ఈ రోజు హైదరాబాద్ సిబిఐ ప్రత్యెక కోర్టులో, రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన, జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ జరిగింది. అయితే కోర్టు ఆదేశాలు ప్రకారం, ఈ రోజు సిబిఐతో పాటుగా, జగన్ మోహన్ రెడ్డి, ఈ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఈ రోజు కూడా వాళ్ళు కౌంటర్ దాఖలు చేయలేదు. గత మూడు విచారణల్లో కూడా, సిబిఐ కానీ, జగన్ మోహన్ రెడ్డి కానీ, కౌంటర్ దాఖలు చేయకుండా, సమయం అడిగారు. అయితే ఈ రోజు కూడా సమయం కావాలి అంటూ, అదే సమాధానం కోర్టుకి చెప్పారు. అయితే కౌంటర్ దాఖలకు మరింత సమయం కావాలని కోర్టుని కోరటంతో, కోర్టు కొంత అసహనం వ్యక్తం చేసింది. గతంలోనే మీకు మూడు సార్లు సమయం ఇచ్చామని, అయినా ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయలేదని, ఇలా కౌంటర్ దాఖలకు సమయం తీసుకున్నట్టు అయితే, ఈ సారి కూడా మీరు కౌంటర్ దాఖలు చేయకపోతే, మీ కౌంటర్ లేకుండా, ఈ కేసులో విచారణ చేపడతాం అంటూ, కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే తాము కౌంటర్ దాఖలు చేయకపోవటానికి గల కారణాలను, సిబిఐ కోర్టుకు తెలియచేసారు, జగన్ తరుపు న్యాయవాది. ముఖ్యంగా తాము కౌంటర్ దాఖలు చేయలేక పోవటానికి కారణం, లాక్ డౌన్ అని చెప్పారు.
జగన్ మోహన్ రెడ్డి తరుపు న్యాయవాది, లాక్ డౌన్ కారణంగా, పలు కారణాల కారణంగా, కౌంటర్ దాఖలు చేయలేక పోయాం అని, తమకు మరి కొంత సమయం ఇస్తే, కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. అయితే సిబిఐ తరుపు మాత్రం, కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు అని కోరగా, సిబిఐ అధికారుల నుంచి తమకు మరింత సమాచారం రావాల్సి ఉందని, ఆ సమాచారం వచ్చిన వెంటనే కౌంటర్ దాఖలు చేస్తామని, తమకు కొంత సమయం కావాలని సిబిఐ తరుపు న్యాయవాది కూడా కోర్ట్ ని కోరారు. ఇరు వైపుల వాదనలు విన్న కోర్ట్, చిట్టచివరి అవకాశంగా మీకు చెప్తున్నాం అని, జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే, తాము ఇక విచారణ మొదలు పెడతామని చెప్పారు. అయితే జగన్ తరుపు న్యాయవాదులు సంగతి పక్కన పెడితే, అసలు సిబిఐ ఎందుకు లేట్ చేస్తుందో అని విషయం పై, రఘురామరాజు తరుపు వ్యక్తులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు అవకాసం ఇచ్చారని, సిబిఐ కూడా ఎందుకు ఇలా తాత్సారం చేస్తుందో అర్ధం కావటం లేదని అంటున్నారు. మరి జూన్ 1కి అయినా కౌంటర్ దాఖలు చేస్తారో లేదో చూడాల్సి ఉంది.