ఈ రోజు హైదరాబాద్ సిబిఐ ప్రత్యెక కోర్టులో, రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన, జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ జరిగింది. అయితే కోర్టు ఆదేశాలు ప్రకారం, ఈ రోజు సిబిఐతో పాటుగా, జగన్ మోహన్ రెడ్డి, ఈ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఈ రోజు కూడా వాళ్ళు కౌంటర్ దాఖలు చేయలేదు. గత మూడు విచారణల్లో కూడా, సిబిఐ కానీ, జగన్ మోహన్ రెడ్డి కానీ, కౌంటర్ దాఖలు చేయకుండా, సమయం అడిగారు. అయితే ఈ రోజు కూడా సమయం కావాలి అంటూ, అదే సమాధానం కోర్టుకి చెప్పారు. అయితే కౌంటర్ దాఖలకు మరింత సమయం కావాలని కోర్టుని కోరటంతో, కోర్టు కొంత అసహనం వ్యక్తం చేసింది. గతంలోనే మీకు మూడు సార్లు సమయం ఇచ్చామని, అయినా ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయలేదని, ఇలా కౌంటర్ దాఖలకు సమయం తీసుకున్నట్టు అయితే, ఈ సారి కూడా మీరు కౌంటర్ దాఖలు చేయకపోతే, మీ కౌంటర్ లేకుండా, ఈ కేసులో విచారణ చేపడతాం అంటూ, కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే తాము కౌంటర్ దాఖలు చేయకపోవటానికి గల కారణాలను, సిబిఐ కోర్టుకు తెలియచేసారు, జగన్ తరుపు న్యాయవాది. ముఖ్యంగా తాము కౌంటర్ దాఖలు చేయలేక పోవటానికి కారణం, లాక్ డౌన్ అని చెప్పారు.

cbi 26052021 2

జగన్ మోహన్ రెడ్డి తరుపు న్యాయవాది, లాక్ డౌన్ కారణంగా, పలు కారణాల కారణంగా, కౌంటర్ దాఖలు చేయలేక పోయాం అని, తమకు మరి కొంత సమయం ఇస్తే, కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. అయితే సిబిఐ తరుపు మాత్రం, కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు అని కోరగా, సిబిఐ అధికారుల నుంచి తమకు మరింత సమాచారం రావాల్సి ఉందని, ఆ సమాచారం వచ్చిన వెంటనే కౌంటర్ దాఖలు చేస్తామని, తమకు కొంత సమయం కావాలని సిబిఐ తరుపు న్యాయవాది కూడా కోర్ట్ ని కోరారు. ఇరు వైపుల వాదనలు విన్న కోర్ట్, చిట్టచివరి అవకాశంగా మీకు చెప్తున్నాం అని, జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే, తాము ఇక విచారణ మొదలు పెడతామని చెప్పారు. అయితే జగన్ తరుపు న్యాయవాదులు సంగతి పక్కన పెడితే, అసలు సిబిఐ ఎందుకు లేట్ చేస్తుందో అని విషయం పై, రఘురామరాజు తరుపు వ్యక్తులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు అవకాసం ఇచ్చారని, సిబిఐ కూడా ఎందుకు ఇలా తాత్సారం చేస్తుందో అర్ధం కావటం లేదని అంటున్నారు. మరి జూన్ 1కి అయినా కౌంటర్ దాఖలు చేస్తారో లేదో చూడాల్సి ఉంది.

సిబిఐ చీఫ్ ఎంపికలో చివరి నిమిషంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. జస్టిస్ ఎన్వీ రమణ లేవనెత్తిన పాయింట్ తో, కేంద్రం వెనకడుగు వేయాల్సి వచ్చింది. మొత్తంగా, ఈ పరిణామంతో సీబీఐ చీఫ్‍గా సుబోధ్ కుమార్ జైస్వాల్ ను నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఢిల్లీలో టాక్ నడుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు కానీ, రేపు కానీ వచ్చే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. మహరాష్ట్ర మాజీ డీజీపీగా పని చేసిన సుబోధ్ కుమార్ జైస్వాల్ , తదుపరి సిబిఐ చీఫ్ గా నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో, హైపవర్ సెలక్షన్ ప్యానెల్ సమావేశం జరిగింది. సుమారుగా 90 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రధాని మోడీ, అలాగే ప్రతిపక్ష నేత ఈ సమావేశంలో పాల్గున్నారు. ఈ ముగ్గురూ పాల్గున్న ఈ సమావేశంలో దాదాపుగా మూడు పేర్లు ఈ సమావేశంలో ఖరారు చేసారు. అందులో నుంచి ఒక్కరికి అవకాసం లభించనుంది. మహారాష్ట్ర మాజీ డీజీపీ సుబోధ్ కుమార్ జైశ్వాల్, రెండో పేరుగా డైరెక్టర్ జనరల్ సీమా బల్ కేఆర్ చంద్ర, అలాగే మూడు పేరుగా కేంద్ర హోం శాఖ స్పెషల్ సెక్రటరీ వీఎస్కే కౌముదిని ప్రతిపాదించారు.

