గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఆకస్మిక బదిలీ ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. రెండు రోజుల క్రిందట సిఐడి చీఫ్ సునీల్ కుమార్ చేతిలో ఉన్న ఒక అదనపు శాఖను కూడా తొలగించిన సంగతి తెలిసిందే. నిన్న అమ్మిరెడ్డిని బదిలీ చేయటం కూడా గమనించాల్సిన అంశం. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి స్థానంలో, ఎస్ఈబీ అదనపు ఎస్పీగా పని చేస్తున్న అరిఫ్ అజీజ్‌ను ప్రభుత్వం నియమించింది. అయితే అమ్మిరెడ్డికి మాత్రం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన్ను డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ పెద్దలతో అమ్మిరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయనే ప్రచారం మధ్య, ఆయన బదిలీ పలువురుని విస్మయానికి గురి చేసింది. వచ్చే వారం పది రోజుల్లో పెద్ద ఎత్తున ఐపిఎస్, ఐఏఎస్ బదిలీలు ఉంటాయనే ప్రచారంలో, అమ్మిరెడ్డికి మరింత ప్రాధాన్యం ఉన్న చోట కూర్చోబేడతారు అనే ప్రచారం మధ్య, ఈ ఆకస్మిక బదిలీతో పాటుగా, ఆయనకు ఎక్కడా కూడా పోస్టింగ్ ఇవ్వకపోవటం, అలాగే డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని చెప్పటం, చర్చనీయంసంగా మారింది. ఈ మొత్తానికి కారణం, రఘురామరాజు ఢిల్లీలో కదుపుతున్న పావులుగా కూడా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్పీ అమ్మిరెడ్డి పై, అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే అవన్నీ రాష్ట్ర స్థాయి వరుకే పరిమితం కావటంతో, పెద్ద చర్చ జరగలేదు.
ఇటీవల రఘురామకృష్ణం రాజు అరెస్ట్ నేపధ్యంలో, అది పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చ అవ్వటం, ఈ ఎపిసోడ్ మొత్తంలో, అమ్మిరెడ్డి పాత్ర పై విమర్శలు రావటం, అలాగే అమ్మిరెడ్డి పై, రఘురామకృష్ణం రాజు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో, ఆయన బదిలీకి దానికి ఏమైనా లింక్ ఉందా అనే చర్చ బలంగా జరుగుతుంది. రఘురామరాజు ఆర్మీ హాస్పిటల్ లో ఉన్న సందర్భంలో, ఆయన డిశ్చార్జ్ అవ్వగానే, మరో కేసులో రఘురామరాజుని అరెస్ట్ చేయటానికి ఎస్పీ అమ్మిరెడ్డి ప్రయత్నం చేసారని, దీనికి ఆర్మీ హాస్పిటల్ రిజిస్టార్ కేపీ రెడ్డి, అలాగే మరో అధికారి ధర్మారెడ్డి సహకరించారు అంటూ, ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి ఆధారాలను కూడా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు రఘురామరాజు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని పై కేంద్రం ఏమైనా విచారణ చేసి, ఆయన పై చర్యలు తీసుకోమని ఆదేశించిందా ? లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభువమే ముందు జాగ్రత్త చర్యగా జాగ్రత్త పడిందా ? లేదా ఇది సాధారణ ప్రకరియలో జరిగిన బదిలీనా అనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాసం ఉంది.