ఆంధ్రప్రదేశ్ లో రామతీర్ధం ఘటన సెగలు పుట్టిస్తుంది. దీంతో ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. అయితే ఈ విచారణ పై, అధికారి పై, వైసీపీ ఎంపీ రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన మాటల్లోనే. "నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, రామతీర్ధం ఘటన పై స్పందిస్తూ, ఆయన చేసిన మంచి కార్యక్రమాలు, ఎలా అణిచివేయాలని అనుకుంటున్నారు, ఇలా ఆయనకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పారు. మరి ఇన్నాళ్ళు, ఏమి చేస్తున్నారో అనే విషయాలు పక్కన పెడదాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, సిఐడి అనే ఒక రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థకు, రామతీర్ధం ఘటన అప్ప చెప్పారు. ఆ సిఐడి సంస్థకు నేతృత్వంవహించేది, సునీల్ కుమార్ అనే వ్యక్తి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, సునీల్ కుమార్ గారు ప్రభుత్వం ఏమి చెప్తే అంత అనేది కొన్ని సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. రంగనాయకమ్మ గారు కానీ, నా స్నేహితుడు నలందా కిషోర్ మీద పై కానీ, కారణం అని గతంలో మనం చెప్పుకున్నాం. ఎందుకు అంటే, ఈయన పెద్దగా రూల్స్ ఫాలో అవ్వరు. రకరకాల కేసుల్లో, ప్రభుత్వం ఏమి చెప్తే అది. దీనికి మొత్తానికి కారణం, సియం ఆఫీస్ లో ఉన్న ట్రంప్ అవినాష్ అనే వ్యక్తి. రాష్ట్ర హైకోర్టు జడ్జిస్ పైన అన్ని మాటలు మాట్లాడితే, హైకోర్టు ఆదేశాలు ఇస్తే, కనీసం ఈ సిఐడి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదు. చివరకు ఆ సిఐడి ని , మీరు అన్ ఫిట్ అని కోర్టు అక్షింతలు వేసి, కేసుని సిబిఐకి అప్పగించింది. ఇక ఇక్కడ దాపరికం లేకుండా, మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. "
"ఈ సునీల్ కుమార్ అనే వ్యక్తి, క్రీస్టియానిటీ ఫాలో అవుతారు. ఆయన సర్టిఫికేట్ లో ఏముందో కానీ, బాయకు మాత్రం, క్రీస్టియానిటీ ఫాలో అవుతారు. మా చీఫ్ మినిస్టర్, మా హోం మినిస్టర్, మా డీజీపీ లాగా క్రీస్టియన్. ఒకసారి కోర్టు, ఇతను సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయటం లేదు అని చెప్పిన తరువాత కూడా, ప్రభుత్వ పక్షాన ఆయన ఉన్నాడు అని అర్ధం అవుతుంది. ఎవరో పెట్టిన కామెంట్ ఫార్వర్డ్ చేస్తేనే కేసులు పెట్టి, కోర్టులను కూడా లెక్క చేయని వ్యక్తి, ప్రభుత్వ కనుసన్నల్లోనే పని చేస్తారనే అనుమానం, అందరికీ ఉంది. అలంటి అనుమానం నాకు కూడా ఉంది. ప్రభుత్వం ఈ కేసుని ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో చేయాలని అనుకుంటే, మరో దర్యాప్తు సంస్థకు ఇవ్వాలి. అలాగే క్రీస్టియన్, రెడ్డి కాని వ్యక్తికీ ఈ కేసు ఇవ్వాలి. ఎందుకంటే, ఇది ఏ పార్టీకి సంబధించినది కాదు అని అందరికీ తెలుసు. న్యాయం చేసినట్టు కాదు, న్యాయం చేసినట్టు కనిపించాలనే సూత్రం అనుసరించి, క్రీస్టియన్, రెడ్డి కాని వ్యక్తిని నియమించాలి. సునీల్ కుమార్ గొప్ప వ్యక్తీ అవ్వచ్చు కానీ, ఈ కేసు విచారణకు మాత్రం ఆయన సూట్ అవ్వరు" అని రఘురామరాజు అన్నారు. మరి ప్రభుత్వం, ఈ విషయం పై ఎలా స్పందిస్తుందో చూడాలి.