2019లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, తన చుట్టూ ఉండాల్సిన మనుషుల కోసం, ఏరి కోరి కొంత మంది వ్యక్తులను తెచ్చుకున్నారు. ఇందులో అనేక మందిని సలహదారులుగా తన ఫంక్షనింగ్ కోసం తెచ్చుకున్నారు. ఇందులో ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పీవీ రమేష్ ని కూడా అలాగే తన కోర్ టీంలోకి తెచ్చుకున్నారు. డాక్టర్ పీవీ రమేష్ కు వైద్య ఆరోగ్య శాఖ పై గతంలో పట్టు ఉండటం, అలాగే చంద్రబాబు హయంలో విదేశీ వ్యవహారాలు చూడటంలో ఆయనకు పేరు ఉండటంతో, పీవీ రమేష్ ను, జగన్ మోహన్ రెడ్డి తన అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి అదనపు ప్రధాన కార్యదర్శిగా పని చేసిన పీవీ రమేష్, సియంఓలో నుంచి తాను తప్పుకుంటున్నాను అంటూ, తన ట్విట్టర్ లో తెలిపారు. ఈ విషయాన్ని ఆయానే స్వయంగా, తన ట్విట్టర్ లో తెలియ చేయటంతో, అందరూ ఒకింత షాక్ తిన్నారు. నవంబర్ 1 నుంచి పీవీ రమేష్ బాధ్యతలు నుంచి తప్పుకున్నట్టు, ఇదే విషయం జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు, తాడేపల్లి వెళ్లి చెప్పిన సందర్భంలో, ఆల్ ది బెస్ట్ చెప్పి, జగన్ పంపించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాని తరువాతే పీవీ రమేష్ ట్వీట్ చేస్తూ, విషయం చెప్పారు. అయితే ఇప్పుడు ఇదే విషయం పై ప్రభుత్వం కూడా జీవో విడుదల చేసి, అధికారింగా పీవీ రమేష్ రాజీనామాను ఆమోదించింది.
35 ఏళ్ళ నుంచి ఆయన ఐఏఎస్ అధికారిగా పని చేసారు. ఆయనకు అపారమైన అనుభవం కూడా ఉంది. అలాగే మొన్న క-రో-నా సందర్భంలో కూడా ఆయనే ప్రభుత్వం తరుపున అన్ని బాధ్యతులు చూసారు. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని పని చేసారు. మొదట్లో కేసులు పెరగకుండా చూసుకోవటంలో ఆయన పాత్ర అధికంగా ఉందని చెప్తారు. అయితే నాలుగు నెలల క్రితం నుంచే పీవీ రమేష్ వెళ్ళిపోతారనే కధనాలు వచ్చాయి. నాలుగు నెలల క్రితం సియంఓ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అధికారుల శాఖల మార్పులు జరిగాయి. ఇదే సందర్భంలో పీవీ రమేష్ ను కూడా ఆ బాధ్యతల నుంచి తప్పించారు. పీవీ రమేష్ తో అజయ్ కల్లంని కూడా తప్పించినా, ఆయనకు వేరే శాఖలు ఇచ్చారు, కానీ పీవీ రమేష్ కు మాత్రం ఏమి ఇవ్వలేదు. ఆ రోజు కూడా ఆయన ఎటువంటి బాధ్యతలు నిర్వహించలేదు. ప్రభుత్వం తనను దూరం పెడుతుంది అనుకున్నారో ఏమో కానీ, గౌరవంగా తప్పుకోవాలని, తానె రాజీనామా ఇచ్చి వచ్చేసారు. అయితే ఏరి కోరి తెచుకున్న వ్యక్తిని ఇలా ఎందుకు తప్పించారు, రాజీనామా చేసి వెళ్ళిపోయేలా ఎందుకు చేసారు అనేది మాత్రం స్పష్టత లేదు.