షర్మిల కొత్త పార్టీ పై ఎట్టకేలకు జగన్ పార్టీ స్పందించింది. స్పందించింది కూడా జగన్ కు అత్యంత ఆప్తుడు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, షర్మిల పార్టీ పై స్పందించారు. షర్మిల రాజశేఖర్ రెడ్డి బిడ్డని, ఈ రోజు ఆమె తీసుకున్న నిర్ణయం పై తప్పుడు బాష్యాలు మీడియాలో వస్తున్నాయని సజ్జల అన్నారు. షర్మిల కొత్త పార్టీ పెడుతుందని, ఆమె పార్టీ గురించి మాకు ఏమి తెలియదు అని చెప్తే అది బుకాయింపు అవుతుందని అన్నారు. షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారు అంటూ, మూడు నెలల ముందు నుంచే మాకు తెలుసని, దీని పై చర్చలు జరుగుతున్న విషయం తమకు తెలిసిందని అన్నారు. షర్మిల పార్టీ పెట్టాలనే ఆలోచనలు భిన్నంగా ఉన్నట్టు ఉన్నాయని సజ్జల అన్నారు. జగన్ షర్మిల మధ్య ఎలాంటి విబేధాలు లేవు కానీ, భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తరణ విషయంలో జగన్ కు ఒక అభిప్రాయం ఉందని, దానికి వ్యతిరేకంగా షర్మిల ఆలోచనలు ఉన్నాయని సజ్జల అన్నారు. ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తెలంగాణాలో పార్టీ విస్తరణ పై మాత్రమే, ఇద్దరికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అన్నారు. ఈ విషయంలో షర్మిలతో చర్చలు జరిగాయని, ఆమెను నచ్చచెప్పే ప్రయత్నం జరిగిందని సజ్జల అన్నారు.

sharmila 09022021 2

పార్టీ పెడితే వచ్చే ఇబ్బందులపై షర్మిలకు వివరించమని సజ్జల అన్నారు. అయినా తెలంగాణాలో పార్టీ ఏర్పాటు పై ఇంకా షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సజ్జల అన్నారు. షర్మిల పార్టీ పెడితే దానితో వైసీపీకి సంబంధం ఉండదని అన్నారు. పార్టీ పెట్టటం అంటే సాహసం అనే చెప్పాలని సజ్జల అన్నారు. షర్మిల తీసుకునే నిర్ణయానికి ఆమె బాధ్యులు అవుతారని, ఫలితాలు ఎలా ఉన్నా, ఆమెకే వర్తిస్తాయని సజ్జల అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో మంది నాయకులను తయారు చేసారని, షర్మిలకు అవకాశాలు ఇవ్వేలేదు అని చెప్పటం కరెక్ట్ కాదని, ఆయన అవకాసం ఇస్తేనే కదా, అంత పెద్ద పాదయాత్ర చేసింది అంటూ సజ్జల అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి చెల్లిగా, వైఎస్ఆర్ కూతురుగా ఆమె సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా, నేనే విషెస్ చెప్తున్నప్పుడు, జగన్ ఆశీస్సులు కూడా ఉంటాయని అనుకుంటున్నా అంటూ, షర్మిల ఎంట్రీ పై సజ్జల వ్యాఖ్యలు చేసారు. మొత్తానికి సజ్జల ప్రెస్ మీట్ వింటుంటే, ఇద్దరి మధ్య గ్యాప్ చాలా పెరిగిందని అర్ధం అవుతుంది. ముందు ముందు ఇవి ఎక్కడి వరకు వెళ్తాయో చూడాలి.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రంగులు పిచ్చి ఎలాంటిదో ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. తమ పార్టీ రంగులు కనిపించిన ప్రతి దానికి వేసేసి చేసిన రచ్చ ఏంటో అందరికీ తెలిసిందే. చివరకు ప్రజలు అందరూ వెళ్ళే పంచాయతీ భవనాలు, స్కూల్స్, ప్రభుత్వ ఆఫీస్ లు,ఇలా వీటికి కూడా వైసీపీ రంగులు వేసిన సంగతి తెలిసిందే. కనీస స్పృహ కూడా లేకుండా చేసిన ఈ పని వల్ల అటు హైకోర్టులో, అటు సుప్రీం కోర్టులో కూడా చీవాట్లు తిన్నారు. చివరకు చీఫ్ సెక్రటరీ పై కోర్టు ధిక్కరణ వరకు వ్యవహారం వెళ్ళింది. మళ్ళీ రంగులు అన్నీ తీసి, వేరే రంగు వేయాల్సి వచ్చింది. ఈ చర్యతో దాదాపుగా 4 వేల కోట్లు దుర్వినియోగం అయ్యింది అంటూ, హైకోర్టులో మరో పిటీషన్ కూడా దాఖలు అయ్యింది. అయితే కోర్టు తీర్పుతో అయినా ఈ రంగులు పిచ్చి పోతుందని అందరూ అనుకున్నారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం, మళ్ళీ రంగులతో నింపేసింది. అసలు ప్రభుత్వ ఆస్తులకు, వైసీపీ రంగులు ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. తాజాగా బియ్యం సప్లై చేసే వ్యాన్ లకు, వైసీపీ రంగులతో పాటుగా, జగన్, రాజశేఖర్ రెడి బొమ్మలు వేసారు. అయితే ఇలాంటివి ఎన్నికల సమయంలో చెల్లవు అని చిన్న పిల్లలకు కూడా తెలుసు. చివరకు ఊరిలో ఉండే విగ్రహాలకు కూడా ముసుగులు వేస్తారు కాదా, ఇలాంటివి ఎలా ఒప్పుకుంటారు ?

