వైసీపీనేతలను, ఆప్రభుత్వ విధానాలను చూస్తుంటే, రాక్షసులే గుర్తుకొస్తున్నారని, కలియుగ రాక్షసులుగా వైసీపీ వారినిచెప్పుకోవాల్సిందేనని టీడీపీజాతీయ అధికార ప్రతిని ధి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన తననివాసంనుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "చంద్రబాబునాయుడిగారికి ప్రభుత్వమిచ్చిన నోటీసులు వైసీపీనేతల రాక్షసత్వానికి పరకాష్టగా చెప్పాలి. ప్రభుత్వం ఏం చేస్తుందో, ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎన్నికల్లో గెలుపుకోసం జగన్ ప్రభుత్వం పకడ్బందీగా ఒకపథకం ప్రకా రం పనిచేసింది. ముందు టీడీపీకి పడే ఓట్లను తొలగించారు. తరువాత రిజర్వేషన్లలో మార్పులుచేశారు. ఎక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను పెట్టాలో ఆలోచించిమరీ ఆప్రకారం రిజర్వే షన్లు అమలుచేశారు. అధికారపార్టీవారికి అనుకూలంగా ఉం డేలా వార్డులు, డివజన్ల పరిధులను మార్చారు. ఒకే కుటుంబంలోని ఓట్లను వివిధ డివిజన్లకు మార్చేశారు. నామినేషన్ల సమయంలో నోడ్యూస్, క్యాస్ట్ తదితర సర్టిఫికెట్లు ఇవ్వకుండా అధికారులపై ఒత్తిడితెచ్చారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, వేసినవారిని బెదిరించడం, టీడీపీ అభ్యర్థులతో బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింపచేయడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. ఈ విధంగా ఎన్నికల్లో పోటీచేయడం కోసం ప్రతిపక్షపార్టీలకు చెందిన వారుఅనేక గండాలను దాటా ల్సి వచ్చింది. తరువాత ప్రచారంచేయకుండా అడ్డుకోవడం, అక్రమకేసులుపెట్టి జైళ్లకుపంపడం చేశారు. ఎన్నికలు జరిగే రోజుకి టీడీపీవారిని బయటకురాకుండా అక్రమంగా నిర్బంధించారు. ఓటర్లను బెదిరించి, ఎక్కడికక్కడ అధికార పార్టీ వారే రిగ్గింగులకు పాల్పడ్డారు. ఇవన్నీ తట్టుకొని ఎక్కడైనా ఇంకా టీడీపీవారు నిలబడితే, వారిని పోలీసులతో కి-డ్నా-ప్ చేయిం చారు. మైదుకూరులో టీడీపీ విజయంసాధిస్తే, మైనారిటీ మహిళను పోలీసులే బెదిరించి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీతప్ప, అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వైసీపీపరమే అయ్యాయి. అంతటితో ఆగని ఈ రాక్షసమూక, కొత్తగా ఆపరేషన్ తాడపత్రి పేరుతో దారుణాలకు తెగబడింది. తాడపత్రిని కైవశంచేసుకునేందుకు ఒక మహాకుట్రతో రాక్షసులంతా ముందుకుసాగుతున్నారు.
టీడీపీ తరుపున గెలిచిన కౌన్సిలర్ల ఇళ్లకువెళ్లి, వారి కుటుంబ సభ్యులను, ఇంట్లోని ఆడవాళ్లను బెదిరిస్తున్నారు. (అందుకు సంబంధించిన వీడియోలను ఈసందర్భంగా దీపక్ రెడ్డి విలేకరులకు ప్రదర్శించారు) టీడీపీ తరుపున గెలిచిన ఒక కౌన్సిలర్ అభ్యర్థికి స్థానికంగా ఒక షోరూమ్ ఉంది. ఆషోరూమ్ ఎదుట వైసీపీఎమ్మెల్యే అనుచరులు సద రు కౌన్సిలర్ అభ్యర్థిపై బెదిరింపులకు పాల్పడ్డారు. జరుగుతున్న దారుణాలను టీడీపీనేత జే.సీ. అస్మిత్ రెడ్డి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు అధికారపార్టీ వారిని నిలువరించకుండా, టీడీపీవారిపైనే ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టారు. కమ్యూనిస్ట్ పార్టీ తరుపున గెలిచిన అభ్యర్థికి కోటి రూపాయలు ఇస్తామని ప్రలోభపెడుతున్నారు. ఇన్నిరకాలు గా వైసీపీఎమ్మెల్యే, టీడీపీ,ఇతరపార్టీల కౌన్సిలర్లను బెదిరి స్తూ, ప్రలోభాలకు గురి చేస్తుంటే, చేసేదిలేక వారందరినీ జే.