తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో భాగంగా ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో దొంగ ఓట్ల కలకలంతో అధికార పార్టీ నేతల తీరుపై ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, నిరసనలకు దిగాయి. తిరుపతిలోని అన్ని పోలింగ్ బూత్ లలో దొంగ ఓట్లు పోలయ్యాయంటూ టిడిపి, బిజెపి పార్టీల అభ్యర్థులు నిరసనలకు దిగారు. పోలీస్ స్టేషన్ ముందు అధికార పార్టీ తీరు, పోలీసుల వ్యవహార శైలిపై నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి తిరుపతిలో జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. దొంగ ఓటర్లను అడ్డుకున్నందుకు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌ వర్మను అరెస్టు చేసి ఎమ్మారపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అలాగే టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహయాదవ్ మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పిఎఆర్ కన్వెన్షన్ హాలులో దొంగ ఓట్లు వేసేందుకు బస్సులు, ఇతరవాహనాల్లో తరలి వచ్చారని, అక్కడికెళ్లి వారిని కట్టడి చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆయన్ను అదుపులోకి తీసుకుని తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు తరలించా రు. దొంగ ఓట్లు భారీగా పోలవడంతో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారంటూ వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు గాంధీ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా పోలీసులు గానీ, పోలింగ్ విధుల్లో ఉన్న ఇతర అధికారులు, సిబ్బంది పూర్తిగా చేతులెత్తేశారు.

chevireddy 19042021 2

ప్రతిపక్ష టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తిరుపతిలో రీపోలింగ్ నిర్వహించాలని, దొంగ ఓటర్లను తరలించిన వైసిపి నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని చంద్రబాబు ప్రకటనలో కోరారు. అధికార పార్టీకి చెందిన నాయకులు మదనపల్లి, చిత్తూరు, పుంగనూరు, పీలేరు, పూతలపట్టు నియోజకవర్గాల నుంచి దొంగ ఓటర్లను దాదాపు 10 వేలమందికి పైగా శనివారం ఉదయానికల్లా ప్రైవేటు బస్సులు, స్కూల్ బస్సులలో, జీపులు, టాక్సీలలో తిరుపతికి చేరుకున్నారు. వారందరినీ కళ్యాణ మండపాలు, లాడ్జీలలో పెట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి 2 వేల మంది నుండి 3 వేల మందిని దొంగ ఓట్లు వేసేందుకు నాయకులకు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇప్పుడు ఈ రోజు ఉదయం నుంచి, విప్ చెవిరెడ్డిదిగా చెప్తున్న ఆడియో టీవీ చానల్స్ వస్తుంది. దొంగ ఓట్ల గురించి మాట్లాడుకుంటూ, వేరే ప్రాంతం నుంచి ఇప్పటికిప్పుడు రమ్మంటే కష్టం అని, 400 దొంగ ఓట్లు మేము వేపిస్తాం అంటూ చెవిరెడ్డిదిగా చెప్తున్న వీడియో ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు ఆయన దాని పై స్పందించలేదు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక్కసారి ఏబి వెంకటేశ్వర రావు పై క్రమశిక్షణా చర్యలు ఉపక్రమించింది. ఐపిఎస్ గా ఉంటూ, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా, ఏబి వెంకటేశ్వర రావు వ్యాఖ్యలు చేసారు అనే అభియోగంతో, ఆరు పేజీలతో కూడిన ఒక జీవోని చీఫ్ సెక్రటరీ ఒక గంట క్రితం విడుదల చేయటం జరిగింది. కమీషనర్ అఫ్ ఎంక్వయిరీస్ విచారణ అనంతరం, విచారణ పూర్తయిన సందర్భంగా, ఆయన మీడియాతో సచివాలయంలో మాట్లాడారు. మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన కొంత మందిని ఉద్దేశిస్తూ, అల్పులు, కుక్క మూతి పిందెలు అంటూ, పరుష పదజాలం ఉపయోగించారని, ప్రభుత్వాన్ని కార్నర్ చేసారని చెప్పి, ఆయన పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది. కమీషనర్ అఫ్ ఎంక్వయిరీస్ విచారణ తరువాత, ఆయన మీడియాతో చెప్పిన వ్యాఖ్యలు, ప్రత్యేకంగా ఆ జీవోలో పేర్కొనటం జరిగింది. 30 రోజుల్లో దీని పై ఆయన సమాధానం ఇవ్వాలని, లేని పక్షంలో, చర్యలకు ముందుకు వెళ్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఆయన పై, నిఘా పరికరాల కొనుగోళ్ళలో అక్రమాలు అంటూ, అసలు కొనుగోళ్ళు జరగని చోట, ఆరోపణలు మోపి, ఆయన్ను సస్పెండ్ చేసారు. దీని పై విచారణ సందర్భంగానే, ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం, ఈ వ్యాఖ్యలు సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకం, అంటూ జీవోలో తెలిపారు.

