ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పే ఏ విషయమైనా బుడగల్లా పేలుతుంది. బుర్రకథలా కామెడీ అయిపోతుంది. తాజాగా ఆయన వ్యాఖ్యలు ఒక్కచోట ఒకలా చేసి తీవ్ర గందరగోళం సృష్టించారు. బెంగళూరులో ఒకే ఒక రాజధాని, అదీ విశాఖ అంటూ బల్లగుద్దిన బుగ్గన..చెన్నై వచ్చేసరికి ఏపీకి మూడు రాజధానులు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. బెంగళూరులో ఒకే రాజధాని విశాఖ అని తాడేపల్లి పెద్దల మనోభీష్టాన్ని ప్రకటించిన బుగ్గనకి కోర్టు కేసుల్లో పడేశాడని ఆగ్రహంగా ఉన్నారు వైసీపీ పెద్దలు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల పేరుతో ఆడిన డ్రామాలు బుగ్గన బుర్రకథలతో బయటపడిపోయి వైసీపీ రంగు వెలిసిపోయిందని పెద్దలు తలంటారని సమాచారం. దీంతో విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చెన్నై వెళ్లిన ఆర్థిక మంత్రి ఇక్కడ మూడు రాజధానుల పాట అందుకున్నారు. అంతకుముందు బెంగళూరు వెళ్లిన బుగ్గన విశాఖే రాజధాని అని ప్రకటించి వైసీపీ సర్కారునే ఇరుకున పడేశారు. బుగ్గన దెబ్బకి సలహాదారుడు సజ్జల, మంత్రులు మీడియా ముందుకు వచ్చి తమ విధానం ఇదంటూ వివరణ ఇచ్చారు. తాను వైసీపీకి చేసిన డ్యామేజ్ తానే కవర్ చేయడానికి చెన్నై సమావేశాన్ని వాడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రాజధానులకోసం ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లుని వెనక్కి తీసుకునే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినట్టుగానే, విశాఖ పరిపాలన రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయని వివరించారు. అయితే చెన్నై సభని లైవ్ ఇవ్వకుండా ఆపేయడం కొసమెరుపు.
news
టిడిపి దూకుడుతో వైసీపీ నేతలకి మైండ్ పోయిందా?
తెలుగుదేశం పార్టీ దూకుడు కార్యక్రమాలతో వైసీపీ గందరగోళంలో పడిందనే వారి వ్యాఖ్యల ద్వారా తేటతెల్లం అవుతోంది. మరోవైపు వైసీపీకి కోర్టుల్లోనా, కేంద్రం నుంచి వరస దెబ్బలతో అల్లాడిపోతోంది. మరోవైపు పార్టీలోనూ తిరుగుబాటు స్వరాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు టిడిపి చేసే విమర్శలు, ఆరోపణలకి సమాధానం ఇచ్చే దమ్ములేక ఏడుపుగొట్టు సవాళ్లతో ముందుకొస్తున్నారు. అనపర్తి సభలో చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి గ్రావెల్ దోపిడీపై ఆరోపణలు గుప్పించారు. దీనిపై మాట్లాడటానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే తనకు గ్రావెల్ మాఫియాతో సంబంధంలేదని చెప్పాలి. దమ్ముంటే విచారణ చేయాలని చెప్పాలి. విచిత్రంగా చంద్రబాబుకి దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. టిడిపి నుంచి గెలిచి వైసీపీలో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా తనపై చంద్రబాబు పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. టిడిపి చేసే ఆరోపణలపై సమాధానం చెప్పే దమ్ములేక ఇలా తమపై పోటీ చేయాలని ఏడుపుగొట్టు చాలెంజులు విసరుతున్నారని రాజకీయ విశ్లేషకుల మాట. ఏడుసార్లు వరసగా కుప్పం నుంచి గెలిచిన చంద్రబాబుని కుప్పంలోనే ఓడిస్తామని వైసీపీ అధినేత జగన్ చెబుతుంటే, వీళ్లేమో వారి నియోజకవర్గాలకి వచ్చి చంద్రబాబు పోటీచేయాలని అడుగుతున్నారు. ఇదంతా చూస్తున్న ప్రజలు టిడిపి దూకుడుతో వైసీపీ నేతలకి మైండ్ పోయిందని అంటున్నారు.