సీ . ప్రభాకర్ రెడ్డి ఒకప్రాంతానికి తరలించారు. రాక్షసప్రభుత్వం ఎప్పుడు ఏంచేస్తుందో తెలియదుకనుక, వైసీపీనేతలనే రాక్షసులబారి నుంచి టీడీపీ కౌన్సిలర్లను కాపాడుకోవడానికి వారిని ప్రభాకర్ రెడ్డి గారు సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఈ మాట ఎందుకుచెబుతున్నామంటే, రేపు మేయర్ ఎన్నిక జరిగేసమయానికి టీడీపీవారంతా తమవద్దేఉన్నారని వైసీపీ ప్రభుత్వం చెప్పినా చెబుతుందని. అందుకే ముందు జాగ్రత్తగా అధికార పార్టీ నుంచి తమవారిని రక్షించుకోవడం జరిగింది. 20 మంది వరకు కౌన్సిలర్లు ప్రభాకర్ రెడ్డి గారి రక్షణలో ఉన్నారు వైసీపీకి 16మంది సభ్యులుమాత్రమే ఉన్నారు. ఎక్స్ అఫీషీయోసభ్యులను కలుపుకున్నాకూడా, వారి బలం 18కి మాత్రమే పరిమితమవుతుంది. రెండుఓట్లు టీడీపీకి అధికం గా ఉన్నప్పుడు, వైసీపీవారు ఎలా ఛైర్మన్ అవుతారు? నేను నాఓటుహక్కుని తాడిపత్రిలోనే ఉపయోగించుకున్నాను. తాడిపత్రిలోనే నా ఎక్స్ అఫీషియో ఓటుని వినియోగించు కోవడానికి దరఖాస్తు చేసుకుంటే, దాన్ని తిరస్కరించారు.
స్థానికంగా ఓటువేయని అధికారపార్టీఎమ్మెల్సీల ఎక్స్ అఫీషియో ఓట్లను తిరస్కరించామంటూ, నా ఎక్స్ అపీషీయో ఓటుని కూడా తిరస్కరించారు. స్థానికంగా ఓటుహక్కులేని అధికారపార్టీ నేతల ఎక్స్ అఫీషియో ఓట్లను తిరస్కరించడం బాగానేఉంది. కానీ తాడిపత్రిలోనే ఓటువేసిన నా ఎక్స్ అఫీ షియో ఓటుని ఎలా తిరస్కరిస్తారు? ప్రభుత్వం తీరు ఎంతటి అక్రమమో చూడండి. వైసీపీఎంపీ తన ఎక్స్ అఫీషియో ఓటు ని అనంతపురం టౌన్లో వినియోగించుకుంటానని చెప్పాడు. అతన్ని తీసుకొచ్చి తాడిపత్రిలో ఓటువేయిస్తామని ఎలా చెబుతారు? వైసీపీకి ఒకన్యాయం, టీడీపీవారికి మరోన్యాయ మా? ప్రభుత్వతీరుపై, వైసీపీ రాక్షసత్వంపై తాముకోర్టుని ఆశ్రయించాము. కోర్టుల్లో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. కోర్టు తీర్పువచ్చాక నాఓటుహక్కుని తిరస్కరించిన అధికారులపై కూడాచర్యలు తీసుకుంటాను. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీవారు గెలిస్తే, నేనేమిటో , నాసత్తా ఏమిటో జే.సీ.సోదరులకు చూపుతానని, నా భార్యనో , నాతమ్ముడినో మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకుంటానని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎన్నికలకు ముందు జే.సీ. కుటుంబానికి ఛాలెంజ్ విసిరారు. వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయాక, తాను విసిరిన ఛాలెంజ్ కు కట్టుబడి పెద్దారెడ్డి రాజీనామా ఎందుకు చేయలేదో తెలియదు. ఆయన పేరుకే పెద్దారెడ్డని తేలిపోయింది. ఆయన విసిరిన ఛాలెంజ్ కు ఆయనే కట్టుబడకపోతే ఎలా? తాడిపత్రి ప్రజలు వైసీపీని, ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తిరస్కరించాక కూడా ఆయన రాజీనా మాచేయలేదు. తనపేరులో ఉన్నపెద్దరికాన్ని ఆయన నిలబె ట్టుకోలేకపోయాడు. నిజంగా వైసీపీఎమ్మెల్యే పెద్దారెడ్డికి దమ్ముంటే, ఆయన రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేస్తే తిరిగి అక్కడ గెలిచేదికూడా టీడీపీయేనని స్ఫష్టంగా చెబుతున్నాము. వైసీపీప్రభుత్వం నీతివంతంగా వ్యవహరించి, తాడిపత్రిలో టీడీపీవారికే మున్సిపల్ పీఠాన్ని అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాను.