గ‌త మిత్రులు మ‌ళ్లీ ఒక్క‌ట‌వుతున్నారా? క‌మ‌లంతో క‌లిసి మెలిసి సైకిల్ ప్ర‌యాణం సాగ‌నుందా? తెలుగు రాష్ట్రాల‌కి దూరంగా తెలుగుదేశం అభ్య‌ర్థి ఉన్న‌త ప‌ద‌విలో బీజేపీ కూర్చోబెట్టిన సంద‌ర్భంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు చేసిన ట్వీట్ హాట్ హాట్ చ‌ర్చ‌ల‌కు దారి తీస్తోంది.
పోర్ట్బ్లెయిర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్గా తెలుగుదేశం అభ్యర్థి ఎస్.సెల్వీ ఎన్నికయ్యారు. టిడిపి, బీజేపీ పొత్తులో భాగంగా సెల్వీ ఎన్నికయ్యారు. ఒప్పందంలో భాగంగా మొదటి మూడేళ్లు బీజేపీ అభ్యర్ధి మున్సిపల్ చైర్మన్గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. పదవీకాలం పూర్తి కావడంతో చివరి రెండేళ్లకు టీడీపీ అభ్యర్ధి సెల్వీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అండమాన్ నికోబార్ ఐల్యాండ్ టీడీపీ యూనిట్కు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ సెల్వీకి చంద్రబాబు అభినందనలు తెలిపారు. బీజేపీ-టీడీపీ పొత్తుతో సమైక్యంగా విజయం సాధించడం హర్షణీయమంటూ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ట్వీట్ చేశారు. కూటమికి అభినందనలు తెలియజేశారు. పోర్ట్బ్లెయిర్ ప్రజల కోసం చేసిన కృషి, అంకితభావం ఫలించాయని, ప్రధానిపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని నడ్డా ట్వీట్‌లో తెలిపారు. పోర్టుబ్లెయిర్‌లో పొడిచిన ఈ పొత్తు, తెలుగురాష్ట్రాల్లో విక‌సించ‌నుంద‌ని విశ్లేషకుల అభిప్రాయం. ఇటీవ‌ల వ‌ర‌కూ వైసీపీ కోసం ఎంత‌కైనా తెగించేలా నిర్ణ‌యాలు తీసుకుంటూ వ‌చ్చిన కేంద్రంలోని బీజేపీ, ఇటీవ‌ల వైసీపీకి దూరం అవుతూ వ‌స్తోంద‌ని ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఏపీలో వైసీపీ స‌ర్కారుకి తీవ్ర‌మైన ప్ర‌జావ్య‌తిరేక‌త‌ని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ‌లోనూ బీజేపీ అధికారంలోకి రావాలంటే తెలుగుదేశం స‌హ‌కారం తీసుకోవ‌చ్చ‌నే ఉద్దేశంతోనే బీజేపీ స్టాండ్ మార్చుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలున్నారు. టిడిపి నుంచి న‌లుగురు, జ‌న‌సేన నుంచి ఒక‌రు తోడ‌య్యారు. మొత్తంగా 156 మంది ఉంటే..టిడిపిలో ఉన్న‌ది 19 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే. అందులో ప్ర‌తిప‌క్ష‌నేత త‌న‌ని అవ‌మానించిన కౌర‌వ‌స‌భ‌కి రాన‌ని బాయ్ కాట్ చేశారు. అంటే 18 మంది ఎమ్మెల్యేలే. వీరి ప్ర‌శ్న‌ల‌కి కూడా స‌మాధానాలు ఇవ్వ‌లేని స్థితిలో ఉన్న స‌ర్కారు స‌స్పెన్ష‌న్ల‌కి తెగ‌బ‌డింది. అవినీతి, రాజ్యాంగ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌న్నింటినీ క‌డిగి పారేస్తున్న పీఏసీ చైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్, పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడుల‌ను స‌స్పెండ్ చేశారు. మిగిలిన టిడిపి ఎమ్మెల్యేల‌నూ స‌స్పెండ్ చేసినా, బడ్జెట్ సమావేశాల్లో బొక్కలు బయట పడతాయని, పయ్యావుల, నిమ్మలని సెషన్ మొత్తం సస్పెండ్ చేయించింది జ‌గ‌నేన‌ని అసెంబ్లీ లాబీల్లో టాకు వినిపిస్తోంది. పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసిన వెంట‌నే వారు త‌మ స్పంద‌న‌ని తెలియ‌జేశారు. శాసనసభ సమావేశాలు ముగిసేంతవరకు సస్పెన్షన్ వేటు వేయ‌డంతో బ‌డ్జెట్ స‌మావేశాల‌లో స‌ర్కారు బొక్క‌లు బ‌య‌ట‌పెడ‌తార‌నే భ‌యంతోనే మిగతా సభ్యుల్ని ఈ ఒక్కరోజు సస్పెండ్ చేసిన స్పీకర్, వీరిద్దరినీ సెష‌న్స్ మొత్తానికి స‌స్పెండ్ చేశారు. సీట్లో నుంచి కదలని త‌న‌ను సస్పెండ్ చేయటం ఆశ్చర్యం కలిగిస్తోంద‌ని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సింహం సింగిల్ గా వస్తుందని చెప్పుకునే వారు మా సభ్యులకు సమాధానం చెప్పలేక సస్పెన్షన్ మార్గం ఎంచుకుంటున్నార‌ని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం చెప్పించిన అసత్యాలు అసెంబ్లీలో ఆధారాలతో సహా ఎండగడతామనే త‌మ‌ని సస్పెండ్ చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఇటీవ‌ల‌కాలంలో కేబినెట్ మీటింగ్ నిర్వ‌హించిన సంద‌ర్భంగా మంత్రుల ప‌నితీరుపై సీఎం వ్యాఖ్య‌లు చేస్తుండ‌డంతో కొంద‌రికి ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని వార్త‌లు వ‌స్తున్నారు. గ‌తంలో ఓపెన్‌గానే ప‌నితీరు బాగాలేద‌ని, కొంద‌రు కొత్త‌వారిని తీసుకుంటామ‌ని లీకులిచ్చిన సీఎం..తాజా కేబినెట్ భేటీలోనూ ముగ్గురుకి ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించార‌ని టాక్ వినిపిస్తోంది.   మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన నుంచీ వివాదాలు బాట ప‌ట్టిన రాయ‌ల‌సీమ‌కి చెందిన మహిళా మంత్రికి ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. ఆమె మ‌ళ్లీ టీవీ షోలు చేసుకోవాల్సిందేన‌ని వైసీపీ స‌ర్కిల్‌లో టాక్‌. మ‌రోవైపు అమాయ‌క‌త్వంతో న‌టిస్తూ, వైసీపీ స‌ర్కారుని ఎర్రి పుష్పం చేస్తున్న కోడిగుడ్డు శాఖా మంత్రిని త‌ప్పిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది.  కేబినెట్ భేటీ పూర్త‌య్యాక వెళ్లిపోతున్న మంత్రుల్ని పిలిచి చాంబ‌ర్లో క్లాస్ తీసుకోవ‌డంతో వీరికి బుగ్గ కారు యోగం త‌ప్పిన‌ట్టేన‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల స‌మాచారం.  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలిపించే బాధ్యతలను మంత్రులకు సీఎం కట్టబెట్టారు. ఒక్కో మంత్రికి ఆరుగురు ఎమ్మెల్యేల బాధ్యతలను ఆయన అప్పగించారు. గెలిపించ‌క‌పోతే మంత్రి ప‌ద‌వులు వ‌దులుకోవ‌డానికి సిద్ధంగా ఉండ‌మంటూ వార్నింగ్ ఇచ్చార‌ట‌.  గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో  ఇద్ద‌రు మంత్రుల‌కు సీఎం మంద‌లించారు. ఒకరేమో అనవసరంగా వేరే నియోజకవర్గాల్లో తలదూర్చడం.. ఇంకో మంత్రిపై భూ తగాదాల ఆరోపణలు రావడంతో ఇద్దరినీ  పిలిచి హెచ్చరించి పంపార‌ని తెలిసింది. లేటెస్ట్ మంత్రివర్గ సమావేశంలో గ‌తంలో కోటింగ్ అందుకున్న మంత్రుల‌కి రీ కోటింగ్ ప‌డిన‌ట్టు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్న స‌మాచారం. ఈ లెక్క‌న ఈ మంత్రుల‌కి మ‌రో అవ‌కాశం లేన‌ట్టే.

