తిరుపతి రుయా హాస్పిటల్ లో, 15 రోజులు క్రితం జరిగిన దా-రు-ణ-మై-న సంఘటన అందరినీ కలిచి వేసిన సంగతి తెలిసిందే. చెన్నై నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ లేట్ గా రావటంతో, తిరుపతి రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ పై చికిత్స పొందుతున్న అనేక మంది రోగులు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. చివరకు ఆక్సిజన్ సరఫరాలో దాదాపుగా 40 నిమిషాల పాటు, అంతరాయం కలగటంతో, కొంత మంది రోగులు అక్కడికక్కడే చ-ని-పో-యా-రు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 11 మంది మాత్రమే చ-ని-పో-యా-ర-ని ప్రకటన చేసింది. అయితే ప్రత్యక్ష సాక్ష్యులు మాత్రం, 50 మందికి పైగానే చ-ని-పో-యి ఉంటారని చెప్పారు. దానికి తగ్గట్టుగానే అక్కడ ఉన్న ప్రతిపక్షాలు కూడా, పేర్లుతో సహా దాదాపుగా 53 మంది పేర్లు, ఆ రోజు చ-ని-పో-యిన వారి పేర్లు చెప్పాయి. ఈ వివాదం ఇలా కొనసాగుతూనే వచ్చింది. అయితే , ఇది ప్రభుత్వ తప్పిదం వల్ల జరిగిన ఘటన కావటంతో, ప్రభుత్వం వైపు నుంచి చ-ని-పో-యి-న వారికి పరిహారం ఇచ్చారు. ఈ పరిహారాన్ని ఇప్పటికే కొంత మందికి ఇచ్చారు. అయితే మొన్నటి వరకు కేవలం 11 మందే చ-ని-పో-యా-ర-ని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు ఈ జాబితాలో మళ్ళీ మరో 12 మందిని చేర్చింది. దీంతో, మొత్తం మృతులు సంఖ్య 23కి చేరుకుంది.

ruya 27052021 2

ఇది అధికారికంగా విడుదల చేసన లెక్క. దీని పై స్పందించిన రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి, ఘటన జరిగిన సమయంలో, అప్పట్లో కేవలం 11 మంది మాత్రమే చ-ని-పో-యా-ర-ని, అయితే తరువాత ఇదే కారణం చేత ఇబ్బంది పడిన మరో 12 మంది వరకు చ-ని-పో-యా-ర-ని, కలెక్టర్ ఆ జాబితా కూడా ఇవ్వమని కోరటంతో, తాము ఆ జాబితా కూడా పమించామని, మొత్తంగా చ-ని-పో-యి-న ఆరి సంఖ్య 23కు చేరుకుందని అన్నారు. అయితే ఇంకా కొంత మంది, తమ వారు కూడా అదే రోజు, ఇదే సమస్యతో పోయారని, మాకు కూడా పరిహారం అందించాలని, తమకు న్యాయం చేయాలని కన్నీటిపర్యంతం అయ్యారు. ఇక ప్రభుత్వం తాజాగా మృతులు సంఖ్య పెంచి చెప్పటంపై, ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. తాము మొదటి నుంచి, ఈ సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్తుంటే, తమ పై ఎదురు దాడి చేసారని, ఇప్పుడు ప్రకటించారని, తాము చెప్పిందే నిజం అయ్యిందని, ఇంకా ఈ సంఖ్య ఎక్కువ ఉంటుందని, అందరికీ న్యాయం చేయాలని, వారు కోరుతున్నారు.

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు, ఈ రోజు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో పరీక్షలు ముగిసాయి. పరీక్షలు అనంతరం, ఆయన ఢిల్లీలో ఉన్న తన అధికారిక నివాసానికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. అవసరం అయితే, రేపు కాని, ఎల్లుండి కాని, ఆయన మళ్ళీ పరీక్షలకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు. అయితే ఈ రోజు జరిగిన పరీక్షల్లో, ఎయిమ్స్ డాక్టర్లు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు. రఘురామరాజు పాదాలు, అరికాళ్ళు బాగా ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. అనుకున్నదాని కంటే, ఆయన పాదాలకు ఎక్కువగా డ్యామేజ్ అయినట్టు, ఆయనకు ఈ రోజు నిర్వహించిన పరీక్షల్లో తేలింది. గతంలో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్, అదే విధంగా సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో పరీక్షలు నిర్వహించినప్పిటికీ కూడా, ఆ రెండు హాస్పిటల్ లో జరిగిన పరీక్షలు కంటే, ఈ రోజు ఎయిమ్స్ లో జరిగిన పరీక్షల్లో మరింతగా ఆయన కాళ్ళ సెల్స్ డ్యామేజ్ అయినట్టు గుర్తించారు. అనేక ఆధునాతమైన పరికరాలతో, అడ్వాన్స్ పరికరాలతో, ఈ పరీక్షలు నిర్వహించారని తెలుస్తుంది. సిటీ స్కాన్, ఎమ్మారై స్కాన్ తోపాటుగా, ఇతర స్కానింగ్ లు, ఇతర పరీక్షలు కూడా నిర్వహించిన డాక్టర్లు, అరికాళ్ళు బాగా ఎక్కువగా డ్యామేజ్ అయినట్టు గుర్తించారు.

