ఉదయం సోషల్ మీడియాలో, మీడియాలో, కోర్టుల పై వ్యాఖ్యలు చేస్తున్న వారిని ఎందుకు కేసులు పెట్టటం లేదు, ఎందుకు అరెస్ట్ చెయ్యటం లేదు అంటూ సిఐడి పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, సిఐడి విచారణ సరిగా లేదని, సిబిఐ విచారణకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సాయంత్రానికి వచ్చే సరికి, మరో కేసు విషయంలో కూడా, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, సిబిఐ విచారణకు ఆదేశించాలని, ఇలా అన్ని కేసులు సిబిఐకి ఇవ్వాలి అంటే, ఇక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ ఒక ఆఫీస్ తెరవాలి అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ రోజు హైకోర్టులో పలు హెబియస్ కార్పస్ పిటీషన్ల పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత, జడ్జి ముందు 24 గంటల్లోపు హాజరు పరచాలని, అయితే ఇక్కడ అలా జరగటం లేదు అంటూ పిటీషనర్ కోర్టుకు తెలిపారు. జుడీషియల్ విచారణకు సంబంధించి పోలీసులు తరుపు కౌన్సిల్ చేసిన వాదనల పై, స్పందించిన ధర్మాసనం, ఇలా అయితే సిబిఐ ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆఫీస్ తెరవాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

ప్రతి కేసుని కూడా సిబిఐకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే, సిబిఐ అధికారులు ఇక్కడ ఆఫీస్ తెరవాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిన్న కూడా హెబియస్ కార్పస్ పిటీషన్ల పై విచారణ జరిగింది. అయితే ఈ సందర్భంగా నిన్న కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటీషన్లను ఉపసంహరించుకోవాలి అంటూ, న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తున్నారని కోర్టు దృష్టికి రావటంతో, హైకోర్టు స్పందిస్తూ, ఇలాంటి చర్యలు ఒక వ్యవస్థను భయపెట్టే సంఘటనలు అని, న్యాయవాదులనే బెదిరిస్తే కోర్టులను మూసేయాలని వ్యాఖ్యలు చేసింది. బీహార్ లో ఇదే తరహా ఘటనలు జరిగితే, అక్కడ కోర్టు సుమోటోగా తీసుకుని డీజీపీని విచారణకు పిలిచిందని, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించింది. గతంలో కూడా ఇదే అంశం పై హైకోర్టు సీరియస్ అయ్యి, ఏపి పోలీసులు తీరు పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ రోజు విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఈ కేసు కూడా సిబిఐకి వెళ్ళే అవకాసం లేక పోలేదు. వచ్చే వారం కోర్టు దీని ఆపి ఏమి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.

నర్సాపారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంటి పై సిబిఐ సోదాలు జరుగుతున్నాయి అంటూ, కొన్ని మీడియా చానల్స్ లో వార్తలు వచ్చాయి. ఢిల్లీ నుంచి సిబిఐ ప్రత్యెక బృందాలు వచ్చాయని, హైదరాబాద్ లోని రఘురామరాజు ఇంటి పై, అలాగే నర్సాపురంలో ఆయన ఇంటి పై, ఢిల్లీలో ఇంటి పై ఒకేసారు సిబిఐ దాడులు చేస్తుంది అంటూ, వార్తలు వచ్చాయి. ఇందు భారత్ కంపనీకి సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయని, ఆ కంపెనీలో ఉన్న మరో 8 మంది డైరెక్టర్ల ఇంటి పై కూడా సిబిఐ సోదాలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. అయితే దీని పై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. తన ఇళ్ళ పై సిబిఐ దాడులు జరుగుతున్నాయి అంటూ వస్తున్న వార్తలు తనకు కూడా తెలియదని, తాను మీడియాలోనే ఈ వార్తలు చూస్తున్నానని, అయితే తను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నానని, ఎలాంటి సిబిఐ దాడులు జరగటం లేదని, హైదరాబాద్ లో కానీ, ఢిల్లీలో కానీ, తన నియోజకవర్గంలో కానీ ఎలాంటి సిబిఐ దాడులు జరగటం లేదు అంటూ, ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేసారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల పై ఒక ప్లాన్ ప్రకారం ఇబ్బందులు సృష్టిస్తున్న వేళ, బెజవాడ కనకదుర్గమ్మ రధానికి ఉండే వెండి సింహాల మాయం, సంచలనంగా మారింది. దీంతో ప్రభుత్వం ఈ కేసు పై ప్రత్యెక దృష్టి పెట్టింది. పోలీసులు కూడా ఈ కేసుని చేదించే పనిలో పడినా, ఆధారాలు చిక్కినట్టే చిక్కి, మళ్ళీ చిక్కుముడులు వస్తున్నాయి. పోలీసులు పురోగతి సాధిస్తున్నారు అనుకునే సమయంలో, ఏదో ఒక ఇబ్బందితో, మళ్ళీ విచారణకు ఇబ్బందులు వస్తున్నాయి. రధానికి ఉన్న వెండి సింహాల మాయం పై, పోలీసులు దృష్టి పెట్టి, ఈ సింహాలు ఈ ఏడాది జూన్ లో మాయం అయినట్టు గుర్తించారు. అయితే కీలకమైన ఈ ఆధారం దొరకటంతో, పోలీసులు ఆసల దొంగలను త్వరలోనే పట్టేసుకుంటారని భావించిన సమయంలో, తదుపరి ఆధారాలు దొరక్క పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు జరిగిందో గుర్తించారు కాబట్టి, ఎవరు చేసారో ఇట్టే కనిపెట్టేయవచ్చని అనుకున్న సమయంలో, తాజాగా పోలీసులు ఎటువంటి ఆధారాలు దొరక్క పోవటంతో, విచారణ అక్కడే ప్రస్తుతానికి ఆగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో, ఎలాగైనా తొందరగా విచారణ చేసి, ఒక కొలిక్కి తెద్దామని పోలీసులు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలం కావటం లేదు.

