కర్నూలు జిల్లా నంధ్యాలలో కుటుంబంతో సహా ఆ-త్మ హ-త్య-కు పాల్పడిన అబ్దుల్ సలాం కేసు విచారణకు సీబీఐ అవసరం లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే పిటిషనర్ అభ్యర్థనను త్రోసి పుచ్చుతూ అసాధారణ, అరుదైన నేరాలకు సంబంధించిన కేసుల విచారణకే సీబీఐ ఏర్పాటయిందని, దీనికి తోడు చాలా పని ఒత్తిడిలో ఉన్నట్లు సీబీఐ కూడా కోర్టుకు నివేదించినందున అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సీబీఐ విచా రణకు నిరాకరిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. సలాం కుటుంబం ఆ-త్మ-హ-త్యపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్ పి) రాష్ట్ర ప్రధానకార్యదర్శి షేక్ ఖాజావలి గత ఏడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన హైకోర్టు మొత్తం వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ, కర్నూలు జిల్లా ఎస్పీలను ఆదేశించింది. ఈ మేరకు కౌంంటర్లు దాఖలయ్యాయి. ఇప్పటికే పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని విశాఖపట్నం సీబీఐ ఎస్పీ కోర్టుకు నివేదించారు. కాగా కేసులో దర్యాప్తు సరైన తీరులోనే జరుగుతోందని కర్నూలు ఎస్సీ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై మరోసారి గురువారం హైకోర్టు సీజే అరూప కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

salaam 02042021 2

అసాధారణాధికారాలను అరుదుగా ఉపయోగించాలని సుప్రీంకోర్టు చెప్పిందని వాటిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అసాధారణ, అరుదైన సందర్భాల్లోనే సీబీఐ విచారణకు ఆదేశించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిలో పర్యవసానాలు ముడిపడి ఉన్న కేసుల్లో దర్యాప్తును బదలాయించడం ద్వారా న్యాయం జరుగుతుందని అనిపించినప్పుడు మాత్రమే సీబీఐకి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ప్రతిదీ సీబీఐ విచారణకు ఆదేశిస్తే విశ్వసనీయత కోల్పోయే అవకాశాలు లేకపోలేదని వివరించింది. సలీంపై దొంగతనం ఆరోపణలతో కేసు నమోదైందని ఫలితంగా అతను కుటుంబ సభ్యులతో కలిసి ఆ-త్మ-హ-త్య-కు పాల్పడ్డట్టు భావించాల్సి వస్తోందని, పోలీసు సిబ్బంది నిందితులుగా ఉన్నారని వివరించింది. ఈ నేపథ్యంలో కోర్టు విచక్షణను ఉపయోగించి సీబీఐకి ఆదేశించలేమని తేల్చి చెప్పింది. దీంతో అనేక ఆరోపణలు ఉన్నా, ఇప్పుడు ఈ కేసు పరిష్కరించే భారం ఏపి పోలీసుల పైనే పడింది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కేసు వివేక కేసు. ఆయన సరిగ్గా 2019 ఎన్నికల నెల రోజులు ముందు, చం-ప-బ-డ్డా-రు. వైసీపీ నేతలు గుండె పోటు అంటూ కవర్ చేద్దామని ట్రై చేసినా, చివరకు నిజం బయటకు వచ్చింది. ప్రజలు ఆశ్చర్య పోయారు. అసలు ముందు గుండె నొప్పి అని ఎందుకు చెప్పారో, ఈ రోజుకీ ఎవరికీ తెలియదు. అయితే అప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలు కావటంతో, కేసు విచారణ ముందుకు సాగలేదు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి, సిబిఐ విచారణ కావాలని నానా యాగీ చేసారు. ఇక ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, వివేక కేసు గురించి ఎన్నికల్లో టిడిపి మాట్లాడకుండా, గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇక తరువాత జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకేముందు, సిబిఐ విచారణకు ఆదేశిస్తారు, వివేక కుటుంబానికి న్యాయం జరుగుతుందని అందరూ అనుకున్నారు. ఈ లోపు సిబిఐ విచారణ కావాలని వేసిన పిటీషన్ ను, జగన్ వెనక్కు తీసుకున్నారు. అయితే, నెలలు గడుస్తున్నా ఏమి కాకపోవటంతో, వివేక కూతురు సంచలనానికి తెర లేపారు. ఏకంగా 15 మంది పై అనుమానం ఉందని, కోర్టుకు వెళ్లి, సిబిఐ విచారణ తెచ్చుకున్నారు. అయితే ఈ విచారణ కూడా గత ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. సిబిఐ వచ్చి, వెళ్తున్నా, విచారణ మాత్రం, ఫాస్ట్ గా సగటం లేదు.

