వివేక కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో సిబిఐ, వివేక కేసులో దూకుడు మీద ఉంది. సూత్రదారులు ఎవరో ఇప్పటికీ తెలవక పోయినా, పాత్రధారులు మాత్రం ఒక్కొక్కరు దొరుకుతున్నారు. ముఖ్యంగా వివేక వాచ్మెన్ రంగన్న ఇచ్చిన స్టేట్మెంట్ తో మొత్తం దొంక కదిలింది. దీంతో అప్పటి వరకు విచరణకు సహకరిస్తున్న సునీల్ యాదవ్ అనే వ్యక్తి పరారు అయ్యాడు. హైకోర్టులో అరెస్ట్ చేయనివ్వకుండా కేసు వేసాడు. అయితే సిబిఐ అతన్ని గోవాలో పట్టుకుంది. కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ కు తరలించారు. నిన్న అతన్ని విచారణ నిమిత్తం కోర్టు అనుమతి అడిగి తీసుకున్నారు. నిన్న రాత్రి అంతా చేసిన విచారణలో, పలు కీలక విషయాలు సిబిఐకి చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో ఈ రోజు సిబిఐ అధికారులు గ్రౌండ్ లోకి వచ్చారు. వివేకా ఇంటి సమీపంలోని వాగులో సిబిఐ అధికారులు తనిఖీ చేస్తున్నారు. వాగులో ఈ మధ్య వర్షం పడటంతో నీళ్ళు రావటంత, ఆ నీళ్ళు అన్నీ తోడేస్తున్నారు. విషయం ఏమిటి అని ఆరా తీయగా, ఆ వాగులోని ఇసుకలో, వివేక హ-త్య కోసం ఉపయోగించిన ఆయుధాలు దాచినట్టు, సిబిఐకి సునీల్ యాదవ్ సమాచారం ఇవ్వటంతో, ఆ ఆయుధాల రికవరీ కోసం సిబిఐ అధికారులు, ఫీల్డ్ లోకి రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది.

viveka 07082021 2

ముందుగా సునీల్ యాదావ్ ను భారీ పోలీస్ బందోబస్తు మధ్య కడప నుంచి పులివెందులకు తీసుకుని వచ్చారు. అక్కడ వివేక ఇంటి సమీపంలోని వాగు వద్ద తీసుకుని వచ్చారు. మునిసిపల్ అధికారుల సాయంతో, భారీ ట్యాంకర్లు పెట్టి నీళ్ళు అన్నీ తోడేస్తున్నారు. మరో పక్క మరో బృందం, ఇసుకని తవ్వుతూ, ఆయుధాల కోసం గాలింపు చేస్తున్నారు. అయితే రెండేళ్ళ తరువాత, ఈ రోజు ఆయుధాల కోసం గాలింపు చేస్తూ ఉండటంతో, అసలు అవి దొరుకుతాయా అనే సందేహం వ్యక్తం అవుతుంది. రోటరీపురం వంకలో ఇవి ఉన్నాయని సునీల్ యాదవ్ ఇచ్చిన సమాచారంతో, సిబిఐ ఈ సోదాలు చేస్తుంది. గతంలో వివేక చనిపోయిన సమయంలో, ముందుగా గుండె పోటు అంటూ నమ్మించారు. తరువాత ఆయన తలకు కుట్లు ఉండటంతో, అందరికీ అనుమానం రాగా, చివరకు అది గొ-డ్డ-లి పోటు అని అర్ధం అయ్యింది. అయితే ఇప్పుడు నిజంగా ఆ ఆయుధాలు ఇక్కడ దొరుకుతాయా అనేది చూడాలి. ఇక మరో పక్క, సునీల్ యాదవ్ ని, పది రోజులు విచారణకు తీసుకోవటంతో, ఎన్ని వాస్తవాలు బయటకు వస్తాయో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. ఇన్నాళ్ళు క-రో-నా కారణంగా రాజకీయం పెద్దగ నడవలేదు. ఏదో ప్రతి రోజు జరుగుతున్న సంఘటనల పై రెండు వైపులా తిట్టుకోవటమే కానీ, ఎక్కడా పెద్దగా రాజకీయం నడిచింది లేదు. క-రో-నా తగ్గటంతో, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ఆక్టివ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే, మరో చిన్న పార్టీ అయిన బీజేపీ కూడా తమకు తెలిసిన విద్య ప్రదర్శించటానికి రెడీ అవుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో, ఇక్కడ బీజేపీకి పెద్దగా ఆదరణ లేకపోయినా, బీజేపీ అంటే వైసీపీ ఆచితూచి స్పందిస్తూ వస్తుంది. చంద్రబాబు ఏమైనా అంటే, వరుస పెట్టి ప్రెస్ మీట్ లు పెట్టే నేతలు, బీజేపీ నుంచి ఎంత పెద్ద విమర్శ వచ్చినా, ఏదో అంటీ ముట్టనట్టు ఉంటూ వస్తారు. దీనికి అనేక కారణాలు ఉన్నా, ముఖ్యంగా జగన్ పై ఉన్న కేసులు వల్లే ఇలా, కేంద్రంతో ఎక్కువగా పెట్టుకోరు అనేది, జగమెరిగిన సత్యం. ఈ మధ్య బీజేపీ నేతలు ఢిల్లీ కూడా వెళ్లి వచ్చారు. అక్కడ వారికి ఇక నుంచి ఏమి చేయాలో చెప్పారని సమాచారం. మరో పక్క జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు 25వ తేదీ రానుంది. ఇక అలాగే కేంద్రం అప్పుల మీద, రాష్ట్రం పీక పట్టుకుంది. వరుస పెట్టి ఉత్తరాలు రాస్తుంది. దీంతో వైసిపీకి హీట్ పెరిగింది.

