మూడోసారి విచార‌ణ ముగించుకుని వ‌చ్చిన త‌రువాత సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి త‌మ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్య‌లు ఫ్ర‌స్టేష‌న్‌లో ఉన్నాయ‌ని అనిపిస్తోంది. వివేకా హ‌-త్య‌కేసు నుంచి ఎటూ త‌ప్పించుకోలేని స్థితిలో ఏకంగా వివేకా కుటుంబ‌స‌భ్యుల‌పైనే ఆరోప‌ణ‌ల‌కు బ‌రితెగించేశారు. వివేకానంద‌రెడ్డి అక్ర‌మ‌సంబంధాలు, రెండో భార్య వ‌ల్ల హ‌-త్య జ‌రిగింద‌ని అనుమానం వ్య‌క్తం చేయ‌డం ద్వారా తాను త‌ప్పించుకునే మార్గం చూసుకుంటున్నారు. మ‌రోవైపు వివేకా కుమార్తె సునీత చెప్పిన‌ట్టు సీబీఐ వింటోంద‌ని, సీబీఐ ఆదేశాల‌తోనే సునీత ఈ కేసులో ముందుకు వెళుతోంద‌ని అవినాష్ చెప్పారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేసే సీబీఐ, ఈడీలు అనేది ఎంపీ అవినాష్ రెడ్డికి తెలియ‌క‌పోవ‌డం విచిత్రం. అలాగే కేంద్రంతో త‌న అన్న జ‌గ‌న్ రెడ్డి సంబంధాలే ఇప్ప‌టివ‌ర‌కూ కాపాడుకుంటూ వ‌స్తున్నాయ‌ని అవినాష్ రెడ్డి మ‌రిచిపోయి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. సునీత చెప్పిన‌ట్టు సీబీఐ వింటే ఈ పాటికే ఆధారాలు అవినాశ్ వైపు చూపుతుండ‌డంతో ఎప్పుడో అరెస్ట‌య్యేవాడ‌ని అంటున్నారు. ఓ వైపు సీబీఐ సునీత చెప్పిన‌ట్టు వింటోంద‌ని అంటూనే,  సీబీఐ తీసుకున్న‌ది గూగుల్ టేకవుట్ కాదు.. టీడీపీ టేకవుట్ అని విమ‌ర్శించి అడ్డంగా బుక్క‌పోయారు అవినాష్. విచార‌ణ స‌మాచారాన్ని సీబీఐ వాళ్లే మా సోదరి సునీత‌కి ఇస్తున్నార‌ని అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. తాను లంచ్ మోషన్ వేసిన వెంటనే సునీత‌కి సీబీఐ సమాచారం ఇస్తోంద‌ని వాపోయారు.