చంద్రబాబుని అడ్డుకుని జగన్ ఏం సాధించారు?
ఏపీలో ప్రతిపక్షనేత పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. నాలుగుదశాబ్దాలు రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు చంద్రబాబు పట్ల అనపర్తిలో పోలీసులు వ్యవహరించిన తీరు అరాచకానికి పరాకాష్టగా నిలిచింది. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న చంద్రబాబుని చిమ్మచీకట్లో 8 కిలోమీటర్లు నడిపించిన పోలీసులు, ఆయనకేమైనా జరగాలని కోరుకున్నారా అనే అనుమానాలూ వస్తున్నాయి. అనపర్తి సభకి అనుమతి ఇచ్చిన పోలీసులే సభ ఆరంభం అయ్యేముందు వేదిక మార్చుకోవాలని కోరడం అంతా అనుమానాస్పదమే. ఒక ప్రతిపక్షనేత పట్ల పోలీసులు అలా వ్యవహరిస్తారా? పోలీసుల ముసుగులో అసాంఘికశక్తులా? లేకపోతే ఎన్ ఎస్ జీ భద్రతలో వస్తున్న చంద్రబాబు కాన్వాయ్ కదలకుండా పోలీసుల్ని రోడ్డుపై కూర్చుని అడ్డుపెట్టుకున్న నేర వ్యూహం ఎవరిది? ఆ పోలీసుల్ని లేవమన్నా, లేపినా పోలీసులపై దాడి చేశారని కేసు పెట్టటానికేనన్నది వైసీపీ క్రిమినల్ ప్లాన్ అని ఎవరికైనా ఇట్టే అర్థం అవుతోంది. పోలీసుల బస్సులని చంద్రబాబుకి అడ్డంగా పెట్టారు. అటుగా ట్రాక్టర్ తో వెళుతున్న ఓ రైతుని కొట్టి దింపేసి ట్రాక్టర్‌ని అడ్డంపెట్టారు. బ్యారికేడ్లు అడ్డంపెట్టడం, టిడిపి కార్యకర్తలపై లాఠీచార్జి, చంద్రబాబు నడిచే తోవ..సభ ప్రాంతంలో కరెంట్ తీసేయడం..జనరేటర్లు ఆపేయడం.. షాపులు మూసేయించడం చూస్తుంటే...పోలీసుల్లా మాత్రం కనిపించలేదు. ప్రత్యర్థులపై దాడులు చేసే ఫ్యాక్షన్ ముఠాలని తలపించారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అనపర్తిలో పోలీసు చర్యలు చూశాక కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలు కూడా తెరవెనుక పెద్దలు ప్లాన్ చేసినవేనని అనుమానాలు వస్తున్నాయి. టిడిపి సభపై, కార్యకర్తలపై దాడులకు నేతృత్వం పోలీసులు అధికారులే వహించడం విశేషం. సీఐ శ్రీనివాస్ టిడిపి నేతలు, కార్యకర్తలపై దాడి చేసిన దృశ్యాలు చూసి ప్రజలు అవాక్కయ్యారు. డిఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుపై బిక్కవోలు పీఎస్‍లో టీడీపీ అధినేత చంద్రబాబుపైనే కేసు నమోదు చేయించడం ఇది పెద్దల ఆదేశాలతో జరుగుతున్న కుతంత్రం అని అర్థం అవుతోందని టిడిపి నేతలు అంటున్నారు.
అడ్డుకుని ఏం సాధించారు అంటే..చంద్రబాబుని మరింత కరడుగట్టినట్టు చేశారు. మామూలు సభ అయితే తాను చేసిన అభివృద్ధి వివరించి వెళిపోయేవారు చంద్రబాబు. వైసీపీ-పోలీసులు కల్పించిన అడ్డంకులతో ఆవేశంతో కూడిన ప్రసంగంతో కేడర్‌లో నూతనోత్తేజం నింపారు. అరాచక ప్రభుత్వంపై ప్రజాతిరుగుబాటుకి అనపర్తిని సంకేతంగా నిలిపారు బాబు. విపక్షాలన్నీ వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుని ముక్తకంఠంతో ఖండించాయి.