sunitha 02042021 2

అయితే ఇప్పటికే కేరళలో ఉన్న ఒక సామాజిక కార్యకర్త సహాయం తీసుకున్న వివేక కూతురు, మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారని వార్తలు వచ్చాయి. వీటి అన్నిటి నేపధ్యం, అనేక ప్రచారాల నేపధ్యంలో, వివేక కూతురు సునీత, నిన్న ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు ఆమె సిబిఐ కేంద్ర కార్యాలయానికి వెళ్తారని తెలుస్తుంది. అక్కడకు వెళ్లి, కేసు విచారణ తీరు, మరిన్ని ఆధారాలు, ఇలా అనేక అంశాల పై సిబిఐతో చర్చించనున్నారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని, ఆమె సిబిఐని అడుగుతారు అంటూ, వార్తలు వచ్చాయి. ఘటన జరిగి రెండేళ్ళు అయినా, ఇంకా న్యాయం దొరకలేదని, దోషులను తొందరగా పట్టుకుని శిక్షించాలని కోరుతున్నారు. అయితే సిబిఐని కలిసిన తరువాత, ఆమె ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో, ప్రెస్ మీట్ లో మాట్లాడతారని తెలుస్తుంది. ఇప్పుడు ఆమె ఏమి మాట్లాడతారు, ఎవరి పైన ఆరోపణలు చేస్తారు, అనే విషయం పై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. ఎందుకో కానీ ఈ కేసు విషయంలో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. సొంత బాబాయ్ విషయంలోనే, ఇప్పటికీ ఏమి చేయలేదని, ప్రతిపక్షాలు తరుచూ ఆరోపిస్తున్నా, అటు వైపు నుంచి రియాక్షన్ లేదు.

పుదుచ్చేరిలో బీజేపీని గెలిపిస్తే, ప్రత్యేకహోదా ఇస్తామని కేంద్రంచెప్పిందని, ఏపీకి మాత్రం ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమనిచెప్పినా ముఖ్యమంత్రి బీజేపీ ని, కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదని టీడీపీ అధికా రప్రతినిధి సయ్యద్ రపీ నిలదీశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరు లతోమాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ అవకాశవాది కాబట్టి, విద్యార్థులను, యువతను మోసగిస్తూ, హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడంలేదన్నారు. అక్కడి నాయకుడైన మల్లాది కృష్ణారావును గెలిపించాలని వైసీపీనేతలైన పిల్లిసుభాష్ చంద్రబోస్ మరికొందరు ప్రచారంచేస్తున్నా రని, అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయడానికి జగన్మోహ న్ రెడ్డి డబ్బుసంచులు పంపాడని రఫీ ఆరోపించారు. పుదుచ్చేరిలో కృష్ణారావుని గెలిపించాలనికోరడం ద్వారా జగన్ ప్రభుత్వం బాహటంగానే బీజేపీకి మద్ధతిస్తోంద న్నారు. బీజేపీకి, జగన్ కుఉన్న అక్రమ సంబంధం పు దుచ్చేరి ఘటనతో బట్టబయలైందన్నారు. పుదుచ్చేరికి ప్రత్యేకహోదా ఇస్తామన్న కేంద్రాన్ని ప్రశ్నించని ముఖ్యమంత్రి, అక్కడ బీజేపీవారికి కొమ్ముకాయడ మేంటని రఫీ ప్రశ్నించారు. బీజేపీతో సఖ్యతగాఉంటే, తన కేసులనుంచి తాను బయటపడవచ్చన్నదే జగన్ ఆలోచన అని, అందుకే ఆయన కేంద్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమైతే, పుదుచ్చేరికి ఎలాఇస్తారని ముఖ్యమంత్రి ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదన్నారు? ప్రత్యేకహోదాతో రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయని, ప్రతిజిల్లా హైదరా బాద్ అవుతుందని, 22మందిఎంపీలను ఇస్తే సాధిస్తాన ని గతంలో ఊదరగొట్టిన జగన్, రాష్ట్రాన్నివంచించిన బీజే పీకి మద్ధతుఎలా తెలుపుతున్నాడో ఆయనే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

