ప్రతి జిల్లాలో వైసిపీ నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. కొన్ని సార్లు ఇవి బహిరంగం అవుతున్నాయి కూడా. సీనియర్ నాయకులు కూడా ఇందుకు అతీతం కాదు. పిల్లి శుభాష్ చంద్రబోస్ లాంటి సీనియర్ నేతలు కూడా, తమ అసంతృప్తి బహిరంగంగా వ్యక్త పరుస్తున్నారు అంటే, వైసీపీలో జరుగుతున్న కోల్డ్ వార్ అర్ధం అవుతుంది. ఇక ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ వివాదాలు తారా స్థాయిలో ఉన్నాయి. అప్పుడప్పుడు బయటకు వచ్చి బాంబు పెల్చుతున్నారు సీనియర్ నేతలు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో సీనియర్ నాయకులు ఎక్కువ. ఆనం కుటుంబం, అలాగే ప్రసన్నకుమార్ రెడ్డి, మేకపాటి, ఆదాల కుటుంబాలు బలంగా ఉన్నాయి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెత్తనం మొత్తం, జగన్ మోహన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కు ఇవ్వటంతో, ఈ పెద్ద కుటుంబాలకు రుచించలేదు. మరో మంత్రి మేకపాటి ఉన్నా, ఆయన జిల్లా పై పెద్దగా పట్టు సాధించటం లేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ అనిల్ కుమార్ మాత్రం, పెత్తనం మొత్తం తీసుకోవటంతో, కొంత అసంతృప్తి సీనియర్ వర్గాల్లో ఉంది. ముఖ్యంగా ఆనం కుటుంబం జరుగుతున్న పనుల పై తీవ్ర అసంతృప్తిలో ఉంది. సీనియర్ నేత అయిన ఆనం రాం నారాయణ రెడ్డి, అప్పుడప్పుడు బహిరంగ వేదికల పైనే అసంతృప్తి వ్యక్తం చేసారు.

aanam 26122020 2

మరో ఏడాది చూస్తాను, తరువాత నేరుగా రంగంలోకి దిగుతా అని నాలుగు నెలల క్రిందట వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక ప్రతి సారి అసెంబ్లీలో ఆక్టివ్ గా కనిపించే ఆనం, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడా మాట్లాడలేదు. ఇది ఇలా ఉంటే, ఆనం వివేకానందరెడ్డి 70వ జయంతి వేడుకలు జరిగిన సందర్భంలో, ఆనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అంటూ, ఆస్కిక్తర వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు, త్వరలోనే మళ్ళీ నెల్లూరు నగరం రాజకీయాల్లో తమ ముద్ర ఏమిటో చూపిస్తాం అంటూ, వ్యాఖ్యానించారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసారు, ఎవరికీ ఇవి వార్నింగ్ అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇక నిన్న జరిగిన ఇళ్ళ పట్టాల పంపిణీ విషయంలో కూడా, సబ్ కలెక్టర్ తో స్వల్ప సంవాదం జరిగింది. మీరు స్టేజ్ మీద ఉంటే నేను రాను అంటూ, ఆనం సభా వేదిక నుంచి వెళ్ళిపోయారు. అయితే దీనికి, గతంలో ఆనంకు, సబ్ కలెక్టర్ పలు విషయాల్లో సహకరించకపోవటానికి వల్ల ఏర్పడిన వివాదం కారణంగా, ఆనం ఇలా చేసారని తెలుస్తుంది. మొత్తంగా, నెల్లూరు వైసీపీలో సీనియర్ లు అందరూ నివురుగప్పిన నిప్పులా ఉన్నారు. వైసీపీ అధిష్టానం దాన్ని చల్లారుస్తుందా లేదా అనేది చూడాలి.

