విశాఖ ఎయిర్ పోర్టులో అప్ప‌టి ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ రెడ్డిని పొడిచిన కోడిక‌త్తి ఎక్క‌డుంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌. ఇప్ప‌టివ‌ర‌కూ విచార‌ణ జ‌ర‌గ‌ని ఈ కేసు ఇటీవ‌లే క‌ద‌లిక వ‌చ్చింది. అయితే బాధితులు, సాక్షులు రాకుండా కేసు విచార‌ణ ఎలా అని న్యాయ‌మూర్తి ప్ర‌శ్నించ‌డంతో సాక్షి వ‌చ్చారు కానీ, బాధితుడైన జ‌గ‌న్ రెడ్డి మాత్రం కేసు విచార‌ణ‌కి రావ‌డంలేదు. ఈకోడికత్తి కేసులో అసలు బాధితుడు అప్పటి ప్రతిపక్ష నేత.. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మాత్రం ఇప్పటివరకు కోర్టుకు హాజరుకాలేదు. నిందితుడు ఇప్పటి వరకు కోర్టుకు హాజరుకాకపోవటంపై ఎన్ ఐఏ కోర్టు అసహనం వ్యక్తంచేసింది. బాధితుడిగా భావిస్తున్న జగన్ కోర్టుకు రావాల్సిందేనని గతంలో స్పష్టంచేసింది. అయినా జగన్ కోర్టుకు హాజరుకాకపోవడం ఏంటని అసహం వ్యక్తం చేసినట్టు సమాచారం. పోలీసులు స్వాధీనం చేసుకున్న కోడిక‌త్తిని కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌లేద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు అవినాష్ రెడ్డి కేసు విచార‌ణ సంద‌ర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తి వ్యాఖ్య‌లు కోడిక‌త్తి కేసులో మ‌రో ట్విస్ట్ కి తెర‌లేపాయి. జ‌గ‌న్ రెడ్డిపై దాడి జ‌రిగిన రోజు ఎయిర్ పోర్టులో సీసీ కెమెరాలు  కూడా ప‌నిచేయ‌లేద‌ట‌. అంటే ఇదంతా చాలా ప్లాన్డ్‌గా రికార్డు కాకూడ‌ద‌ని చేసిన‌ట్టే ఉంది.  2018లో విశాఖపట్నం ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ మోహన్ రెడ్డిపై జ‌నిప‌ల్లి శ్రీనివాస రావు  కోడికత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. ఈ కేసు విచార‌ణ‌ని ఎన్ఐఏ తీసుకుంది. అప్ప‌టి నుంచి జైలులోనే కోడిక‌త్తి శ్రీను ఉంటున్నాడు. సీఎం జ‌గ‌న్ రెడ్డిని క‌లిసేందుకు కోడిక‌త్తి శ్రీను త‌ల్లిదండ్రులు ప్ర‌య‌త్నించినా సాధ్యంకాలేదు. శ్రీను లాయ‌ర్ విజ్ఞ‌ప్తి మేర‌కు విజయవాడ ఎన్ఐఎ కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఈ కేసులో ప్రధానమైన కోడికత్తిని తీసుకురావాల‌ని కోర్టు ఆదేశించింది. కోడికత్తి కేసుకు సంబంధించి సాక్షిగా సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ దినేశ్ కుమార్ ను కోర్టు విచారించింది.

వివేకానంద‌రెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డే చంపేశాడ‌ని సీబీఐ చెప్పినా మేము న‌మ్మం అంటోంది వైసీపీ. సీబీఐయే కాదు, కోర్టులు తీర్పు ఇచ్చినా మేము అవినాష్ రెడ్డి వెంటే ఉంటామంటూ వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది. వైసీపీ అఫీషియ‌ల్, వైసీపీ సోష‌ల్మీడియా, వైసీపీ వెరిఫైడ్ లీడ‌ర్స్ అక్కౌంట్ల నుంచి మొత్తం #westandwithysavinash పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే వైఎస్ అవినాష్ రెడ్డి బాబాయ్ వివేకానంద‌రెడ్డిని చంపేసినా ఆయ‌న వెనుకే మేమున్నాం అని పార్టీ ప్ర‌క‌టించ‌డం ద్వారా కిందిస్థాయి కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు. ఇదే సోష‌ల్మీడియాలో నారాసుర‌ర‌క్త‌చ‌రిత్ర పోస్టులు పెట్టామ‌ని, ఇప్పుడు వైఎస్ సునీత ర‌క్త‌చ‌రిత్ర అని పెట్ట‌మంటున్నార‌ని వైసీపీ పోస్టుల కింద కామెంట్ల రూపంలో పోస్టులు చేస్తున్నారు. అవినాష్ రెడ్డిని అనుమానితుడు అని సీబీఐ స్ప‌ష్టం చేశాక కూడా వుయ్ స్టాండ్ విత్ అవినాష్ అంటున్నారంటే, వేసింది ఆయ‌నే అయినా వేయించింది త‌మ అభిమాన నేతే అని కార్య‌క‌ర్త‌లు క‌న్‌ఫామ్ చేసుకుంటున్నారు. మ‌రోవైపు వైఎస్ వివేకానంద‌రెడ్డితో అన్ని విధాలా వైరం ఉన్న దూర‌పు బంధువు వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు చంపుతాడ‌నే వాద‌న‌లో ``ఒక క‌న్ను మ‌రో క‌న్నుని ఎందుకు పొడుస్తుంది అధ్య‌క్షా`` అని అమాయ‌కంగా ప్ర‌శ్నించిన జ‌గ‌న్ రెడ్డి త‌న సాక్షి పేప‌ర్లో వివేకానంద‌రెడ్డి కూతురే చంపేసింద‌ని అవినాష్‌రెడ్డి చెప్పిన‌ట్టు అచ్చేయించ‌డం చూస్తే అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయి. ఒక క‌న్ను మ‌రో క‌న్నుని ఎలా అనేది జ‌గ‌న్ చెప్పిందే నిజ‌మ‌నుకుంటే..సునీత‌పై నేరం మోప‌డం దారుణం అని వైసీపీలోనే చ‌ర్చ మొద‌లైంది.

