ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు జిల్లా, గడచిన రెండేళ్లుగా దౌర్జన్యాల, దోపిడీలు, దుర్మార్గాలకు కేంద్రబిందువుగా మారిందని, సర్వేపల్లి ఎమ్మెల్యే త అనుచరులతో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి సంతకాలు ఫోర్జరీ చేయించి మరీ, సర్వేపల్లి రిజర్వాయర్ లో మట్టితవ్వకాలకు తెరలేపారని, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన తననివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! అక్రమ మట్టితవ్వకాలకు సంబంధించిన కథనాలు మే30న జర్నలిస్ట్ ఫ్రెండ్స్ గ్రూపుకిచెందిన వాట్సాప్ గ్రూపులో వార్తలొచ్చాయి. అదేరోజు రాత్రి 7.08 ని.లకు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నిఅనుమతులతోనే సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని, కొందరు బ్లాక్ మెయిలర్స్ దానిపై దుష్ర్పచారంచేస్తున్నారని, గ్రూపులో వచ్చిన మెసేజ్ లపై స్పందించారు. సర్వేపల్లి నియోజకవర్గమంతా ఇష్టానుసారం గ్రావెల్, మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. కొన్నిగ్రామాల్లో జరుగుతున్న మైనింగ్ ను గ్రామస్తులే ఎక్కడికక్కడ అడ్డుకుంటూ, అవసరమైనప్రాంతాలలో సీసీ.కెమెరాలుకూడా పెట్టా రు. జీపీఎస్ విధానం అమర్చి, వాహనాలగురించిన సమాచారం తీసుకొని మరీ, గ్రామస్తులే స్వయంగా ఫిర్యాదుచేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో కొన్నివాహనాల ను అడ్డుకున్న అధికారులు వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ లో ఏ2గా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు చేర్చారు. ఐపీసీ 427కింద, మాగుంటపై క్రిమినల్ కేసు పెట్టారు. ఒంగోలు ఎంపీ స్వయంగా మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆయనపేరు చేర్చారు. మాగుంట అగ్రిఫామ్స్ అని ఆయనకు చెందిన సంస్థను కూడా ఫిర్యాదులో చేర్చా రు. సాధారణమైనగ్రావెల్ తవ్వకాలకు ఎంపీ స్థాయి వ్యక్తిఎలా దరఖాస్తు చేసుకుంటాడని అధికారులు ఆలోచించరా? అలాపెట్టుకొనిఉంటే, దానిపై ఎంపీనీ గానీ, ఆయన కార్యాలయాన్ని గానీ సంప్రదించి నిజానిజాలుతెలుసుకోవాల్సిన బాధ్యత అధికారులపై లేదా? మట్టి తవ్వకాలపేరుతో పెట్టిన దరఖాస్తులు మూడూ ఒకేవిధమైన దస్తూరితోఉంటే, వాటిపై ఫోర్జరీ సంతకాలుపెడితే, దానిపై ఆలోచించరా? ఈవ్యవహారంపై కాకాణి గోవర్థన్ రెడ్డి అంతా సక్రమంగానే ఉందని, అన్నిఅనుమతులతోనే గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని ఎలా చెబుతారు?

సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాణికి తెలియకుండా చీమకూడా చిటుక్కుమనదు. తవ్వకాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులే ఒకరిపోర్ట్ కూడా ఇచ్చారు. తాము 8వేలక్యూబిక్ మీటర్లకు అనుమతులిస్తే, 18వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు జరిగాయన్నారు. అదినిజమో కాదో పరిశీలించడానికి వెళ్లిన టీడీపీవారిపై అక్రమకేసులు పెట్టారు. మాజీ సర్పంచులు, ఇతరమాజీ ప్రజా ప్రతినిధులపై తప్పుడుకేసులుపెట్టారు. ఎంపీ మాగుంటశ్రీనివాసులరెడ్డి సంతకాన్ని గోవర్థన్ రెడ్డి అనుంగుఅనుచరుడే ఫోర్జరీచేశాడు. ఒకే సంతకంతో మూడు దరఖాస్తులు వచ్చినప్పుడు ఇరిగేషన్ అధికారులు ఎందుకు పరిశీలించ లేదు? కేసులుపెట్టేటప్పుడు అధికారులు ఎంపీ కార్యాలయాన్ని సంప్రదించరా? వైసీపీఎమ్మెల్యే తానుసాగిస్తున్న అక్రమమైనింగ్ కోసం ఎంపీని బలిచేస్తారా? ఎంపీ మాగుంటపై ఎమ్మెల్యే కాకాణి కక్షతీర్చుకున్నాడు. కాకాణి దోపిడీపై, అరా చకాలపై తాము ముఖ్యమంత్రికి అనేకసార్లు ఫిర్యాదుచేసినా, ఆయన ఏనాడూ గోవర్థన్ రెడ్డిని పిలిచివిచారించలేదు. సర్వేపల్లి ఎమ్మెల్యే కనునసన్నల్లో అధికార పార్టీ ఎంపీ మాగుంటశ్రీనివాసులు రెడ్డిని ఏ2గా ఎఫ్ఐఆర్ లోనమోదుచేయడం సామాన్యవిషయమా? మాగుంట శ్రీనివాసులు రెడ్డి 1000క్యూబిక్ మీటర్లకు సంబంధించిన కేసులో ముద్దాయా? అలా చెప్పడానికి తమకేసిగ్గుగా ఉంది. వైసీపీ ఎమ్మెల్యే ఇష్టానుసారం గ్రావెల్ దోపిడీచేస్తూ, ఏమాత్రం సంబంధంలేని సొంతపార్టీ ఎంపీనే ఇరికించడం దేనికి సంకేతం? ఎమ్మల్యేలు ఏంచేసినా, అధికారులు చూస్తూఊరుకోవాలని నెల్లూరు పర్యటనకు వచ్చిన సజ్జల చెప్పాడా ? అక్రమ మైనింగ్ ఎంతవరకు, ఏ స్థాయిలో జరిగిందో అధికారులే నిజాలు నిగ్గు తేల్చాలి. ఎంపీసంతకం ఫోర్జరీ చేసిన కాకాణి అనుచరుడిపై క్రిమినల్ కేసులునమోదుచేసి, అరెస్ట్ చేయాలి. తప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ కృష్ణమోహన్ ను వెంటనే సస్పెండ్ చేయాలి. శాఖాపరమైన విచారణ జరిపి, అతనిపై చర్యలు తీసుకోవాలి. ఎంపీ నిజంగా మైనింగ్ కు దరఖాస్తు చేసుకున్నాడా లేదా అని విచారించకుండా, ఎఫ్ఐఆర్ నమోదుచేసిన ఎస్సై, ఇత ర పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులు మరీ ఇంతదారుణంగా వ్యవహరించడం సిగ్గుచేటు. కాకాణి గోవర్థన్ రెడ్డి, ఆయనకు సహకరించిన అధికా రులపై ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకొని, మాగుంట కుటుంబం పరువు ప్రతిష్టలు కాపాడాలి.

పులిచింతల ప్రాజెక్ట్ లో, ప్రమాదం జరిగింది. పై నుంచి వస్తున్న వరద తాకిడి సమయంలో, ఈ రోజు ఉదయం మూడు గంటలకు, నీటిని విడుదల చేసే క్రమంలో గేట్లు తెరుస్తూ ఉండగా, ఒక్కసారిగా 16వ నంబరు గేటు ఊడిపోయింది. పులిచింతల ప్రాజెక్టు ప్రస్తుతం ఇన్‍ఫ్లో వచ్చి లక్షా 10 వేల క్యూసెక్కులుగా ఉంది. ఇన్‍ఫ్లో ఆధారంగా చేసుకుని, నీటికి కిందకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే, 16వ నంబర్ గేటు ఊడిపోయి , నీళ్ళు అన్నీ వృధాగా పోతున్నాయి. పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధం 45.77 టీఎంసీలుగా ఉంది. అయతే ఈ నేపధ్యంలోనే మిగతా గేట్లు పై ఈ ఒత్తిడి పడి, మిగతా గేట్లు కూడా ఇబ్బంది వస్తుందని భావిస్తున్న అధికారులు, మిగతా గేట్లు కూడా ఎత్తి నీటికి కిందకు విడుదల చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఊడిపోయిన గేటు స్థానంలో తాత్కాలికంగా మరో గేటు ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మంత్రి అనిల్ కుమార్, ఇతర అధికారులు డ్యాం వద్దకు వెళ్లి, ఏమి చెయ్యాలి అనే సమాలోచనలు జరిపారు. ఇతర సాంకేతిక నిపుణులను కూడా అక్కడకు రప్పించారు. గతంలో పులిచింతల గేటు బెగించిన బెకాన్ సంస్థ అధికారులను కూడా పిలిపిస్తున్నారు. ప్రస్తుతం తాత్కాలిక గేటు ఏర్పాటు ఒక్కటే మార్గం అని, ముందు ఆ పనులు చేయాలని డిసైడ్ అయ్యారు.

