తొలివిడత పంచాయతీ ఎన్నికల నిర్వహణతీరుపై, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, రెవెన్యూఅధికారులు, ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణలో వ్యవహరించినతీరుపై టీడీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోందని, ఆపార్టీ జాతీయప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అసహనం వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ సరైనరీతిలో ఎన్నికలు నిర్వహించలేదనే అభిప్రాయంతో తామున్నామని, ప్రభుత్వంలోనివారు, అధికారపార్టీకి చెందిన ముఖ్యనాయకులు, ముఖ్యమంత్రి సహా అందరూ ఎన్నికలకమిషనర్ ని కార్నర్ చేసి, ఆయన్ని కులపరంగా, వ్యక్తిత్వంపరంగా, దూషిస్తూ, మానసికంగా వేధిస్తున్నారని తాము ముందునుంచీ చెబుతూనే ఉన్నామన్నా రు. అధికారపార్టీ అరాచకానికి, మంత్రుల బెదిరింపులకు ఎన్నికల కమిషనర్ తలొగ్గినట్లుగా తాము అనిపిస్తోందన్న రామయ్య, అందుకు తొలివిడత జరిగిన పంచాయతీఎన్నికలే నిదర్శనమన్నా రు. బరితెగించి మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్ని కల కమిషనర్ ఏంచర్యలు తీసుకున్నారని, హైకోర్టు తీర్పుపై ఎస్ఈ సీ ఎందుకు అప్పీలు చేయలేదని, అలాచేయకపోవడంలో ఎస్ఈసీ మెతకతనం ఉన్నట్లుగా తమకు అర్థమైందని రామయ్య స్పష్టంచే శారు. ఎస్ఈసీకి సహకరించిన అధికారులను బ్లాక్ లిస్ట్ లో పెడతా నని మంత్రి బహిరంగంగా బెదిరిస్తే, అతనిపై ఐపీసీ 506 ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రి పెద్దిరెడ్డి, రాజ్యాంగవ్యవస్థపై దాడికి దిగితే, అతనిపై కేసులు పెట్టి చర్యలు తీసుకునేలా ఎస్ఈసీ ఎందుకు వ్యవహరించలేకపో యాడన్నారు. పెద్దిరెడ్డి హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెం చ్ కు వెళితే, దానిపై ఎస్ఈసీ ఎందుకు డివిజన్ బెంచ్ లో అప్పీలు చేయలేదని రామయ్య ప్రశ్నించారు.

అవినీతికి, అరాచకానికి మారుపేరైన, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పుంగనూరు నియోజకవర్గంలో 83పంచాయతీలకు తొలిదశలో ఎన్నికలు జరిగితే, 69స్థానాలు ఏకగ్రీవమైతే ఎస్ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు? అంతటి ఘనచరిత్ర పెద్దిరెడ్డికి ఉందని ఎస్ఈసీ భావి స్తున్నారా అని రామయ్య నిగ్గదీశారు. తొలుత ఏకగ్రీవాలను ప్రకటించవద్దన్న ఎస్ఈసీ, తరువాత ఏకపక్షంగా ఏకగ్రీవాలను ప్రకటిచండానికి ఎలా ఒప్పుకున్నారన్నారు. ఎస్ఈసీ గవర్నర్ ను కలిసి వచ్చినతర్వాతే ఏకగ్రీవాలను ప్రకటించాలని ఆదేశించడం జరిగిందన్నారు. మాచర్ల నియోజకవర్గంలో పోలీస్ యంత్రాంగం, అధికారులుఉన్నారా అనే సందేహం కలుగుతోందన్న రామయ్య, అక్కడ 77స్థానాల్లో ఎన్నికలు జరిగితే, 76ఏకగ్రీవాలయ్యాయని, ఇండియాలో 29రాష్ట్రాల్లో ఎక్కడా ఈవిచిత్రం ఉండదన్నారు. ఇంత జరిగితే ఎన్నికలకమిషన్ ఏంచేస్తోందని రామయ్య ప్రశ్నించారు? 77స్థానాల్లో 76స్థానాలు ఎలాఏకగ్రీవమయ్యాయనే విషయంపై విచారణకు ఆదేశించకుండా, అన్నిస్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎస్ఈ సీ ఎలా ప్రకటిస్తుందన్నారు. గతంలోకూడా మాచర్లలో ఇప్పుడున్న ఎమ్మెల్యేనే అధికారంలోఉన్నాడని, ఆనాడుకానీ ఏకగ్రీవాలు ఇప్పు డెలా అయ్యాయనేదానిపై ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎస్ఈసీ పై లేదా అని రామయ్య మండిపడ్డారు. ఇవన్నీ చూశాకే ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి భయపడిందని తాము అంటున్నామన్నా రు. నాకు ఓటేయకపోతే, నాపార్టీ అభ్యర్థులను గెలిపించకపోతే, మీకు పథకాలురావని ఎమ్మెల్యే జోగిరమేశ్ అంటే, అతనికి తూతూ మంత్రంగా నోటీసులిచ్చిన ఎన్నికలకమిషన్ రేపట్నుంచీ ఇలా మాట్లాడొద్దని చెప్పడమేంటన్నారు. పబ్లిక్ మీటింగ్ లో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే తమకు ఓటేయకపోతే, ప్రభుత్వపరంగా వచ్చే రాయితీలు రావంటే, అతను వచ్చే ఎన్నికల్లో పోటీచేయకుం డా చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికలకమిషన్, నోటీసులిచ్చి ఊరుకో వడమేంటని రామయ్య నిగ్గదీశారు.

