భారతీయ జనతా పార్టీ అధ్యక్ష్యుడు జేపీ నడ్డా, తన కొత్త టీంని ప్రకటించారు. ఈ రోజు బీజేపీ కొత్త కార్యవర్గాన్ని, 70 మంది పేర్లతో ప్రకటించారు. ఇందులో సీనియర్లు, జూనియర్లకి సమ ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే అన్ని రాష్ట్రాల నుంచి ఈ కార్యవర్గంలో ప్రాధాన్యత ఉండేలా చూసుకున్నారు. అయితే తమిళనాడు నుంచి ఎవరూ లేకపోవటం మరో గామించాల్సిన అంశం. దాదాపుగా 12 మంది ఉపాధ్యక్షులతో పెద్ద టీంని జేపీ నడ్డా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పురందేశ్వేసరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, సత్య ప్రసాద్ జాతీయ కార్యదర్శిగా నియమితులు అయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి డీకే అరుణ ఉపాధ్యక్షురాలిగా, డాక్టర్ లక్ష్మణ్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమితులు అయ్యారు. ఇక కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువ ఎంపీ తెజేస్వి సూర్య, యువ మోర్చా అధ్యక్షుడిగా నియమితులు అయ్యారు. గత కార్యవర్గంలో ఉన్న చాలా మందిని, ఇప్పుడు జేపీ నడ్డా తొలగించారు.
అయితే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీలో ఆక్టివ్ గా ఉన్న రాం మాధవ్ కు, ఈ సారి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కక పోవటం, చర్చకు దారి తీసింది. అలాగే మురళీధర్ రావు పేరు కూడా కొత్త కార్యవర్గంలో లేకపోవటం చర్చకు దారి తీసింది. ఇద్దరికీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లేకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక మరో పక్క జాతీయ స్పోక్స్ పర్సన్ నుంచి జీవీఎల్ నరసింహరావు పేరుని కూడా తొలగించారు. అయితే బీజేపీ వర్గాలు మాత్రం, వీరికి త్వరలో క్యాబినెట్ మంత్రి పదవి లభించే అవకాసం ఉందని చెప్తున్నారు. మరి వీరిని కావాలని దూరం పెట్టారా ? లేక మంత్రి పదవులు కోసం దూరం పెట్టారా అనేది తొందరలోనే తెలిసే అవకాసం ఉంది.