తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంతో వైసీపీలో వణుకు పుట్టించారు. ఇప్పటివరకూ టిడిపి నుంచి వచ్చిన నలుగురు, జనసేన నుంచి ఒకరిని 151లో కలిపి లెక్కేసుకుంటూ మొత్తం ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అని ఊహాల్లో తేలుతున్న వైసీపీ అధిష్టానానికి టిడిపి ఇచ్చిన ఝలక్ గట్టిగానే తగిలింది. తెలుగుదేశం ఆ ఒక్క స్థానం గెలవడం కంటే ముఖ్యంగా టిడిపి నుంచి వెళ్లిన నలుగురికి ఓ హెచ్చరిక సందేశం, అలాగే వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తులను ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి వైపు తిప్పే వ్యూహం రెండూ వున్నాయంటున్నారు వ్యూహకర్తలు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు జరిపిన వ్యూహ కమిటీ సమావేశంలో ఈ దిశగా చర్చలు సాగాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని దింపే యోచనలో తెలుగుదేశం ఉందని ఫీలర్ పంపారు. ఈనెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏడింటికి ఎన్నిక జరగనుంది. మార్చి 13న నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో టిడిపి అభ్యర్థిని దింపేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం 23 మొదటి ప్రాధాన్యం ఓట్లు అవసరం కాగా, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు 23 మంది అయినా వైసీపీతో వంశీ, కరణం బలరాం , మద్దాలగిరి, వాసుపల్లి గణేష్ అంటకాగుతున్నారు. ఈ నలుగురు జంపింగ్ ఎమ్మెల్యేలకి విప్ జారీ చేయడం ద్వారా దారి తెచ్చుకోవాలనుకుంటోంది. మరోవైపు వైసీపీలో ఉన్న ఆనం, కోటంరెడ్డి వంటి అసంతృప్త ఎమ్మెల్యేలు ఓట్లు కలిసి వస్తే టిడిపి అభ్యర్థి గెలుపు ఖాయం కానుంది. ఈ నేపథ్యంలో మాజీ మేయర్, చేనేత కమ్యూనిటీకి చెందిన పంచుమర్తి అనూరాధని ఎమ్మెల్సీ అబ్యర్థిగా దింపే యోచనలో టిడిపి ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
news
అందరూ ఊహించినట్టే, జగన్ కు భారీ షాక్ ఇచ్చిన విజయసాయి రెడ్డి
ఇద్దరు ఆత్మ పరమాత్మ లాగా ఉండేవారు. ఆయన తప్పుడు లెక్కలు రాస్తే, ఈయన లెక్క వెనక వేసుకునే వాడు. అక్రమాస్తుల కేసుల్లో ఒకరు ఏ1 అయితే, ఇంకొకరు ఏ2. పార్టీలోను ఒకరు సీఎం అయితే, ఇంకొకరు డిఫాక్టో సీఎం. వీరే జగన్ రెడ్డి, విజయ్ సాయి రెడ్డి. చాలా రోజులుగా ఇదే అందరికీ తెలిసిన విషయం.కాలంలో జైలులో, బెయిల్ లోనా వీడని బంధం. కానీ ఇటీవల ఇద్దరు దూరమయ్యారని సమాచారం. వరస కేసుల్లో, విషాదాలలో తన కుటుంబ సభ్యులు ఇరుక్కుపోవడంతో సాయి రెడ్డి ఒంటరి అయ్యారు. వైకాపా నుంచి కనీస మద్దతు లేదు. దీంతో సాయి రెడ్డి పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టన్నట్టు ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి గ్యాప్ బయటపడింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా విజయసాయి డుమ్మా కొట్టారు. విశాఖలో తన ఓటును నమోదు చేసుకున్న విజయసాయిరెడ్డి పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి కూడా ఆసక్తి చూపించలేదు. వైవీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర ఇంచార్జ్ గా నియమించడంతో అలక బూనిన సాయిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికీ దూరంగా ఉన్నారు. ఇటీవల తారకరత్న అంత్యక్రియల సమయంలో చంద్రబాబుతో విజయసాయి చనువుగా ఉండటంపై జగన్ ఆగ్రహం చేసినట్లు తెలిసింది. ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు, లోకేష్‌కు వ్యతిరేకంగా మాట్లాడాలని జగన్ రెడ్డి ఆదేశించినా పట్టించుకోకుండా ఢిల్లీకి వెళ్లిన విజయసాయిరెడ్డి వైసీపీకి దూరం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.