cabinet 06082021 2

ఈ రోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఇదే విషయం పై, చర్చ జరిగింది. జగన్ మోహన్ రెడ్డి మంత్రుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కొంత మంది మంత్రులు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల పై అసలు స్పందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ వాళ్ళు విమర్శలు చేస్తుంటే, ఎందుకు వదిలేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇద్దరు బీజేపీ నేతలు, వారి విమర్శలు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక నుంచి బీజేపీ నేతల మాటలకు కౌంటర్ ఇవ్వాలని ఆదేశించారు. అంతే కాకుండా, ఈ రోజు పులిచింతల పై టిడిపి విమర్శలు చేస్తే, ఎందుకు కౌంటర్ ఇవ్వలేదని వాపోయారు. పధ్ధతి మార్చుకోవాలి అంటూ హెచ్చరించారు. ముగ్గురు మంత్రులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని సమాచారం. దీంతో క్యాబినెట్ వివరాలు చెప్పిన పేర్ని నాని, బీజేపీ పై విమర్శలు చేసారు. బీజేపీ ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని పడగొట్టటానికి కుట్రలు చేస్తుంది అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. కాషాయం వ్యక్తిని సియం కుర్చీ ఎక్కించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేసారు. జార్ఖండ్‍లో జడ్జి హ-త్య కేసుపై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేసారు. జడ్జిల రక్షణకు చేపట్టిన చర్యల వివరాలు అందించాలని అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసారు. ఈనెల 17లోగా వివరాలు అందించాలని అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చారు చీఫ్ జస్టిస్. ఈ నోటీసులు జారీ చేసింది సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం. వివిధ రాష్ట్రాల్లో జడ్జిలపై ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయో గమనిస్తున్నారా అంటూ ఆగహ్రం వ్యక్తం చేసారు. కేంద్రం ఏం చేయాలనుకుంటోంది అంటూ అటార్నీ జనరల్‍ను చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. సంఘటన జరిగిన రోజునే 22 మంది సభ్యుల సిట్‍ను ఏర్పాటు చేశామని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే సిట్‍ను ఏర్పాటు చేసినట్లు ధర్మాసనానికి తెలిపారు జార్ఖండ్‍ ప్రభుత్వ న్యాయవాది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని జార్ఖండ్ న్యాయవాది సుప్రీం కోర్టుకు తెల్పారు. నిన్నటి నుంచి సీబీఐ కేసు దర్యాప్తును ప్రారంభించిందని జార్ఖండ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. అయితే ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. సీబీఐ కేసు ప్రారంభించిందని మీరు చేతులు దులుపుకొన్నారా? అంటూ ప్రశ్నించారు.

