రాష్ట్రంలో ప్రజాస్వామ్య వలువలు ఊడ్చబడ్డాయని, తిరుపతి ఉపఎన్నిక చూస్తే, తానెందుకు అలా అనాల్సివచ్చిందో ప్రజలకు అర్థమవుతోందని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అతిదారుణంగా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.."తిరుపతి ఉపఎన్నిక ఏ రకంగా జరుగుతుందో రాష్ట్రప్రజలంతా వారి పనులు ఆపిమరీ గమనించాలి. దానివల్ల ప్రభుత్వతీరు, ప్రభుత్వపెద్దల పనితీరు, ఈ ప్రభుత్వం ఏరకంగా అధికారంలోకి వచ్చిందో తెలుస్తుందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తు న్నా. వంటచేసే మహిళలు, కార్ఖానాలో పనిచేసే కార్మికులు, పొలాల్లో ఉండే రైతులు, కూలీలు అందరూ వారి పనులు పక్కనెట్టి, కాసేపు టీవీలు చూడాలి. తిరుపతి ఉపఎన్నిక ఎలా జరుగుతుందో అందరూ తెలుసుకోవాలి. ఉప ఎన్నిక పరిశీలకులుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులున్నారు.... ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఎన్నికల పరిశీలకులుగా ఉన్నా రు.. సెక్రటేరియట్ లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) ఉన్నారు. ఢిల్లీలో ఎన్నిక ల సంఘం ఉంది. ఇన్ని ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దౌర్జన్యం యధాస్థితిలో సాగిపోతోంది. పెద్దిరెడ్డి దౌర్జన్యాలను ఆపే దిక్కులేదు ఈ రాష్ట్రంలో. పీలేరు నుంచి బస్సులో జనాలను తీసుకొస్తే, అక్కడున్న స్థానికులు వారిని ఆపి, ఎక్కడివారు ఎందుకొచ్చారని నిలదీశారు. స్థానికులతో పాటు, హోంగార్డు కూడా ఉన్నాడు. వారంతా బస్సు ఆపి, ఎక్కడి నుంచి వస్తున్నారని నిలదీయడంతో బస్సులోని వారంతా దిగి పరిగెత్తారు. బస్సు డ్రైవర్ బస్సు ఆగిపోయిందని, దొంగ ఓట్లు వేయడానికి వచ్చామని చెప్పి, కనుక్కొని బస్సును ఆపారని, బస్సులోని వారంతా పారిపోయారని, అతను బస్సు ఓనర్ కి ఫోన్ చేసి చెప్పాడు. ఆ బస్సు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం నుంచే వచ్చింది. ఆ బస్సుడ్రైవర్ పెద్దిరెడ్డికి తెలుసు. బస్సులో వచ్చినవారంతా హోంగార్డుని, స్థానికులనుచూసి ఎందుకు పారిపోయారు? బస్సుని వారు ఆపకపోతే, అందులో వచ్చినవారంతా దొంగఓట్లు వేసేవారు కదా పెద్దిరెడ్డిగారు? ప్రజాస్వామ్యానికి ఏంఖర్మ పట్టింది పెద్దిరెడ్డి మంత్రిత్వంలో, ఆయనొక మంత్రా... జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రా? మీదొక ప్రభుత్వమా?

బీజేపీ మహిళానేత శాంతారెడ్డి కొందరు దొంగఓటర్లనుపట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం నైతిక విలువలున్నా, ఒక్కక్షణం ఆయన తాడేపల్లి నివాసం నుంచి శాంతారెడ్డి వైపుచూడాలి. ఆమెమాటలకు ఆయన సమాధానం చెప్పాలి. ఆమె మాటలు వింటానికి ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధమేనా? ఆ మాటలు వింటే పెద్దిరెడ్డి బతుకు ఇక అంతే... నానోటితో నేను చెప్పలేను. శాంతారెడ్డి మాటలకు ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి సిగ్గేయడంలేదా? ఈ ప్రభుత్వం గాజులేసుకుందని ఆమె అంటుంటే వారికి సిగ్గుగా లేదా? ఈరకంగా దొడ్డిదారిన, దొంగదారిన, గెలిచే గెలుపు కూడా ఒక గెలుపేనా? జగన్మోహన్ రెడ్డి విజయాలన్నీ ఇదే విధంగా వచ్చాయా? లక్షలకు లక్షల మెజారిటీలన్నీ ఇలానే సాధించారా? జగన్మోహన్ రెడ్డి విజయాలన్నీ ఇలా దొంగ గెలుపులేనా? ప్రజలు మెచ్చి, వారికి నచ్చి గెలిపించారని అనుకుంటున్నాం. దొంగఓట్లు వేయించడంలో మీరంతా ఇంతటి దిట్టలని ఇప్పుడే తెలిసింది. ఈ రకంగా ఒకరిపేరుతో మరొకరు దొంగఓట్లు వేయడమే పెద్దనేరం, సిగ్గుచేటు. అలా వచ్చినవారికి బుద్ధిలేదు. పంపినవెధవకు సిగ్గులేదు. ఎంతో పకడ్బందీగా, నిష్ణా తులైన వారిలా దొంగఓటర్లు వ్యవహరించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరుగుతాయి అంటే ఈ రకంగా జరుగుతాయని దేశమంతా తెలియచేస్తాం. ఇంతటితో వదిలేదులేదు. మీకు వచ్చిన మెజారిటీ అంతా ఈ విధంగా దొంగఓటర్లతో వచ్చిందే. 151సీట్లు కూడా ఇలానే వచ్చాయా? ఇటువంటి నైపుణ్యం ఎక్కడనేర్చుకున్నారో చెప్పండి. ఇదివరకు స్టూవర్ట్ పురం దొంగలబ్యాచ్ పేరుచెబితే, పోలీస్ స్టేషన్లలోని సెల్ ల తాళాలు ఊడిపోయేవి. ఇప్పుడు ఈ పార్టీ పేరుచెబితే నకిలీఓట్లు కుప్పలుకుప్పులుగా పడిపోతున్నా యి. మీ గెలుపులన్నీ ఇలా తప్పుడుదారిలో సాధించినవేనా జగన్మోహన్ రెడ్డి గారు? కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి, తిరుపతి ఉపఎన్నికను రద్దుచేయాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు అనేవి ఎలా జరుగుతున్నాయో, ప్రజాస్వామ్యం ఎలా అపాహస్యం అవుతుందో, మొన్న స్థానిక సంస్థల ఎన్నికల నుంచి చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే, లోకల్ లీడర్స్ హవా ఉంటుంది కాబట్టి, అలా గుద్దుకున్నారు అనుకున్న, చివరకు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే ఫార్ములా ఉపయోగించారు. ఉదయం నుంచి టీవీల్లో, సోషల్ మీడియాలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో జరుగుతున్న అరాచకాలు, ఏ రకంగా జరుగుతున్నాయో చూసాం. అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. టిడిపి నేతలు ఫిర్యాదులు కూడా చేసారు. ఎట్టకేలక ఈ విషయం పై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాష్ట్రంలో ఉండే చీఫ్ ఎలేక్టరియల్ ఆఫీసర్ స్పందించారు. దొంగ ఓట్లు వేసే వారిని అరెస్ట్ చేయాలని, వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని, చిత్తూరు, నెల్లూరు కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు జారీ చేసారు. ఎలాంటి అక్రమాలు జరగకుండా, పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ ఆదేశించారు. అయితే మరి ఇవి ఎంత వరకు గ్రౌండ్ లో అమల్లోకి వస్తాయో చూడాలి..

