ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై నమోదు అయిన సిఐడి కేసుకు సంబంధించి, తెలుగుదేశం పార్టీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తుంది. ఎఫ్ఆర్ సర్టిఫైడ్ కాపీ కోసం నిన్న ఉదయం దరఖాస్తు చేసారు. 24 గంటల్లో సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలని కోరుతూ నిబంధనలు ఉన్నాయి. ఈ రోజు సర్టిఫైడ్ కాపీ వచ్చే అవకాసం ఉంది. సర్టిఫైడ్ కాపీ వచ్చిన వెంటనే, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఇచ్చిన కంప్లైంట్, దాని పై నమోదు అయిన ఎఫ్ఐఆర్ పై క్వాష్ పిటీషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం నేతలు చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి 23వ తేదీ వరకు వైట్ చేయటం, దాని పై చర్చ జరగటం ఇవన్నీ అనవసరమైన వివాదాలకు తావు ఇచ్చినట్టు అవుతుందని, అందువల్ల ఈ లోపే, ఈ ఎఫ్ఐఆర్ పై క్వాష్ పిటీషన్ వేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా 2015లో ఆంధ్రప్రదేశ్ లో సిఆర్డీఏ చట్టం అమలులోకి వచ్చింది. ఈ సీఆర్డీఏ చట్టానికి అసెంబ్లీ ఆమోదం కూడా తెలిపింది. ఈ సిఆర్డీఏ చట్టంలో నిబంధాలు ప్రకారమే జీవో ఇచ్చారని, నిబంధనలకు అనుగుణంగానే, రాజధానిలోని అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు, ఇలా ఆరు రకాల భూములుకు సంబంధించి జీవో ఇచ్చారని తెలుగుదేశం నేతలు చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఒక జీవోకి దురుద్దేశాలు ఆపాదించటం సరికాదని న్యాయవాదులు చెప్తున్నారు.
రాజధాని నిర్మాణం అనేది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిందని, అటువంటి అప్పుడు ఆ రాజధాని ప్రజా ప్రయోజనాల కోసం అయినప్పుడు, భూములు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని, అలాగే బయట జరిగిన లావాదేవీలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ లో పేర్కున్న అంశాలు కూడా అభ్యంతరంగా ఉన్నాయని, ఎవరో రైతులు, ఎవరో మధ్యవర్తులు అంటూ, ఎక్కడ భూమీ, ఏ ఊరిలో భూమి, ఇలా ఏమి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్ లో చెప్పటం, దానికి సంబంధం లేని సెక్షన్ల కింద కేసు నమోదు చేయటం పై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టటం పై కూడా అభ్యంతరం వ్యక్తం అవుతుంది. అసలు ఈ సెక్షన్ కింద కేసు ఎలా పెట్టారో కూడా ఆశ్చర్యం వేస్తుందని అంటున్నారు. అందుకే ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగం అని, ఎక్కడా ఏమి చెప్పకుండా, కేవలం గాల్లో ఆరోపణలు చేసి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే, దీని పై క్వాష్ పిటీషన్ వేస్తామని టిడిపి లీగల్ సెల్ అంటుంది.