కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, సుప్రీం కోర్టులో వాదించే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‍, బీజేపీ నేత, న్యాయవాది అయిన అశ్వినీ ఉపాధ్యాయకు , జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం పై సంచలన లేఖ రాసారు. ఆ లేఖలో స్పష్టంగా జగన్ మోహన్ రెడ్డి చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు రాసిన లేఖ, అదే విధంగా ఆ లేఖను తరువాత మీడియాకు ఇచ్చి, బహిర్గతం చేయటం, కచ్చితంగా ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది అని తెలిపారు. అంతె కాకుండా, ఈ లేఖ బయటకు విడుదల చేసిన సమయం చూస్తే అనేక అనుమానాలకు తావు ఇచ్చే విధంగా ఉందని ఆయన లేఖలో తెలిపారు. సుప్రీం కోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, ఏదైతే ప్రజాప్రతినిధుల పై ఉన్నటు వంటి కేసులు పై త్వరతిగతిన విచారణ జరపాలి అంటూ, ఆదేశాలు జరీ చేసినటు వంటి నేపధ్యంలో, జగన్ ఈ లేఖ రాయటం, దాన్ని బహిర్గతం చేయటం అనుమానాస్పదంగా ఉందని అన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ, 16.9.2020న ఈ యొక్క ప్రజా ప్రతినిధులకు సంబందించిన తీర్పు ఇస్తే, ఆ తరువాత 6.10.2020లో జగన్ మోహన్ రెడ్డి, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు లేఖ రాయటం, ఆ తరువాత ఆయన ప్రధాన సలహాదారు అయిన అజయ్ కల్లం రెడ్డి, 10.10.2020లో ఈ లేఖను బహిర్గతం చేస్తూ విలేఖరుల సమావేశం పెట్టటం, ఇవన్నీ చూస్తుంటే, కచితంగా అనుమానాలకు దారి తీస్తున్నాయని అన్నారు.

attorney general 02112020 2

ప్రైమాఫసి కింద అంటే ప్రాధమిక ఆధారాల కింద చుస్తే, ఇవన్నీ కూడా కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని అన్నారు. అయినా కూడా ఇవన్నీ చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా దృష్టిలో ఉన్నాయని, ఆయనకు కూడా ఈ లేఖ వచ్చింది, అలాగే మీడియాకు విడుదల చేసిన విషయం తెలుసు కాబట్టి, దీని పై నేను ప్రత్యేకంగా కోర్టు ధిక్కారణ కింద కేసు పెట్టాలని అనుమతి ఇవ్వాల్సిన పని లేదు అంటూ ఈ లేఖలో స్పష్టం చేసారు. అశ్వినీ ఉపాధ్యాయ అనే వ్యక్తి , బీజేపీ నేత సీనియర్ లాయర్. ప్రజాప్రతినిధులలో నేర చరిత్ర ఉన్న వ్యక్తుల పై ఆయన గత కొంత కాలంగా పోరాటం చేస్తున్నారు. ఆయనే జగన్ రాసిన లేఖ, దాన్ని బహిరంగ పరచటం పై, కోర్టు ధిక్కారణ కింద కేసు నమోదు చేయటానికి అనుమతి ఇవ్వాలి అంటూ, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‍కు గతంలో లేఖ రాసారు. ఆ లేఖకు , అటార్నీ జనరల్ స్పందించి, ఈ వ్యాఖ్యలు చేసారు. అలాగే ఈ లేఖలో జగన్ పై ఉన్న 31 కేసులు అంశాన్ని కూడా సుప్రీం కోర్టు అటార్నీ జనరల్ ప్రస్తావించారు. సుప్రీం కోర్టు అటార్నీ జనరల్ అంటే కేంద్రం తరుపున, సుప్రీంలో వాదిస్తారు. ఆయన కూడా, ఇలా రాయటం చూస్తుంటే, కేంద్రం కూడా ఈ విషయంలో, ఏమి చేయలేదనే సంకేతాలు వస్తున్నాయి.

అక్రమ కేసులు ఎందుకు పెట్టారు, రైతులకు ఎందుకు బేడీలు వేసారు అని ప్రశ్నించి ఆందోళన కార్యక్రమాలు చేసి, జైల్ భరో కార్యక్రమంలో పాల్గున్న వారికి, షాక్ ఇచ్చారు పోలీసులు. రైతులకు బేడీలు వేసిన సంఘటనకు నిరసనగా, గుంటూరు జైల్లో ఉన్న రైతులకు సంఘీభావంగా, అమరావతి రైతులు ఆందోళన కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. శనివారం రోజున చలో గుంటూరు జైలు కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. అయితే ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదు అంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. ముందు రోజు రాత్రి నుంచే చాలా మంది పై స్థాయి నాయకులను హౌస్ అరెస్ట్ చేసారు. రకరకాల నిర్బంధాలు చేసారు. అయినా సరే, పోలీసులు ఆంక్షలు దాటుకుని, అమరావతి రైతులు, మహిళలు, జేఏసి నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, జైలు భరో కార్యక్రమం కోసం గుంటూరు వెళ్లారు. అక్కడ జైలుకు కూత వేటు దూరంలో వారిని ఆపేయటంతో పోలీసులు, రైతులు, మహిళలు మధ్య గొడవ జరిగింది. పెద్ద ఎత్తున రైతులు, మహిళలు చేరుకోవటంతో, వారిని కంట్రోల్ చేసే క్రమంలో, పోలీసులు కొంచెం దూకుడుగా వెళ్లారు. లాగి పడేయటం, ఎత్తి వ్యాన్ లో పడేయటం, ఇలాంటి ఘటనలతో, కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొత్తానికి పోలీసులు మధ్యానానికి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. అయితే ఇప్పుడు ఆ రోజు ఆందోళనలో పాల్గున్న వారికి, షాక్ ఇచ్చారు పోలీసులు.