abv 180422021 2

దీనికి సంబంధించి మొత్తం ఆరు పేజీలతో ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వుల్లో ఆయన మాట్లాడిన మాటలు, తెలుగులో పెట్టారు. ఇలా తెలుగులో పెట్టటం చాలా అరుదు. అయితే, ఈ సందర్భంగా ఆ వ్యాఖ్యలు కూడా పెట్టారు. ముఖ్యంగా ఆయన అల్పులు, అధములు, కుక్క మూతి పిందెలు, చట్టాల పై అవగాహన లేని వారు, తన పై ఆరోపణలు చేసారని, ఆయన చెప్పిన మాటలకు , ప్రభుత్వ పెద్దలు నోచ్చుకున్నట్టు అర్ధమవుతుంది. అలాగే తన పై కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్ లు సృష్టించారు అంటూ డీజీపీ, సిఐడి, ఏసిబి చీఫ్ ల పై, ఆధారాలను చీఫ్ సెక్రటరీకి కూడా సమర్పించారు. దీని పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని కూడా కోరారు. ఇదే సమయంలో వివేక కేసుకి సంబంధించి, సిబిఐకి రాసిన లేఖ విషయంలో కూడా, అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వానికి తెలియ చేయాల్సిన అంశాలు, ప్రభుత్వ పరువు తీసే విధంగా, మీడియా ముందు విడుదల చేయటం పై, ప్రభుత్వం సీరియస్ అవుతున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

వివేక కేసు విషయంలో, రోజుకి ఒక వార్త, గత నెల రోజులు నుంచి చోటు చేసుకుంటుంది. వివేక కుమార్తె సునీత ఢిల్లీ వెళ్లి, నాకు న్యాయం చేయండి అంటూ, బహిరంగంగా వేడుకున్న దగ్గర నుంచి, ఈ కేసు రోజు వార్తల్లోకి వస్తుంది. వివేక కుమార్తె ఆరోపణలు చేస్తే, టిడిపి పైన ఎదురు వైసీపీ అరొపణలు చేయటం, లోకేష్ సవాల్ విసరటం, ప్రమాణం చేయటం, వైసీపీ నేతలు ఎవరూ రాకపోవటం, ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఇందులో ఒక టర్నింగ్ పాయింట్ ఏమిటి అంటే, ఆ రోజు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబి వెంకటేశ్వర రావు, సిబిఐకి రాసిన లేఖలు బయటకు రావటం. ఈ కేసుకి సంబంధించి, తన వద్ద చాలా సమాచారం ఉంది అంటూ, ఆయన సిబిఐకి లేఖ రాసారు. ఈ విషయంలో సిబిఐకి గతంలో రెండు సార్లు ఫోన్ చేసినా, తన వద్దకు ఎవరూ రాలేదని చెప్పారు. వివేక కుటుంబ సభ్యులు అక్కడ స్పాట్ లో ఉండి ర-క్తం తుడవటం, కుట్లు వేయటం లాంటివి కూడా చెప్పారు. తరువాత విజయసాయి రెడ్డి, గుండె పోటు అని మీడియాకు చెప్పిన విషయం కూడా ఆ లేఖలో తెలిపారు. అయితే ఇవన్నీ వాస్తవాలు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వివేక కుటుంబం నుంచి, జగన్ మోహన్ రెడ్డి వైపు నుంచి ఏబి వెంకటేశ్వర రావుకి కౌంటర్ ఇవ్వాలి కానీ, ఎందుకో ఏపి పోలీసులు కౌంటర్ ఇచ్చారు.

abv 18042021 2

ఈ రోజు డీజీపీ, ఏబీ వెంకటేశ్వర రావు ఆరోపణల పై, ప్రెస్ మీట్ పెడతారని మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే డీజీపీ కాకుండా, డిఐజి మీడియా ముందుకు వచ్చారు. ఏబీ వెంకటేశ్వర రావు చేసిన ఆరోపణలు ఖండించారు. ఏబీవీ దెగ్గర అంత సమాచారం ఉంటే, సిట్ కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇది సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకం అని, నేరం కూడా అని అన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఆరోపణలు వస్తుందే జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద అయితే, మళ్ళీ జగన్ ప్రభుత్వానికే ఆధారాలు ఎలా ఇస్తారు ? అందుకే కదా ఆయన ఏడాది నుంచి సిబిఐకి రాస్తుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే, అప్పట్లో ఏబివి జగన్ కుటుంబ సభ్యుల పై ఆధారాలు లేకపోయినా, వాళ్లని అరెస్ట్ చేయాలని, దర్యాప్తు అధికారి రాహూల్ దేవ్ శర్మపై ఒత్తిడి తెచ్చారని, డిఐజి ఆరోపించారు. ఇక ఫోర్జరీ డాక్యుమెంట్ లు అంటూ, ఆయన చేసిన ఆరోపణలు కూడా నిరాధారం అయినవి అని అన్నారు. కమిషనరాఫ్ ఎంక్వైరీస్ విచారణ వివరాలు ఆయన మీడియాకు చెప్పటం కూడా తప్పు అని, సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకం అని అన్నారు. మరి దీని పై ఏబి వెంకటేశ్వర రావు ఎలా స్పందిస్తారో చూడాలి..