వైసీపీ త‌న బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం మొద‌లుపెట్టింది. ఫేక్, మార్ఫింగ్ వైసీపీకి రాజ‌కీయాల‌తో పెట్టిన విద్య‌. విప‌క్షంలో ఉన్న‌ప్పుడే అప్ప‌టి అధికార టీడీపీపై ఫేక్ వార్ ప్ర‌క‌టించి అతిపెద్ద తెలుగుదేశం వ్య‌వ‌స్థ‌ని కకావిక‌లు చేసింది. 35 మంది క‌మ్మ డిఎస్పీలు, పింక్ డైమండ్, స‌చివాల‌యం కారిపోవ‌డం, అమ‌రావ‌తి మునిగిపోతుంది, రాజ‌ధానిలో భూకంపాలు వ‌స్తాయంటూ చేసిన ఫేక్ ప్ర‌చారాలు ఎంత‌గా ప్ర‌జ‌లు న‌మ్మారో 2019 ఎన్నిక‌ల ఫ‌లితాలు స్ప‌ష్టం చేశాయి. త‌న బాబాయ్‌ని చంపేసి, నారాసుర ర‌క్త‌చ‌రిత్ర అని ఫేక్ రాత‌లు నిస్సిగ్గుగా రాయించ‌డం వైసీపీ ఫేక్ గ్యాంగుల బ‌రితెగింపు ప‌రాకాష్ట‌. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఈ స్థాయిలో ఫేక్ చేసిన వైసీపీ అధికారం ఆయుధంగా అందింది. ఫేక్, మార్ఫింగ్  చేస్తూ పోలీసుల మాటున దాక్కుంటున్నారు. కౌంట‌ర్‌గా టిడిపి-జ‌న‌సేన పోస్టుల‌తో ఎటాక్ చేస్తే పోలీసుల్ని పుర‌మాయించి త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తున్నారు. చేతిలో అధికారం ఉన్నా ప్ర‌జల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త పెరిగిన నేప‌థ్యంలో ఫేక్ ప్రాప‌గాండాని మ‌ళ్లీ న‌మ్ముకుంది వైసీపీ. పేటీఎం బ్యాచులు, ఐప్యాక్ బృందాల‌న్నీ దిగిపోయాయి. కొద్దిరోజులుగా టిడిపి ల‌క్ష్యంగా వైసీపీ చేస్తున్న విష‌ప్ర‌చారాన్ని మ‌రింత తీవ్రం చేసింది. టిడిపి యువ‌నేత నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌పై విషం చిమ్ముతూనే..పార్టీలో గంద‌ర‌గోళం సృష్టించ‌డానికి మార్ఫింగ్ వీడియోలు, ఆడియోలు, ఫేక్ లెట‌ర్లు వ‌దులుతున్నారు. తెలుగు మ‌హిళ అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత వైఎస్ జ‌గ‌న్రెడ్డిని గెలిపించాల‌న్నార‌నే మార్ఫ్‌డ్ వీడియో వ‌దిలి, ఆమెపై చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఫేక్ లెట‌ర్ అచ్చెన్నాయుడి పేరుతో రిలీజ్ చేశారు. మ‌రోవైపు చంద్ర‌బాబు ఆడియోల‌ని ఫేక్ చేస్తున్నారు. కిందిస్థాయి కార్య‌క‌ర్త‌ల‌ని భ‌య‌పెట్టేందుకు గంజాయి కేసుల్లో అరెస్టు చేయించామ‌ని వైసీపీ ఫేక్ ప్ర‌చారం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో టిడిపి కోసం క‌ష్ట‌ప‌డుతున్న వారిని టార్గెట్ చేసి మ‌రీ ఇటువంటి త‌ప్పుడు ప్ర‌చారాల‌కి దిగ‌డం వైసీపీ మైండ్ గేములో భాగ‌మేన‌ని అర్థం అవుతోంది

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌-త్య‌కేసులో వైసీపీ క్యాంపు ఎత్తుగ‌డ‌లు ఒక్కొక్క‌టి నేర‌స్తుల ఆచూకీ చెబుతున్నాయి. గ‌తంలో వివేకా హ‌-త్య‌పై ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌ద‌ని కోర్టుకెళ్లి గాగ్ ఆర్డ‌ర్ తీసుకొచ్చారు వైఎస్ జ‌గ‌న్ రెడ్డి మ‌నుషులు. ఇప్పుడు వైఎస్ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయకుండా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ ఆయ‌న‌తోనే దాఖలు చేయించారు. దీంతో రెండు విష‌యాల‌ను అవినాశ్ రెడ్డి ఒప్పుకున్న‌ట్ట‌య్యింది. ఒక‌టి రేపు సీబీఐ అరెస్ట్ చేయ‌డం త‌ప్ప‌ద‌నేది, రెండోది విచార‌ణ సంద‌ర్భంగా వివేకానంద‌రెడ్డి హ‌-త్య‌లో త‌న పాత్ర‌ని ఒప్పుకున్న సంగ‌తి అని అనుమానాలు వ‌స్తున్నాయి. విచార‌ణ‌కి మూడోసారి పిలిచిన‌ప్పుడు మీటింగ్ల పేరుతో నాన్చుతున్న‌ప్పుడే ఏదో త‌ప్పించుకునే వ్యూహం ప‌న్నుతున్నార‌ని చాలా మంది ఊహించారు. అనుకున్న‌ట్టే విచార‌ణ‌కి ఒక రోజు ముందు తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పిటిష‌న్ దాఖ‌లు చేశారు. రేపు సీబీఐ విచారణకు హాజరుకానున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, సిబిఐ విచారణలో ఆడియో వీడియో రికార్డ్ చేయాలని, న్యాయవాది సమక్షంలో విచారించాలని కోరారు. అవినాష్ రెడ్డికి సిఆర్పిసి 160 కింద నోటీసు సిబిఐ అంద‌జేయ‌డంతో అరెస్టు త‌ప్ప‌ద‌ని నిర్ణ‌యించుకున్న అవినాష్ రెడ్డి చివ‌రి ప్ర‌య‌త్నంగా హైకోర్టు త‌లుపు త‌ట్టారు.