మరో కొత్త కధ.. సాక్షిలో జగన్ రెడ్డి రాతలే అవినాష్‌రెడ్డిని దొరికించేశాయా?
వైఎస్ వివేకానందరెడ్డి హ-త్యకేసులో ప్రతీసారి ఓ కొత్త వాదనని తెచ్చి వైఎస్ అవినాష్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యారని మాజీ పోలీసు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మర్డర్ జరిగిన వెంటనే అంతా ఓ మాటనుకుని గుండెపోటు థియరీ తెచ్చారు. అదీ జగన్ సాక్షి చానల్లోనే వేశారు. జగన్ ఆత్మలాంటి విజయసాయిరెడ్డి గుండెపోటు ప్రకటన చేశాడు. ఆ తరువాత ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మంచి అవకాశం అని ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాతో చంద్రబాబు గొడ్డలితో అడ్డంగా తన బాబాయ్‌ని నరికేశారని, ఆయనకి లోకేష్, బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి సహకరించారని అదే సాక్షిలో జగన్ రెడ్డి అచ్చేయించారు. ఇక్కడి నుంచే అనుమానాలు మొదలయ్యాయి. సేమ్ పరిటాల రవి కేసులో మాదిరిగానే సాక్షులు అనుమానాస్పదంగా చనిపోవడం ఆ స్కెచ్ ఇక్కడా అమలయ్యిందని సందేహాలు వ్యక్తం అయ్యాయి. సీబీఐ రాకముందే కేసుని అనామకుల్ని ఇరికించి క్లోజ్ చేయాలనుకున్నారు. సీబీఐ దిగడంతో సీబీఐపైనే దా-డు-లకు వెనకాడలేదు. ఒక్కో నిందితుడినీ సీబీఐ అరెస్ట్ చేసినా, విచారణకి పిలిచినా వైఎస్ అవినాశ్‌రెడ్డి గిలగిలా కొట్టుకుంటుండడం, నిందితులకు మద్దతుగా లాయర్లని పెట్టడంతో ఏ విచారణ లేకుండానే అవినాష్‌రెడ్డి హ-త్యలో తన పాత్ర ఉందని ఒప్పేసుకున్నట్టు అయ్యింది. ఈ నేపథ్యంలో మళ్లీ సాక్షిలోనే ఆస్తి గొడవల నేపథ్యంలో అల్లుడు నర్రెడ్డి ఈ హత్య చేయించాడని నిందితులు చెబుతున్నది రాశారు. వివేకా హ-త్యలో సాక్షిలో రాసిన మూడో వెర్షన్ ఇది. తాజాగా మూడోసారి సీబీఐ విచారణకి హాజరైన అవినాష్ రెడ్డి తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోర్టుకి వెళ్లడం, విచారణ అనంతరం వివేకానందరెడ్డి అక్రమసంబంధాల గురించి మాట్లాడటం కొత్త వెర్షన్ బయటకి తెచ్చారు. ఇదీ సాక్షి మీడియాలోనే వస్తోంది. వివేకాకు ఓ ముస్లిం మహిళతో సంబంధముందని షేక్ షహన్ షా అనే అబ్బాయి వారికి పుట్టాడని, ఆ అబ్బాయినే వారసుడ్ని చేయాలనుకున్నాడని, ఆ గొడవల్లోనే చంపేసి ఉంటారని కొత్త వాదన తెరపైకి తెచ్చాడు. అంటే సాక్షిలో వేసినదాని ప్రకారం, జగన్ రెడ్డి సన్నిహితులు చెప్పిన దాని ప్రకారం వివేకా హ-త్యకేసులో ఇది నాలుగో వెర్షన్. ప్రతీసారి కేసులో అనుమానితులు ఎందుకు మారుతున్నారంటే, అసలు నిందితులు వారికి తెలుసుకాబట్టి అనేది కామన్ మేన్‌కి కూడా అర్థం అవుతోంది.
రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా, మళ్ళీ అదే తిరుపతి ఫార్ములా... బటన్ నొక్కుడు మీద నమ్మకం లేదా ?
