వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌ని ముందు గుండెపోటు అని, ఆ త‌రువాత గొడ్డ‌లిపోట‌ని వైసీపీ ప్ర‌చారంలోకి తీసుకొచ్చింది. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కి ముందు, వైసీపీ సీట్ల ప్ర‌క‌ట‌న‌కి ముందు జ‌రిగిన ఈ హ‌త్య‌ని వాడుకోవ‌డం ద్వారా వైసీపీ అధికారంలోకి వ‌చ్చింద‌ని మాజీ వైసీపీ నేతే ఆరోపించారు. ఆయ‌నెవ‌రో కాదు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఆ త‌రువాత జ‌గ‌న్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడైన జ‌మ్మ‌ల‌మ‌డుగు ఆదినారాయ‌ణ‌రెడ్డి.    వైఎస్ వివేకానందరెడ్డిని హ-త్య చేసి నారాసుర ర‌క్త‌చ‌రిత్ర అంటూ టిడిపికి ఆ ర‌క్తం మ‌ర‌క‌లు అంటించే ప్ర‌య‌త్నం వెనుక అతి పెద్ద కుతంత్రం ఉంద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వెల్ల‌డించారు. వివేకానంద‌రెడ్డి హ‌త్య‌ని టిడిపిపైకి నెట్ట‌డంలో విజ‌యం సాధించిన వైసీపీ దీనిద్వారా టిడిపిని 50 స్థానాల్లో ఓడించింద‌ని తెలిపారు. త‌న ఓట‌మికి వివేకానంద‌రెడ్డి హ‌త్యే ప్ర‌ధాన కార‌ణ‌మ‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గ‌మే కాదు, క‌డ‌ప జిల్లాలో ఎక్క‌డ‌కి వెళ్లినా వివేకా హ‌త్య తానే చేశాన‌ని వంద శాతం ప్ర‌జ‌లు న‌మ్మార‌ని, అందుకే తాను ఓడిపోయాన‌ని చెప్పారు. వివేకా హ‌త్య‌పై వైసీపీ వాళ్లు చెప్పింది ప్రజలు వందశాతం నమ్మేశారన్నారు. ఇప్పుడు నిజాలు తెలిసి ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి వెల్ల‌డించారు.

వైసీపీ ఇటీవ‌ల కాలంలో స్కెచ్ వేసిన ప్ర‌తీది బొక్క‌బోర్లా ప‌డుతోంది. తాజాగా వంగ‌వీటి రాధా విష‌యంలో మైండ్ గేమ్ ఆడేందుకు ఐప్యాక్‌-వైసీపీ ఫేక్ అక్కౌంట్ల‌తో చేసిన ప్ర‌చారం ప్లాన్ బెడిసికొట్టేసింది. జ‌న‌సేన‌లో వంగ‌వీటి రాధా చేరిపోతున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసిన వైసీపీకి బ్రేకింగ్ న్యూస్ వ‌దిలింది టిడిపి. నారా లోకేశ్‌తో వంగవీటి రాధ భేటీకి రంగం సిద్ధ‌మైంద‌ని వార్త‌లు రెండు రోజుల ముందు వచ్చాయి. అనుకున్నట్టే పీలేరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర విడిది ప్రాంతంలో ఇరువురు నేతల సమావేశంఅయ్యారు. భేటీ అనంతరం నారా లోకేశ్‌తో కలిసి రాధ  పాదయాత్రలో పాల్గున్నారు. వైసీపీ కాపు నేత‌లే ల‌క్ష్యంగా చేసుకుని వంగ‌వీటి రాధాని టార్గెట్ చేశారు. వైసీపీ ఫేక్ ఖాతాల నుంచి వంగ‌వీటి రాధా పార్టీ మారుతున్నార‌నే స‌మాచారాన్ని స్ప్రెడ్ చేశారు. జ‌న‌సేన పేర్ల‌తో వైసీపీ చాలా రోజులుగా ఈ ఫేక్ ఖాతాలు న‌డుపుతోంది. ఈ ఖాతాల నుంచి జ‌న‌సేన గ్రూపుల్లోకి వైసీపీ పోస్టుల‌ను పుష్ చేసింది. ఈ ప్ర‌చారం తీవ్రం కావ‌డంతో వంగవీటి రాధా యువసేన స్పందించింది. రాధాపై కొంద‌రు కావాల‌నే దుష్ప్రచారాలు చేస్తున్నార‌ని,  రాధా ప్రతిష్టను మసకబార్చాలని కొందరు కుయుక్తులు పన్నుతున్నార‌ని,  ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు అని ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.  రాధా టిడిపిలోనే కొనసాగుతారని పదేపదే చెప్పాల్సిన అవసరం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. పదవుల కోసమో, ఇతర అవసరాల కోసం పార్టీలు మార్చే నైజం రాధాది కాద‌ని తేల్చి చెప్పారు. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులతో రాధా ప్రతిష్టను మంట కలపాలని చూసే వారి ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవ‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఇటువంటి అపోహ‌లు, అనుమానాలు సృష్టించేవారికి చెంప‌పెట్టులాగ నారా లోకేష్ పాద‌యాత్ర‌లో వంగ‌వీటి రాధా పాల్గుని, అందరి నోర్లు మూయించారు.

