గత 16 నెలలుగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకాలు చేస్తుంది అంటూ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ కు అనేక లేఖలు రాసారు. అయితే 99 శాతం, ఆ లేఖల పై ఎలాంటి చర్యలు లేవు, లేదా చంద్రబాబుకి తిరిగి ఉత్తరం రాయటం లేదు. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు రాసిన లేఖలను ప్రెస్ ముందు ప్రస్తావించారు డీజీపీ. అయితే మొదటి సారి డీజీపీ, చంద్రబాబు రాసిన లేఖకు రియాక్ట్ అయ్యారు. అయితే, ఇది చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖ కాదు, ప్రధానికి రాసిన లేఖ. ఫోన్ ట్యాపింగ్ గురించి చంద్రబాబు, ప్రధానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై స్పందించిన డీజీపీ చంద్రబాబుకు లేఖ రాసారు. మీరు ప్రధానికి రాసిన లేఖ మీడియా ద్వారా మా దృష్టికి వచ్చింది, మీరు ప్రధానికి రాసిన లేఖ విషయానికి సంబంధించి, తమకు మీదగ్గర ఉన్న సాక్ష్యాలు ఇవ్వాలి అంటూ డీజీపీ లేఖలో తెలిపారు. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం, అందరి హక్కులు కాపాడతామని డీజీపీ తెలిపారు.

అయితే ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ నేతలు స్పందిస్తూ, ఆరోపణలు వస్తుందే మీ మీద అని, అందుకే అత్యున్నత విచారణ కోరుతున్నామని, మీకు సాక్ష్యాలు ఎలా ఇస్తాం అని ప్రశ్నించారు. అలాగే డీజీపీ రాసిన లేఖ పై చంద్రబాబు కూడా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ విషయం పై నేను ప్రధానికి లేఖ రాస్తే, దానికి డీజీపీ హడావిడిగా స్పందించటం విచిత్రంగా ఉంది. మీ మీద ప్రధానికి లేఖ రాస్తే, ఆధారాలు మీకు ఇవ్వాలి అని అడగటం విడ్డురంగా ఉందని చంద్రబాబు అన్నారు. గతంలో ఎన్నో లేఖలు ఆయనకు రాస్తే, దానికి స్పందన లేదని అన్నారు. ఆయన విచారణ చెయ్యకుండా, నన్ను ఆధారాలు ఇవ్వమని అడగటం ఏమిటి అని ప్రశ్నించారు. నన్ను విశాఖలో అడ్డుకుంటే ఏమి చేసాడు ? ఆత్మకూరు వెళ్ళనివ్వకుండా ఎందుకు ఆపాడు ? కోర్టులో నిలబడి చట్టం చదివే పరిస్థితి తెచ్చుకుని, ఇప్పుడు సాక్ష్యాలు ఇవ్వమంతున్నారు అని మండి పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ముందు నుంచి వాళ్లకు ఉన్న అలవాటే అని, గతంలో సిబిఐ జేడీ లక్ష్మీనారయణ ఫోన్ కూడా ఇలాగె ట్యాప్ చేసారని అన్నారు.

న్యాయమూర్తులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ, ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కధనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తరువాత అధికార పార్టీ ఎంపీ రఘురామరాజు తన ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది అని చెప్పటం, అలాగే చంద్రబాబు, ప్రధానికి లేఖ రాయటం, హైకోర్టులో పిల్ దాఖలు కావటంతో, ఈ మొత్తం వ్యవహారం పై చర్చ జరుగుతుంది. ఈ నేపధ్యంలో, శ్రవణ్ కుమార్ వేసిన పిల్ పై , ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా, ఇరు పక్షాల నుంచి హోరా హరీ వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ మహేశ్వరీ నేతృత్వంలోనే బెంచ్ ఈ వదనలు విన్నది. ఈ అంశం పై దాదాపుగా 45 నిమిషాల సేపు వాదనలు జరిగాయి. అయితే ప్రభుత్వం తరుపు వాదనలు వినిపిస్తూ, ఆంధ్రజ్యోతిని కూడా పార్టీగా చేర్చాలని వాదించారు. దీని పై స్పందించిన ధర్మాసనం, ఆ కధనం చదివి వినిపించమని కోరింది. ఆంధ్రజ్యోతి కధనం పై ఫోన్ ట్యాపింగ్ కు విచారణకు ఆదేశిస్తే, మీకు వచ్చిన అభ్యంతరం ఏమిటి అంటూ కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు, పిటీషనర్ శ్రవణ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఆంధ్రజ్యోతి కధనంలో ఏమైనా తప్పు ఉంటే, మీరు తగు చర్యలు తీసుకోవచ్చు అని, మేము కూడా ఈ విచారణలో ఏమైనా తప్పు ఉంటే, చూస్తాం అని ధర్మాసనం చెప్పినట్టు చెప్పారు.

ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద నేరం అని, రాజ్యంగంలో కూడా ఇది ఉందని, ఇద్దరి వ్యక్తుల మధ్య మాట్లాడే విషయం, వినే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కోసం ఒక అధికారిని ప్రభుత్వం నియమించింది అంటూ, న్యాయవాది శ్రవణ్ కోర్టుకు తెలిపారు. ఆ అధికారి పేరు చెప్పాలని కోర్టు కోరగా, ఓపెన్ కోర్టు లో చెప్పలేను అని, అఫిడవిట్ రూపంలో దాఖలు చేస్తానని చెప్పారు. అలాగే న్యాయమూర్తుల పై, షాడో పార్టీలను నియమించింది అంటూ, శ్రవణ్ కోర్టుకు తెలపటంతో, దాంట్లో ఉన్న ఆధారాలు అఫిడవిట్ రూపంలో తమకు చెప్పాలని కోర్టు తెలిపింది. 5 గురు ఫోనులు ట్యాప్ అయ్యాయి అని శ్రవణ్ చెప్పటంతో, దీని పై విచారణకు ఆదేశిస్తే మీకు అభ్యంతరం ఏమిటి అని కోరగా, తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం చెప్పటంతో, గురువారంలోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చెయ్యాలని కోరింది. ఈ కేసు విచారణ గురువారానికి వాయిదా వేసింది. దీంతో పాటు, సర్వీస్ ప్రొవైడర్ లకు కూడా నోటీసులు ఇవ్వాలని కోరింది. మొత్తంగా శ్రవణ్ కుమార్ ని అఫిడవిట్ ని దాఖలు చెయ్యమని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చెయ్యమని, సర్వీస్ ప్రొవైడర్లకు కూడా నోటీసులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ పరిశీలించి, గురువారం కోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది.

అమరావతిని మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకుంటూ, వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లులు తేవటం వెనుక కూడా అభ్యంతరాలు ఉన్నాయి. శాసనమండలిలో సెలెక్ట్ కమిటీలో ఉన్నది అని ఒకరు, అలాగే పునర్విభజన చట్టం మార్చాలని, ఇలా అనేక వాదనలు వినిపించినా, ప్రభుత్వం గవర్నర్ చేత బిల్లులు ఆమోదింప చేసుకుంది. అయితే దీని పై రైతులు హైకోర్టు తలుపు తట్టారు. ఇది వరుకే అమరావతి పై అనేక పిటీషన్లు ఉండటంతో, రైతులు హైకోర్టు తలుపు తట్టటంతో, హైకోర్టు ఈ విషయం పై స్టేటస్ కో విధిస్తూ, యదాతధ స్థితి కొనసాగించాలని, విచారణ వాయిదా వేసింది. అయితే హైకోర్టు స్టేటస్ కో ఇవ్వటం పై, ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తట్టింది. వెంటనే విచారణ చెయ్యాలని కోరగా, పిటీషన్లో అనేక తప్పులు ఉండటంతో, సుప్రీం కోర్టు అది తిప్పి పంపించింది. మళ్ళీ తప్పులు సరి చేసి పంపించటంతో, సుప్రీం కోర్టులో ఈ కేసు ఈ రోజు లిస్టు అయ్యింది.