vans 09022021 2

ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉండటంతో, వైసీపీ రంగులు, జగన్, రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఉన్న వ్యాన్లు ఆపేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. మీరు తిప్పాలి అనుకుంటే, రంగులు మార్చాలని సూచించింది. అదీ కాకుండా ఇప్పుడు పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, పట్టణాల్లో తిప్పుకోవచ్చని చెప్పింది. అయితే ప్రభుత్వం ఈ ఆదేశాల పై మళ్ళీ కోర్టుకు వెళ్ళింది. వ్యాన్ ల మీద రంగులు మార్చాలి అంటే, మూడు నెలలు పడుతుందని, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ రేపు విచారణకు వచ్చే అవకాసం ఉంది. అయితే ఇక్కడ ప్రభుత్వం పట్టింపు కాకపొతే, ఏమి లేదు. ఒకటి ఎన్నికలు అయ్యేంత వరకు ఆపుకుని, ఎప్పటి లాగా డీలర్లతో ఇప్పించవచ్చు. లేదు అంటే, ఈ నెలాఖరుతో ఎలాగూ పంచాయతీ ఎన్నికలు అయిపోతాయి కాబట్టి, వచ్చే నెల నుంచి యదావిధిగా తిప్పుకోవచ్చు. ఇప్పుడు ఎలాగూ ఇలానే చేస్తున్నారు కదా ? పట్టణాల్లో ఎక్కడా ఆంక్షలు లేవు కదా ? మరి ప్రభుత్వం రంగులు విషయంలో మళ్ళీ ఎందుకు కోర్టుకు వెళ్తుందో, వారికే తెలియాలి. ఏది ఏమైనా రేపు కోర్టు ఇచ్చే డైరెక్షన్ ఎలా ఉన్నా, అదే ఫైనల్ కాబట్టి, చూద్దాం కోర్టు ఏమి చెప్తుందో.

ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి, కేంద్రం నుంచి ప్రత్యేక హోదా ఎప్పుడు తెస్తున్నారు అంటే, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రూపాయి ఇవ్వకపోయినా, కేంద్ర బడ్జెట్ అద్భుతం అంటూ లేఖలు రాస్తారు. రైల్వే జోన్, పోర్ట్, స్టీల్ ఫ్యాక్టరీ, ఇలా విభజన హామీలు గురించి మాట్లాడమంటే మాట్లాడరు. పోలవరం డబ్బులు ఇవ్వమని అడగరు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం అంటే మెతకగా ఉంటారు. రాత్రి పూట వెళ్లి అమిత్ షా ని కలుస్తారు. మోడీ గారు కనిపిస్తే, కాళ్ళ మీద వంగిపోవటానికి ప్రయత్నం చేసారు. జగన్ మోహన్ రెడ్డి, ఒక పక్క ఇంత వినయంగా ఉంటూ, మోడీ, అమిత్ షా దృష్టిలో మంచిగా ఉండటానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంటే, జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం, ఏపి జనాల ముందు ఎలివేషన్లు ఇస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేస్తూ, కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి, పోస్కో తో కలిపి, ఈ డీల్ సెట్ చేసారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత గమనించిన వైసీపీ నేతలు, తాము కూడా పోరాటం చేస్తామని ముందుకు వచ్చారు. అంతటితో అపారా అంటే, ప్రజలను చుసిన ఉత్సాహంలో, ఏకంగా ప్రధాని మోడీకి వార్నింగ్ లు ఇస్తున్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు.