అక్ర‌మాస్తులు సంపాదించి కేసుల్లో అరెస్ట‌యి బెయిల్ పై విడుద‌లై ఉన్నారు వైఎస్ జ‌గ‌న్ రెడ్డి. సీబీఐ, ఈడీ, మ‌నీల్యాండ‌రింగ్, ఆర్థిక నేరాల కేసుల్లో ఆరితేరిపోయాడ‌ని ఆయ‌న‌పై కేసులే చెబుతాయి. అయితే ఏ కేసులోనూ విచార‌ణ‌కి హాజ‌రు కాడు జ‌గ‌న్. ఏ కేసు విచార‌ణ‌నీ కొలిక్కి రానివ్వ‌డు. 30కి పైగా కేసుల్లో వైఎస్ జ‌గ‌న్ రెడ్డి తెలివితేట‌లు చూసి సీనియ‌ర్ న్యాయ‌వాదులే నోరెళ్ల‌బెట్టేస్తున్నారు. వ్య‌వ‌స్థ‌ల‌ని, కేంద్రంలో పెద్ద‌ల్ని ఇంత‌గా మేనేజ్ చేయ‌క‌పోతే ఇన్ని కేసుల్లో, ఇన్నేళ్లు త‌ప్పించుకుని తిర‌గ‌డం సాధ్య‌మా? అని విశ్లేషిస్తున్నారు. వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేయ‌డం, కోర్టుల్లో విచార‌ణని జాప్యం చేయ‌డం ఎలాగే తెలిసిన విశేష అనుభ‌వం ఉన్న వైఎస్ జ‌గ‌న్ రెడ్డి త‌న త‌మ్ముడు అవినాశ్ రెడ్డికి ఇందులో శిక్ష‌ణ ఇస్తున్న‌ట్టు ప‌రిణామాలు చూస్తే అర్థం అవుతోంది. వైఎస్ వివేకానంద‌రెడ్డిని గుండెపోటు ప్ర‌చారంలోకి తెచ్చింది, ఆ త‌రువాత గొడ్డ‌లిపోటు థియ‌రీ చెప్పిందీ అవినాష్ రెడ్డే. ఆ త‌రువాత సీబీఐ విచార‌ణ కావాల‌ని డిమాండ్ చేసిన జ‌గ‌న్ రెడ్డి, సీఎం అయ్యాక సీబీఐ విచార‌ణ వ‌ద్ద‌ని కోర‌డంతో అనుమానాలు బ‌ల‌ప‌డ‌డం మొద‌లు అయ్యాయి. వివేకానంద‌రెడ్డి హ‌-త్య విష‌యంలో ఒక్కో నిజం వెల్ల‌డి అవుతుండ‌డంతో దీనిపై ఎవ్వ‌రూ మాట్లాడ‌టానికి వీళ్లేందుకు అంటూ కోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్తీసుకొచ్చారు. తాజాగా సీబీఐ త‌న‌ని అరెస్టు చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని వైఎస్ అవినాశ్ రెడ్డి హైకోర్టుని ఆశ్ర‌యించారు. ఇది అన్న‌య్య వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ఆదేశాల‌తోనే అని ప్ర‌చారం సాగుతోంది. జ‌గ‌న్ రెడ్డిపై మొత్తం 31 కేసులుండ‌గా అందులో సీబీఐ 11, ఈడీ 7 ఉన్నాయి. ఈ కేసుల‌లో కోర్టుల‌కి హాజరు కావ‌డాన్ని తప్పించుకోటానికి జ‌గ‌న్ రెడ్డి ఇప్ప‌టివ‌ర‌కూ వేసిన పిటిషన్లు 320 అని తెలుస్తోంది. అంద‌రినీ స్టేలు తెచ్చుకున్నారు, వ్య‌వ‌స్థ‌ల‌ని మేనేజ్ చేశార‌ని ఎద్దేవ చేసే జ‌గ‌న్ రెడ్డి వేసిన స్టే పిటిషన్లు 158 దాటిపోయాయి. 11 ఏళ్ల నుండి బెయిల్ ఉంటూ, సీఎం అయిపోయి రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌పై జ‌గ‌న్ రెడ్డి దా-డి చేస్తూనే ఉన్నారు. స్టేలు, డిశ్చార్జి పిటిష‌న్లు, వ్య‌వ‌స్థ‌ల మేనేజ్ చేయ‌డంలో ఆరితేరిపోయిన జ‌గ‌న్ రెడ్డి త‌న త‌మ్ముడు అవినాశ్ రెడ్డి వివేకా కేసులో అరెస్టు కాకుండా ట్రైనింగ్ ఇచ్చార‌ని తెలుస్తోంది.

Advertisements

Latest Articles

Most Read