపికి `సంబంధించిన అప్పుల కోసం, భవిష్యత్తులో మద్యం పై రాబోయే ఆదాయాన్ని తనఖా పెట్టి అప్పులు తీసుకోవటం, అలాగే ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తీసుకోవటం పై కూడా కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇవన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయి అని, వీటికి సమాధానం ఇవ్వాలి అంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఏపి ప్రభుత్వానికి లేఖ రాయటం జరిగిండ్. అలాగే కాగ్ ఆధ్వర్యంలో, పూర్తి స్థాయి ఆడిట్ జరపాలని కూడా కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ మధ్య కాలంలో కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో, బుగ్గన తో పాటుగా, ఇతర అధికారులు కూడా సమావేశం అయ్యి, వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా, ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ ఉల్లంఘనలు గురించి సమాధానం చెప్పాల్సిందే అంటూ, గట్టిగా చెప్పటంతో, ఏమి చేయలేక, బుగ్గన బృందం తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి, విజయసాయి రెడ్డి పైన సిబిఐ విచారణ చేసి, విచారణ కొనసాగుతున్న సమయంలోనే, మనీ లాండరింగ్ ఆరోపణల నేపధ్యంలో, ఈడీ అధికారులు కూడా సమాంతరంగా విచారణ చేసి, వాటి పై చార్జ్ షీట్లు కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సిబిఐ కోర్టు, ఈడీ కోర్టులో కూడా విచారణ మొదలైంది. అయితే ముందుగా ఈడీ చార్జ్ షీట్లు ఫైల్ చేసారు కాబట్టి, ఈడీ కోర్టులో విచారణ మొదలు పెట్టాలని గతంలో ఈడీ కోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం పై విజయసాయి రెడ్డి సిబిఐ కోర్టుకు వెళ్లి, రెండు విచారణలు అవసరం లేదని, సిబిఐ కోర్టులో కలిపి విచారణ చేయాలని కోరారు. అయితే సిబిఐ కోర్టు విజయసాయి రెడ్డి పిటీషన్ ని తోసిపోచ్చింది. దీంతో విజయసాయి రెడ్డి, ఈ తీర్పుని సవాల్ చేస్తూ, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. విజయసాయి రెడ్డి జనవరి 11వ తేదీన హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టుని కోరారు. ముందుగా సిబిఐ కేసులు విచారణ జరిపిన తరువాతే, ఈడీ కేసులు విచారణ జరిపేలా ఉత్తర్వులు ఇవ్వాలి అంటూ కూడా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన గత కొన్ని రోజులుగా, తెలంగాణా హైకోర్టులో విచారణ కొనసాగింది.

tg 10082021 2

దీని పై హైకోర్టు ఈ రోజు తమ తీర్పుని ప్రకటించింది. విజయసాయి రెడ్డి వేసిన పిటీషన్ ను కొట్టి వేస్తూ, హైకోర్టు నిర్ణయం తీసుకుంది. సిబిఐ అధికారులు విచారణ చేసిన సమయంలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణల నేపధ్యంలో, ఒక వైపు ఈడీ అధికారులు కూడా విచారణ చేసి, ఆధారాలు దొరికిన తరువాతే చార్జ్ షీట్ దాఖలు చేసారు కాబట్టి, ఇప్పుడు ఈడీ కేసులు విచారణ ముందుగా జరిపితే, మీకు అభ్యంతరం ఏమిటి అంటూ కూడా విజయసాయి రెడ్డిని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. అయితే విజయసాయి రెడ్డి న్యాయవాది ప్రధానంగా నాలుగు అయుదు వాదనలు గట్టిగా వినిపించారు. ప్రధానంగా సిబిఐ కేసు విచారణ జరిపితే తాము నిర్దోషిగా బయటకు వస్తే, ఈడీ కేసులు నిలబడవు కాబట్టి, ముందుగా సిబిఐ కేసు విచారణ చేయమని కోరారు. అయితే సిబిఐ న్యాయవాది వదానలు వినిపిస్తూ, ఈడీ విచారణ పూర్తయ్యింది కాబట్టే ముందుగా ఈడీ చార్జ్ షీట్ చేసిందని, విజయసాయి రెడ్డి పిటీషన్ పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. దీంతో కోర్టు కూడా ఏకీభావించింది. దీంతో ఈడీ కోర్టులో కూడా విచారణ మొదలు కానుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు, ఈ మధ్య కాలంలో, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక చట్ట విరుద్ధమైన పనుల పై, ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా 200కు పైగా చట్ట వ్యతిరేకమైన అంశాల్లో హైకోర్టులో, రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు హైకోర్టు ఆగ్రహానికి గురి అయ్యేలా చేసింది. దీంతో ఈ రోజు హైకోర్టు కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంచలన ఆదేశాలు ఇవ్వటం, చర్చనీయంసం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం అంటే అలవాటు పడిపోయింది కాబట్టి, ఇది కొత్త కాదు కానీ, కేంద్రంలో అధికారులు కూడా ఇలా కోర్టు ఆగ్రహానికి ఎందుకు గురి కావాల్సి వచ్చిందో ఆలోచించుకోవలసిన అంశం. ఈ రోజు ఉపాధి హామీ నిధులు అంశం, పై ఈ రోజు హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. గత నెలల్లో హైకోర్టు రెండు సార్లు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు సంబంధించి, సరైన అఫిడవిట్ దాఖలు చేయకపోవటం పై ఈ రోజు రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కార్యదర్శికి మేమో జారీ చేస్తామని, అలాగే అతని పై నాన్ బెయిలబుల్ కేసు కూడా బుక్ చేస్తామని హెచ్చరించింది.

hc center 10082021 2

వెంటనే అతన్ని కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ దశలో కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సోలిసిటర్ జనరల్ జోక్యం చేసుకుని, వారం రోజుల్లో కోర్టు అడిగిన పూర్తి సమాచారం అంద చేస్తామని ఆయన హైకోర్ట్ ని అభ్యర్ధించారు. ఈ దశలో రాష్ట్ర హైకోర్టు, ఈ కేసు విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. అయతే వాయిదా వేసే క్రమంలో, హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది. 2014 నుంచి ఈ రోజు వరకు కూడా, రాష్ట్రంలో ఉపాధి హామీ కింద జరిగిన పనులు, ఎంత విలువ, ఎన్ని బిల్లులు చెల్లించారు, సంవత్సరాలు వారీగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17 లోపు ఆ ప్రమాణ పత్రం దాఖలు చేయాలని, అలా దాఖలు చేయని పక్షంలో వచ్చే వాయిదా నాటికి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హాజరు కావాల్సి ఉంటుందని, ఆయనకు నాన్ బెయిలబుల్ వారంట్ కూడా జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. అయితే కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఈ లోపే మేము అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పటంతో, హైకోర్టు కేసుని వాయిదా వేసింది.

Advertisements

Latest Articles

Most Read