జలాశయాలను ఆధునిక దేవాలయాలుగా పిలుస్తారని, అలాంటి దేవాలయాల నిర్వహణను గాలికొదిలేసిన ప్రభుత్వం, లక్షలక్యూసెక్కుల నీటిని వృథాచేస్తూ, సకలజీవరాశుల మనుగడను ప్రశ్నార్థకంచేస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్ట్ లో 16వ గేటుకొట్టుకుపోవడంవల్ల దాదాపు 35టీఎంసీల నీటినిప్రభుత్వం వృథాగా సముద్రంపాలుచేసిందన్నారు. ముక్త్యాల రాజాగారి ఆలోచనలనుంచి డెల్టాప్రాంతస్థిరీకరణకోసం పుట్టుకొచ్చిన ప్రాజెక్ట్ కి నందమూరి తారకరామారావు గారు శంఖుస్థాపనచేయడం జరిగిందన్నారు. ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి హాయాంలో సదరుప్రాజెక్ట్ నిర్మాణం పూర్తైందని, ప్రాజెక్ట్ నిర్మాణసమయంలోనే ప్రాజెక్ట్ గేట్లసంఖ్యను 33 నుంచి 24కు కుదించాలని చూశారని, స్పిల్ వేను 750 మీటర్లనుంచి 550కు తగ్గించారన్నారు. స్పిల్ వేనిర్మాణసమయంలో ఖాళీగా ఉన్నప్రదేశాన్ని మట్టితో నింపడం జరిగిందన్నారు. ఈ విధంగా ప్రాజెక్ట్ నిర్మాణసమయంలో జరిగే పొరపాట్లపై ఆనాడు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబునాయుడు, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారన్నారు. దానితోపాటు గేట్లు అమర్చేటప్పుడు, గేటుకి గేటుకి మధ్యన 600మిల్లీమీటర్ల వ్యత్యాసముండాలని కూడా ఆనాడు అధికారులు చెప్పారన్నారు. కానీ కేవలం 400మిల్లీ మీటర్ల వ్యత్యాసంతోనే గేట్లు అమర్చడంజరిగిందన్నారు. ఈవిధంగా ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలను, నిర్మాణంలోని లోపాలను ఆనాడు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబునాయుడు ఎత్తిచూపుతూనే ఉన్నారన్నారు. ముగ్గురు మంత్రులు పులిచింతల ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లి, ఏంచేశారని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆనాడున్న ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన ప్యాకేజీని కూడా ఇవ్వకుండా వారిసమస్యలను గాలికొదిలేసిందన్నారు. తరువాత వచ్చిన టీడీపీప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించిందని, దాదాపు రూ.400కోట్లవరకు చెల్లింపులు చేసిందని మాజీమంత్రి తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రాజెక్ట్ ల నిర్వహణ సరిగా పట్టించుకోనందునే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయ న్నారు. ప్రభుత్వలోపాలను, పనితీరునిఎత్తిచూపే వారిపై కేసులు పెడుతున్న ప్రభుత్వం, పాలనలోని లోపాలను ఎందుకు సరిదిద్దుకోలేకపోతోందన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ డ్యామ్ లు, ప్రాజెక్ట్ లనిర్వహణపై ఎలాంటిచర్యలు తీసుకుందన్నారు? డ్యామ్ లనిర్వహణపై ప్రభుత్వానికి ఎలాంటి అవగాహనలేదని, పైనుంచి ఎంతవరద వస్తోంది...ఎంతనీటిని నిల్వచేయాలి.. ఎంతనీటిని కిందికివదలాలనే ఆలోచనలను ప్రభుత్వంగానీ, అధికారులుగానీ అమలుచేయడం లేదన్నారు.
జగన్ ప్రభుత్వ అసమర్థపాలనకు నిదర్శనమే పులిచింతల గేట్లు కొట్టుకుపోవడానికి కారణమని మాజీమంత్రి తేల్చిచెప్పారు. ప్రస్తుత రైతులకు ఎంతవరకు నీరు అవసరం..ఎంతనీరు కాలువలకు వదలాలనేదానిపై కూడా ప్రభత్వం ఎలాంటి ఆలోచనలు చేయలేదన్నారు? రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో ఏనాడైనా సరే ప్రాజెక్టుల నిర్వహణ, బలోపేతంపై ముఖ్యమంత్రి ఏనాడూ అధికారులతో ఎలాంటి సమీక్షలు నిర్వహించిందిలేదన్నారు. జగన్ తండ్రి హాయాంలో జరిగిన జలయజ్ఞంపేరుతో జరిగిన ధనయజ్ఞానికి నిదర్శనంగానే పులిచింతలప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయిందని రాజేంద్రప్రసాద్ స్పష్టంచేశారు. డ్యామ్ లు, ప్రాజెక్ట్ లవద్ద నీటినిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించడం, నీటిప్రవాహాన్ని గమనించండం వంటివి ఈప్రభుత్వంలో ఏనాడైనా జరిగాయా అన్నారు. చేయాల్సిదంతా చేస్తున్న జగన్ ప్రభుత్వం, చివరకు తనసొంతపత్రికలో వాస్తవాలను మరుగునపరిచి, పచ్చిఅబద్ధాలు చెబుతున్నారన్నారు. 2004 తర్వాత తెనాలిలో బహిరంగసభనిర్వహించి మరీ పులిచింతలను జాతికిఅంకితం చేస్తానని చెప్పిన రాజశేఖర్ రెడ్డి, ప్రాజెక్ట్ నిర్మాణాన్ని శ్రీనివాస కన్ స్రక్షన్స్ సంస్థకు అప్పగించడం జరిగిందన్నారు. శ్రీనివాస కన్ స్ట్రక్షన్స్ సంస్థను ఎవరిదో, ఎవరుతెరపైకి తెచ్చారో జగన్మోహన్ రెడ్డి, ఆయన మీడియా సమాధానంచెప్పాలని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. భవిష్యత్ లో పులిచింతల డ్యామ్ కు ప్రమాదం వస్తుందని, చంద్రబాబునాయుడుఎంతలా మొత్తుకున్నా రాజశేఖర్ రెడ్డిప్రభుత్వం లెక్కచేయలేదన్నారు. దాని పర్యవసానంగానే నేడు ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోవడం, ప్రాజెక్ట్ గోడలు బీటలువారడం వంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు పూజించే దేవాలయాలను పడగొడుతున్న జగన్ ప్రభుత్వం, ఆధునిక దేవాలయాలైన జలాశయాలను కూడా పట్టించుకోకుండా గాలికొదిలేయడం వల్లే ఇటువంటి దుష్ఫరిణామాలు సంభవిస్తున్నాయన్నారు. ముగ్గురుమంత్రులు ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి,ఏంచేశారో, అధికారులకే ఏం సలహాలిచ్చారో చెప్పాలన్నారు. సింగడు అద్దంకి పోనూపోయాడు..రానూవచ్చాడన్నట్టుగా మంత్రులు పులిచింతలకువెళ్లి వచ్చారని ఆలపాటి ఎద్దేవాచేశారు.