rrr 27052021 2

దీంతో రఘురామరాజు రెండు కాళ్ళకు, పివోపీ కట్టు కట్టారు. రఘురామరాజు, రెండు వారాల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని, ఆయన ఎక్కడికీ తిరగకూడదని, కాళ్ళు కింద పెట్టకూడదని, అని డాక్టర్లు సలహా ఇచ్చారు. అందుకే ఆయన నడవకుండా ఉండటానికి, పూర్తిగా రెస్ట్ అవసరం కాబట్టి, కాళ్ళకు కట్టు కట్టారు. అయితే ఆయనకు చేసిన వివిధ రకాల బ్లడ్ టెస్ట్ వివరాలు, మరో ఒకటి రెండు రోజుల్లో వస్తాయని, మరింతగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రెండు రోజుల క్రితం, రఘురామరాజు ఆర్మీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి, వెంటనే ప్రత్యెక విమానంలో, ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కు వెళ్ళిపోయారు. అక్కడ ఆయనకు వైద్యం చేసి, వివిధ రకాల పరీక్షలు చేసారు. మరో పక్క ఈ రోజు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్, రఘురామరాజుకు ఫోన్ చేసారు. ఘటన జరిగిన వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎయిమ్స్ వైద్యులకు కూడా అన్ని రకాల పరీక్షలు చేయాలని, సూచించారు.

ఓటుకు నోటు, ఓటుకు నోటు అంటూ చంద్రబాబు పై గత 5 ఏళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఒక పక్క లక్ష కోట్ల దొంగలు దర్జాగా తిరుగుతుంటే, 50 లక్షల ఆరోపణల పై చంద్రబాబు ఓటు కోసం నోటు ఇచ్చారు అంటూ ఆరోపణలు చేసారు. అసలు మనాకు ఓటుకు నోటు అంటే ఏంటో తెలియనట్టు, అసలు అవి ఎప్పుడూ చేయనట్టు, కొంత మంది బిల్డ్ అప్ ఇస్తూ వచ్చారు. అయినా అక్కడ చంద్రబాబు వాయిస్ నిజమో కాదో ఇప్పటికీ తెలియదు. ఒక వేళ నిజం అయినా, అక్కడ చంద్రబాబు డబ్బు ప్రస్తావన ఏమి చేయలేదు. అదీ కాక అక్కడ వేరే పార్టీ ఎమ్మెల్సీతో కాదు మాట్లాడింది. అక్కడ ఉన్నది గవర్నర్ కోటా ఎమ్మెల్సీ. ఎవరైనా వారితో మాట్లాడవచ్చు. మాకు ఓటు వేయమని అడగవచ్చు. అయితే ఇక్కడ చంద్రబాబు అసలు ఆ మాటలు అన్నారో లేదో పక్కద పెడితే, ఇదేదో పెద్ద నేరం అయినట్టు, ఇన్నాళ్ళు వైసీపీ ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు ఇలా ప్రచారం చేస్తున్న బ్లూ బ్యాచ్ కి షాక్ ఇచ్చింది ఈడీ, ఏసిబి. అసలు ఈ కేసులో చంద్రబాబు పాత్ర పై ఎక్కడా ఒక్క ముక్క కూడా రాయలేదు ఏసిబి. ఏసిబి చార్జ్ షీట్ లో చంద్రబాబు పేరు ఎక్కడ లేదు. ఈడీ కూడా ఈ రోజు ఛార్జ్ షీట్ వేసింది. అందులో కూడా ఎక్కడా చంద్రబాబు పేరు లేదు.

