ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సహకారం ఇప్పటికిప్పుడు లేకపోవటంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఈ అన్ని అంశాల పై , ఈ రోజు దాదాపుగా 40 నిమిషాల పాటు గవర్నర్ తో భేటీ అయ్యి, ఆయనకు అన్ని విషయాలు చెప్పారు. అయితే గవర్నర్ తో భేటీ అనంతరం, ఎన్నికల కమిషన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై, హైకోర్టులో ఫిర్యాదు చేయటానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నిన్న ఈసి స్పనిస్తూ, గ్రామపంచయతీ ఎన్నికలు వచ్చే ఫిబ్రవరిలో నిర్వహిస్తామంటూ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. అయితే దీని పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహనీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు లేఖ రాసారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కదాని, కరోనా సెకండ్ వేవ్ తో పాటుగా, చలి తీవ్రత ఎక్కువుగా ఉండటంతో, ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్నికలు నిర్వహిస్తే ఉద్యోగులు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. పైగా, కాంటైనేమేంట్ జోన్స్ నిర్వహణలో, ఇటు రెవిన్యూ యంత్రాంగం, ఇటు పోలీసులు కూడా బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైరస్ తగ్గిన వెంటనే, అనువైన పరిస్థితి ఉంటే, తెలియ చేస్తామని పేర్కొన్నారు. దీనికి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, చీఫ్ సెక్రటరీకి మెసేజ్ పెట్టారని, రాజ్యాంగబద్ధ సంస్థలను పని చేసుకోనివ్వటం లేదంటూ ఆయన మెసేజ్ చేసారని తెలుస్తుంది.
అయితే ఈ రోజు గవర్నర్ తో భేటీ అయిన ఎలక్షన్ కమీషనర్, ఇదే విషయాన్ని గవర్నర్ తో కూడా చెప్పి, తమకు కలుగుతున్న ఇబ్బందులు తెలిపారు. అయితే గవర్నర్ తో భేటీ ముగియగానే, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై హైకోర్టుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా, హైకోర్టు స్పందిస్తూ, ఎన్నికలు నిర్వహించటానికి ఎన్నికల కమిషన్ కు ఉన్న ఇబ్బంది ఏమిటి అంటూ ప్రశ్నించిన నేపధ్యంలో, తాము కసరత్తు చేసి, ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకుని, ప్రభుత్వానికి లేఖ రాయగా, చీఫ్ సెక్రెటరీ బదులుగా రాసిన లేఖ, అలాగే ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా, దాన్ని కూడా భగ్నం చేసేలా వ్యవహరిస్తున్నారు అనే అంశంతో పాటుగా, రాష్ట్ర ప్రభుత్వం, ఈసికి సహకరించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించటం లేదని, ఎలక్షన్ కమిషన్ పిటీషన్ వేసినట్టు తెలుస్తుంది. ఈ పిటీషన్ త్వరలోనే విచారణకు వచ్చే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గవర్నర్ ని కలిసిన తరువాత, ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకోవటంతో, ఆయనకు అన్నీ వివరించి, ప్రభుత్వం పై, హైకోర్టులో ఫిర్యాదు చేసినట్టు అర్ధం అవుతుంది.