జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన సోమవారం ఉంటుందని అందరూ భావించారు. మీడియా కూడా ఈ విషయం పై రెండు రోజుల నుంచి కధనాలు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆయన పర్యటన వాయిదా పడిందని, గురువారం ఆయన పర్యటన ఉంటుందని సమాచారం వచ్చింది. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆఫీస్ వర్గాలు, జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వచ్చిన తరువాత అప్పాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు. అయితే ఢిల్లీ వెళ్ళిన తరువాత ఒకవేళ అప్పాయింట్మెంట్ లభించక పొతే,మళ్ళీ ఇబ్బందులు ఉంటాయని, ఆయన పర్యటన వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. దీంతో పాటు, కేంద్ర రక్షణ మంత్రి రాజనాద్ సింగ్, అదే విధంగా జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షకావత్, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్, న్యాయ శాఖా మంత్రి అప్పాయింట్మెంట్ కూడా కోరారు. అయితే ఒక్క అమిత్ షా వద్ద నుంచే, అది కూడా రేపు ఢిల్లీ వస్తే అప్పుడు అప్పాయింట్మెంట్ ఖరారు చేస్తామని చెప్పటం, అలాగే జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ అప్పాయింట్మెంట్ టైం క్లారిటీ రాకపోవటం, మిగతా ముగ్గిరు మంత్రులు కూడా, అప్పాయింట్మెంట్ కు సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు, ఈ నేపధ్యంలోనే పూర్తిగా అప్పాయింట్మెంట్ లు ఖరారు అయిన తరువాతే ఢిల్లీ వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు.

amitshah 06062021 2

ఇందు కోసమే జగన్ మోహన్ రెడ్డి పర్యటన వాయిదా వేసుకుని, గురువారం అప్పాయింట్మెంట్ ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. గురువారం అప్పాయింట్మెంట్లు లభిస్తే, ఆ రోజు ఆయన ఢిల్లీ వెళ్ళే అవకాసం ఉంది. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వరుస వివాదాలు చుట్టుముట్టటం, అలాగే దేశ వ్యాప్తంగా పరువు పోతూ ఉండటంతో, జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంచరించుకుంది. అయితే ఢిల్లీ పర్యటన కేవలం వ్యాక్సిన్లు, పోలవరం కోసం, విభజన హామీల కోసం అని చెప్తున్నా, ప్రధాన్యతాంసాలు వేరే ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారంతో, దేశ వ్యాప్తం పరువు పోతుంది. అలాగే కేంద్రం కూడా ఈ విషయంలో, సీరియస్ గా ఉందనే సమాచారం వస్తుంది. ఇక రఘురామకృష్ణం రాజు వేసిన జగన్ బెయిల్ రద్దు పిటీషన్ కూడా, 14వ తేదీన విచారణకు వస్తుంది. అలాగే టీవీల పై పెట్టిన రాజద్రోహం కేసు పై, సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యల పై కూడా, ఆయన కేంద్రానికి వివరణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మొత్తం మీద, ఇప్పుడు సీన్ సోమవారం నుంచి ఢిల్లీకి మారింది.

సంగం డైరీ పాలక వర్గం పై మరో కేసు నమోదు అయ్యింది. సంగం డైరీ పాలకవర్గం, గత నెల 24వ తేదీన చైర్మెన్ ధూళిపాళ్ల నరేంద్ర అధ్యక్షతన విజయవాడలో ఒక హోటల్ లో సమావేశం నిర్వహించారు. ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పై విడుదల అయిన తరువాత, ఆయన పాలకవర్గ సమావేశం నిర్వహించాల్సి ఉండటంతో, ఈ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇది పక్కన పెడితే, ఇప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి కోపం తెప్పించిది. ఎపిడమిక్ డిసీజ్ ఆక్ట్ నిబంధలకు విరుద్ధంగా, కర్ఫ్యూ నిబంధనలకు విరుద్దంగా ధూళిపాళ్ల నరేంద్ర ఈ సమావేశం ఏర్పాటు చేసారని, విజయవాడ పటమట ఎస్ఐ కిషోర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధూళిపాళ్ల నరేంద్ర పై కేసు నమోదు చేసారు. అలాగే పాలక వర్గం సమావేశం ఏర్పాటు చేసిన హోటల్ లో ఉన్న సిసిటీవీ ఫూటేజ్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ సెక్రటరీకి నోటీసులు ఇవ్వటంతో, విజయవాడ పటమట ఎస్ఐ దగ్గరకు విచారణ నిమిత్తం హాజరు అయ్యారు. అయితే మధ్యానం 12 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ సడలింపు ఉండటంతో, ఆయనను ఇంకా వదిలి పెట్టలేదని, ఇంకా ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటూ, సంగం డైరీ ప్రతినిధులు పోలీసులు తీరుని ప్రశ్నిస్తున్నారు.