యువ‌గ‌ళం పాద‌యాత్ర రాయ‌ల‌సీమ‌లో సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ నియోజ‌క‌వ‌ర్గం వెళితే ఆ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, వైసీపీ నేత‌ల అవినీతిని ఆధారాల‌తో స‌హా ప్ర‌జ‌ల‌ముందుంచి మ‌రీ స‌వాల్ విస‌రుతున్నారు నారా లోకేష్‌. పెద్దిరెడ్డి ఇలాఖా..అంటే పుంగ‌నూరు, మ‌ద‌న‌ప‌ల్లె, తంబ‌ళ్ల‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గాల‌లో లోకేష్ రెచ్చిపోయారు. పాపాల మిధున్ రెడ్డి స‌న్నాఫ్ పాపాల పెద్దిరెడ్డీ చిత్తూరు జిల్లాకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా అంటూ స‌వాల్ విసిరారు. రేపు తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉంటా...ద‌మ్ముంటే రావాలంటూ ఎంపి మిథున్ రెడ్డికి యువనేత లోకేష్ సవాల్ విసిరారు. ``చిత్తూరు జిల్లా అభివృద్ధికి మేము నిధులు కేటాయించాం... ఫాక్స్ కాన్, సెల్ కాన్ వంటి పరిశ్రమలు తెచ్చి వేలాదిమంది యువతకు ఉద్యోగాలిచ్చాం. పుంగనూరులో రోడ్లకు నిధులు మంజూరుచేసింది కూడా నేను పంచాయితీరాజ్ మంత్రిగా పనిచేసే సమయంలోనే. చిత్తూరును పెద్దిరెడ్డి కుటుంబం నమిలేస్తోంది. ఒకరికి ముగ్గరు ప్రజాప్రతినిధులు ఉన్న పెద్దిరెడ్డి అండ్ కో మదనపల్లిని ఎందుకు జిల్లా చేయలేదు? ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీగా పెద్దిరెడ్డి కుంటుంబం ఉంది. జిల్లా వాళ్ల చేతిలో ఉండాలని మదనపల్లిని జిల్లా కాకుండా అడ్డుకున్నారు అని ఆరోపించారు. మదనపల్లికి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారిక ఎమ్మెల్యే నవాజ్ బాషా అయితే అనధికార ఎమ్మెల్యేలు పాపాల పెద్దిరెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి. తమిళనాడు రిజిస్ట్రేషన్ తో చేసిన లారీలతో ఇక్కడ కొండలను తవ్వి గ్రావెల్ తరలిస్తున్నారు. దళితులకు చెందిన డీకేటీ భూములు లాక్కుని మైనింగ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే నవాజ్ బాషా తన బినామీలతో బెంగళూరు బస్టాండ్ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ నుండి నెలకు ఐదు లక్షలు వసూలు చేస్తున్నాడు. మదనపల్లి పట్టణంలో నవాజ్ బాషా తన అనుచరులతో వెంచర్లు వేస్తున్నాడు. ప్రభుత్వ భూమి పక్కనే ఉండేలా ప్రేవేటు స్థలాల్లో వెంచర్లు వేస్తూ ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నాడు.