ramana 25052021 2

అయితే మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్ర మాజీ డీజీపీ సుబోధ్ కుమార్ జైశ్వాల్ వైపే ప్రధాని మోడీ మొగ్గు చూపే అవకాసం కనిపిస్తుంది. మొత్తంగా తదుపరి సిబిఐచీఫ్ కోసం,109 మంది అధికారుల పేర్లు పరిశీలించారు. వీరిని వడపోయిగా, మొత్తం 10 మంది సెలెక్ట్ అయ్యారు. ఆ తరువాత నిన్న సమావేశం మొదలు అయ్యే సమయానికి, ఆరుగురుకి కుదించారు. అయితే ఈ ఆరుగురిలో, బీఎస్ఎప్ చీఫ్ రాకేశ్ ఆస్థానా, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ చీఫ్ గా ఉన్న వైసీ మోదీ పేర్లు కూడా పరిశీలినలో ఉన్నాయి. వీరిలో రాకేశ్ అస్తానా వైపు ప్రధాని మోడీ మొగ్గు చూపుతారని అందరూ అనుకున్నారు. అయితే ఈ సమావేశంలో పాల్గున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పుని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ముందు పెట్టారు. ఆరు నెలల లోపు రిటైర్డ్ అయ్యే వారిని, సిఐడి చీఫ్ గా నియమించవద్దు అంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుని ఆ సమావేశం ముందు పెట్టారు. దీంతో, రాకేశ్ ఆస్థానా, వైసీ మోదీ పేర్లను, కేంద్రం పక్కన పెట్టాల్సి వచ్చింది.

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో వైద్యం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన కాళ్ళకు అయిన గా-యా-లు, అయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడక పోవటంతో, అయన ఇంకా ఆర్మీ హాస్పిటల్ లోనే ఉన్నారు. ఆర్మీ హాస్పిటల్ డిశ్చార్జ్ రిపోర్ట్ ఇస్తే కాని, బెయిల్ ఇవ్వటం కుదరదు అంటూ సిఐడి కోర్టు చెప్పటంతో, ఆయన ఇంకా విడుదల కాలేదు. అయితే ఈ పరిస్థితిలో ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఆర్మీ ఆస్పత్రి కమాండర్‌కు ఈ రోజు ఒక లేఖ రాసారు. తనకు వైద్యం జరుగుతున్న తీరు, ఆరోగ్య పరిస్థితిని ఆ లేఖలో వివరించారు. తనకు కాలి నొప్పి ఇంకా తగ్గలేదని ఆ లేఖలో తెలిపారు. ఇప్పటికే అనేక పెయిన్ కిల్లర్స్, యాంటీ బయోటెక్స్ వాడుతున్నా కూడా, ఇంకా కాలు నొప్పి అలాగే ఉందని అన్నారు. అలాగే తన బీపీలో కూడా హెచ్చుతగ్గులు గమనించామని అన్నారు. నోరు కూడా తరుచూ పొడారిపోతుందని, తన ఆరోగ్య పరిస్థితి పై ఆ లేఖలో వివరించారు. తనకు అంతా సెట్ అయ్యి, ఆరోగ్యం మెరుగు పడే దాకా, ఇక్కడే ఆర్మీ హాస్పిటల్ లోనే వైద్యం అందించాలని, ఆయన కోరారు. ఒక వేళ మీరు నన్ను డిశ్చార్జ్ చేయాలి అనుకుంటే కనుక, తన డిశ్చార్జ్ సమ్మరీలో మొత్తం వివరాలు అన్నీ, తన ఆరోగ్య పరిస్థితి పై, స్పష్టంగా తెలపాలని కోరారు.