bjp 010542021 2

తనఅవినీతి కేసులకోసమే ముఖ్యమంత్రి ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టుపెట్టాడ న్నారు. ఎన్నికల్లో గెలవడంకోసంఏమైనాచేయడం, ఏది పడితే అదిచెప్పడం ముఖ్యమంత్రికి అలవాటుగా మారిం దన్నారు. టీడీపీప్రభుత్వంలో కేంద్రంరాష్ట్రానికి ఇస్తామ న్న నిధులనుకూడా జగన్ సాధించలేకపోయాడన్నా రు. హోదాఇవ్వకపోయినా, వెనుకబడిన జిల్లాలకు, అమరావతికి నిధులివ్వకపోయినా, రైల్వేజోన్ అటకె క్కించినా, విశాఖస్టీల్ ను అమ్మేస్తున్నాముఖ్యమంత్రి ఎందుకు నోరెత్తడంలేదన్నారు. తనప్రయోజనాలు, తన పై ఉన్నకేసులకోసమే, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని రఫీ మండిపడ్డారు. పుదుచ్చేరిలో గతంలో ఉన్న నారాయణస్వామి ప్రభుత్వాన్నికూలదోయడానికి జగన్మోహన్ రెడ్డే సహకరించాడని, ఇప్పుడేమో బీజేపీకి మద్ధతిస్తూ, తన ప్రయోజనాలను కాపాడుకుంటున్నా డన్నారు. ఇతరరాష్ట్రాల్లోని ప్రభుత్వాలను పడగొట్టడా నికి డబ్బులు పంపాల్సిన అవసరం ఈముఖ్యమంత్రికి ఎందుకొచ్చిందన్నారు? తిరుపతి ఉపఎన్నికలో జగన్మో హన్ రెడ్డి అసమర్థతను ఎత్తిచూపుతామని, బీజేపీతో, ముఖ్యమంత్రికున్న లోపాయికారీ ఒప్పందాలను కూడా ఎండగడతామని రఫీ స్పష్టంచేశారు. గతంలో రాజీనా మాలతో దేశమంతా రాష్ట్రంవైపుచూసేలా చేస్తానన్న జగన్, ఇప్పుడు తనపార్టీఎంపీలతో ఎందుకుఆపని చేయించడంలేదన్నారు. జగన్మోహన్ రెడ్డికి మరోఎంపీని గెలిపించినా, ఈరాష్ట్రానికి ఏమీ ఒరగదనే వాస్తవాన్ని తిరుపతిపార్లమెంట్ లోని ప్రజలు గమనించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి మౌనం రాష్ట్రానికి శాపంగా మారిందని, వైసీపీప్రభుత్వ వికృత రాజకీయక్రీడను రాష్ట్రవాసులు గమనించాలన్నారు.

తెలుగుదేశం పార్టీలో అత్యున్నత కమిటీ అయిన పొలిట్‌బ్యూరో సమావేశం ఈ రోజు అత్యవసరంగా జరగనుంది. ఈ రోజు ఉదయం పది గంటలకు, ఈ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. వైరస్ వ్యాప్తి దృష్టిలో పెట్టుకుని, ఈ సమావేశం ఆన్లైన్ లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, ముఖ్యంగా నిన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కొత్తగా వచ్చిన ఎన్నికల కమీషనర్ నీలం సాహ్నీ, నోటిఫికేషన్ ఇవ్వటం. ముఖ్యంగా అనేక ఫిర్యాదులు వచ్చినా, వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరినా, ఎవరి వాదనలు పట్టించుకోకుండా, ప్రభుత్వం చెప్పినట్టు చేసారనేది ఆరోపణ. ఏడాది క్రితం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో, నామినేషన్ సందర్భంగా వైసీపీ వర్గాలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. నామినేషన్ వేసే వారిని మధ్యలో ఎత్తుకు పోవటం, అలాగే కిడ్నాప్ చేయటం, బెదిరింపులు, దౌర్జన్యాలు, ఏకంగా బుద్దా వెంకన్న, బొండా ఉమా ని చంపటానికి చూడటం, ఇవాన్నీ జరిగాయి. దీంతో చాలా మంది కనీసం నామినేషన్ కూడా వేయలేక పోయారు. అధికారులు, పోలీస్ కూడా అధికార పక్షానికి కొమ్ముకాస్తుంది అనేది ఆరోపణ. దీంతో 2014లో 2 శాతం ఉన్న ఏకాగ్రీవాలు, మొన్న 30 శాతం వరకు వెళ్ళాయి. అయితే ఈ ఎన్నికలు మధ్యలో ఆగిపోయాయి.

polit 02042021 2

దీంతో ఏడాది తరువాత జరిగే ఎన్నికలు కాబట్టి, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని టిడిపి కోరుతుంది. అయితే కొత్త ఎన్నికల కమీషనర్ మాత్రం, పాత వాటిని కొనసాగించారు. దీంతో, తెలుగుదేశం పార్టీ రెండు విషయాల పై ఆలోచిస్తుంది. దీని పై న్యాయ పోరాటం చేయాలని ఒకటి. రెండోది, ఎన్నికల బహిష్కరణ. ప్రభుత్వం అరాచకాలను ఎదుర్కున్న నిమ్మగడ్డ ఉండగానే, వైసీపీ ఆరాచకం చేసిందని, ఇప్పుడు తమకు అనుకూలమైన వారిని పెట్టుకుని, ఇంకా ఎంతో అరాచకం చేస్తుందని, ఈ విషయం ప్రజలకు వివరించి, అసలు ఇలాంటి ఎన్నికల్లో ఎందుకు పాల్గునాలి అని, ప్రజల మధ్య చర్చ పెట్టి, ఎన్నికల బహిష్కరిస్తే ఎలా ఉంటుంది, అనేది కూడా టిడిపి ఆలోచన. ఈ రెండు అంశాల పై చర్చించేందుకు, తెలుగుదేశం పార్టీ ఈ రోజు అత్యవసరంగా పొలిట్‌బ్యూరో సమావేశం ఏర్పాటు చేసింది. ఒకవేళ ఎన్నికల్లో పాల్గునకపోతే, దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకుని వెళ్ళాలి, ఒకవేళ పోటీ చేస్తే, అన్నీ ప్రజలకు వివరించి, ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయమని, ప్రజలకు వివరించే అవకాసం పై చర్చ జరిగే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisements

Latest Articles

Most Read