ఈ రోజు రాజధాని అమరావతిలో జగన్ సభకు విద్యాసంస్థల బస్సులను లాక్కున్నారు అధికారులు. దీంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్షలు ఉన్నా బస్సులను బెదిరించి అధికారులు లాక్కోవటంతో విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్సులు ఇవ్వలేమని చెప్పినా కళాశాలల యాజమాన్యాలపై అధికారులు ఒత్తిడి తెచ్చారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకే యాజమాన్యాల నుంచి బస్సులు తీసుకున్నారు. బస్సులు ఇవ్వకపోతే ఎలా తిరుగుతాయో చూస్తామంటూ అధికారులు విద్యాసంస్థల యాజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చారు. రాజధానిలో సీఎం సభకు హాజరయ్యేందుకు ప్రజలను తీసుకెళ్లేందుకు విద్యాసంస్థల బస్సులు అవసరమని అధికారులు చెప్పారు. అయితే, విద్యార్థులు పరీక్షల సమయం అని, వారు హాజరయ్యేందుకు బస్సులు అవసరమని కళాశాలల యాజమాన్యాలు చెప్పాయి. అయినప్పటికీ, అధికారులు విద్యార్థుల పరీక్షలను పట్టించుకోకుండా బస్సులను లాక్కున్నారు. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. బస్సులను బలవంతంగా తీసుకువెళ్లి సీఎం సభకు పంపేలా బెదిరించిన ప్రభుత్వం ఈ చరిత్రలోనే లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
news
అంబటి రాయుడుని ఐప్యాక్ పేటీఎం ఎంతలా వాడేస్తోందో చూడండి
అంబటి రాయుడు ముక్కుసూటి క్రికెటర్. బ్యాటుతోనూ, మాటలతోనూ సమాధానం చెప్పగల ఎగ్రెసివ్ నెస్ ఆయన సొంతం. ఇండియా టీమ్‌కి ఆడినా, ఐపీఎల్ లో సీఎస్కేతో జర్నీ చేసినా అంబటి రాయుడు స్టైలే వేరు. అంతర్జాతీయ మ్యాచుల్లో యాటిట్యూడ్-పాలిటిక్స్ వల్ల అవకాశాలు దక్కకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అంబటి రాయుడుకి క్రికెట్లో జరిగిన అన్యాయం పట్లా అందరిలోనూ సానుభూతి ఉంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే రాయుడు వేసిన పొలిటికల్ ఫ్రంట్ ఫుట్ అంబటిపై ఉన్న సాఫ్ట్ కార్నర్‌ని దూరం చేసింది. ఐపీఎల్లో ఆడుతూనే జగన్ రెడ్డి పాలనని ప్రశంసిస్తూ ట్వీట్లేసిన రాయుడు ..అనంతరం సీఎంని కలిసి వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానంటూ సంకేతాలు పంపారు. వైసీపీ అనుకూల మీడియా చానళ్లకి వైసీపీ లైనులో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీనికంతటికీ స్కెచ్ ఐప్యాక్ ఆఫీసులో రెడీ అవుతోంది. అంబటి రాయుడు క్రమం తప్పకుండా ఐప్యాక్ ఆఫీసులో కోర్ టీముతో భేటీ అయిన తరువాతే వైసీపీ అనుకూల చానళ్లకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారని తెలుస్తోంది. అంబటి రాయుడుని పేటీఎం టీములాగే వైసీపీ వాడుతోందని తెలుస్తోంది. అంబటిరాయుడులాంటి వారితో కుల, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టించి వైసీపీ అందులో చలికాచుకుని రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తోంది.
ముద్రగడ పద్మనాభంకి కుంభకర్ణుడు మాదిరి శాపం
కాపు జాతిని కాపాడే ఏకైక నేతని తానేనని ప్రకటించుకునే ముద్రగడ పద్మనాభంకి కుంభకర్ణుడు మాదిరిగానే శాపం ఉంది. ఇది చాలా విచిత్రమైన శాపం. వైసీపీ అధికారంలో ఉంటే ముద్రగడ హాయిగా నిద్రపోతాడు. టిడిపి అధికారంలో ఉంటే నిద్రమానేసి కాపు రిజర్వేషన్లు పేరుతో పోరాడుతుంటాడు. మళ్లీ వైసీపీ అధికారంలో ఉన్నా ఇబ్బందుల్లో ఉంటే నిద్రమత్తు వదిలేసి మరీ లేఖలతో విరుచుకుపడతాడు ముద్రగడ. సంబంధంలేని అంశాలపైనా ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడంతో వైసీపీ కోసం పనిచేసే కుంభకర్ణుడు ముద్రగడ పద్మనాభం అని తేలిపోయింది.