తిరుపతిలో దొంగలు పడ్డారు. ఓట్ల దొంగలు పడి, దొంగ ఓట్లతో అరాచకం చేస్తున్నారు. ఈ అరాచకం ఎంత వరుకు వెళ్ళింది అంటే, ఏకంగా లోపల పోలింగ్ బూత్ లో కూర్చుకున్న అజేంట్ ఓటు వేయటానికి, దొంగ ఓటర్ వచ్చి దొరికిపోయిన ఘటన ఇది. ఇది తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటింగ్ సందర్భంగా, ఒక బీజేపీ అజేంట్ కు ఎదురైన అనుభవం ఇది. తన ఓటే దొంగ ఓటు వేయటానికి వచ్చిన దొంగ ఓటర్ ను చూసి, అవాక్కయ్యాడు ఆ బీజేపీ అజేంట్. ఆయన మాటల్లో అసలు ఏమి జరిగిందో చూడండి ?"నేను తిరుపతి 152 ఏ పోలింగ్ బూత్ లో , నేను ఓటర్ గా ఉన్నాను. అదే విధంగా బీజేపీ అజేంట్ గా ఈ బూత్ కి నేను ఉన్నాను. ఇక్కడ నా ఓటే, సేం ఇటువంటి కార్డు తీసుకుని ఒక వ్యక్తి, దొంగ ఓటు వేసే దానికి వచ్చాడు. అతన్ని మేము పట్టుకుని, పోలీసులకు అప్పచేప్పాం. పోలీసులు అతన్ని ఏమి చేసాడు అనే విషయం ఇంత వరకు తెలియదు. దయచేసి, ఈ విషయన్ని ఎన్నికల కమిషన్ దృష్టిలోకి తీసుకుని, దీని పై ఆక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం" అని అన్నారు.

తిరుపతిలో అరాచకం తారా స్థాయిలో ఉంది. ఎక్కడ చూసినా దొంగ ఓటర్లు ఇష్టం వచ్చినట్టు స్వైరవిహారం చేస్తున్నారు. తమ ఓటు ముందే పోల్ అయిపోయిందని స్థానికులు ఆందోళన చేస్తున్నా సమాధానం చెప్పే వారు లేరు. పోలీసులు, అధికారులు చేతులు ఎత్తేసారు. ఇక తిరుపతి టిడిపి పార్లమెంట్ అభ్యర్ధి పనబాక లక్ష్మీ స్వయంగా రంగంలోకి దిగారు. దొంగ ఓట్ల పై, స్వయంగా రాతపూర్వకంగా, అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగటం లేదని ఫిర్యాదులో తెలిపారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న తమకు, ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని, ఇంత అడ్డ దిడ్డంగా ఎన్నికల నిర్వహణ ఎప్పుడు చూడలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే భయంతోనే, ఇలా రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని వాపోయారు. చిత్తూరు జిల్లా నాలుగు వైపుల నుంచి, పెద్దిరెడ్డి దొంగల ముఠాని దింపి దొంగ ఓట్లు వేయిస్తున్నారని వాపోయారు. నకిలీ ఓటర్ కార్డులు ముద్రిస్తుంటే, పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించటం లేదని, ఎలక్షన్ కమిషన్ కు ఫోన్ చేసిన ఉపయోగం లేకుండా పోయిందని వాపోయారు.

Advertisements

Latest Articles

Most Read