మంత్రి కొడాలినానీకి నోటీసులు ఇవ్వడం ముఖ్యంకాదని, చర్యలు తీసుకోవాలని విలేకర్లు అడిగినప్రశ్నకు సమాధానంగా రామయ్య అభిప్రాయపడ్డారు. మంత్రి కొడాలినానీ అసలు మనిషే కాడని, మనిషిరూపంలో ఉన్నచెత్తని, డంపింగ్ యార్డ్ అని, అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరమన్నారు. చంద్రబాబు నాయుడు రెండుసార్లు కొడాలినానీకి ఎమ్మెల్యే సీటుఇచ్చారని, అందుకుకృతజ్ఞతగా నానీ, చంద్రబాబునాయుడికాళ్లకు మొక్కడం తానుచూశానని రామయ్య తెలిపారు. నానీ వ్యాఖ్యలను అతని భార్యకూడా సమర్థించదని, ఆహా చంద్రబాబునాయుడిని ఏమి తిట్టావంటూ, ఆమె ఆయన మాటలను మెచ్చుకుంటే, తాను చెవి కోసుకుంటానని రామయ్య శపథం చేశారు. నానీ మాటలు విని, గుడివాడ ప్రజలందరూకూడా సిగ్గుతో మగ్గిపోతున్నారన్నారు. చంద్రబాబునైనా, ఆయనకుమారుడినైనా రాజకీయంగా విమర్శిం చాలేతప్ప, పరుషపదజాలంతో నోటికొచ్చినట్లు దూషించ డమేంటన్నారు? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్, మంత్రినానీ ని నిలువరించకుండా చోద్యంచూస్తున్నాడన్నారు. సమాజంలో ఉన్న పెద్దలు, గుడివాడప్రజలు నానీకి బుద్ధిచెప్పకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నారో తెలియడంలేదన్నారు. నానీ వ్యాఖ్యలపై ఛీఛీ..ఛీఛీ అన్న రామయ్య, అతని స్థానంలో నా తమ్ముడో, నాకొడుకో ఉండి చంద్రబాబుని దూషించిఉంటే, వాడిని లాగిపెట్టి కొట్టేవాడినన్నారు. 11కేసుల్లో ముద్దాయిగా ఉన్నా, రాష్ట్రాన్ని కొల్లగొట్టినా, తాను జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ గౌరవంగానే సంబోధిస్తానన్నారు. గుడివాడ ఓటర్లంతా ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకొని, కొడాలి నానీని మనిషిగా మార్చి, అతనిలో మానవత్వం నింపడానికి ప్రయత్నిస్తే మంచిదని రామయ్య హితవుపలికారు. ప్రజల ముందు మాట్లాడేటప్పుడు, నానీ సంభాళించుకొని మాట్లాడేలా అతన్ని తయారుచేయాల్సిన బాధ్యత గుడివాడవాసులపైనే ఉందన్నారు. కొడాలినానీ మానసికంగామార్పు చెందాలన్నారు.

