ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఒక మూడు నాలుగు నెలల పాటు, వరుసుగా దేవాలయాల పై దా-డు-లు జరిగాయి. ఎవరైనా కావాలని చేస్తున్నారా, లేక అనుకోకుండా అలా జరిగాయో కానీ, ప్రతి రోజు ఏదో ఒక వార్త వస్తూ వచ్చేది. ఒక నెల రోజులు నుంచి ఉన్నట్టు ఉండి, అక్కడ ఇలాంటి వార్తలు పెద్దగా రాకపోవటంతో అటు పోలీసులు, ఇటు హిందువులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ దా-డు-లు జరిగిన సమయంలో, విజయవాడ ఇంద్రకీలాద్రి పై జరిగన సంఘటనతో అందరూ షాక్ కు గురయ్యారు. మొత్తం రాష్ట్రాన్ని ఈ అంశం ఊపెసింది. ఇది రాజకీయం అంశం కూడా అయ్యింది. కనకదుర్గమ్మ రధానికి ఉండే నాలుగు వెండి సింహాల్లో, మూడు మాయం అయ్యాయి. ఇది గుర్తించటం, పెద్ద చర్చకు దారి తీయటం, ఇది గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందని రాజకీయ ఆరోపణలు రావటం, చివరకు అది ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని పోలీసులు తేల్చటం జరిగింది. అయితే ఈ ఘటన జరిగి అనేక నెలలు అవుతున్నా, ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. రాష్ట్రంలో తిరుమల తరువాత, అంత పెద్ద దేవాలయం కావటంతో, పోలీసులు కూడా ఈ కేసు విషయమై ప్రత్యెక శ్రద్ధ పెట్టారు. పోలీస్ కమీషనర్ కూడా రంగంలోకి దిగారు. అయినా ఎలాంటి పురోగతి పోలీసులు సాదించ లేకపోయారు. ముందుగా, ఈ చోరీ జరిగింది గత జూన్ నెలలో అని పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో, వెండి సింహాలకు పాలిష్ చేసిన వ్యక్తిని కూడా పట్టుకుని, విచారించినా ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకలేదు.
తరువాత ఆలయ సిబ్బందిని, సెక్యూరిటీ వారిని, ఇలా అనేక మందిని పోలీసులు విచారణ చేసారు. అలాగే కొంత మంది బీహార్ నుంచి వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు పని చేసినట్టు గుర్తించారు. వారిని కూడా పోలీసులు విచారించారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. అయితే ఈ లోపు దసరా పండుగ రావటం, దేవస్థానం అధికారులు కూడా బిజీ అయిపోవటంతో, ఈ విషయం మరుగున పడిపోయింది. కొత్త వెండి సింహాలు చేయించే పనిలో దేవస్థానం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అసలు ఇవి ఏమయ్యాయి, ఎవరు దొంగతనం చేసారు అనే విషయంలో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. సాక్ష్యాత్తు దేవాదాయ శాఖా మంత్రి నివాసం ఉండే చోటుకుని, కూత వేటు దూరంలో ఉన్న గుడిలో జరిగిన దాన్ని, ఇప్పటి వరకు ప్రభుత్వం గుర్తించలేకపోయందని, అలాగే ఈ అంశంలో దేవాదాయ మంత్రి ప్రమేయం కూడా ఉంది అంటూ, ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు కూడా చేసాయి. ఎన్ని చేసినా, ఏమి చేసినా, పోలీసులు ఎంత విచారణ జరిపినా, ఇన్నాళ్ళు అయినా, ఈ కేసులో ఎలాంటి ఆధారం దొరకలేదు. మరి ఈ కేసుని ఎప్పటికి తెలుస్తారో, ఎప్పటికి దర్యాప్తు పూర్తి చేసి, నిజాలు బయట పెడతారో చూడాలి. ఏది ఏమైనా, ప్రభుత్వానికి ఇది ఒక మచ్చగా మిగిలిపోతుంది.