జగన్మోహన్ రెడ్డి రెండేళ్లపాలనలో రాష్ట్రం ఎంత నాశనం అవ్వాలో అంతకు మించే అయిందని, అవినీతి, దోపిడీ, నిరుద్యోగం వంటివి పెరిగిపోయాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆదివారం ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే. "రెండేళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏవిధంగా వి-ధ్వం-సం- చేశాడో ప్రతిఒక్కరూ ఆలోచించాలి. తన పాలనలో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏవిధంగా భ్రష్టు పట్టించాడో టీడీపీ విడుదలచేసిన బుక్ లెట్ లో వివరించాము. జగన్ రెండేళ్ల పాలనకు జేసీబీ- ఏసీబీ-పీసీబీ అని టీడీపీ నామకరణం చేసింది. ఎవరైనా మంచి కార్యంతో పని ప్రారంభిస్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేతతో తనపాలన ప్రారంభించాడు. రెండేళ్లక్రితం జూన్ 26 సాయంత్రం జేసీబీలతో ప్రజావేదికను కూల్చివేయించాడు. ఆనాటినుంచే ముఖ్యమంత్రి రాష్ట్ర వి-ధ్వం-సా-ని-కి శ్రీకారంచుట్టాడు. అది మొదలుప్రతి శుక్రవారం రాత్రి ప్రతిపక్షనేతల ఇళ్లు, వ్యాపార సంస్థలపైకి జేసీబీలను పంపిస్తూనే ఉన్నాడు. ఆస్తులు ధ్వం-సం చేయడమే పనిగా పెట్టుకున్నాడు కాబట్టే, జేసీబీ అన్నాం. ప్రశ్నించేవారిపై ఏసీబీతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడుకాబట్టి, ఏసీబీ అన్నాం. అవి రెండూ కుదరనప్పుడు కొత్తగా పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని) వాడుతున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి రెండేళ్లపాలను జేసీబీ- ఏసీబీ- పీసీబీ పాలన అంటున్నాం. ఏసీబీతో ఆగకుండా సీఐడీని కూడా జగన్ తన జేబు సంస్థగా మార్చుకున్నాడు. తాడేపల్లిప్యాలెస్ నుంచి సీఐడీకి ఆదేశాలు అందడమే ఆలస్యం...వెంటనే అరెస్టులు జరిగిపోతాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడినా సరే, వారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతారు. 94 శాతంహామీలను పరిష్కరించామని ముఖ్యమంత్రి, మంత్రులు డబ్బాలు కొట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా ఉన్నారని, అదిచూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఏదేదో మాట్లాడుతున్నాయని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అందుకే ప్రభుత్వం చెబుతున్న 94అంశాలకు సంబంధించి బాధ్యతగల ప్రధాన ప్రతిపక్షం ఒక ఛార్జ్ షీట్ విడుదల చేసింది. 94 విధ్వంసాలు చేసిన ముఖ్యమంత్రి, మిగిలిన ఆరింటిని పూర్తిచేసి, రాష్ట్రాన్ని విధ్వంసాలకు నిలయంగా మార్చడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజావేదికతో కూల్చివేతలు ప్రారంభించిన ముఖ్యమంత్రి, రెండేళ్లలో ఎన్ని అక్రమ కట్టడాలు కూల్చాడో, ఎవరివి కూల్చాడో సమాధానంచెప్పాలి.