వైసీపీలో నోటికి పని చెప్తూ, బూతులు మంత్రిగా పేరు తెచ్చుకున్న కొడాలి నానికి ఎట్టకేలకు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. మొన్నటి వరకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పై ఇష్టం వచ్చినట్టు మంత్రి కొడాలి నాని మాట్లాడిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ మా బొచ్చు పీకుతాడా అంటూ జుబుక్సాకరంగా కూడా మంత్రి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే అప్పట్లో ఎన్నికలు లేకపోవటంతో, ఈ విషయం పై ఎన్నికల కమీషనర్ కేవలం గవర్నర్ కు ఫిర్యాదు చేసి వదిలేసారు. అయితే ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉండటంతో, ఈ సందర్భంగా కొడాలి నానీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ నోటికి పని చెప్పారు. అయితే ఈ సారి మాత్రం ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకోలేదు. మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసు పంపించింది. సాయంత్రం 5 గంటల లోపల, ఆయన వ్యక్తిగతంగా కానీ, ఆయన ప్రతినిధి ద్వారా కానీ, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ కు వచ్చి వివరణ ఇవ్వాలని కోరింది. కొద్దిసేపటి క్రితం మంత్రి కొడాలి నానీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ కు, దురుద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేసారు. దీంతో మంత్రి మాట్లాడిన పూర్తి వీడియోను ఎన్నికల కమిషన్ పరిశీలించింది. పరిశీలించిన తరువాత, ఈ వ్యవహారం పై నోటీసులు ఇవ్వాలని భావించిన నేపధ్యంలో, సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసారు.

kodali 12022021 2

ఎన్నికల కమిషన్ జాయింట్ సెక్రటరీ పేరుతో ఈ నోటీసు జారీ చేసారు. మంత్రి కొడాలి నాని సంతృప్తికర సమాధానం ఇవ్వని పక్షంలో, తదుపరి చర్యలు ఉంటాయని, ఎన్నికల కమిషన్ ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఇలాంటి ఆక్షనే తీసుకున్న పరిస్థితి ఉంది. చివరకు ఆయన కోర్టుకు వెళ్లి, కొంత మేరకు రిలీఫ్ పొందారు. నిన్న జోగి రమేష్ పై కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. ఈ రోజు మంత్రి కొడాలి నాని పై కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. ముందు నుంచి కూడా కొడాలి నానీ, ఎన్నికల కమిషన్ పై పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కమీషనర్ పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే అప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి, కొడాలి నాని ఆటలు సాగాయి. ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉండటం, ఎన్నికల కమీషనర్ కు అధికారం ఉండటంతో, ఈ రోజు కొడాలి నాని పై చర్యలకు, ఉపక్రమించారు. మరి మంత్రి కొడాలి నాని వివరణ ఇస్తారా లేదా అనేది చూడాలి. దీని పై ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