రాష్ట్రంలో వైసీపీ బ్లూ బ్యాచ్ (రౌడీమూకలు) అరాచకాలనేపథ్యంలో ఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయిందని, చట్టాన్ని తనచేతుల్లోకి తీసుకొని, చట్టాన్ని తనచుట్టంగా మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి, అనంతపురంలో బలైన స్నేహలత కుటుంబానికి ఏం సమాధానం చెబుతాడని టీడీపీఅధికారప్రతినిధి దివ్యవాణి ప్రశ్నించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు జగన్ అండగా ఉన్నాడని, రక్షణకల్పిస్తున్నాడని సినిమావారిని తలదన్నేలా అసెంబ్లీలో వైసీపీ మహిళానేతలు చెప్పిన డైలాగులు (మాటలు) ఏమయ్యాయని దివ్యవాణి ఎద్దేవాచేశారు. ఆడవాళ్లకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని చెప్పినవారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రమంతా గన్ ఎక్కడ...జగన్ ఎక్కడాఅని ఎదురుచూస్తున్నారన్నారు. మరో మహా తల్లి నిండుఅసెంబ్లీలో మాట్లాడుతూ, తన గుండె జగన్... జగన్ అని కొట్టుకుంటున్నట్లు చెప్పుకుందని, నేడు ఆగిపోయిన స్నేహలత గుండెను తిరిగికొట్టు కునేలా సదరుమహిళా ఎమ్మెల్యే చేయగలదా అని టీడీపీ మహిళా నేత నిలదీశారు. స్నేహలత కుటుంబానికి డబ్బులిచ్చి సరిపెట్టినం త మాత్రాన చనిపోయిన ఆమెఆత్మకు శాంతికలగదనే విషయాన్ని అధికారపార్టీకి చెందిన మహిళలు తెలుసుకోవాలన్నారు. జగన్ మాట ఇస్తే శాసనమని మరొకామె చెప్పిందని, వారివారి మాటల ద్వారా సదరుమహిళానేతలంతా ఆస్కార్ అవార్డుకు పోటీపడ్డారని దివ్యవాణి దెప్పిపొడిచారు. వ్యక్తిగతప్రయోజనాలకోసం, మంత్రి పదవులకోసం జగన్ ను పొగిడినవారంతా, స్నేహలత కుటుంబాని కి న్యాయంచేసే దిశగా ఎందుకుఆలోచించడం లేదన్నారు. దిశాచట్టం అని మభ్యపెడుతున్న ప్రభుత్వం, స్నేహలత తల్లికి ఏం సమాధానం చెబుతుందన్నారు. దిశా స్టేషన్ కు ఆమె కాల్ చేసినా అక్కడున్న సిబ్బంది ఎందుకు స్పందించలేదో , ముఖ్యమంత్రి తీసుకొచ్చిన చట్టం ఏమైందో చెప్పాలన్నారు. జగన్ 18నెలల పరిపాలనలో దాదాపు 260మంది మహిళలపై లైంగికవేధింపులు, అత్యాచారాలు, దారుణాలు జరిగాయన్నారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన దిశాచట్టం ప్రకారం 21రోజుల్లోనే దోషులకు మరణశిక్ష పడుతుందని పాలకులు చెప్పారని, ఇప్పటివరకు జరిగిన దారుణాలకు సంబంధించి ఏ కేసులో, అలా ఎంతమందికి శిక్షపడిందో చెప్పాలన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన దిశాచట్టం నిజంగా అమల్లో ఉంటే, అనంతపురం జిల్లాలో ముక్కుపచ్చలారని 13ఏళ్లబాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన లారీడ్రైవర్ ను ఏం చేశారో, ఎలాశిక్షించారో, దిశాచట్టం ఏచేసిందో చెప్పాలన్నారు. సదరు చట్టంలో చెప్పినట్లుగా 354(e), 354 (f) సెక్షన్లప్రకారం ప్రభుత్వం ఎందరిపై చర్యలు తీసుకున్నారని