ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క-రో-నా కేసుల్లో దేశంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు సలహాలు ఇస్తుంటే, ప్రభుత్వం వైపు నుంచి ఎదురు దాడి మాత్రమే కనిపిస్తుంది కానీ, ఆ సలహాలు, సూచనలు మంచి ఉద్దేశంతో తీసుకోకుండా, రాజకీయం కక్షసాధింపు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, పీసీసీ ఉపాధ్యక్షులు డా. గంగాధర్‌కు సిఐడి నోటీసులు ఇవ్వటం, ఆయనను విచారణకు రమ్మనటం ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, ప్రభుత్వం క-రో-నా ను అరికట్టటంలో ఫెయిల్ అయ్యిందని, కొన్ని ఉదాహరణలు చెప్పినందుకు, ఆయనకు సిఐడి నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ రోజు డా. గంగాధర్ సిఐడి ముందు హాజరు అయ్యారు. ఆయనతో పాటుగా, న్యాయవాదులు కూడా లోపలకు వెళ్ళారు. రెండు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు సరైన రక్షణ పరికారాలు లేవని తాను పరిశీలన చేసిన విషయాలు చెప్తే, తన పైన డిజాస్టర్ మ్యానేజ్మెంట్ ఆక్ట్ కింద కేసులు పెట్టారని, ఇలా అడగటం కూడా తప్పా అని డా. గంగాధర్ విచారణ అయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, వాస్తవానికి చాలా తేడా ఉందని, అన్నీ నెగటివ్ కోణంలో చూడకుండా, సలహాలను ప్రభుత్వాలు తీసుకోవాలని అన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధరకు నోటీసులు ఇవ్వడం దుర్మారమని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆరోపించారు. ప్రభుత్వ చర్యలపై తగిన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి, ఏపీ మానవహక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషనుకు ఆయన శనివారం లేఖలు రాశారు. కో-వి-డ్ కట్టడిపై ప్రభుత్వ అవగాహనా లేమీ, తీసుకోవాల్సిన చర్యలపై నిర్మాణాత్మక సూచనలను విస్మరించి కక్షహరితంగా కేసులు నమోదు చేయడం చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొ న్నారు. క-రో-నాకు బలవుతున్న వైద్యుల అంశంపై గత ఏప్రిల్ లో ఒక టీవీ ఛానల్ ఇంటర్వూలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి తగిన రక్షణ పరికరాలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. తాను చేసే సూచనలను విమర్శనాత్మకంగా కాక నిర్మాణాత్మక సూచనగా తీసుకోవాలని పేర్కొన్నట్లు శైలజానాథ్ తెలిపారు. అయితే ప్రభుత్వం కక్షపూరితంగా నోటీసులు జారీ చేయడం భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడ మేనని పేర్కొంటూ పోలీసు నోటీసుల పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.