nvramana 06082021 2

2019లో ఇలాంటి సందర్భంలో జారీచేసిన నోటీసులకు కేంద్రం ప్రత్వుత్తరం ఇవ్వాల్సి ఉంది అని అన్నారు. కొన్ని సందర్భాల్లో సీబీఐ విచారణకు ఆదేశాలిచ్చినా.. సీబీఐ ఏం చేయలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రత్యుత్తరంపై కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదని అన్నారు. కేంద్రం ప్రభుత్వం ఒక వారంలో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసారు. గ్యాంగ్‍స్టర్లు, ఉన్నత స్థాయి వ్యక్తులకు సంబంధించిన అనేక కేసులు దేశంలో ఉన్నాయని అన్నారు. గ్యాంగ్‍స్టర్లు, కొందరు వ్యక్తులు న్యాయమూర్తులను బెదిరిస్తున్నారు అంటూ చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా, ఎకంగా ప్రభుత్వమే జడ్జిల పై అనేక ఆరోపణలు చేస్తూ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఇప్పుడు చీఫ్ జస్టిస్ గా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ పైనే, అప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా లేఖ రాయటం పెను సంచలనం అయ్యింది. ఈ రోజు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, ఈ సంఘటన కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటుందని, విశ్లేషకులు అంటున్నారు.

పులిచింతల ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ టిడిపి మాజీ ఎం.ఎల్.ఏ బొల్లినేని రామారావు అనేది పచ్చి అబద్దం. పులిచింతల ప్రాజెక్టు పనుల నిర్వహణలో కాంట్రాక్టరుకు రూ.56.52 కోట్ల అనుచిత లబ్ది చేకూరింది'' అని 2009-10లో కాగ్‌ వైఎస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. టిడిపి నేత నిమ్మల రామానాయుడు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టును 1988 నవంబర్ 13న ఎన్.టి.ఆర్ గారు మొదట శంకుస్థాపన చేశారు. 1994-95లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.501 కోట్లు. 2004 అక్బోబర్ 15న పులిచింత ప్రాజెక్టుకు వైఎస్ భూమి పూజ చేశారు. 30-9-2004 తేదీన మెస్సర్స్‌ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌ మరియు చైనా రైల్వే 18 బ్యూరో జాయింట్ వెంచర్ తో వైఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడమైంది. 18.11.2005న జీవో నెం. 208 ద్వారా సవరించిన అంచనా రూ.681 కోట్లు. 04.08.2009న జీవో నెం. 90 ద్వారా వైఎస్ ప్రభుత్వం సవరించిన అంచనా వ్యయం రూ.1281 కోట్లు. 29.01.2014న జీవో నెం. 7 ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సవరించిన అంచనా వ్యయం రూ.1861 కోట్లు. భూసేకరణలో జాప్యంల వలన ధరలు పెరిగినందుకున అధనంగా రూ.285 కోట్లు ఇవ్వాలని శ్రీనివాస్ కన్ స్ట్రక్షన్ 2012లో ప్రభుత్వాన్ని కోరారు. దీనిని పరిశీలించిన డీఏబీ రూ.199 కోట్లను అధనంగా చెల్లించాలని 03.10.2013న ప్రతిపాధించారు. ఇది అమలు కాకపోవడంతో కోర్టుకు వెళ్లారు. సుదీర్ఘంగా విచారణ జరిపి మచిలీపట్నం కోర్టుకు 02.06.2016న రూ.199 కోట్లతో పాటు 2013 నుండి వడ్డీ కల్పి రూ.399 కోట్లు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దానిపై హైకోర్టుకు ప్రభుత్వం వెళ్లగా కాంట్రాక్టరుకు చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతం అనగా రూ.199 కోట్లను డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాన్ని 01.01.2019న ప్రభుత్వం అమలు పరిచింది. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం పులిచింతల మునక రైతుల పరిహారం కోసం రూ.128 కోట్లు మరియు హైకోర్టు ఆదేశాల మేరకు రూ.199 కోట్లు మాత్రమే చెల్లింపులు చేయడమైంది. ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వాసితులకు పరిహారం చెల్లించి వారిని ఖాళీ చేయించడంలో వైఎస్ గాని, కాంగ్రెస్ గాని తగినంత శ్రద్ధ పెట్టలేదు. అందువలన ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగి, దానిపై కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లారు.వారు చేసిన పాపానికి చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల ప్రకారం రూ.199కోట్లు చెల్లించింది. మరో 128 కోట్లు భూములు కోల్పోన రైతులకు చెల్లించింది.