దివ్యవాణి నిలదీశారు. పాలకులు, అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పరుచూరి బ్రదర్స్ ను మించిపోయేలా డైలాగులు చెప్పడంతప్ప, ఆచరణలో అందుకు తగినవిధంగా పనులుచేయడంలేదన్నారు. న్యాయమూర్తుల కొరత అనేది దేశవ్యాప్తంగా ఉందని, జాతీయ లా కమిషన్ కూడా ఇదే విషయం చెప్పిందని, ఇవన్నీ తెలిసీకూడా దిశాచట్టంలో కేవలం 21రోజుల్లోనే నిందితులకు శిక్షపడేలా చేస్తామని చెప్పడంముమ్మాటికీ ప్రజలను, ముఖ్యంగా ఆడబిడ్డల ను మోసగించడమే అవుతుందన్నారు. మృగాళ్ల చేతిలో బలైపోయిన ఏ ఆడబిడ్డకు, ఆమె కుటుంబానికి జగన్ తనపాలనలో న్యాయంచేశాడో, ఎందరుదోషులను శిక్షించాడో చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు. వైసీపీనేతలు, కార్యకర్తలు పలుకేసుల్లో నిందితులుగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడంలేదన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగే ఘటనలు రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతున్నాయన్న కేంద్ర ప్రభుత్వ నివేదికపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీఎమ్మెల్యేలు ఇప్పటికైనా డైలాగులు చెప్పడంమానేసి, వాస్తవాలకు దగ్గరగా ఆలోచిస్తే మంచిదన్నారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గత కొన్ని నెలలుగా, ప్రభుత్వం చేస్తున్న అనేక రాజ్యాంగబద్ధ పనుల పై వివిధ వర్గాలు వేస్తున్న పిటీషన్ల పై, ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కేసుల్లో హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది కూడా. హైకోర్ట్ ఆదేశాలు లెక్క చేయకపోవటం, మీ మీద కోర్టు ధిక్కరణ కేసు ఎందుకు పెట్టకూడదు అని కూడా ప్రశ్నించి, ఆ దిశగా ఒక రెండు కేసుల్లో అడుగులు కూడా వేసింది. ఈ జాబితాలో చీఫ్ సెక్రటరీ ఉన్నారు, డీజీపీ ఉన్నారు, కొన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు కూడా ఉన్నారు. అయితే వీరిని కోర్టు హెచ్చరించింది కానీ, ఏనాడు వారికి శిక్షలు ఖరారు చేయలేదు. ఇప్పటికే ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు మధ్య ఘర్షణ వాతావరణం ఉందని ఏమో కానీ, కోర్టు చర్యలకు అయితే దిగలేదు. అయితే ప్రభుత్వ వైఖరి పై మాత్రం, అనేక సార్లు కామెంట్స్ అయితే చేసింది, అనేక మంది అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు తాజాగా ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ కూడా ఏకంగా ప్రభుత్వం పై కోర్టు ధిక్కరణ కేసు వేసారు. అది కూడా విచారణలో ఉంది. అయితే ఇవన్నీ ఇలా ఉంటే, ఈ మధ్య కాలంలో కేవలం హెచ్చరికలు వరుకే ఇస్తూ వస్తున్న హైకోర్టు చర్యలకు కూడా దిగింది. తమ ఆదేశాలు లెక్క చేయని అధికార పై కోర్టు ధిక్కరణ కింద కేసు తీసుకుని, ఏకంగా శిక్ష కూడా వేసేసింది.