చంద్రబాబునాయుడికి పేరొస్తుందన్న కుళ్లుతో, కక్షతో ఈ ముఖ్యమంత్రి అమరావతిని చం-పే-శా-డు. అమరావతి వి-ధ్వం-సం-తో, వి-ధ్వం-సా-లను పతాక స్థాయికి చేర్చాడు. రెండేళ్లయింది..ముఖ్యమంత్రి చెప్పిన మూడు రాజధానులు ఎక్కడ? రెండేళ్లయినా రాష్ట్ర రాజధాని ఏది అంటే ఎవరూ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అమరావతి పూర్తైతే రెండులక్షలకోట్ల ఆదాయంవచ్చేది. అప్పుడు ఈ ముఖ్యమంత్రికి అప్పులు చేయాల్సిన దుస్థితి తలెత్తేది కాదు. అమరావతి తర్వాత ఈ ముఖ్యమంత్రి పోలవరంపై పడ్డాడు. తన చేతగానితనం, అసమర్థతతో రూ.54వేలకోట్లకు ఆమోదిపంబడిన పోలవరం ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.22వేలకోట్లకు పరిమితం చేశాడు. రివర్స్ టెండరింగ్ పేరుతో మిగిల్చామంటూ సిగ్గు లేకుండా లేఖలు రాస్తున్నాడు. మిగిల్చామంటూనే పోలవరం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కు రూ.5వేలకోట్లు దోచిపెట్టింది నిజంకాదా? ప్రతిదానిలో రివర్స్ టెండరింగ్ పేరుతో, తన సొంత మనుషులకుదోచిపెట్టాడు. ఇదేనా ఈ ముఖ్యమంత్రి రెండేళ్లలో సాధించిన ఘనత? 2021 జూన్ నాటికి పోలవరం పూర్తిచేస్తామని జలవనరులమంత్రి అసెంబ్లీలో బల్లగుద్ది చెప్పాడు.పోలవరంపై ఈముఖ్యమంత్రి, మంత్రి ఇప్పడేం సమాధానం చెబుతారు? చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ఆదాయం వస్తుందని భావించి, భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పనిదొరుకుతుందని ఆలోచించి ఉచిత ఇసుక విధానం అమలుచేశారు. ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక రూ.5 నుంచి రూ.7వేలకు అమ్ముతున్నారు. ఇసుక దోపిడీని రెండేళ్ల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు వారికి కాదు.. అంతా తనకే చెందాలని భావించి, రాష్ట్రంలోని ఇసుకరీచ్ లన్నింటినీ ఒకే వ్యక్తికి అప్పగించాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నాడని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అదే మద్యాన్ని తనవ్యక్తిగత ఆదాయవనరుగా మార్చుకున్నది నిజంకాదా? ఇదేనా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మద్యపాన నిషేధం. మద్యంపై రూ.20వేలకోట్లవరకు ముఖ్యమంత్రి దోపిడీచేస్తున్నాడు.

ఇకఅప్పుల విషయానికొస్తే, ఈముఖ్యమంత్రి చేసిన అప్పులదెబ్బకు, ఎవ్వరైనా సరే నోరువెళ్లబెట్టాల్సిందే. అప్పులుచేయడం, ప్రభుత్వ ఆస్తులు అమ్మడం తప్ప ఈ ముఖ్యమంత్రికి సంపద సృష్టించి పేదలకు పంచడం తెలియ దు. అప్పులు తెచ్చి, భూములు అమ్మేసి పథకాలపేరుతో అరకొరా ప్రజలకు ఇచ్చి, మిగిలింది తనజేబులో వేసుకోవడా నికి ఈ ముఖ్యమంత్రేకావాలా? ఆపని ఎవరైనా చేస్తారు? రెండేళ్లలోనే రాష్ట్రంలోని ఒక్కోకుటుంబంపై రూ.2.50లక్షల అప్పువేశాడు ఈముఖ్యమంత్రి. అదీ ఈయన రెండేళ్ల తనపాలనలో సాధించినఘనత. రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ.84వేలకోట్లయితే, అప్పులేమో రూ.87వేలకోట్లు. వచ్చే ఆదాయం మొత్తం అప్పులకువడ్డీ కట్టడానికే సరిపోతుంది? ఇక అభివృద్ధికి నిధులెక్కడున్నాయి? ఈముఖ్యమంత్రి ఏ నిధులతో పోలవరం పూర్తిచేస్తాడు..ఏడబ్బుతో రోడ్లు వేస్తాడు ? జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో రాష్ట్రం మొత్తం ఆర్థికంగా పతనమైంది. బీసీలకు డమ్మీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి, ఆఖరికి వారి రిజర్వేషన్లను 24శాతం వరకు తగ్గించేశాడు. బీసీల రిజర్వేషన్లకు కోతపెట్టిందిచాలక, పనికిరాని కార్పొరేషన్ల తోతమకు ఏం ఒరగబెట్టావని బడుగు, బలహీనవర్గాలవారంతా ఈ ముఖ్యమంత్రిని కాలర్ పట్టుకొని నిలదీయాలి. ఇలాఅనేకవిధాలుగా, రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసగిస్తునేఉన్నాడు. వాటిని గమనించి ఎవరైనా మాట్లాడితే వారిపై తప్పుడుకేసులు పెట్టి, జైళ్లకు పంపించడమే పనిగాపెట్టుకున్నాడు. మేథావులు, ప్రజాస్వామ్యవాదుల మౌనం రాష్ట్రానికి చేటు చేస్తుంది. ప్రజలను మోసగిస్తూ, అబద్ధపు మాటలతో, మోసపు వాగ్ధానాలతో జనం నెత్తిన టోపీ పెట్టాలని చూస్తున్న ముఖ్యమంత్రి చర్యలపై పార్టీలు, కులాలు, వర్గాలకు అతీతంగా ప్రతిఒక్కరూ గళమెత్తాలని కోరుతున్నాం.