జీఎస్టీ. గూడ్స్ అండ్ స‌ర్వీస్ టాక్స్‌. దేశ‌మంతా వ‌స్తుసేవ‌ల ప‌న్నురూపంలో ఒకే దేశం-ఒకే ప‌న్ను విధానం అమ‌లు అవుతోంది. ఒక్క ఏపీలో జీఎస్టీతోపాటు జేఎస్టీ కూడా చెల్లించాల‌ట‌. జేఎస్టీ అంటే జ‌గ‌న్ సెల్ఫ్ ట్యాక్స్. ఇదీ ఏపీలో జ‌గ‌న్ రెడ్డి వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నుంచీ బ‌ల‌వంతంగా వ‌సూలు చేస్తున్న ట్యాక్స్‌. దీనిపై తెలుగుదేశం జె ట్యాక్స్ పేరు పెట్టింది. జ‌గ‌న్ రెడ్డికి ఒక‌ప్పుడు అత్యంత స‌న్నిహితుడు అయిన జ‌మ్మ‌ల‌మ‌డుగు ఆదినారాయ‌ణ రెడ్డి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఈ జ‌గ‌న్ సెల్ఫ్ ట్యాక్స్ గురించి వివ‌రించాడు. టిడిపి ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌లనూ జెఎస్టీ కోసం వేధించార‌ని, అవి క‌ట్ట‌లేక చాలా ప‌రిశ్ర‌మ‌లు విస్త‌ర‌ణ నిలిపేశార‌ని చెప్పుకొచ్చారు. వైసీపీకి మ‌ద్ద‌తు ప‌లికి గ‌త ఎన్నిక‌ల్లో వారి కోసం ప‌నిచేసిన మైసూరారెడ్డికి చెందిన తేజా సిమెంట్స్ జ‌గ‌న్ సెల్ఫ్ ట్యాక్స్ క‌ట్ట‌లేక ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయ‌లేద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి చెప్పారు. కేంద్రం విధించే జీఎస్‌టీ కంటే ఏపీలో జేఎస్టీ చాలా పవర్‌ఫుల్ అని, ‘జగన్‌ సెల్ఫ్‌ ట్యాక్స్‌’ను పారిశ్రామిక‌వేత్త‌లు తట్టుకోలేకపోతున్నార‌ని ఆరోపించారు. జగన్‌కు ఆస్తులు ఎన్నిచోట్ల ఉన్నాయో ఆయనకే తెలియద‌ని చెప్పుకొచ్చారు. కేర‌ళ‌లో అనంత పద్మనాభస్వామికి నేలమాళిగలు ఉన్నట్లే ఎన్ని నేలమాళిగలు ఉన్నాయో లెక్కేలేద‌ని, ఆయన అనంత పద్మనాభస్వామి అయితే.. ఈయన అనంత జగన్నాథస్వామి అంటూ జ‌గ‌న్ అవినీతిని బ‌య‌ట‌పెట్టారు.

ఎన్నెన్ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికాడు. దేశ‌మంతా త‌న వెంట వ‌చ్చేస్తుంద‌ని న‌మ్మ‌బ‌లికాడు. టీఆర్ఎస్ కి స‌మాధి క‌ట్టి దాని పునాదుల‌పై బీఆర్ఎస్ కి శంకుస్థాప‌న చేశాడు. త‌ర‌గ‌ని డ‌బ్బుని న‌మ్ముకుని తెలంగాణ జాతిపిత కాస్తా జాతీయ నేత అవ‌తారం ఎత్తాడు. అయితే నాలుగు మీటింగ్లు, ప‌ది మంది అవుట్ డేటెడ్ లీడ‌ర్ల చేరిక‌లు.. అంత‌కు మించి బీఆర్ఎస్ సాధించింది ఏమీ లేదు. మోదీని దింపేస్తా, ఢిల్లీ పీఠ‌మెక్కేస్తా అని క‌ల‌లు కంటుంటే..వివిధ రాష్ట్రాల నేత‌లు, బీజేపీయేత‌ర జాతీయ పార్టీల‌న్నీ స్టాలిన్ వైపు చూస్తున్నాయి. కేసీఆర్ ప‌రిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ని చూపించి  క‌విత‌ని ర‌క్షించుకోవ‌డం మిన‌హా ఇంకే ప్ర‌యోజ‌నమూ, ఇంకొక ప్ర‌త్యామ్నాయం క‌న‌ప‌డ‌టంలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్ప‌టికే పాత్ర‌ధారులు చాలా మందిని అరెస్టు చేశారు. సూత్ర‌ధారి అని చెబుతున్న కేసీఆర్ ముద్దుల త‌న‌య క‌విత‌ని విచార‌ణ‌కి పిలిచి వ‌దిలేస్తారా? ఇప్పుడు ఈ అనుమాన‌మే కేసీఆర్‌కి, బీఆర్ఎస్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వటం, అదే స‌మ‌యంలో క‌విత ఢిల్లీలో ధ‌ర్నా నిర్వహించ‌డం పెద్ద స్కెచ్ వేశామ‌నుకుంటున్నారు. కానీ అటువైపు నుంచి త‌రుముతోంది అన‌కొండ‌. తెలంగాణ జిల్లాల ప్ర‌జాప్ర‌తినిధులంద‌రినీ పిలిపించుకుని ఢిల్లీపై ఏం ఒత్తిడి తెస్తారో ఏమో కానీ గులాబీ ద‌ళ‌ప‌తి వ్యూహం ఏంటో తెలియ‌క నేత‌లు తిక‌మ‌క ప‌డుతున్నారు. అరెస్టు కాకుండా ఏం చేయాలి? అరెస్ట‌యితే ఏం చేయాల‌నేది ఇప్ప‌టికీ క్లారిటీ లేదు.

Advertisements

Latest Articles

Most Read