నిన్న జరిగిన తిరుపతి ఎన్నికల్లో, నకిలీ ఎన్నికల ఓటర్ ఐడి కార్డులతో వచ్చి, బయట నుంచి వచ్చిన వేలాది మంది ఓట్లు వేసారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో టిడిపి వీడియోలతో సహా బయట పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా టిడిపి కుట్ర అంటూ వైసీపీ ఎదురు దాడి చేస్తుంది. ఈ విషయం మీద, టిడిపి పార్లమెంట్ అభ్యర్ధి పనబాక లక్ష్మి, ఓపెన్ సవాల్ విసిరారు. గురువారం నాడు తిరుమల శ్రీవారి నేత్ర దర్శనం రోజు, పవిత్రమైన రోజున, ఆ రోజున మీరు ప్రమాణానికి సిద్ధం అవుతారా అని సవాల్ విసిరారు. దొంగ ఓట్లు వేయలేదని, నకిలీ ఓటర్ కార్డులతో ఎవరూ రాలేదని, వారు అంతా భక్తులు అంటూ, తిరుమల దర్శనానికి, శ్రీకాళహస్తి దర్శనానికి వచ్చారు అంటూ, మంత్రి పెద్దిరెడ్డితో, ఇతర వైసీపీ నేతలు చెప్తున్న నేపధ్యంలో, పనబాక లక్ష్మి సవాల్ విసిరారు. వారు దొంగ ఓటర్లు కాదని, నకిలీ ఓటర్లు కాదని, మాకు సంబంధం లేదని మీరు ప్రమాణం చేయగలరా, ఆ విషయంలో మీరు మా పైన ఆరోపిస్తున్నట్టు, వారికి మాకు ఎలాంటి సంబంధం లేదని, మేము ప్రమాణం చేస్తాం అంటూ పనబాక లక్ష్మి ఓపెన్ చాలెంజ్ విసిరారు. గతంలో కూడా వివేక కేసు పై లోకేష్ మీద ఆరోపణలు చేయటం, లోకేష్ వెంకన్న పై ప్రమాణం చేద్దామని చాలెంజ్ చేయటం, ఆ తరువాత లోకేష్ ఒక్కడే ప్రమాణానికి రావటం, జగన్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ రాకపోవటం తెలిసిందే.

panabaka 18042021 2

ఈ నేపధ్యంలో, తిరుపతిలో మరోసారి సవాల్ చేసుకోవటం, ఇప్పుడైనా వైసీపీ నేతలు, ముఖ్యంగా పెద్దిరెడ్డి, ఈ సవాల్ ను స్వీకరిస్తారో లేదో చూడాలి. నిన్న పనబాక లక్ష్మితో పాటుగా, తెలుగుదేశం నేతలు స్వయంగా, దొంగ ఓటర్లను పట్టుకున్నారు. పెద్దిరెడ్డి కళ్యాణమండపం నుంచి తండోపతండాలుగా వస్తున్న దొంగ ఓటర్లను, వారిని తరలిస్తున్న బస్సులను పట్టుకున్నారు. ఏకంగా ఎస్పీ కార్యాలయం ఎదుటే టిడిపి నేతలు ఒక బస్సుని పట్టుకున్నారు. అందులో అంతా దొంగ ఓట్లు వేయటానికి వచ్చిన వారు ఉన్నారని, టిడిపి నేతలు ఆరోపించారు. దీని పై ఆందోళన కూడా చేసారు. అదే విధంగా ఎక్కడికక్కడ పోలింగ్ బూత్ లలో కూడా నకిలీ ఓటర్లను పట్టుకున్నారు. కార్డు తీసుకుని తండ్రి పేరు అడిగితే చెప్పలేక పోయారు. భర్త పేరు అడిగితే చెప్పలేక పోయారు. కొంత మంది పరిగెత్తారు. ఇవన్నీ టీవీల్లో వచ్చాయి. అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినా, సరే పెద్దిరెడ్డి మాత్రం, ఇదంతా టిడిపి కుట్ర అని చెప్పటంతో, పనబాక లక్ష్మి చాలెంజ్ చేసారు. మరి దీనికి పెద్దిరెడ్డి ఏమి అంటారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read