కేంద్ర జలశక్తి విభాగం విడుదల చేసిన నోటిఫికేషన్ (గెజిట్) పరిశీలిస్తే, 05-12-2015వ తేదీన ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఉమ్మడి ఒప్పందం, 27-05-2016న జరిగిన డ్రాఫ్ట్ నోటి ఫికేషన్ ఏదైతే ఉందో, వాటిని అతిక్రమించేలా సదరు నోటిఫికే షన్ ఉందని, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆక్షేపించారు. శనివారం ఆయన తన నివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనేక్లుప్తంగా మీకోసం...! "గతంలో నీటి వాటాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్యన ఉన్న డ్రాఫ్ట్ నోటిఫికేషన్, ఉమ్మడి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి, తాజాగా నీటి కేటాయింపులు జరపాలని కేసీఆర్ 2016లో కేంద్రాన్ని కోరారు. ఆనాడు కేంద్ర జలశక్తి మంత్రిగా ఉన్న ఉమాభారతిగారు విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రైన చంద్రబాబునాయుడి గారి దృష్టికి తీసు కొచ్చారు. ఆనాడే చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లేఖను తీవ్రంగా తప్పు పట్టారు. ఆనాటి నుంచీ పెద్దగా వివాదాలు లేకుండానే కేసీఆర్, చంద్రబాబులు వ్యవహరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కేసీఆర్ తన ఇష్టానుసారం ప్రవర్తిస్తూ, తనకు నచ్చినట్లుగా నీటిని వాడుకోవడం మొదలెట్టాడు. ఇరురాష్ట్రాల నీటి కేటాయింపులు, వాడకం వివరాలు, ఇతరత్రా అంశాలు, నదీ బోర్డుల పరిధిలోనూ, కేంద్రం పరిధిలోనూ ఉంటాయి. ఆ ప్రకారంగా నడుచుకోకుండా గోదావరి జిల్లాల రైతాంగం ప్రయోజనాలను, రాయలసీమ రైతుల ప్రయోజనాలను తుంగలో తొక్కేలా పొరుగు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. సాగునీటి రంగ నిపుణులు కూడా కేసీఆర్ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ రెచ్చిపోవడానికి ఏపీ ముఖ్యమంత్రి అసమర్థతే కారణం. ఈ ముఖ్యమంత్రికి ఉన్న అవగాహన లోపమే ఏపీ రైతాంగానికి శాపంగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జగన్మో హన్ రెడ్డి తన స్వార్థంకోసం, తన ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఏపీ నీటి కేటాయింపులను కూడా కేసీఆర్ పరం చేయడానికి సిద్ధమయ్యాడు. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలను పొరుగు రాష్ట్రానికి తాకట్టుపెట్టేలా ఈముఖ్యమంత్రి ప్రవర్తించడం నిజంగా చాలా బాధాకరం. నిన్నకేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన నోటిఫికేషన్లో ఏపీకి సంబంధించిన ఎలాంటి వివాదాలు లేని ప్రాజెక్టులను కూడా ప్రస్తావించారు.
ఏవైనా వివాదాలున్న ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తే, వాటిపై మాట్లాడొచ్చు. కానీ ఎలాంటి వివాదాలులేని, పొరుగు రాష్ట్రానికి ఎలాంటి నష్టం కలిగించన ప్రాజెక్టులను కేంద్ర జలశక్తి విభాగం నోటిఫికేషన్లో ఎందుకు ప్రస్తావించిందో తెలియడం లేదు. సదరు నోటిఫికేషన్ ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వ సలహాదారు సజ్జలకు ఎలా ఆమోదనీయమో వారే సమాధానం చెప్పాలి. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకాలకు ఎలాంటి అనుమతులు లేకపోయినా కూడా కేంద్ర జలశక్తి విభాగం వారు నోటిఫికేషన్లో పొందు పరిచారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, వెలిగొండప్రాజెక్ట్ లకు అనుమతులున్నా, వాటి ప్రస్తావన నోటిఫికేషన్లో ఎందుకుచేయలేదు? ఆ విధంగా చేయకపోవడం ముఖ్యమంత్రికి, వైసీపీ నేతలకు ఎలా సమ్మ తమైందో వారే చెప్పాలి. సదరు నోటిఫకేషన్ ను ముఖ్యమంత్రి, సజ్జల ఎలా స్వాగతిస్తున్నారో వారే చెప్పాలి. విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఏపీలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వివరాలను కూడా పొందుపరిచారు. వాటన్నింటినీ విభజన చట్టంలోని 11వషెడ్యూల్లో పొందుపరిచారు. ఆ ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం నిర్మించుకోవచ్చని కూడా విభజన చట్టంలో చెప్పారు. అలాంటి ప్రాజెక్టులకు అనుమతులు లేవని చెప్పిన కేంద్ర నోటిఫికేషన్ ముఖ్యమంత్రికి ఎలా సమ్మతమైంది? సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్ తో తెలంగాణకు ఎలాంటి నష్టం లేకపోయినా కూడా, ఆ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేక పోయినా దాన్ని గోదావరి బోర్డు పరిధిలోకి ఎలా చేర్చారో కూడా కేంద్ర జలశక్తి విభాగం వారు సమాధానం చెప్పాలి. తుంగభద్ర బోర్డు పరిధిలోని హెచ్ ఎల్సీ, ఎల్ ఎల్సీ కాలువలను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకొస్తే, వాటికెలా విలువ ఉంటుందో ప్రభుత్వపెద్దలే సమాధానం చెప్పాలి.
కృష్ణానదికి చివరన ఉన్న ప్రకాశం బ్యారేజీ, గోదావరి నదికి చివరన ఉన్న ధవళేశ్వరం బ్యారేజీలను కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడాన్ని ఈ ప్రభుత్వం ఎలా స్వాగతిస్తుందో తెలియడం లేదు. గోదావరి, కృష్ణా నదులకు చిట్టచివరన ఉన్న ఏపీ, రెండు నదుల ద్వారా వచ్చే వరద నీటిని కూడా వాడుకోవడానికి వీల్లేకుండా కేంద్ర ప్రభుత్వమిచ్చిన నోటిఫికేషన్ ఈ ముఖ్యమంత్రికి ఎలా ఆమోదయోగ్యమైందో ఆయనే చెప్పాలి. ఏపీ, తెలంగాణకు సంబంధించి ఉమ్మడి ప్రాజెక్టులై న శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను వివాదాల జాబితాలో చేరిస్తే, ఒక అర్థం పర్థం ఉంటుందిగానీ, ఎలాంటి వివాదాలు లేని, వెలిగొండ, హంద్రీనీవా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి చేర్చడం చాలా విచిత్రంగా ఉంది. ఈ విధంగా కేంద్రం తీసుకున్ననిర్ణయాలన్నీ ఏపీ జుట్టుని తన అధీనంలో కి తీసుకున్నట్లుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ, పాలకుల అసమర్థత, అనుభవరాహిత్యమే, రాష్ట్ర రైతాంగానికి ముప్పుగా పరిణమించింది. జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన గడ్డకే తీవ్ర అన్యాయం చేస్తూ, రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నాడు. కేంద్ర గెజిట్ ను ఆమోదిస్తున్నామ ని, స్వాగతిస్తున్నామని, సమ్మతిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెప్పడం ముమ్మాటికీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేయడమే .