ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టులు కలిసి రావటంలేదో, లేక ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే న్యాయ సలహాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారో కానీ, అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు చట్ట విరుద్ధంగా, రూల్ అఫ్ లా కి వ్యతిరేకంగా ఉంటున్నాయని కోర్టులు వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. అయితే కోర్టులు మా నిర్ణయాలు అడ్డుకుంటున్నాయి అనే ప్రచారాలు చేస్తున్నా, కింద కోర్టు నుంచి, పై కోర్టు వరకు ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాలను తప్పు బడుతున్నారు అంటే, లోపం కోర్టుల్లో కాదు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో అని గ్రహించలేక పోతున్నారు. ఉదాహరణకు కొన్ని చూస్తే, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తే ఎవరైనా చూస్తూ కూర్చుంటారా ? అందుకే కింద కోర్టు నుంచి పై కోర్టు దాకా దీన్ని తప్పు బట్టారు. ఇక ఒక రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ని తప్పించే నిర్ణయం చట్టం ఒప్పుకుంటుందా ? అందుకే కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు తప్పు బట్టింది. అలాగే అమరావతి విషయం. 30 వేల మందితో అగ్రిమెంట్ చేసుకుని, ఇప్పుడు తూచ్ అంటే కుదురుతుందా ? అలాగే ఇళ్ళ పట్టాలు. ఇళ్ళ పట్టాలు మొత్తం ఆపినట్టు ప్రచారం చేసారు కానీ, నిజానికి కోర్టు ఆపింది ముంపు భూములు, మైనింగ్ భూములు, ప్రభుత్వ స్కూల్స్ స్థాలాలు లాంటివే కోర్టు స్టే ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ సుప్రీం కోర్టులో తగిలింది.

sc 29082020 2

ఇది కూడా ఇలాంటి నిర్ణయమే అని చెప్పాలి. ఓ కేసులో 455 రోజుల తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్ళటం పై, సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పిటీషన్ కొట్టేసిన సంఘటన ఇది. ఎప్పుడో 1999లో గుంటూరు జిల్లా, సత్తెనపల్లికి చెందిన ఎం.శ్రీనివాసరావు అనే వ్యక్తి, తమను ఒక అధికారి లంచం అడిగారు అంటూ తప్పుడు ఫిర్యాదు చేసారని ఏసిబి కేసు నమోదు చేసింది. దీనికి సవాల్ చేస్తూ, శ్రీనివాసరావు 2007లో అప్పటి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. 2018లో శ్రీనివాసరావుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే దీని పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సుదీర్ఘ కాలం తరువాత, సుప్రీం కోర్టులో ఈ కేసు పై అపీల్ చేసింది. ఈ పిటీషన్ జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ కు చెందిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే దీని పై సుప్రీం కోర్టు బెంచ్ తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. ఇంత సుదీర్ఘ కాలం తరువాత, 455 రోజుల తర్వాత ఎస్ఎల్పీ దాఖలు చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు చేసిందని, ఇలా చేసి సరిదిద్దలేని అసమర్థతను ప్రభుత్వం చూపించింది అంటూ, ఈ వైఖరిని తాము ఆక్షేపిస్తున్నామని సుప్రీం కోర్టు తెలియ చేసింది.

దేశంలోనే అతి పొడవైన కోస్తా తీరాల్లో మూడో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో పూర్తిగా చతికిలపడింది. మొత్తం 13 జిల్లాల్లో రాయలసీమ జిల్లాలు మినహా మిగిలిన 9 జిల్లాలు సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయి. ఒక మేజర్ పోర్టు సహా 11 మైనర్ పోర్టులతో అలరారుతున్నప్పటికీ ఎగుమతి సన్నద్ధతా సూచీ-2020 (ఈపీఐ)లో మొత్తం 8 సముద్ర తీర రాష్ట్రాల్లో ఏపీ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్సెస్ భాగస్వామ్యంతో రూపొందించిన నివేదికను నీతి అయోగ్ ఇటీవల విడుదల చేసింది. ఇందులో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు వరుసగా మొదటి, రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. సువిశాల కోస్తా తీరంతోపాటు రోడ్డు, రైలు, విమాన మార్గాలున్నప్పటికీ ఈపీఐలో ఏపీ వెనుకబడిపోవడం వెనుక ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రను పోషిస్తున్న వాణిజ్య రంగంలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ పనితీరుకు నిరాశ తప్పటం లేదు. సుదీర్ఘ తీర ప్రాంతం, నూతన సాంకేతికత, రవాణా సదుపాయాలు, అత్యాధునిక పోర్టులున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఎగుమతుల్ని ఆకర్షించటంలో సర్కారు పూర్తిగా విఫల మైంది.

niti 2908200 2

దేశంలోని వివిధ రాష్ట్రాల ఎగుమతుల సన్నద్ధత, పనితీరును పరిశీలించిన నీతి అయోగ్ ఈ నివేదికను విడుదల చేసింది. దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా ఎగుమతులకు సంబంధించి, సుస్థిరాభివృద్ధిని సాధించేందుకు కీలకమైన అన్ని ఆర్థిక ప్రమాణాలు, ఆర్థిక యూనిట్లను పరిగనణలోకి తీసుకుంది. ఈపీఐ పరంగా అనేక రాష్ట్రాలు ఎగుమతుల వైవిధ్యం , రవాణా అనుసంధానత, మౌలిక సదుపాయలను కల్పించడం వంటి విషయాల్లో సగటున మంచి పనితీరును ప్రదర్శించినట్లు నివేదికలో పేర్కొంది. ఎగుమతుల పోటీని తట్టుకుంటూ పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఇతర కీలక అంశాలపై దృష్టిని సారించాలని సూచించింది. సముద్ర తీర రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, తమిళ నాడు రాష్ట్రాలు అత్యంత మెరుగైన పనితీరును కనబరచి మొదటి మూడు ర్యాకులను కైవసం చేసుకున్నట్లు పేర్కొంది. ఇక ఒడిశా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు వరుసగా నాలుగు, ఐదు, ఆరు ర్యాకులను సాధించగా ఆంధ్రప్రదేశ్ ఏడు, పశ్చిమ బెంగాల్ ఎనిమిది ర్యాంకులతో సరిపెట్టుకున్నాయి. సముద్ర తీరం లేకుండా చుట్టూ భూభాగమే కలిగిన రాజ స్థాన్, తెలంగాణ, హర్యానా సైతం మెరుగైన ఫలితాలను సాధించాయి.

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెంనాయడుకి, ఎట్టకేలకు హైకోర్టులో ఊరట లభించింది. దాదాపుగా 70 రోజులకు పైగా అచ్చెన్నకు బెయిల్ రాలేదు. ఈ మధ్య కాలంలోనే ఆయనకు రెండు సార్లు పైల్స్ ఆపరేషన్లు జరగటం(మొదటి సారి, పోలీసులు అరెస్ట్ చేసే ముందు రోజు ఆపరేషన్ జరిగింది), తరువాత కరోనా బారిన పడటం, ఇలా అనేక విధాలుగా ఆయన ఈ 70 రోజులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈఎస్ఐ కేసులో అచెన్న పై అభియోగాలు మోపి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మొదట్లో చేసిన ప్రచారం 900 కోట్లు స్కాం అంటూ హడావిడి చేసి, తరువాత 3 కోట్లు అభియోగాలు మోపి చివరకు, ఇప్పటి వరకు రూపాయి కూడా అచ్చెన్న దుర్వినియోగం చేసినట్టు నిరూపించలేదు. మరో పక్క అచ్చెన్న తరుపు న్యాయవాదులు గత 70 రోజులుగా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జిల్లా కోర్టు బెయిల్ పిటీషన్ కొట్టి వేయటంతో, హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, అచ్చెన్నకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.. విజయవాడ ఏసీబీ కోర్టులో పూచీకత్తు ఇవ్వాలని, దేశం విడిచి వెళ్ళ కూడదని, విచారణకు సహకరించాలని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్.

achem 29082020 2

ఈ సందర్భంగా న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే పిటీషనర్ వేసిన బెయిల్ పిటీషన ని కింద కోర్టుతో పాటు, హైకోర్టు కూడా కొట్టేసి, మీకు దర్యాప్తు చేసే అవకాసం వచ్చేలా చేసామని, అయినా ఇప్పటి వరకు, పిటీషనర్ డబ్బు తీసుకునట్టు ఎక్కడా ఆధారాలు లేవని న్యాయమూర్తి అన్నారు. విజిలెన్స్ గతంలో చేసిన ప్రధామిక విచారణలో కానీ, ఇప్పుడు అరెస్ట్ చేసిన తరువాత రెండు నెలలుకు పైగా కానీ, పిటీషనర్ పై ఏ ఆధారం కోర్టుకు చూపించలేదు, కేవలం సిఫారసు లేఖలు మాత్రమే చూపించారు, వీటి ఆధారంగా ఇప్పటికే 77 రోజులు జైల్లో ఉన్న వ్యక్తికి, బెయిల్ ఇవ్వకుండా ఆయన స్వేఛ్చను హరిన్చాలేము, పైగా ప్రభుత్వ తరుపు అడ్వకేట్ జెనెరల్ కూడా, ఏ విధమైన నగదు తీసుకున్నట్టు ఆధారాలు లేవని చెప్పారు, కాబట్టి ప్రాధమిక ఆధారాలు లేకుండా ఆయనకు ఇంకా బెయిల్ ఇవ్వకుండా ఉండలేం అంటూ, విచారణకు సహకరించాలని చెప్తూ, షరతులతో బెయిల్ మంజూరు చేసారు. అలాగే కేసులో ఛార్జ్ షీట్ కూడా సెప్టెంబర్ లో వేస్తున్నాం అంటున్నారు, అంటే విచారణ చివరి దశకు వచ్చినట్టే కదా అంటూ, కోర్టు వ్యాఖ్యానించింది. ఇక మరో పక్క కోర్టు ఆదేశాల పై తెలుగుదేశం శ్రేణులు సంతోషిస్తున్నాయి. అచ్చెన్న తప్పు చెయ్యలేదని ముందు నుంచి చెప్తున్నాం అని, ఇది కేవలం బీసి నేతల పై కక్ష్ సాధింపు మాత్రమే అని, ఇన్ని నెలలు గదించినా రూపాయి కూడా అవినీతి చూపించలేక పోయారని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ప్రభుత్వం పై, అధికారుల పై తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. అందరికీ ఇళ్ళు పేరుతో, రాష్ట్ర ప్రభుత్వం ఒక సెంటు స్థలాన్ని, పేదలకు ఇస్తాను అంటూ చెప్పింది. అయితే కొన్ని చోట్ల ముంపు భూములు, మైనింగ్ భూములు, స్కూల్ బిల్డింగ్స్, పశువుల మేత కోసం వేసిన భూములు, కొండలు, స్మశానాలు, ఇలా ఎక్కడ పడితే అక్కడ, చట్ట విరుద్ధంగా, ఇచ్చాం అంటే ఇచ్చాం అనే విధంగా, ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి సిద్ధం అయింది. అలాగే రాజధాని అమరావతిలో రైతులు, రాజధాని నిర్మాణం కోసం భూమి ఇస్తే, అవి కూడా పేదలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటివి ఒక రెండు వేల నుంచి మూడు వేల ఎకరాలు ఉంటాయి. ఇవన్నీ తదితర పార్టీల వాళ్ళు కోర్టుల్లో కేసులు వెయ్యటంతో, ప్రతి విషయంలో కోర్టుల్లో ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఇవి మాత్రం ఆపి, ప్రభుత్వం చెప్తున్నట్టు మిగతా 40 వేల ఎకరాలు పంచ వచ్చు. కానీ కోర్టు కేసుల వల్ల ఆపెస్తున్నాం అంటూ, మొత్తం పంపిణీ ఆపేసి, ప్రతిపక్షాలు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నాయి అంటూ రాజకీయ ఆరోపణలు భారీగా చేస్తున్నారు. అయితే నిన్న మరోసారి విశాఖలోని గబ్బాడలో చెట్లు నరికేసి, ఇళ్ళ స్థలాల ఫ్లాట్లు కోసం రెడీ చేస్తున్నారని, ఆర్‌.గంగునాయుడు అనే వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించారు. చెట్లు నరికివేతను అడ్డుకోవాలని, హైకోర్టులో అపీల్ చేసారు.

hc 29082020 2

ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. తమ దృష్టికి వచ్చిన కొన్ని పిటీషన్లలో ముంపు భూములు ఇళ్ళ స్థలాల పేరిట ఇస్తున్నారని, అలాగే కొన్ని చోట్ల చెట్లు నరికివేస్తున్నారని పేర్కొంది. ముంపు భూములు ఇస్తే తరువాత పేదలు ఇబ్బందులు పడతారు కదా అని పేర్కొంది. అలాగే చెట్లు నరికివేత పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు నరక కూడదని సుప్రీం కోర్టు గతంలో అనేక ఉత్తర్వులు ఇచ్చిందని, అవి ఉల్లంఘించి ఎందుకు చెట్లు నరుకుతున్నారని ? చెట్లు నరకమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు ? ఆ ఫైల్ తమ ముందు పెట్టాలని ఆదేశించింది. ఇక నుంచి చెట్లు నరికివేత ఆపేయాలని, తమ దృష్టికి ఈ అంశం మళ్ళీ వస్తే ముఖ్య కార్యదర్శి బాధ్యత వచించాల్సి ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే అధికారులు ఏమి చేస్తున్నారో చూడకుండా, తమ పైనే నిందలు మోపుతున్నారు అంటూ, ప్రభుత్వాన్ని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇక పై చెట్లు ఎక్కడ నరకం అంటూ, తమకు అఫిడవిట్ రూపంలో దాఖలు చెయ్యాలని చెప్తూ, ఈ కేసుని నాలుగు వారాలు వాయిదా వేసింది.

Advertisements

Latest Articles

Most Read