వైఎస్ ప్రభుత్వం కమీషన్లు పుచ్చుకునే పనులకు నిధులు విడుదల చేసి, రైతులకు పరిహారంలో కమీషన్లు రావు కనుక దాన్ని నిర్లక్ష్యం చేసింది. పులిచింతల కాంట్రాక్టు సంస్థకు ఉదయగిరి తెలుగుదేశం మాజీ శాసనసభ్యుడు బొల్లినేని రామారావుకు సంబంధం లేదు. ఆ కాంట్రాక్టర్ కుటుంబం కాంగ్రెస్ లో ఉండేది. వైఎస్ తో సన్నిహితంగా ఉండేది. ఈ వాస్తవాన్ని సాక్షి తలకిందలు చేసి ఫేక్ వార్త రాసి చంద్రబాబుకు అంటకట్టడం వారి అబద్దాల చరిత్రలో మరో పచ్చి అబద్దం. పులిచింతల పూర్తి చేసిన ఘనత వైఎస్ ది అని అక్కడ 45 అడుగుల వైఎస్ విగ్రహంతో స్మృతివనం ఏర్పాటు చేస్తామని 07.10.2019న నీటి పారుదల శాఖా మంత్రి అనీల్ కుమార్ ప్రకటించారు. జగన్ రెడ్డి కూడా ఆ ఘనత తమదే అన్నారు. మరి పులిచింతల గేటు కొట్టుకుపోయిన పాపం పూర్తిగా జగన్ కుటుంబానిది కాదా? జగన్ రెడ్డికి గాని, బెట్టింగ్ మంత్రి అనిల్ కు కానీ వీటి మీద అవగాహానే లేదు. పై నుంచి వరద వస్తున్నా ఫ్లడ్ కుషన్ మైంటైన్ చేయలేదు. ఈ వైఫల్యం వల్లే పులిచింతల గేటు కొట్టకపోయింది. నీరు సముద్రం పాలయ్యాయి. రైతులకు ద్రోహం చేశారు. దీని కప్పిపెట్టుకోవడానికి దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు తెలుగుదేశంపై పచ్చి అబద్దాల రాతలు రాయించారు. ఇది ఒక ఫేక్ పత్రిక – ఫేక్ నేత చేతిలో ఉన్న ఫేక్ పత్రిక. గేట్లను అమర్చడానికి నిర్మించే పియర్స్ లో ఒక గేటుకు, ఇంకో గేటుకు మధ్య గ్యాప్‌ గరిష్ఠంగా ఆరు మిల్లీ మీటర్లకు మించి ఉండకూడదని తెలిసినా, పులిచింతలలో 400 మిల్లీమీటర్లకు పైగా పెట్టారు. దీంతో గేట్ల పై ఒత్తిడి పెరిగింది. మొత్తంగా సివిల్‌ పనుల్లో, మెకానికల్‌ పనుల్లో కూడా లోపాలతో ప్రాజెక్ట్ నిర్మాణం చేసారు. 754.59 మీటర్ల దూరం స్పిల్‌వే నిర్మించాల్సి ఉండగా, 546 మీటర్లకు తగ్గించారు. 33 గేట్లు పెట్టాల్సి ఉండగా, కేవలం 24 గేట్లు పెట్టారు. కాంక్రీటు డ్యాం నిర్మించాల్సి ఉండగా, 355 మీటర్ల మట్టికట్ట నిర్మాణం చేపట్టారు. డిజైన్ మార్చి, స్పిల్ వే తగ్గించటం, గేట్లు తగ్గించటం, కాంక్రీటు డ్యాం లేకుండా మట్టి మట్టికట్ట నిర్మాణం చేయటంతో, మొత్తంగా ఈ రోజు వరద ఉదృతికి, గేటు కొట్టుకుపోయింది. జలయజ్ఞంలో జరిగిన ధనయజ్ఞంలో భాగంగానే డిజైన్ మార్పులు నాశిరకం పనులు జరిగాయి. తండ్రిని అడ్డం పెట్టుకొని నాడు జగన్ రెడ్డి కమీషన్లు కొల్లగొట్టారు. ఆ పాపమే నేటి పులిచింతల దుస్థితి. చంద్రబాబు ప్రభుత్వం, ఈ నాసిరకం పనులు దృష్టిలో పెట్టుకునే, పూర్తిస్థాయిలో నీటిని నిల్వను ఎప్పుడూ చేయలేదు. జాగ్రత్తగా ఫ్లడ్ మానిటర్ చేస్తూ, డ్యాంను కాపాడుతూ వచ్చారు. డ్యామ్ మెయిన్ టినెన్స్ కు నిధులు కేటాయించారు.

Advertisements

Latest Articles

Most Read