pulichintala 05082021 2

అయితే గేటు పెట్టాలి అంటే, ప్రవాహాన్ని ముందు ఆపాల్సి ఉంటుంది. అందుకే పులిచింతల నుంచి నీళ్ళు భారీగా కిందకు వదిలేయాలని డిసైడ్ అయ్యారు. దాదాపుగా 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదులుతున్నారు. అంటే పులిచింతల దాదాపుగా ఖాళీ చేస్తున్నారు. మరో పక్క అయినా పై నుంచి పులిచింతలకు వరద వస్తుంది. అయితే పులిచింతల నుంచి భారీగా నీళ్ళు విడుదల చేయటంతో, ప్రకాశం బ్యారీజికి ఫ్లాష్ ఫ్లడ్ వస్తుంది. దీంతో జిల్లా కలెక్టర్ జె.నివాస్ అందరినీ అలెర్ట్ చేస్తున్నారు. 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ఫ్లాష్ష్ ఫ్లడ్ వచ్చి చేరుతుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా నది పరివాహక ప్రాంత ప్రజలు, ఇప్పుడు వరద లేదు కాబట్టి రిలాక్స్ అయి ఉంటారు, ఇంత తక్కువ సమయంలో వారిని అలెర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాగులు, వంకలు కాలువలకు కూడా ఫ్లాష్ ఫ్లడ్వస్తుంది కాబట్టి, అక్కడ కూడా అలెర్ట్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ పరిస్థితిని అధికారులు సమర్ధవంతంగా ఎదుర్కుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తారని ఆశిద్దాం..

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం సుప్రీం కోర్టుకు చేరిన విషయం తెలిసిందే. ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను, రెండు రోజులు క్రిందట విచారణ జరిగిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ముందు ఈ పిటీషన్ వచ్చింది. అయితే ఈ రోజు జరిగిన విచారణలో, ఈ పిటీషన్ ను వేరే బెంచ్ కు బదిలీ చేస్తూ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్ లో, శ్రీశైలం నుంచి తెలంగాణా నీటిని విద్యుత్ ఉత్పత్తు కోసం వాడుతూ, అనవసరంగా నీటిని కిందకు విడుదల చేసిందని, సాగు నీటికి ఉపయోగపడటం లేదని, కాబట్టి తెలంగాణా ప్రభుత్వాన్ని శ్రీశైలం ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని తీసుకోవటాన్ని నిలిపివేయాలి అంటూ, ఆ మేరకు తెలంగాణా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి అంటూ ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై, మొన్న సోమవారం విచారణకు వచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలో ధర్మాసనం ఇరు రాష్ట్రాలకు కూడా ఈ జల వివాదాలకు సంబంధించిన అంశాల పై మధ్య వర్తిత్వమే మంచిది, అంటూ రెండు రాష్ట్రాలకు సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవ పెట్టకుండా, ఈ న్యాయ పరమైన అంశాల జోలికి పోకుండా, మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.

jagan 04082021 2

ఈ సమయంలో అస్సాం, మిజోరాంలో జరుగుతున్న విషయాల పై న్యాయవాది చెప్పగా, కలలో కూడా అలా జరగాలని కోరుకోవద్దు, ఇరు రాష్ట్రాలు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అంటూ, మధ్యవర్తిత్వం గురించి ప్రస్తావించారు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలి అంటే తాను ముందు ఉంటాను అంటూ చెప్పారు. దీంతో ఏపి ప్రభుత్వం హజారైన దుష్యంత్ దవే మీరు చాలా చక్కని మాట చెప్పారు, ఈ విషయం ఏపి ప్రభుత్వాన్ని అడిగి చెప్తానని చెప్పారు. అయితే ఏపి ప్రభుత్వం తరుపున ఈ రోజు హాజరైన మరో న్యాయావాడి ఉమాపతి, ఈ కేసుని మేము న్యాయ పరంగానే ఎదుర్కుంటాం అని, మధ్యవర్తిత్వం అవసరం లేదని, కోర్టుకు చెప్పారు. దీంతో ఏపి ప్రభుత్వం వద్దు అని చెప్పటంతో, ఈ కేసుని వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తామని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. అయితే కేంద్రం తరపు హాజరైన న్యాయవాది మాత్రం, మీరే ఈ కేసు చూడాలని చెప్పగా, అందుకు చీఫ్ జస్టిస్ ఒప్పుకోలేదు. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని అందుకే వేరే బెంచ్ కు బదిలీ చేస్తున్నామని చెప్పారు.