amaravati 02112020 2

తాము అనుమతి లేదు అని చెప్పినా, కార్యక్రమంలో పాల్గున్న వారి పై నాన్ - బెయిలబుల్‌ కేసులు పెట్టారు. శనివారం రోజున ఆందోళనలో పాల్గున్న దాదాపు 122 మంది పై నాన్ - బెయిలబుల్‌ కేసులు నమోదు చేసారు. కో-వి-డ్ గైడ్ లైన్స్ అతిక్రమించారని, అలాగే 144 అమలులో ఉన్నా, ఆ సెక్షన్ నిబంధనలు ఉల్లంఘించారని, అమరావతి ఉద్యమంలో పాల్గున్న 122 మంది పై కేసులు పెట్టారు. గుంటూరులోని అరండల్‌పేట స్టేషన్‌లో, ఈ కేసులను నమోదు చేసారు పోలీసులు. కేసులు పెట్టిన వారిలో అమరావతి జేఏసి నాయకులు, వివిధ పార్టీల నేతలు కూడా ఉన్నారు. అమరావతి మహిళా జేఏసి నేత రాయపాటి శైలజ, అమరావతి దళిత జేఏసి నేత మార్టిన్‌ లూధర్‌, ఇలా 122 మంది పై కేసులు పెట్టారు. ఐపిసి 341, 186, 188, 269 సెక్షన్ల కింద, వీరి అందరి పై, నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు అయ్యాయి. 122 మందిలో, 23 మందిపై 151 సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది. రాయపాటి శైలజను ఏ1గా చేర్చటం గమనించాల్సిన విషయం. మేము పోరాడుతుంటే అక్రమ కేసులు పైన అయితే, మళ్ళీ మా మీదే కేసు పెట్టారని, కేసులు ఎదుర్కుంటామని, అమరావతిని సాధిస్తామని రైతులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు జరపటం పై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై, విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ నేత తులసి రెడ్డి. ఆయన మాటల్లో "నవంబర్ 1 వ తేదీ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అవతరణ దినంగా ప్రకటిస్తూ, 27వ తేదీన జీవో విడుదల చేసింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవాలు జరుగుతున్నాయి. ఇది సమంజసం కాదు. ఇది సహజం కాదు. ఇది సాంప్రదాయం కాదు. ఎందుకంటే, మన రాష్ట్రానికి సంబంధించి మూడు రోజులు ఉన్నాయి. ఒకటి పుట్టిన రోజు, రెండు పెళ్లి రోజు, మూడు విడాకుల రోజు. 1953 అక్టోబర్ 1న అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా, సమైక్య మద్రాసు రాష్ట్రం నుంచి, రాయలసీమ ప్రాంతము, కోస్తా ఆంధ్రా ప్రాంతం విడిపోయి, ఆంధ్ర రాష్ట్రంగా, రాష్ట్రం అవతరించింది. ఇది అవతరణ దినం, ఇది పుట్టిన రోజు. 1953 అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ పుట్టిన రోజు. దాని తరువాత, 1956 నవంబర్ ఒకటిన, ఆంధ్ర రాష్ట్రము, ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతము కలిసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. ఒక విధంగా చెప్పాలి అంటే, ఇది మన రాష్ట్రానికి పెళ్లి రోజు. 1956 నవంబర్ ఒకటి అనేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెళ్లి రోజు. దాని తరువాత, 2014 జూన్ 2న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయి, నవ్యాంధ్రప్రదేశ్ గా, తెలంగాణా రాష్ట్రాలుగా ఏర్పాటు అయ్యాయి. "