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స తీసుకుని, ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణా వచ్చి, తనను అరెస్ట్ చేయటం, అలాగే అరెస్ట్ సందర్భంలో నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించటం, తదితర పరిణామాల పై, రఘురామకృష్ణం రాజు, కేసిఆర్ కి, 8 పేజీల లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వచ్చి, ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేసే సమయంలో ఫాలో అవ్వాల్సిన మార్గదర్శకాలను, తెలంగాణా పోలీసులు పాటించలేదని తెలిపారు. ముఖ్యంగా గచ్చిబౌలి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ టార్గెట్ గా రఘురామకృష్ణం రాజు, ఈ లేఖలో అనేక అంశాలు కేసీఆర్ కు తెలిపారు. గచ్చిబౌలి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించారని, అతని పై రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా, గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు, ఆదేశాలతో పాటుగా, పోలీస్ మాన్యువల్‌ ని కూడా రఘురామరాజు జత పరిచారు. తన పై పెట్టిన కేసు గురించి వివరిస్తూ, ఏపి సిఐడి కేసు పెట్టిందని, సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్ ఈ కేసుని పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 14న హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న తన విల్లాకు ఒక బృందం ఏపి నుంచి వచ్చిందని చెప్పారు.

rrr kcr 30052021 2

ఏపి పోలీసులు తన ఇంటికి వచ్చిన సమయంలో, గచ్చిబౌలి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కూడా ఉన్నారని, ఆయన కనీస నిబంధనలు కూడా పాటించలేదని తెలిపారు. తాను ఒక ఎంపీని అని, పక్క రాష్ట్రం నుంచి పోలీసులు తనను అరెస్ట్ చేయటానికి వస్తే, కనీసం ఆ కేసుకు సంబందించిన ప్రాధమిక సమాచారం కూడా గచ్చిబౌలి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ చూడలేదని, కనీసం ట్రాన్సిట్‌ రిమాండ్‌ ఆర్డరు అడగలేదని, అసలు కేసు ఏంటో ఎఫ్ఐఆర్ ఏంటో కూడా చూడలేదని అన్నారు. నిబంధనలు ప్రకారం, తనకు ఇక్కడే వైద్య పరీక్షలు చేసి పంపించాల్సి ఉన్నా, అది కూడా పట్టించుకోలేదని గచ్చిబౌలి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ని తప్పుబట్టారు. తనని అరెస్ట్ చేస్తున్న సమయంలో కూడా, ఏపి పోలీసులు నేట్టేస్తుంటే, ఈయన చూస్తూ ఉన్నారు కాని, వారించలేదని అన్నారు. నిబంధనలు అనుసరించకుండా, ఇష్టం వచ్చినట్టు చేసిన, ఈ అరెస్ట్ లో ప్రమేయం ఉన్న, తెలంగణా పోలీసులు పై, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది ఈడీ. ఆయన పై, ఇపుడు మరో ఈడీ కేసులో విచారణ మొదలైంది. ఇప్పటికే జగన్ పైన 11 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులు విచారణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈడీ మరో చార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, గృహ నిర్మాణ శాఖలో జరిగిన అక్రమాల పై, గతంలోనే ఈడీ అభియోగాలు మోపి, చార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే అందులో తప్పులు ఉన్నాయని, ఈడీ కోర్టు దాన్ని తప్పి పంపించింది. ఆ చార్జ్ షీట్ ని మళ్ళీ సవరించిన ఈడీ, సరైన విధంగా చార్జ్ షీట్ దాఖలు చేసింది. మొన్న మార్చి నెలలో ఈడీ మళ్ళీ చార్జ్ షీట్ వేయగా, దాన్ని గత నెల 23న ఈడీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ చార్జ్ షీట్ లో హేమా హేమీలను, ఈడీ కోర్టు పేర్కొంది. అందులో జగన్ ఏ1 కాగా, మిగతా వారి పేర్లు ఇలా ఉన్నాయి. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, అలాగే వైసిపీ ఎమ్మెల్యే వీవీ కృష్ణప్రసాద్, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి సహా ఆనేక మందికి ఈడీ నిందితులుగా తమ చార్జ్ షీట్ లో పెట్టింది. ఇది ఇలా ఉంటే, ఇక్కడ ఒక అంశం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. జగన్ అన్ని కేసుల్లో, ఆయన ఏ1 గా ఉంటే, విజయసాయి రెడ్డి ఏ2 గా ఉంటూ వచ్చారు. అయితే ఈ కేసులో మాత్రం, అందుకు భిన్నంగా జరిగింది.