ఏ అభివృద్ధైనా ఆ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి పైనే ఆధారపడి ఉంటుందని, దానికి విరుద్ధంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే పారిశ్రామిక వేత్తలను ప్రభుత్వం భయంతో పరుగులపెట్టిస్తోందని, మోహన్ దాస్ పాయ్ అన్న దానికి అమర్ రాజా గ్రూప్ రాష్ట్రం నుంచి తరలిపోవడమే నిదర్శనమని టీడీపీ అధికారప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన తన నివాసం నుంచి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! తిరుపతిలోని రేణిగుంట సమీపంలో రూ.15వేలకోట్ల పెట్టుబడి పెట్టాలనుకున్న రిలయన్స్ సంస్థ ఇప్పటికే రాష్ట్రం నుంచి వెళ్లిపోయింది. దానితోపాటు నేడు అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా చెన్నైకి తరలి పోవడానికి సిద్ధమైంది. రాయలసీమ ప్రాంతంలో ఒక ప్పుడు ఉపాధిలేక పొరుగు రాష్ట్రాలకు వలసపోయే వారికెందరికో అమర్ రాజా సంస్థ బతుకుదెరువు చూపించించింది. అమర్ రాజా సంస్థ సీమలో వలసలను ఆపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. యువత ఉపాధి కోసం ఫ్యాక్షనిజం బాట పడుతున్న సమయంలో అమర్ రాజా సంస్థ వారికి ఉన్నత మార్గాన్ని చూపింది. అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీలు రాష్ట్రం నుంచి తరలిపోతే, ప్రత్యక్షంగా, పరోక్షంగా కంపెనీపై ఆధారపడి జీవిస్తున్న దాదాపు 12వేల మంది తీవ్రంగా నష్టపోతారు. అంతమంది ఉద్యోగులకు కన్నీళ్లు మిగల్చడం ద్వారా జగన్ ప్రభుత్వం ఏం సాధించింది? అమర్ రాజా సంస్థలు రాష్ట్రం నుంచి వెళ్లిపోవడం వల్ల రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుంది. ఉద్యోగుల పిల్లలతో పాటు, సీమలోని పేదలకు తక్కువ ఖర్చుకే అమర్ రాజా సంస్థ విద్యను అందిస్తోంది. పరిశ్రమల శాఖా మంత్రి పేరులో శ్రమ ఉంది గానీ, రాష్ట్రంలో పరిశ్రమల కోసం ఆయన పడుతున్న శ్రమశూన్యం. ఇంకా సిగ్గులేకుండా రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెబుతున్నాడు. ఎక్కడ ఏప్రాంతంలో మేకపాటి గౌతమ్ రెడ్డి పెట్టుబడులుపెట్టించాడో చెప్పాలని, అవసరమైతే, తన వ్యాఖ్యలపై ఆయన నిజ నిర్థారణ కమిటీ వేయాలని పత్రికా ముఖంగా డిమాండ్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాదాపు రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంనుంచి తరలిపోయాయి. అదానీగ్రూప్ రూ.70వేల కోట్ల పెట్టుబడి, లులూ గ్రూప్ రూ.2,200కోట్లు, బీఆర్. షెట్టి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రూ.12వేలకోట్ల పెట్టుబడి, సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్ట్ రూ.50వేలకోట్ల పెట్టుబడి రాష్ట్రం నుంచి పరారైంది. రాయలసీమకే తలమానికమైన కియా పరిశ్రమకు చెందిన అనుబంధ పరిశ్రమలు 17, రూ.2వేలకోట్ల పెట్టుబడి పెట్టకుండా రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయన్నారు. ఒంగోలులలోని ఏపీ పేపర్ పల్ప్ మిల్స్ వారు , ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటివి ఎప్పుడో పరారయ్యాయన్నారు. జువారీ సిమెంట్స్, హెరిటేజ్, సంగం డెయిరీ సంస్థలను వేధిస్తున్నారు. ఉద్యోగస్తులపై ఏసీబీ, ప్రతిపక్షాలపై జేసీబీ, పరిశ్రమలు, కంపెనీలపై పీసీబీ ని పంపడం ప్రభుత్వానికి రివాజుగా మారింది. మాట వినని వారిపైనే ముఖ్యమంత్రి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు. కడపలోని జువారీ సిమెంట్స్ సంస్థ నుంచి పొల్యూషన్ వస్తోందని, చెబుతోందన్న జగన్మోహన్ రెడ్డి తన భారతి సిమెంట్స్ నుంచి పొల్యూషన్ రాకుండా పంచామృతం, పన్నీరు లాంటివి వస్తున్నాయేమో చెప్పాలి.