hc 25122020 2

వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా, ముసునూరు మండల తహశీల్దార్ టి.మదన్ మోహన్ రావు, హైకోర్టు ఆదేశాలు ఉన్నా సరే, ఓ భూమి విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించటంతో, ఆయనకు హైకోర్టు రూ. 2 వేల జరిమానా విధించింది. ఒక వేళ ఆ సొమ్ము కనుక కోర్టుకు కట్టకపోతే, రెండు నెలల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని, హైకోర్టు తమ తీర్పులో తెలిపింది. ఈ మేరకు, హైకోర్టు జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి ఆదేశాలు ఇచ్చారు. ఒక కేసు విషయంలో, హైకోర్టు ముందుకు విచారణకు వచ్చిన కేసులో, పిటీషనర్ తరుపున అసైన్డ్ భూమిని వెనక్కు తీసుకునే విషయంలో, తహశీల్దార్ టి.మదన్ మోహన్ రావు సరైన నిబంధనలను పాటించాలని హైకోర్టు ఆదేశించినా, వాటిని అతిక్రమించినందుకు, తహశీల్దార్ పై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసిన హైకోర్టు, విచారణ జరిపింది. ఆయన ఉద్దేశపూర్వకంగా చేసారని హైకోర్టు తెలిపింది. అయితే తనను క్షమించాలని కోరుత హశీల్దార్ కోర్టులో అఫిడవిట్ వేసి, మళ్ళీ దాన్ని వెనక్కు తీసుకోవటంతో, హైకోర్టు సీరియస్ అయ్యి, ఆయనకు జరిమినా విధించింది.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఈ రోజు వైసీపీ ప్రభుత్వం చేసిన స్కాం అంటూ వివరాలు బయట పెట్టారు. ఆయన మాటల్లో.... ఏ1 జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో హడావుడి చేస్తున్నారు. ఆయన ఏ పథకం ప్రారంభించినా అందులో అవినీతి ఉంటుంది. ఇళ్ల పట్టాల స్కీంలోనూ వేల కోట్ల అవినీతి చేశారు. 30 లక్షలమందికి ఇళ్లు ఇస్తామంటున్నారు. ఇందుకోసం 60 వేల ఎకరాల భూమి సేకరించారు. స్థల సేకరణ కోసం 22 వేల 355 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో ఏ1, ఏ2, కొందరు ఎమ్మెల్యేలు రూ. 6500 కోట్ల అవినీతి చేశారు. అవినీతిని నిరూపించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలి. అవినీతి చేయడంలో జగన్మోహన్ రెడ్డి , అతనికి సలహాలు ఇవ్వడంలో విజయసాయి రెడ్డి ఘనులు. 10, 15 లక్షల విలువుండే భూమిని 40 లక్షలకు పైగా చెల్లించి కొనుగోలు చేశారు. ఇందులో భారీ అవినీతికి పాల్పడ్డారు. భూ సేకరణలో రేట్లు పెంచి సుమారు రూ. 4వేల కోట్లు దోపిడీ చేశారు. కొండలు, గుట్టలు, చెరువులు, స్మశానాల్లో భూములు సేకరించారు. ఆ భూమి చదును చేయడానికి మళ్లీ డబ్బు ఖర్చు పెట్టారు. అందులోనూ రూ. 2 వేల కోట్లు తినేశారు. భూమిలిస్తాం, పట్టాలిస్తామంటూ గ్రామాల్లోని వైసీపీ నేతలు, వాలంటీర్లు అమాయక ప్రజల దగ్గర రూ. 5 వందల కోట్లు వసూలు చేశారు. టీడీపీ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 8 లక్షల ఇళ్లు నిర్మించాం.

vs 25122020 2

వాటిని పేదలకు ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం ఇష్టపడటం లేదు. నర్సీపట్నంలో 2, 595 మందికి ఇళ్లు కేటాయిస్తే వాటిని తీసేసేందుకు చూస్తున్నారు. నర్సిపట్నంలో 624 మంది డిపాజిట్ లు కట్టినా ఇళ్లు ఇవ్వడంలేదు. ఎందుకు ఇవ్వరంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇవ్వకపోవడానికి కారణాలు చెబుతూ నోటీస్ ఇచ్చారా? డిపాజిట్ కట్టిన వారికి ఇళ్లు కేటాయించాల్సిందే. లేకుండా ప్రజా పోరాటం తప్పదు. టిడ్కో ఇళ్లకు లోన్ మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు. రూపాయికే ఇళ్లు అని మాయమాటలు చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను ఇంతలా మోసం చేస్తారా? డిపాజిట్లు కట్టిన వారికి అన్యాయం చేస్తూ సంబరాలా? మంత్రులు అవంతి, నారాయణ స్వామి తిరుమల కొండపై నుంచి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం సరికాదు. కొండపై అన్యమత ప్రచారం చేయకూడదని కోర్టులు కూడా చెప్పాయి. సంప్రదాయాలను కాపాడాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా? అవంతి శ్రీనివాస్ సమాధానం చెప్పాలి.

Advertisements

Latest Articles

Most Read