క‌మ‌లంతో త‌న ప్ర‌యాణం ఉండ‌ద‌ని జ‌న‌సేన ఆవిర్భావ‌స‌భ‌లో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప్ర‌క‌టించ‌డంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. అంద‌రి కంటే ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆందోళ‌న‌కి గుర‌య్యారు. ఇన్నాళ్లూ బీజేపీకి ఉన్న 0.50 శాతం ఓటింగ్ బ‌లం కంటే, జ‌న‌సేన‌కి ఉన్న 10 శాతం ఓటింగ్‌ని చూపించి అటు అధిష్టానం ద‌గ్గ‌ర‌, ఇటు వైసీపీ ద‌గ్గ‌ర మంచిగానే వెన‌కేసుకున్నార‌ని బీజేపీలో టాక్ వినిపిస్తోంది. బంద‌రులో జ‌రిగిన ఆవిర్భావ సభా వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుల‌పై స్పందించారు. బీజేపీతో పొత్తులో ఉంటే ముస్లింలు దూరం అవుతారని, అందుకే తాను బీజేపీకి దూరంగా జరుగుతాన‌ని చెప్ప‌డం ద్వారా బీజేపీతో పొత్తు తెంపేసుకున్నాన‌ని చెప్ప‌క‌నే చెప్పారు. దీనిపై వైసీపీ క్యాంపులో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. ఎందుకంటే టిడిపితో జ‌న‌సేన జ‌ట్టు క‌లిగితే క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని రాజ‌కీయ విశ్లేషకుల మాట‌. స‌ర్వేలు ఇదే చెబుతున్నాయి. అందుకే జ‌న‌సేన టిడిపితో కల‌వ‌కూడ‌ద‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. పేరుకి బీజేపీ అధ్య‌క్షుడైనా వైసీపీ కోస‌మే ప‌నిచేస్తార‌నే పేరున్న సోము వీర్రాజు జ‌న‌సేన బీజేపీతో క‌టీఫ్ చెప్ప‌డంతో టెన్ష‌న్ ప‌డుతున్నారు. తాను అధ్య‌క్షుడిగా ఉన్న‌పార్టీ, త‌న‌ని ప్రేమ‌గా చూసుకునే వైసీపీ అధికార కోల్పోతుంద‌నే ఆందోళ‌న నెల‌కొంద‌ట‌. బీజేపీతో కొన‌సాగేది లేద‌ని పవన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత సోము వీర్రాజు వెర‌యిటీగా స్పందించారు. జనసేన, టీడీపీ పొత్తుపై పవన్ ఎక్కడా మాట్లాడలేద‌ని, బీజేపీ పొత్తుపైనే మాట్లాడార‌ని, టీడీపీతో పొత్తుపై జనసేన క్లారిటీ ఇచ్చాక మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామ‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్ర‌క‌టించారు. మొత్తానికి ప‌వ‌న్ పొత్తు ఉండ‌ద‌ని చెప్ప‌డం ద్వారా సోమువీర్రాజుకి, వైసీపీకి గ‌ట్టి షాకే ఇచ్చారు.

Advertisements

Latest Articles

Most Read