rrr r 24052021 2

ఇలా తన ఆరోగ్య పరిస్థితి గురించి మొత్తం వివరాలతో లేఖలో ప్రస్తావించారు రఘురామరాజు. అయితే ఇదే సందర్భంలో రఘురామరాజు మరో ఆసక్తికర విషయం కూడా తన లేఖలో ప్రస్తావిస్తూ, ఆర్మీ హాస్పిటల్ కమాండర్‌ దృష్టికి తీసుకుని వెళ్లారు. సుప్రీం కోర్టు ఇప్పటికే తనను పూర్తిగా ఆర్మీ హాస్పిటల్ లో ఆధీనంలో ఉండమని చెప్పి, సిఐడి అధికారులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిందని, అయితే సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొంత మంది పోలీసులు, ఆర్మీ హాస్పిటల్ వద్దే ఉన్నట్టు, తనకు సమాచారం ఉంది అంటూ, రఘురామ కృష్ణం రాజు, సంచలన ఆరోపణలు చేసారు. రఘురామరాజు రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆయన ఆరోగ్యం పై, ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ? ఎందుకు డిశ్చార్జ్ సమ్మరీలో మొత్తం వివరాలు రాయమని అడిగారు ? అలాగే ఏపి పోలీసులకు ఇక్కడ ఉన్నది నిజమేనా ?

తన తండ్రి అక్రమ అరెస్ట్, అదే విధంగా సిఐడి కస్టడీలో తన తండ్రి పై సిఐడి పోలీసులు కొ-ట్ట-టం, ఈ మొత్తం వ్యవహారం పై, ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలి అంటూ, ఎంపీ రఘురామకృష్ణం రాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటీషన్ పై , ఈ రోజు కొద్ది సేపటి క్రితం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. న్యాయమూర్తి వినీతి శరన్ బెంచ్ ముందుకు ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. అయితే విచారణ అంత తొందరగా ఇప్పటికిప్పుడు జరపవలసిన అవసరం లేదని, ముందుగా ఈ పిటీషన్ లో ని ప్రతివాదుల వివరణ కూడా తీసుకుంటామని సుప్రీం కోర్టు తెలిపింది. ప్రస్తుతం ఇది వెకేషన్ బెంచ్ కాబట్టి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి, రెగ్యులర్ బెంచ్ వచ్చినప్పుడు దీని పై విచారణ జరుపుతామని, న్యాయమూర్తి వినీత్ శరన్ స్పష్టం చేసారు. అయితే సరిగ్గా ఇక్కడే రఘురామకృష్ణం రాజు తరుపు న్యాయవాది వేసిన పాచిక అద్భుతంగా పని చేసింది. రఘురామకృష్ణం రాజు తనయుడు భరత్ తరుపున హాజరు అయిన న్యాయవాది ముకుల్ జోక్యం చేసుకుని, మీరు ఎప్పుడు విచారణ చేసినా తమకు అభ్యంతరం లేదని, కాకపోతే తొందరగా వింటే బాగుటుందని అభ్యర్ధిస్తూ, మరో విజ్ఞప్తి కూడా చేసారు. ప్రస్తుతం ఉన్న ప్రతివాదుల నుంచి జగన్ మోహన్ రెడ్డి, ఏపి ప్రభుత్వం, సిఐడి అధికారులను తొలగించాలని కోరారు.

sc 25052021 2

కేవలం యూనియన్ అఫ్ ఇండియా, సిబిఐ ని మాత్రమే పార్టీ చేయాలని అభ్యర్ధించారు. దానికి, సుప్రీం కోర్టు అంగీకరించింది. కేవలం కేంద్ర ప్రభుత్వం, సిబిఐకి మాత్రమే నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా, కేంద్ర ప్రభుత్వం, సిబిఐ ఈ పిటీషన్ పై తమ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుందని, ఆరు వారాల తరువాత దీని పై విచారణ జరుపుతాం అంటూ, ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరుపున హాజరు అయిన, న్యాయవాది దవే, తమ ప్రభుత్వ వాదనలు వినకుండా, కేవలం కేంద్ర ప్రభుత్వం, సిబిఐ వాదనలు విని, చివరకు సిబిఐకి అప్పచేప్పితే, తమ వాదన వినే వారు ఎవరు, ఎందుకు తమ వాదన వినరు అని అభ్యంతరం వ్యక్తం చేసారు. అయితే కోర్టు స్పందిస్తూ, మీరు ఇంప్లీడ్ అవ్వండి, దాన్ని పరిశీలిస్తాం కానీ, మిమ్మల్ని ప్రతి వాదులుగా చేర్చం అంటూ, తేల్చి చెప్పారు. అయితే రఘురామ రాజు న్యాయవాదులు చేసిన పనితో, ఇప్పుడు కేవలం కేంద్రం, సిబిఐ మాత్రమే జరిగిన దాన్ని కోర్టుకు చెప్పి, తమ అభిప్రాయం చెప్తాయని, సిబిఐ విచారణకు కేంద్రం కూడా అభ్యంతరం చెప్పే అవకాశాలు ఉండవని విశ్లేషకులు అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read