tulasireddy 01112020 1

"ఒక విధంగా చెప్పాలి అంటే, 2014 జూన్ 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడాకుల రోజు. పుట్టిన రోజున , పుట్టిన రోజు జరపుకోవటం అనేది, అది సాంప్రదాయం, సహజం, అది సమంజసం. పెళ్లి రోజును, పుట్టిన రోజుగా జరుపుకోవటం సమంజసం కాదు. సాంప్రదాయం కాదు. అది కూడా పెళ్లి పెటాకులు అయిన తరువాత, విడాకులు అయిన తరువాత, పెళ్లి రోజును, పుట్టిన రోజుగా ఉత్సవాలు చేసుకోవటం అనేది చాలా విడ్డూరం. కాబట్టి, ఈ సారికి అయిపొయింది కానీ, కనీసం వచ్చే ఏడాది నుంచి అయినా, రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి, నవంబర్ ఒకటిన కాకుండా, అక్టోబర్ ఒకటిన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరిపితే, అది సమంజసంగా ఉంటుంది. అప్పుడే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మకు శాంతి లభిస్తుంది" అని తులసి రెడ్డి అన్నారు. అయితే గతంలో చంద్రాబాబు హయంలో, జూన్ 2న మనల్ని అన్యాయం చేసిన రోజు కాబట్టి, ఆ రోజుని నవ నిర్మాణ దీక్ష పేరుతో, ఆ ఏడాది కసిగా ఎలా ఎదగాలి అని చెప్పేవారు. కానీ ఇప్పుడు వచ్చిన జగన్ ప్రభుత్వం అవన్నీ ఎత్తేసి, నవంబర్ 1 న తెలంగాణాతో కలిసిన రోజుని, అవతరణ దినోత్సవంగా జరుపుతుంది.

రాజధాని అమరావతి పిటీషన్ల పై ఈ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా రాజధాని పిటీషన్లలో ఇంప్లీడ్ అవుతాం అంటూ, చాలా మంది రాయలసీమ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి పిటీషన్లు వేసారు. అమరావతి కేసులో తమ వాదన కూడా వినాలని, రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి కొంత మంది న్యాయవాదులు ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేసారు. అయితే ఈ మొత్తం పిటీషన్ల పై కోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది. వారి ఇంప్లీడ్ పిటీషన్లను కోర్టు ఈ రోజు తిరస్కరించింది. ఈ పిటీషన్లు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో విచారణ అర్హత కాదు అని ధర్మాసనం భావించింది. అందుకే ఈ ఇంప్లీడ్ పిటీషన్లను ధర్మాసనం కొట్టి వేసింది. ఇదే సందర్భంలో, విశాఖలో గెస్ట్ హౌస్ కి సంబంధించి, ప్రభుత్వం క్యాంప్ ఆఫీస్ కోసం గతంలో ఇచ్చిన అఫిడవిట్ పై ఈ రోజు కూడా విచారణ జరిగింది. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నారని చెప్తున్నా, ఇది తొందర్లోనే క్యాంప్ ఆఫీస్ గా మారిపోతుందనే అనుమానాలు రాజాధాని ప్రాంత రైతులు వ్యక్తం చేస్తూ, పిటీషన్ వేసారు. దీని పై కూడా ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా ఈ గెస్ట్ హౌస్ పై, పూర్తి స్థాయి ప్రణాళిక, ప్లాన్ మొత్తం తమ ముందు ఉంచాలని కోర్టు తెలిపింది. ఇక్కడ గెస్ట్ హౌస్ నిర్మాణం అనేది భారీ స్థాయిలో నిర్మిస్తున్నారని, ఇది రాజధాని తరలింపులో భాగం అంటూ, రైతులు కోర్టుకు చెప్పారు.

hc 02112020 2

దీంతో ఆ ప్లాన్ ను కోర్టు ముందు ఉంచాలని, కోర్టు తెలిపింది. ఇదే సమయంలో సియం క్యాంప్ ఆఫీస్ నిర్మాణం అనేది, పరిపాలనా రాజధానిలో భాగంగా నిర్మిస్తున్నారు అనే తెలిస్తే కనుక, అప్పుడు అభ్యంతరాలు పిటీషనర్ తెలియచేస్తూ, కోర్టు దృష్టికి తీసుకుని రావచ్చని కోర్టు తెలిపింది. గతంలో ప్రభుత్వం ఈ విషయం పై వాదిస్తూ, ఇది కేవలం సియం క్యాంప్ ఆఫీస్ అని, దీనికి పరిపాలనా రాజధానికి సంబంధం లేదని, ఎన్ని అయినా సియం క్యాంప్ ఆఫీస్ లు పెట్టుకోవచ్చని, దానికి సంబందించిన వివరాలు కోర్టుకు సమర్పించారు. అయితే దీని పై అన్ని కోణాల్లో పరిశీలించిన కోర్టు, దీని పై వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు అర్ధం అవుతుంది. అందుకే ముందుగా ప్లాన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరటం, అలాగే ఇది పరిపాలనా రాజధానిలో భాగంగా నిర్మిస్తున్నారు అంటే తమ వద్దకు వచ్చి చెప్పవచ్చు అని చెప్పింది. ఇక మరో పక్క ఇంప్లీడ్ పిటీషన్లు అన్నీ కోర్టు కొట్టేసింది. దీంతో ఇప్పుడు ఇక మెయిన్ పిటీషన్ ఒక్కటే మిగిలి ఉంది. దీని పై కూడా రోజు వారీ విచారణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇరు వైపులా, ఒక్కొక్కరికీ ఏడు రోజులు సమయం కోర్టు ఇచ్చింది. దీంతో రాజధాని మెయిన్ పిటీషన్ పై కూడా, మరో నెల రోజుల్లోనే ఏదో ఒక విషయం కోర్టు చెప్పే అవకాసం ఉందని తెలుస్తుంది.

Advertisements

Latest Articles

Most Read