dhulipalla 06062021 2

అయితే సంగం డైరీ పాలక వర్గం పై కేసు పెట్టటంతో, కంపెనీ ప్రతినిధులు స్పందించారు. సంగం డైరీ పాలక వర్గం మీటింగ్ లో, కేవలం 12 మంది డైరెక్టర్ లు మాత్రమే అదీ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించి పాల్గున్నారని, ఇందులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అవకాశమే లేదని, వాపోతున్నారు. పాలక వర్గంలో ఉన్నది కేలవం 12 మంది మత్రమే అని, ఆ 12 మందితో మాత్రమే సమావేశం నిర్వహించామని, పోలీసులు స్వాధీనం చేసుకున్న హోటల్ సిసిటీవీ ఫూటేజ్ లో కూడా ఇదే విషయం ఉంటుందని, కావాలి అంటే అది పోలీసులు చుసుకోవచ్చని అంటున్నారు. ఈ కేసుని కావాలనే తమ పై మోపారని, సంగం డైరీ అధికారులు చెప్తున్నారు. డైరీ పాలక వర్గం సమావేశం వెంటనే నిర్వహించాల్సి ఉండటం, డైరీకి సంబందించిన పాలనాపరమైన, అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండటంతో, ఈ సమావేశం నిర్వహించామని చెప్తున్నారు. అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా ఏమి చేయకుండా, ధూళిపాళ్ల నరేంద్ర ని మళ్ళీ టార్గెట్ చేయటం పై టిడిపి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే పనులు చాలా వరకు వివాదాస్పదం అవుతున్నాయి. ఎక్కువ సార్లు, అనాలోచితంగా చేస్తున్న పనులు, చివరకు ప్రభుత్వ మెడకు చుట్టుకుని, అభాసుపాలు అయ్యేలా చేస్తుంది. అయినా ప్రభుత్వ పెద్దలు మాత్రం, మారటం లేదు. మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తున్నారు. చాలా కేసుల్లో కోర్టుల వరకు వెళ్లి, కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు మొట్టికాయలు తింటున్నారు. అయినా ప్రభుత్వ పెద్దల్లో మార్పు లేదు. ఎక్కడ తప్పు జరుగుతుంది, మనం ఎక్కడ చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం, నిబంధనలు ప్రకారం నడుచుకోవటం లేదు, రాజ్యాంగానికి లోబడి మన నిర్ణయాలు ఉండటం లేదా, అనే వాటి పై దృష్టి పెట్టటం లేదు. ఎవరైనా విమర్శ చేస్తే చాలు, వారి పై ఎదురు దాడి అస్త్రాన్ని ఎంచుకుంటున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఈ రెండేళ్ళలో, ఇలా అనేక సంఘటనలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం చేసిన ఒక పని, విమర్శలకు తావు ఇచ్చింది. నిరంజన్ రెడ్డి అనే లాయర్ కు, ప్రభుత్వం రూ.96 లక్షలు ఫీజు కింద విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన రాజధానికి సంబంధించిన కేసుల్లో వాదించారని, అందుకని ఆ పేమెంట్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే అంత పెద్ద మొత్తంలో, ఒక లాయర్ కు డబ్బులు ఇవ్వటం పై, పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

hcc 06062021 2

ఒక ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఒక లాయర్ కు ఇవ్వటం, గతంలో ఎప్పుడూ లేకపోవటంతో, దీని పై లోతుగా విచారణ చేయగా, ఆ నిరంజన్ రెడ్డి అనే లాయర్, జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, జగన్ తరుపున వాదించే న్యాయవాది అని తేలింది. దీంతో ఇది క్విడ్ ప్రోకో అంటూ, విపక్షాలు విమర్శలు గుప్పించాయి. జగన్ మోహన్ రెడ్డి సొంత పనులు కోసం, ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇస్తున్నారు అంటూ విమర్శించారు. అయితే ఈ ఆరోపణలు నేపధ్యంలో, ఈ రోజు ఈ అంశం పై, మరో సంచలన విషయం బయట పడింది. అసలు ఈ నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి, రాజధాని కేసుల్లోనే ఎక్కడా పాల్గునలేదని, ఆయన ఎక్కడా వాదనలు వినిపించలేదు అంటూ, విజయవాడకు చెందిన లాయర్ సీహెచ్ విజయకుమార్ సంచలన ఆరోపణలు చేస్తూ, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఏపి రాజధాని కేసుల్లో అసలు నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి పల్గున లేదని, ప్రభుత్వం ఇచ్చిన జీవో చట్ట విరుద్ధమని, ఆ జీవోని సస్పెండ్ చేయాలని చెప్తూ పిటీషన్ దాఖలు చేసారు. దీంతో ఇప్పుడు హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.