ఘటన జరిగిన చోటు నుంచి ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన ఆధారాల ప్రకారం, వారు ఇచ్చే రిపోర్ట్ లో కీలకమైన అంశాలు దొరుకుతాయని పోలీసులు భావించారు. కానీ తాజాగా ఫోరెన్సిక్ ఇచ్చిన రిపోర్ట్ లో, పోలీసులకు కావలసిన ఎలాంటి సమాచారం లభ్యం కాలేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఎలాంటి ఆధారాలు దొరక్కపోవటంతో, ఎలా ముందుకు వేళ్ళలో పోలీసుల అర్ధం కాక, విచారణలో కొత్త దారులు వెతుకుతున్నారు. జూన్ లో మాయం అయ్యాయి అని ఆధారాలు దొరకటంతో, ఈ కేసు విచారణ తొందరగా ముగిసిపోతుందని భావించినా, తదుపరి ఆధారాలు దొరక్కపోవటంతో, కేసు విచారణలో వేగం తగ్గింది. రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయంలో జరిగిన ఘటన కావటంతో, పోలీసులు కూడా ఈ విషయం సీరియస్ గా తీసుకున్నారు. ఆరు బృందాలు, ఈ కేసు పై విచారణ చేస్తున్నాయి. దాదాపుగా 100 మందికి పైగానే ఇప్పటి వరకు విచారణ చేసారు. మరో పక్క ఈ విషయం పై రాజకీయ దుమారం కూడా రేగింది. ప్రతిపక్షాలు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేసాయి. ఈ నేపధ్యంలో, ఈ కేసు తొందరగా ఒక కొలిక్కి తీసుకు రావాలని పోలీసులు భావిస్తున్నా, విచారణ నెమ్మదించింది. తొందర్లోనే అసలు దొంగలను పోలీసులు పట్టుకుంటారని ఆశిద్దాం.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పై ఈ మధ్య అధికార పార్టీ నేతలు కొంత మంది, తమ అసహనం వ్యక్తం చేస్తూ, మీడియాలో ఇష్టం వచ్చినట్టు హైకోర్టు పై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీలు హైకోర్టు ఎక్కువగా జోక్యం చేసుకుంటుంది అంటూ పార్లమెంట్ లో కూడా వ్యాఖ్యలు చేసారు. విజయసాయి రెడ్డి, నందిగం సురేష్, గుడివాడ అమర్నాద్, పండుల రవీంద్ర బాబు, ఇలా కొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు హైకోర్టు ఇస్తున్న తీర్పుల పై అసహనం వ్యక్తం చెయ్యటమే కాక, హైకోర్టు పై లైన్ దాడి కూడా వ్యాఖ్యలు చేసారు. ఇదే కోవలో స్పీకర్ తమ్మినేని కూడా, హైకోర్టు పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. అన్ని విషయాల పై హైకోర్టు అభ్యంతరం చెప్తుందని, ఇంకా మేము ఎందుకు , ఈ శాసన వ్యవస్థ ఎందుకు అంటూ వ్యాఖ్యలు చేసారు. తరుచు ఇలనాటి వ్యాఖ్యలు ఆయన కోర్టుల పై చేస్తూనే ఉన్నారు. అయితే స్పీకర్ స్థానంలో ఉంటూ, తమ్మినేని ఇలా వేరే వ్యవస్థ పై పౌరుషంగా వ్యాఖ్యలు చేయటం పై, అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తమ్మినేని మాత్రం, తరుచూ హైకోర్టుని తప్పు పడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, గత కొన్ని నెలలుగా, హైకోర్టు పై అధికార పార్టీ నేతలు, అలాగే అధికార పార్టీ సోషల్ మీడియా వింగ్, సోషల్ మీడియాలో హైకోర్టు పై చేస్తున్న ప్రచారం పై, హైకోర్టు రిజిస్టార్, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.

హైకోర్టు రిజిస్టార్ తో పాటుగా, ఇతరులు కూడా, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పై పిటీషన్ దాఖలు చేసారు. ఇక అలాగే, 90 మందికి పైగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి నోటీసులు ఇచ్చారు. దీని పై సిఐడి కేసు నమోదు చేసారు. అయితే ఇంత వరకూ వీరిని సిఐడి పట్టుకోలేక పోవటం పై కూడా, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు ఈ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా, స్పీకర్, ఉప ముఖ్యమంత్రి నారాయాణ స్వామి, మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు పై చేసిన వ్యాఖ్యల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని అభిప్రాయపడింది. వీరి పై ఎందుకు కేసులు నమోదు చెయ్యలేదని ప్రశ్నించింది. హైకోర్ట్ రిజిస్టార్ కంప్లెయింట్ ఇచ్చినా, కేసులు నమోదు చేయరా ? ప్రభుత్వం పై వ్యాఖ్యలు చేస్తే, వెంటనే అరెస్ట్ చేస్తున్నారు కదా, హైకోర్టు పై వ్యాఖ్యలు చేస్తుంటే కేసు ఎందుకు పెట్టటం లేదని ప్రశ్నించింది. వారిని రక్షించెందుకే ఇలా చేస్తున్నారా, ఇలా అయితే కేసుని సిబిఐకి ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Advertisements

Latest Articles

Most Read