ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన వివేక కేసులో, నిన్న కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నిన్న వాచ్‌మెన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలంతో, రాష్ట్రమంతా ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. రంగన్నను, జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన సిబిఐ అధికారులు, జరిగిన విషయం మొత్తం స్టేట్మెంట్ రూపంలో రికార్డు చేసారు. రంగన్న సుపారీ గురించి, తొమ్మది మంది వ్యక్తులు వచ్చారని, ఇద్దరు ప్రముఖులు ఉన్నారని స్టేట్మెంట్ ఇచ్చారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ పేర్లు నిన్న తెలియలేదు. రంగన్న ఇప్పుడు హాట్ టాపిక్ ఆవ్వటంతో, ఈ రోజు మీడియా మొత్తం రంగన్న ఇంటికి వెళ్ళింది. నిన్న ఏమి చెప్పారో చెప్పమని అడగగా, ముందుగా తనకు ఏమి గుర్తు లేదని, ఏమి చెప్పానో గుర్తు లేదు అంటూ, తప్పించుకునే ప్రయత్నం చేసారు. తరువాత గుచ్చి గుచ్చి అడగగా, విలేఖరులు చెవుల్లో వచ్చి, ముగ్గురు పేర్లు చెప్పాడు. అందులో ఒకరు వివేక అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి కాగా, మరో వ్యక్తి వివేకా పాత డ్రైవర్ దస్తగిరి, మరో వ్యక్తి పేరు సునీల్‌కుమార్ గా చెప్పాడు. అయితే మరో వ్యక్తి కూడా ఉన్నాడని, అతను పొడుగుగా ఉన్నాడని రంగన్న చెప్పాడు. అయితే ముందుగా ఎర్ర గంగిరెడ్డి తనని బెదిరించాడని, ఎవరికీ ఏమి చెప్పవద్దు అంటూ తనను బెదిరించినట్టు చెప్పాడు.
తరువాత సిబిసి సార్ వాళ్ళు, నీకు ఏమి అవ్వదు, నీకు రక్షణగా మేము ఉంటాం అంటూ భరోసా ఇచ్చారని, అప్పుడు వాళ్లకు మొత్తం చెప్పేసానని, తరువాత జమ్మలమడుగు తీసుకుని వెళ్ళి, అక్కడ జడ్జి గారు ముందు కూడా చెప్పమంటే చెప్పానని అన్నాడు. ఖర్చులకు 1500 ఇచ్చారని, ఆటోలో పులివెందుల పంపించారని చెప్పుకొచ్చాడు. అయితే జడ్జి ముందు ఏమి చెప్పాడో, పూర్తిగా గుర్తు లేదాని అన్నాడు. భయంగా ఉంది అంటూ విలేఖరుల ముందు చెప్పాడు. అయితే రంగన్న ఆరోపణల పై, గంగిరెడ్డి స్పందిచారు. అసలు రంగన్న ఎవరో తనకు తెలియదు అని, ఎప్పుడూ మాట్లాడలేదని, అలాంటిది తన మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్ధం కావటం లేదని అన్నారు. వివేకతో మంచి స్నేహం ఉందని, చనిపోయే ముందు రోజు రాత్రి కూడా కలిసామని, తరువాత రోజు ఏడు గంటలకు వార్త తెలిసిందని, సునీత గారు కూడా వివరాలు అడిగితే ఇవే చెప్పానని, ఈ కేసుతో తనకు సంబంధం లేదని, తాను ఎవరినీ బెదిరించ లేదని అన్నారు.