ఎంపీ రఘురామకృష్ణం రాజు పై, ఏపి సిఐడి పోలీసులు జరిపిన దా-డి ఇప్పుడు, జాతీయ స్థాయిలో చర్చనీయంసం అయ్యింది. అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ చర్చ వ్యాపించింది. రఘురామకృష్ణం రాజు ఢిల్లీకి వచ్చిన తరువాత, తన సహచర ఎంపీలు, లోకసభ, రాజ్యసభ ఎంపీలు అందరికీ కూడా, తన పై జరిగిన ఘా-తు-కా-న్ని వివరిస్తూ, 20 పేజీల లేఖను అందరికీ అందిస్తం జరిగింది. ఆ లేఖలో, తన పై పోలీసులు ఏ విధంగా దా-డి చేసారు, ఏ విధంగా చిత్ర హింసలు పెట్టారు అనే అంశం, అందులో వివరిస్తూ, దానికి సంబంధించి, తన పాదలకు తగిలిన గా-యా-ల ఫోటోలు అన్నీ కూడా అందులో పొందుపరుస్తూ, లేఖలు ఇచ్చారు. ఆ లేఖ చూసి, ఫోటోలు చూసిన ఎంపీలు అందరూ కూడా, జరిగిన విషయం తెలుసుకుని విస్తుపోతున్నారు. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్యం పై దా-డి అని, ఇది పార్లమెంట్ పై జరిగిన దా-డి అంటూ, ఎంపీలు చాలా మంది స్పందిస్తున్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా దీని పై, చర్చించాల్సిన అవసరం ఉందని, దీని పై స్వల్పకాలిక చర్చ కూడా జరగాల్సిన అంశం ఉంది అంటూ, పలువురు ఎంపీలు స్పందిస్తున్నారు. రఘురామరాజు రాసిన లేఖకు పలువురు ఎంపీలు, పార్టీలకు అతీతంగా స్పందిస్తూ, ఏపి ప్రభుత్వం తీరుని ఎండగడుతున్నారు.

cid 06062021 2

ఈ రోజు ఇదే అంశం పై, కేరళ ఎంపీ ప్రేమ్ చంద్రన్ స్పందించారు. రఘురామకృష్ణం రాజు పై ఏపి సిఐడి అధికారులు వ్యవహరించిన తీరుని ఖండించారు. ఇది రఘురామరాజు మీద కాదని, ఇది పార్లమెంట్ పై జరిగిన దా-డి అని, ఇది ఆయనకు అవమానం కాదని, ఇది పార్లమెంట్ కే అవమానం అంటూ, కేరళ ఎంపీ ప్రేమ్ చంద్రన్ స్పందించారు. ఈ అంశం పై వచ్చే పార్లమెంట్ సెషన్ లో లేవనెత్తి, దీని పై తప్పకుండా చర్చిస్తామని తెలిపారు. ఇప్పటికే తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ ఈ విషయం పై మొదటిగా స్పందించారు. తరువాత కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ సుమలత కూడా ఈ అంశం పై తీవ్రంగా స్పందించారు. తరువాత శివసేన ఎంపీ ప్రియాంకా చేతుర్వేది కూడా, తీవ్ర పదజాలంతో, రఘురామకృష్ణం రాజు పై జరిగిన దా-డి ని తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు తాజాగా కేరళ ఎంపీ ప్రేమ్ చంద్రన్, కూడా తీవ్రంగా స్పందించారు. ఈయన ఏడు సార్లు ఎంపీగా చేసి, ప్రసుతం లోకసభలో డిప్యూటీ స్పీకర్ గా కూడా ఉన్నారు. మొత్తం మీద అందరూ ఈ పరిణామం పై తీవ్రంగా స్పందిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read