jagan 30052021 2

ఈ కేసు నుంచి, విజయసాయి రెడ్డిని ఈడీ తప్పించటం ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. అలాగే జగన్‌కు సంబంధించిన కార్మెల్ ఏషియా కంపెనీతో పాటుగా, ఐఏఎస్ అధికారి ఎస్.ఎన్.మహంతి పేరు కూడా ఇందులో పెట్టలేదు. ఈ కేసుకు సంబంధించి, సిబిఐ 14 మందిని నిందితులుగా పేర్కొంది. అయితే ఈడీ మాత్రం, కేవలం 11 మందిని మాత్రమే నిందితులుగా చేర్చింది. ఇందులో విజయసాయి రెడ్డి లేకపోవటం విశేషం. ఈ కేసుకు సంబంధించి, ఇప్పటికే కొన్ని ఆస్తులు ఆటాచ్ చేసారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన కంపెనీని, గృహనిర్మాణ శాఖకు సంబందించిన, కొన్ని భూములు, అతి తక్కువ ధరకే ఇచ్చారని, దానికి క్విడ్ ప్రోకో గా, జగన్ కంపెనీలలో ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి వాటాలు కొనుగోలు చేసారు అనేది ఆరోపణ. అయితే ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌ కలిపి, గచ్చిబౌలి ఉన్న ప్రాజెక్టులో నాలుగున్నర ఎకరాల వాటాను, ఇందు శ్యాంప్రసాద్ రెడ్డికి ఇచ్చినట్లు, సిబిఐ తాను తయారు చేసిన చార్జ్ షీట్ లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల్లో బెయిల్ రద్దు పిటీషన్ విచారణకు వస్తున్న తరుణంలో, ఇది ఆసక్తి రేపుతుంది.

ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఈ రోజు మరో బాంబు పేల్చారు. ఈ రోజు కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ని, రఘురామరాజు కలిసారు. ఈ సందర్భంగా పలు సంచలన ఆరోపణలు చేసారు. అంతే కాదు, దానికి సంబందించిన ఆధారాలు కూడా ఇచ్చారు. సుమారుగా 30 నిమిషాలు పాటు జరిగిన ఈ సమావేశంలో, ఆర్మీ హాస్పిటల్ పై రఘురామరాజు సంచలన ఆరోపణలు చేసారు. తన అరెస్ట్, తరువాత సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆర్మీ హాస్పిటల్ కు రావటం, ఆ తరువాత అక్కడ జరిగిన అంశాలను పూస గుచ్చినట్టుగా వివరించారు. మూడు పేజీల లేఖతో పాటు, ఆధారాలు కూడా రాజ్‌నాథ్‌సింగ్‌ కు ఇచ్చారు. ప్రధానంగా ఆర్మీ హాస్పిటల్ కు సంబందించిన రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసారు రఘురామరాజు. ప్రస్తుతం ఆర్మీ హాస్పిటల్ లో అసిస్టెంట్ కమాండ్ ర్యాంక్ లో రిజిస్ట్రార్ ఉన్న కేపీ రెడ్డి, తనను త్వరగా డిశ్చార్జ్ చేసి, మళ్ళీ ఏపి పోలీసులకు అప్పగించేందుకు ప్రయత్నం చేసారని అన్నారు. ప్రస్తుతం ఏపి ప్రభుత్వంలో డిప్యుటేషన్ పై పని చేస్తున్న టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి గతంలో డిఫెన్సు లో పని చేసేవారని, ఆ పరిచయాలతో, ఈయన కూడా ఈ కుట్రలో భాగం అయ్యారని, ఈయనతో పాటుగా, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం అయ్యారని ఆ లేఖలో తెలిపారు.

rrr 30052021 2

కేపీరెడ్డి, ధర్మారెడ్డి, అమ్మిరెడ్డి, ముగ్గురు కలిసి తన పై కుట్ర పన్నారని, తనను పోలీసులకు ఇచ్చేందుకు కేపీ రెడ్డి చేయని ప్రయత్నం లేదని అన్నారు. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి అని, ఆయన పై చర్యలు తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ని కోరారు. ఆర్మీ హాస్పిటల్ కు వచ్చిన తరువాత, వెంటనే ట్రీట్మెంట్ చేసి, తనను వెంటనే పోలీసులకు అప్పగించేలా కేపీ రెడ్డి డాక్టర్ల పై బలవంతం చేసారని అన్నారు. ఆ ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని అన్నారు. ధర్మారెడ్డి హైదరాబాద్ వచ్చి, కేపీ రెడ్డితో సమావేశం అయ్యారని, మెడికల్ రిపోర్ట్ లను తారుమారు చేసే ప్రయత్నం చేసినా, మెడికల్ బోర్డు ఒప్పుకోకుండా, సరైన రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు. ఆర్మీ హాస్పిటల్ లో కూడా ఏపి పోలీసులు మఫ్తీలో మకాం వేసారని, 15 మంది పోలీసులు ఇక్కడే ఉన్నారని, వారి భోజనాలు కూడా కేపీ రెడ్డి ఏర్పాట్లు చేసారని, వారి మెస్ బిల్లులు కూడా తన వద్ద ఉన్నాయని, ఆ బిల్లులు కూడా కేంద్ర మంత్రికి ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారం పై, విచారణ చేసి, అందరి పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisements

Latest Articles

Most Read