నవాజ్ బాషా, అనుచరులు కలసి ప్రభుత్వానికి చెందిన 40 ఎకరాల్లో లేఅవుట్లు వేసి రూ.100 దోచుకున్నారు. మదనపల్లిలో లే అవుట్ వేయాలంటే కప్పం కట్టాలి. 557 ఎకరాలు ఉన్న సీటీఎం చెరువును స్థానిక ఎమ్మెల్యే, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచులు 40 ఎకరాలు కాజేశారు. కరోనా వస్తే షాపులు, రెస్టారెంట్లు, బంగారం కొట్ల నుండి రూ.4కోట్లు వసూలు చేశారు. వలసపల్లి దగ్గర జ్యూస్ ఫ్యాక్టరీకి చెందిన మూడెకరాల భూమిని ఎమ్మెల్యే నవాజ్ బాషా లారీ ఓనర్స్ అసోషియేషన్ పేరు చెప్పి రూ.12కోట్లు విలువు చేసే భూమిని లాక్కున్నారు. బసినికొండ రోడ్డులో అగ్గిపెట్టె పరిశ్రమ కార్మికులకు చెందిన రూ.20 కోట్ల విలువైన రెండెకరాల భూమిని ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆక్రమించారు. నిమ్మనపల్లిలోని బహుదా నది నుండి రోజూ 100 టిప్పర్ల ఇసుక బెంగుళూరుకు వెళ్తోంది. మదనపల్లిలో క్వారీలు చేయాలంటే పాపాల పెద్దిరెడ్డికి 50 శాతం కమిషన్ ఇవ్వాలి. ఘన చరిత్ర ఉన్న బీటీ కాలేజీకి చెందిన 40 ఎకరాల భూమిని కూడా స్వాహా చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2024 నాటికి దొరికిన భూమి, కొండలు, చెరువులు కూడా స్వాహా చేస్తారు. మదనపల్లికి పరిశ్రమలు రాకపోవడానికి కారణం పెద్దిరెడ్డి కుటుంబమే. వాళ్ల కుటుంబాన్ని తరిమికొట్టండి. `` అని లోకేష్ పిలుపునిచ్చారు. నారా లోకేష్ త‌మ ఫ్యామిలీపై చేసిన అవినీతి ఆరోప‌ణ‌ల‌పై స్పందించ‌లేదు ఎంపీ మిధున్ రెడ్డి. అభివృద్ధిపై చ‌ర్చ‌కి రావాల‌ని లోకేష్ స‌వాల్ విసిరితే, లోకేష్‌కి ద‌మ్ముంటే చిత్తూరు జిల్లాలో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని ప్ర‌తి స‌వాల్ విస‌ర‌డం తోక‌ముడిచిన‌ట్టేన‌ని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

త‌న‌ను అరెస్ట్ చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టుని ఆశ్ర‌యించిన‌ప్పుడే, వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు త‌ప్ప‌ద‌ని తేలిపోయింది. కోర్టులో కూడా సీబీఐ అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటామ‌ని చెప్పేసింది. స‌రిగ్గా నాలుగేళ్ల క్రితం మార్చి 14న వివేకానంద‌రెడ్డిని అత్యంత కిరాత‌కంగా చంపేశారు. ఇప్పుడు హైకోర్టు కూడా మార్చి14న సీబీఐ ముందు హాజ‌ర‌వ్వాల‌ని సూచించ‌డం...అదే రోజు అరెస్టు త‌ప్ప‌ద‌ని, ఇది దేవుని స్క్రిప్ట్ అంటున్నారు నెటిజ‌న్లు.  ఏ బాబాయ్ హ‌త్య‌ని చూపించి 2019 ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందారో అదే హ‌త్య‌కేసు త‌న మెడ‌కి చుట్టుకోవ‌డంతో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కి తెర‌తీశారు. మార్చి 14న అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే, ఆ టాపిక్ నుంచి జ‌నాల్ని డైవ‌ర్ట్ చేయ‌డానికి చాలా పెద్ద ప్లాన్లు వైసీపీ వేసింద‌ని జ‌రుగుతున్న ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఓ వైపు స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కాం పేరుతో సీఐడీ అరెస్టులు, మ‌రోవైపు రాజ‌ధాని భూముల కేసులో నారాయ‌ణ ఇంటి చుట్టూ తిరుగుతున్న సీఐడీ, తాజాగా ఏపీ వ్యాప్తంగా మార్గదర్శి అధికారుల‌ని అదుపులోకి తీసుకుంటున్న సీఐడీ కేసుల‌ని చూస్తే...అవినాష్ అరెస్టు త‌ప్ప‌ద‌ని తేలిపోతోంది. ఆ అరెస్టుని డైవ‌ర్ష‌న్ చేయ‌డానికే సీఐడీని వాడుకుని ప్ర‌తిప‌క్షం, ప్ర‌ధాన మీడియా సంస్థ‌ల‌పై కేసుల‌ని తెలుస్తోంది.

Advertisements

Latest Articles

Most Read