అందరూ ఏమి జరుగుతుందా అని ఉత్కంఠగా ఎదురు చుస్తున్న సమయంలో, అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే ధర్మనాసం ముందుకు వచ్చింది. అయితే దీని పై కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. దానికి కారణం హైకోర్టులో రైతులు తరుపున చీఫ్ జస్టిస్ బాబ్డే కుమార్తె, రుక్మిణీ బాబ్డే, వాదనలు వినిపించారు. ఈ విషయం చీఫ్ జస్టిస్ ముందు ప్రాస్తావన చెయ్యటంతో, వెంటనే చీఫ్ జస్టిస్ బాబ్డే ఈ కేసుని ఈ బెంచ్ వాదించదని, వేరే బెంచు ముందు ఈ కేసు లిస్టు చెయ్యాలని ఆదేశించారు. దీంతో ఈ కేసు విచారణ వేరే ధర్మాసనం ముందు, విచారణకు రానుంది. బుధవారం ఈ కేసు విచారణ మళ్ళీ సుప్రీం ముందుకు రానుంది. మొత్తానికి ఈ రోజు ఏమి జరుగుతుందా అని టెన్షన్ లో చూసిన వారికి, మళ్ళీ బుధవారం వరకు ఆగాల్సిన పరిస్థితి. అయితే చీఫ్ జస్టిస్ వేరే బెంచ్ కు కేసుని బదిలీ చెయ్యటం పై, ప్రశంసలు వస్తున్నాయి. ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా మంచి నిర్ణయం తీసుకున్నారని పలువురు అభిప్రాయపడ్డారు.

కారు దగ్ధం వీడియో ఇక్కడ చూడవచ్చు - https://youtu.be/sXByFiiN9R8 . విజయవాడలో దారుణం జరిగింది. కారులో మనుషులను పెట్టి మంటలు అందించాడు ఒక వ్యక్తీ. వేణుగోపాల్​రెడ్డి అనే వ్యక్తి హత్యకు ప్లాన్ చేసాడు. ల్యాండ్ వ్యవహారం వివాదంలో, ఈ మర్డర్ ప్లాన్ జరిగింది. నలుగురు వ్యక్తులను ప్రీ ప్లాన్డ్ గా నోవోటెల్ వద్దకు తీసుకోవచ్చాడు నిందితుడు. కారులో వచ్చిన నలుగురు పై పెట్రోల్ పోసి హత్యాయత్నం చేసాడు. కారు పూర్తిగా దగ్ధం అయ్యింది. ఆ మంటలకు ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మిగిలిన వారు తప్పించుకున్నారు. గాయాలు అయిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ కేసు పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని కృష్ణా రెడ్డిగా గుర్తించారు. అతనికి ఒక ప్రైవేటు హాస్పిటల్ లో వైద్యం జరుగుతుంది. ఈ ఘటన పై ఏసిపీ మాట్లాడుతూ ఘటన వివరాలు తెలిపారు. నలుగురు ఫ్రెండ్స్ అని, ఇది ఏదో అనుకోకుండా జరిగింది కాదని అన్నారు. మొత్తం ప్లాన్ ప్రకారం చేసారని తెలిపారు. చాల కాలం నుంచి నలుగురు కలిసి వ్యాపారాలు చేస్తున్నారని అన్నారు.

రియల్ ఎస్టేట్ తో పాటు, కారులు కొనటం అమ్మటం లాంటివి చేసారని, అయితే వ్యాపారంలో వీరికి ఎప్పుడు నష్టాలు వస్తు ఉండేవని అన్నారు. ఈ విషయం పైనే, ఈ నష్టాలు ఎవరు ఎంత భరించాలి అనే దాని పై గత కొంత కాలంగా నలుగురు మధ్య చర్చలు జరుగుతున్నాయని ఏసిపి తెలిపారు. ఆ సందర్భంగానే, నోవోటెల్ కు వెళ్లి మాట్లడకుందాం, మా ఫ్రెండ్ వస్తాడు అంటూ, ఇక్కడకు రప్పించినట్టు చెప్పారు. ఈ సందర్భంలో ఏమి జరిగింది అనేదాని పై విచారణ చేస్తున్నామని, ఏమి జరిగింది అనే దాని పై త్వరలోనే చెప్తాం అని అన్నారు. పరారీలో ఉన్న వేణుగోపాల రెడ్డి ని పట్టుకుంటానికి చేస్తున్నామని అన్నారు. త్వరలోనే విచారణకు సంబంధించి మొత్తం వివరాలు చెప్తాం అని అన్నారు. కారు దగ్ధం వీడియో ఇక్కడ చూడవచ్చు - https://youtu.be/sXByFiiN9R8

Advertisements

Latest Articles

Most Read