ఈబీసీలకి ఇచ్చిన రిజర్వేషన్లు దెబ్బ తినకుండా, బీసీల రిజర్వేషన్లకి ప్రమాదం వాటిల్లకుండా టిడిపి పాలనలో సీఎం చంద్రబాబు కాపులకి 5 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. అయినా శాంతించని ముద్రగడ పద్మనాభం వైసీపీ కోసం రాష్ట్రంలో అల్లర్లు సృష్టించారు. టిడిపి ఐదేళ్ల పాలనలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేలకోట్లు నిధులిచ్చినా ముద్రగడ పద్మనాభం ఉద్యమం ఆపలేదు. ఐదేళ్లు (2014-19) టిడిపి పాలన మొత్తం ముద్రగడ ఉద్యమం కొనసాగింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కుంభకర్ణుడు మాదిరిగానే మళ్లీ నిద్రలోకి జారుకున్నారు ముద్రగడ. కాపులకి చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్ జగన్ రెడ్డి ఎత్తేస్తే నోరు మెదపలేదు. కాపు కార్పొరేషన్‌కి రూపాయి కూడా వైసీపీ సర్కారు కేటాయించకపోతే ఒక్క లేఖ కూడా రాయలేదు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణలు చేస్తే కుంభకర్ణుడి నిద్రవీడి వచ్చి మరో లేఖ రాశారు ముద్రగడ పద్మనాభం.
టీవీ9 హసీనా..ఎన్టీవీ రెహానా ఎందుకు కొట్టుకున్నారు ?
వైసీపీకి చెందిన రెండు చానళ్లు, వైసీపీ కోసం అదే చానళ్లలో పనిచేసే ఇద్దరు మహిళలు దారుణంగా కలబడి మరీ కొట్టుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీసు మీడియా పాయింట్ దగ్గర జరిగిన ఈ గొడవల్లో ఒకరిని ఒకరు రక్కుకుంటూ, గిచ్చుకుంటూ, తిట్టుకుంటూ వీడియోలు కూడా తీసుకుని సోషల్ మీడియాలో పోస్టులు చేసుకున్నారు. వీళ్లిద్దరూ బయటకు చెబుతున్నట్టు ఒకరు లైవ్ పెట్టినప్పుడు ఇంకొకరు లైవ్ మైకులు పెడుతున్నారని చెబుతున్నా...ఇద్దరి మధ్యా వివాదానికి ఇద్దరు `ముఖ్య`మైన వ్యక్తులు కారణం అని తెలుస్తోంది. ఒకరు ముఖ్యనేత పీఆర్ టీములో కీలకంగా ఉంటే..ఇంకొకాయన సలహాల సామ్రాజ్యాన్ని ఏలేవారని తెలుస్తోంది. పీఆర్ టీములో కీలక వ్యక్తి టీవీ9 హసీనాకి మద్దతుగా నిలిస్తే.. సలహాల పెద్దాయన ఎన్టీవీ రెహానాకి అండ అని తెలుస్తోంది. ఇద్దరి గొడవ సందర్భంగా కూడా సలహాల పెద్దాయన పేరే ప్రస్తావనకి రావడం విశేషం. ఎస్సార్కే సార్ కి నీ గురించి తెలియదు, ఆయన దగ్గరే తేల్చుకుందాం అని హసీనా మాటలు రికార్డు అయి ఇప్పుడు మీడియా వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఎవరా ఎస్సార్కే సార్! ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. tv9 హసీనా, NTV రెహానా మధ్య సీఎంవో లో ఆధిపత్యం కోసం నిత్యం గొడవలు జరుగుతున్నాయని, వీరిద్దరికీ సీఎంవోలో ఇద్దరు పెద్దలు ఆశీస్సులుండడంతో ఇది కొట్టుకునే వరకూ దారి తీసిందని సమాచారం. ఇద్దరు మహిళా జర్నలిస్టుల తీరుపై అటు యాజమాన్యాలు, ఇటు సీఎంవోలో వత్తాసు పలికిన వారు, వైసీపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. వీరి తీరుతో వైసీపీ రోడ్డున పడిందని, యాజమాన్యాలు కూడా వైసీపీతోపాటే బద్నాం అయ్యాయని కోపంగా ఉన్నారు. వైసీపీ పెద్దల ఆదేశాలతో ఎన్టీవీ రెహానా ను విశాఖకి, టీవీ9 మేనేజ్మెంట్ హసీనా హైదరాబాద్ కు బదిలీ చేసిందని విశ్వసనీయ సమాచారం.