ఇదేదో పురాణ కథలు కాదు..ఏపీలో చిత్రాలు..ప్రజాస్వామ్య వ్యవస్థని నడిరోడ్డుపై నగుబాటుకి గురిచేసిన వైసీపీ ఎన్నికల లీలలు. పట్టభద్రుల ఎన్నికల కోసం వైసీపీ చేర్పించిన ఓట్లు చూస్తుంటే విపక్షాలే కాదు, సామాన్య ప్రజలు కూడా గుండెలు బాదుకుంటున్నారు. రాయలసీమలో, ముఖ్యంగా జగన్ రెడ్డి అత్యంత ముఖ్యంగా భావించే పెద్దిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఉండే ప్రాంతాల్లో ఈ అరాచక ఓట్ల నమోదు జరిగింది. గతంలో తిరుపతి ఉప ఎన్నిక, కుప్పం మున్సిపల్ ఎన్నికలకి పెద్ద ఎత్తున టూరిస్టు ఓటర్లని దింపిన వైసీపీ పెద్దలు ఈ సారి ఏకంగా వేలసంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయించారు. తిరుపతిలో ఓటర్ల లిస్టులని పరిశీలించిన విపక్ష నేతలు వైసీపీ బరితెగింపు చూసి నోరెళ్లబెట్టారు. ఓటర్ల లిస్టులు పట్టుకుని టిడిపి నుంచి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, సీపీఐ నుంచి నారాయణ డోర్ టు డోర్ వెళితే..దొంగ ఓటర్లు వేలసంఖ్యలో బయటపడ్డారు. తిరుపతి ఒక డోర్ నెంబర్లో 18కి పైగా ఓట్లు నమోదు అయ్యాయి. అయితే ఈ ఓటర్లందరికీ ఒకామె భార్యగా నమోదు చేసి దొరికిపోయారు. ఇంకో డోర్ నెంబర్‌కి వెళితే అది చికెన్ సెంటర్. అందులో 36 ఓట్లున్నాయి. అవి కూడా ముస్లిం, హిందూ, క్రిస్టియన్లు కలిసి వున్నట్టు నమోదు చేశారు. ఇంకో డోర్ నెంబర్లో ఏ మణికంఠ పేరుతో 11 ఓట్లు నమోదు అయ్యాయి. ఏ మణికంఠకి ప్రతీ ఓటుకి తండ్రి మారిపోయాడు. ఏ తండ్రికీ ఇంటి పేరు ఏ లేదు. ఇవీ వైసీపీ మార్కు దొంగ ఓటర్లచిత్రాలు. అసలు చదువుకోని వాళ్లకి పట్టభద్రుల ఓట్లు ఎలా వచ్చాయో తెలియని మరో విచిత్రం. తిరుపతిలోని యశోదనగర్ 18-1- 90/12 నంబరు గల ఖాళీ ప్రదేశంలో 10 దొంగ ఓట్లు, ఒక వలంటీర్ ఇంట్లో 12 దొంగ ఓట్లు, సీపీఎం ఆఫీస్ పక్కన గల లక్ష్మీ ఇంట్లో 8 దొంగఓట్లు ఉన్నట్లు సీపీఐ నేతలు గుర్తించారు.తిరుపతి నగరంలోనే 7 వేల దొంగ ఓట్లు ఉన్నట్లు సీపీఐ ఆరోపిస్తోంది. తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో వేలాది దొంగ ఓట్లను అధికార వైసీపీ నమోదు చేసిందని టిడిపి నేతలు అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. విపక్షాలన్నీ దొంగ ఓట్లపై ఆధారాలపై ఫిర్యాదులు చేస్తుంటే, వైసీపీ స్పందనతో అవి తమ ఘనతే అని చాటుకున్నట్టుంది. ఎన్నికలలో ఓటమి ఖాయం అని తెలిసే ఇలా దొంగ ఓట్ల ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ అంటోంది. వలంటీర్లు నమోదు చేయించిన దొంగ ఓట్లను ఆధారాలతో సహా బయటపెట్టినా వాటిపై స్పందించడంలేదంటే, అది తమ పనేనని ఒప్పుకున్నట్టు స్పష్టం అవుతోంది.