cbn 27052021 2

అయితే రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి పేర్లు తమ చార్జ్ షీట్ లో ఈడీ పెట్టింది. అయితే మనీ లాండరింగ్ విషయంలో, రేవంత్ రెడ్డికి ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అనే దాని పై, ఈడీ రేవంత్ రెడ్డిని చేర్చింది. ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి అనే విషయంలో రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేసారు. అయితే ఇక్కడ ఏసిబి, ఈడీ చార్జ్ షీట్ లు , రెండిటిలో ఎక్కడా చంద్రబాబు పేరు అయితే లేదు. ఆయన పై ఆధారాలు కోసం ఎంతగా ప్రయత్నం చేసినా, చంద్రబాబు పై ఎలాంటి ఆధారాలు దొరక్క పోవటంతో, చంద్రబాబు పై ఇన్నాళ్ళు విషం చిమ్మిన బ్లూ బ్యాచ్ కు నిరాస అనే చెప్పాలి. గత 40 ఏళ్ళుగా చంద్రబాబు పై దాదాపుగా 40 కేసులు పెట్టారు. రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పటి జగన్ మోహన్ రెడ్డి వరకు, అనేక మంది అయన పై ఎన్నో ఆరోపణలు, కేసులు పెట్టి ఇరికిద్దాం అని చూసినా, ప్రతి కేసులో కూడా ఆయన పై ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా ఎవరూ చూపించలేక పోయారు. దీంతో, అన్ని ఆరోపణలు లాగే ఇది కూడా కేవలం రాజకీయ ఆరోపణలు లాగే అయిపోయాయి.

ప్రసుత్తం రాష్ట్రంలో రాజకీయం కంటే, హాట్ టాపిక్ నెల్లూరు ఆ-నం-ద-య్య ఇస్తున్న క-రో-నా మం-దు. ఆయన ఇస్తున్న మం-దు-తో, క-రో-నా వచ్చిన వారికి నయం అవుతుందని, క్రిటికల్ కేసులు కూడా కోలుకుంటున్నారని, అలాగే క-రో-నా రాని వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో రాష్ట్రం నలు మూలల నుంచే కాక, పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అక్కడకు ఎగబడ్డారు. దీంతో ప్రభుత్వం దృష్టి ఆ మందు పై పడింది. అంత మంది అక్కడకు వస్తూ ఉండటంతో, ప్రభుత్వం రంగంలోకి దిగి, అసలు ఈ మం-దు ఏమిటి అంటూ తేల్చటం మొదలు పెట్టింది. ఈ మం-దు పై పరిశోధనలు జరిపి, దాని ఫలితాలు అనుకూలంగా వచ్చే దాకా, మం-దు ఇవ్వటం కుదరదు అంటూ ఆ-నం-ద-య్య పై ఆంక్షలు పెట్టారు. అంతే కాదు, ఆ-నం-ద-య్య-ను కొంత మంది వచ్చి తీసుకుని వెళ్లారని, ఆయన కొంత మంది అధీనంలో ఉన్నారని, కొంత మంది ప్రముఖులు ఆయన చేత మం-దు తయారు చేపించి, బయటకు పంపిస్తున్నారు అంటూ, రెండు రోజుల నుంచి ప్రచారం జరిగింది. అయితే మరో పక్క ప్రభుత్వం మాత్రం, దీని పై వివిధ రకాల పరిశోధనలు జరుపుతున్నాం అని చెప్తుంది. అయితే గత వారం రోజులుగా మం-దు ఆగిపోవటం, అనిశ్చితి నేలకోనటంతో, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రంగంలోకి దిగారు.

venkaiaha 27052021 2

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సొంత జిల్లా నెల్లూరు కావటంతో, ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆ-నం-ద-య్య మం-దు పై ప్రయోగాలు, పరిశోధనలు ఎంత వరకు వచ్చాయి, అసలు ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి, ఇంకా ఎన్ని రోజులు పరిశోధనలు జరుగుతాయి, వాటి ఫలితాలు ఎప్పుడు చెప్తారు, ఈ మం-దు పై ప్రభుత్వ పరంగా వచ్చిన నివేదిక ఏమిటి, డాక్టర్లు ఏమి అంటున్నారు, ఇలా తదితర అంశాల పై, ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆరా తీసారు. ఢిల్లీలోని కేంద్రమంత్రులతో ఆయన ఈ విషయం పై సమాచారం తెప్పించుకున్నూర్. ముఖ్యంగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజుని, ఈ పరిశోధనల పై సమాచారం అడిగి తెలుసుకున్నారు. అలాగే ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్‌తో కూడా ఈ మం-దు పై, దాని ప్రభావం పై ఆరా తీసారు. అయితే జరుగుతున్న పరిశోధనల పై చెప్పగా, ఈ పరిశోధనలు తొందరగా ముగించి, తగు నివేదికలు తొందరగా ఇవ్వాలని కోరారు. ఇక మరో పక్క, ఈ రోజు ఉదయం హైకోర్టులో కూడా ఈ విషయం పై విచారణ జరగగా, హైకోర్టు కూడా ఇదే విషయం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read