gudivada 08022021 2

విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మల్యే గుడివాడ అమర్నాథ్‌, మోడీని ఉద్దేశించి, ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేసారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేస్తున్న వారి దగ్గరకు వెళ్ళిన గుడివాడ అమర్నాథ్‌, మా జగన్ మోహన్ రెడ్డి 130 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీనే మట్టికరిపించారని, మాకు మోడీ పెద్ద లెక్క కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. మోడీని కూడా మట్టికరిపిస్తాం అనే విధంగా వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి చేసే పోరాటం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అంటూ, బీజేపీకే వార్నింగ్ ఇస్తున్నారు ఎమ్మెల్యే. అయితే ఇది ఏదో ఉత్సాహ పరుస్తునికి చేసినా వ్యాఖ్యలా, నిజంగానే ఇలా అన్నారో కానీ, ఎలా అన్నా సరే, ఈ మాటలు ఢిల్లీ వాళ్లకి తెలిస్తే, వాళ్ళు ఎలా మట్టికరిపిస్తారో, పాపం గుడివాడ అమర్నాథ్‌ గారికి తెలుసో తెలియదో అని, విశ్లేషకులు వాపోతున్నారు. అయతే యధావిధగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు మాత్రం, ఈ విషయంలో కూడా సైలెంట్ గా ఉన్నారు. అదే తెలుగుదేశం పార్టీ నేతలు ఏ చిన్న వ్యాఖ్యలు చేసిన పడిపోయే ఏపి బీజేపీ నేతలు సోము, జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. మరి రేపు అయినా నోరు విప్పుతారో లేదో చూడాలి.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, విజయసాయి రెడ్డి, రాజ్యసభ చైర్మెన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి, రాజ్యసభలోనే క్షమాపణ చెప్పారు. నిన్న రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడు పట్ల, అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి పై, కేంద్రమంత్రి, పార్లమెంటరీ శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి మందలించారు. రాజ్యసభ చైర్మెన్ పట్ల అందరికీ గౌరవం ఉండాలని, నిన్న జరిగిన సంఘటన పై, చేసిన వ్యాఖ్యల పై, విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకుని, క్షమాపణ కోరాలని, ప్రహ్లాద్ జోషి సభలోనే హెచ్చరించారు. ఈ విధంగా సభా గౌరవాన్ని మంటగలపకూడదు, రాజ్యసభ చైర్మెన్ స్థానాన్ని అందరూ కూడా గౌరవించాలి, క్షమాపణ చెప్పకపోతే కనుక ఏదైనా చర్యలు తీసుకోవాలి అంటూ ప్రహ్లాద్ జోషి రాజ్యసభాలోనే డిమాండ్ చేసారు. దీని పై స్పందించిన వెంకయ్య, ఇలా బలవంతంగా చెప్పించిన అవసరం లేదని వ్యాఖ్యలు చేస్తూ ఉండగానే, వెంటనే విజయసాయి రెడ్డి లెగిసి, వెంకయ్యకు క్షమాపణ చెప్పారు. నిన్న చేసిన వ్యాఖ్యలు ఉపసమహరించుకుంటున్నా అని, రాజ్యసభ చైర్మెన్ ను అగౌరవ పరచాలని అనుకోలేదు. నిన్న ఆవేశంలో మాట్లాడాను. చైర్ ను అనేంతటి వాడిని కాదు, నా వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమించండి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా, ఇలా మాట్లాడకుండా చూసుకుంటాను, అంటూ హామీ ఇచ్చారు. తొందరపాటులో, నిన్న అలా మాట్లాడానని, క్షమించమని కోరారు.

vsreddy 09022021 2

ఇక విషయానికి వస్తే, నిన్న రాజ్యసభలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో, సభలో పెద్ద గందరగోళం జరిగింది. నిన్న సభ ప్రారంభం కాగానే, విజయసాయి రెడ్డి లెగిసి పాయింట్ అఫ్ ఆర్డర్ అంటూ, 4 వ తారిఖు కనకమేడల, జగన్ పై చేసిన వ్యాఖ్యలు రికార్డ్స్ నుంచి తొలగించి, చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఏ రోజుకి ఆ రోజు అయితేనే పాయింట్ అఫ్ ఆర్డర్ ఇవ్వాలని, నాలుగు రోజులు క్రితం జరిగిన దానికి, ఇప్పుడు పాయింట్ అఫ్ ఆర్డర్ కుదరదు అని, అయితే మీరు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే, పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదు చేయాలని వెంకయ్య కోరారు. అయితే విజయసాయి రెడ్డి మాత్రం, ఊగిపోయారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చైర్మెన్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేసారు. వెంకయ్య మనసు టిడిపితో, తనువు బీజేపీతో ఉందని, పక్షపాతంతో వ్యవహరిస్తారని, టిడిపికి ఎక్కువ సమయం కేటాయిస్తారు అంటూ, ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కుదిరినట్టు అక్కడ కుదరదు కదా, నిన్నే కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు, బీజేపీ ఎంపీలు విజయసాయి రెడ్డిని తిట్టారు. ఈ రోజు దెబ్బకు దిగి వచ్చి, ఉపరాష్ట్రపతికి క్షమాపణ చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read