పరిశ్రమలను తరలించడంతోపాటు, జాబ్ లెస్ క్యాలెండర్ తో ముఖ్యమంత్రి నిరుద్యోగులకు కన్నీళ్లు మిగిల్చాడు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్రం ఇప్పటికే సీరియస్ అయింది. ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అనే డూప్లికేట్ కార్పోరేషన్ పెట్టి, పంచాయతీ కార్యాలయాలు, మండల కార్యాలయాలు కూడా తాకట్టుపెట్టే దుస్థితికి వచ్చారు. చివరకు పథకాలను కూడా నిలిపేసే దుస్థితికి ప్రభుత్వం వచ్చింది. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర యవతకు, నిరుద్యోగులకు జగనన్న కొబ్బరిచిప్పల పథకం పేరుతో వారిచేతుల్లో చిప్పపెడతాడు. ముఖ్యమంత్రి ఒక్కసారి అమర్ రాజా సంస్థ చరిత్రను గమనించాలి. ఆ సంస్థ రాష్ట్రంలో పరిశ్రమ పెడతామని చెప్పినప్పుడు, సంస్థ యజమానులు ఏ పార్టీలో ఉన్నారని కూడా చూడకుండా, నాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ భూములు కేటాయించారు. పరిశ్రమ పెడితే రాయలసీమ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని మాత్రమే ఆనాడు ఆయన ఆలోచించాడు. చిత్తూరు ప్రాంతంలో ఎక్కడికెళ్లి అడిగినా, అమర్ రాజా సంస్థ యజమానులెవరో తమకు తెలియకపోయినా, ఉపాధి పొందినవారు వారు తినే అన్నం ముద్దను చూపుతారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు లేవని, పరిశ్రమలను తన్ని తరిమేస్తున్నారని లండన్ కు చెందిన పత్రికే చెప్పింది. రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతే, ముఖ్యమంత్రికి, సజ్జల రామకృష్ణారెడ్డికి వచ్చిన నష్టమేమీ లేదని, నష్టపోయేదల్లా నిరుద్యోగులు, యువతే. భారతిసిమెంట్స్ లోగానీ, సాక్షి పేపర్ లో గానీ ముఖ్యమంత్రి యువతకు, ఉపాధి కల్పిస్తాడా? అమర్ రాజా సంస్థలో పనిచేసుకుంటున్న వారికి సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి సంస్థలో ఏమైనా ఉపాధి కల్పిస్తాడా? ఒక పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్లిపోతుందంటే పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? చంద్రబాబునాయుడు సెల్ కాన్ మొబైల్ పరిశ్రమను, రేణిగుంట శ్రీసిటీలో నెలకొల్పారు. రాష్ట్రంనుంచి పరిశ్రమలు పరారవుతున్నాయి. మైనింగ్ పేరుతో రాష్ట్రంలోని సహజవనరులను వైసీపీ దొంగలు దోచుకుంటున్నారు. ఈ వ్వవహారంపై ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు , మేథావులు స్పందించకపోతే, చివరకు రాష్ట్రంలో బతకలేక అందరూ పొరుగురాష్ట్రాలకు వలసపోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా తన విధానం మార్చుకొని , ఏపీకి పరిశ్రమలు వచ్చేలా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. మేకపాట్ గౌతమ్ రెడ్డిచెప్పిన రూ.6లక్షలకోట్ల పెట్టుబడి ఎక్కడుందో, ఆయనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చాక రాష్ట్రానికి అగ్గిపెట్టెల తయారీ పరిశ్రమ కూడా రాలేదనే వాస్తవం గౌతమ్ రెడ్డికి తెలియదా?

Advertisements

Latest Articles

Most Read