కృష్ణా జిల్లా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల పై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. కొద్ది సేపటి క్రితం, ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం, ఈ నెల 17 వరకు కూడా, మీడియాతో మాట్లాడవద్దు అని, ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా,ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే విధంగా, జోగి రమేష్ వ్యవహరించటానికి వీలు లేదని, ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున కాకుండా, వేరే పార్టీ తరుపున ఎవరైనా ఎన్నికల్లో పాల్గుంటు, నామినేషన్ వేస్తే, వాళ్లకు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సంక్షేమ పధకాలు కట్ చేయాలి అంటూ, జోగి రమేష్ నిన్న వ్యాఖ్యలు చేసారు. నిన్నటి నుంచి ఈ వీడియో వైరల్ కావటం, ప్రధాన మీడియాలో రావటం, అలాగే వివిధ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటంతో, వీడియోలు పరిశీలించిన ఎన్నికల కమిషన్, జోగి రమేష్ పై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17 వరకు మీడియాతో మాట్లాడకూడదు అని, అలాగే ఎన్నికల అధికారులను కానీ, మిగతా వారిని కానీ బెదిరించే విధంగా మాట్లాడటానికి వీలు లేదని స్పష్టం చేసింది. ప్రచారంలో పాల్గున్నప్పుడు కానీ, మిగత సందర్భాల్లో కానీ, ఎన్నికల ప్రక్రియ పై ప్రభావం పడే విధంగా మాట్లాడకూడదు అని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ అమలు చేయాలని, ఈ క్షణం నుంచి ఉత్తర్వులు అమలులోకి వస్తాయని తెలిపింది.

ఎన్నికల్లో జరుగుతున్న అధికార పార్టీ అరాచకాలు, గత నాలుగు రోజుల నుంచి ఎలక్షన్ కమిషన్ వైఖరి మారటంతో, తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న పత్రికా సమావేశం పెట్టిన చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు కొన్ని మండలాల్లో ఒక్క నామినేషన్ కూడా పడకుండా చూస్తున్నారని అన్నారు. బలంతపు ఎకగ్రీవాలు చేస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. ఎవరిని ఎన్నుకోవాలో, ఎంచుకునే స్వేఛ్చ కూడా ప్రజలకు లేదని అన్నారు. వైసిపీ చేస్తున్న అరాచకాలు ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కు పంపిస్తున్నా, ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని అన్నారు. పోలీసులను విచ్చలవిడగా వాడుతూ అరాచకం చేస్తున్నారని అన్నారు. ఎస్ ఐ లు, సిఐలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని, కేసులు పెడతాం అని వేధిస్తున్నారని, భయపెడుతున్నారని అన్నారు. ఒక మంత్రి, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు పాటిస్తే బెదిరిస్తాం అని చెప్తుంటే, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్ చోద్యం చూస్తున్నారని అన్నారు. ఇక ఎన్నికల కమిషన్ కూడా తమ అధికారాలను ఉపయోగించలేక పోతుందని చంద్రబాబు అన్నారు. కేవలం పుంగనూరులో జరుగుతున్న అరాచకాలకు సంబంధించి, ఇప్పటికి ఏడు లేఖలు పంపానని, ఎలక్షన్ కమిషన్ దగ్గరకు అభ్యర్ధులను కూడా పంపామని చంద్రబాబు అన్నారు.

cbn 12022021 2

దేనికీ స్పందన లేదని చంద్రబాబు అన్నారు. ఆన్లైన్ నామినేషన్ల విషయంలో, ఎందుకు వెనకడుగు వేసారో అర్ధం కావటం లేదని చంద్రబాబు అన్నారు. పుంగనూరులో 23 వుంటే 23 ఏకగ్రీవం చేసుకున్నారని, అలాగే రొంపిచర్లలో 10 నామినేషన్లు వేస్తే పది తిరస్కరించి మొత్తం ఏకగ్రీవం చేసుకున్నారని, సోమల్ లో 15 వుంటే మొత్తం 15 ఏకగ్రీవం చేసుకున్నారని, చౌడేపల్లిలో 17 వుంటే 14 బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారని, 85 పంచాయతీల్లో 82 ఏకగ్రీవాలు చేసుకన్నారని చంద్రబాబు అన్నారు. ఇంత విపత్కర పరిస్థితిలో ఎన్నికలకు వెళ్తున్నామని, ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలం అయ్యిందని చంద్రబాబు అన్నారు. ఈ అరాచకాల పై, ఈసికి దిశానిర్దేశం చేయమని, హైకోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. అరాచకాలు చేసి, ఏకాగ్రీవాలు చేసుకున్న చోట, ఈసీ పట్టించుకోక పొతే, హైకోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసామని చంద్రబాబు అన్నారు. ఇవి వదిలి పెట్టం అని, అవసరం అయితే సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్తాం అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read