చంద్రబాబుని అడ్డుకుని జగన్ ఏం సాధించారు?
ఏపీలో ప్రతిపక్షనేత పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. నాలుగుదశాబ్దాలు రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు చంద్రబాబు పట్ల అనపర్తిలో పోలీసులు వ్యవహరించిన తీరు అరాచకానికి పరాకాష్టగా నిలిచింది. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న చంద్రబాబుని చిమ్మచీకట్లో 8 కిలోమీటర్లు నడిపించిన పోలీసులు, ఆయనకేమైనా జరగాలని కోరుకున్నారా అనే అనుమానాలూ వస్తున్నాయి. అనపర్తి సభకి అనుమతి ఇచ్చిన పోలీసులే సభ ఆరంభం అయ్యేముందు వేదిక మార్చుకోవాలని కోరడం అంతా అనుమానాస్పదమే. ఒక ప్రతిపక్షనేత పట్ల పోలీసులు అలా వ్యవహరిస్తారా? పోలీసుల ముసుగులో అసాంఘికశక్తులా? లేకపోతే ఎన్ ఎస్ జీ భద్రతలో వస్తున్న చంద్రబాబు కాన్వాయ్ కదలకుండా పోలీసుల్ని రోడ్డుపై కూర్చుని అడ్డుపెట్టుకున్న నేర వ్యూహం ఎవరిది? ఆ పోలీసుల్ని లేవమన్నా, లేపినా పోలీసులపై దాడి చేశారని కేసు పెట్టటానికేనన్నది వైసీపీ క్రిమినల్ ప్లాన్ అని ఎవరికైనా ఇట్టే అర్థం అవుతోంది. పోలీసుల బస్సులని చంద్రబాబుకి అడ్డంగా పెట్టారు. అటుగా ట్రాక్టర్ తో వెళుతున్న ఓ రైతుని కొట్టి దింపేసి ట్రాక్టర్‌ని అడ్డంపెట్టారు. బ్యారికేడ్లు అడ్డంపెట్టడం, టిడిపి కార్యకర్తలపై లాఠీచార్జి, చంద్రబాబు నడిచే తోవ..సభ ప్రాంతంలో కరెంట్ తీసేయడం..జనరేటర్లు ఆపేయడం.. షాపులు మూసేయించడం చూస్తుంటే...పోలీసుల్లా మాత్రం కనిపించలేదు. ప్రత్యర్థులపై దాడులు చేసే ఫ్యాక్షన్ ముఠాలని తలపించారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అనపర్తిలో పోలీసు చర్యలు చూశాక కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలు కూడా తెరవెనుక పెద్దలు ప్లాన్ చేసినవేనని అనుమానాలు వస్తున్నాయి. టిడిపి సభపై, కార్యకర్తలపై దాడులకు నేతృత్వం పోలీసులు అధికారులే వహించడం విశేషం. సీఐ శ్రీనివాస్ టిడిపి నేతలు, కార్యకర్తలపై దాడి చేసిన దృశ్యాలు చూసి ప్రజలు అవాక్కయ్యారు. డిఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుపై బిక్కవోలు పీఎస్‍లో టీడీపీ అధినేత చంద్రబాబుపైనే కేసు నమోదు చేయించడం ఇది పెద్దల ఆదేశాలతో జరుగుతున్న కుతంత్రం అని అర్థం అవుతోందని టిడిపి నేతలు అంటున్నారు. అడ్డుకుని ఏం సాధించారు అంటే..చంద్రబాబుని మరింత కరడుగట్టినట్టు చేశారు. మామూలు సభ అయితే తాను చేసిన అభివృద్ధి వివరించి వెళిపోయేవారు చంద్రబాబు. వైసీపీ-పోలీసులు కల్పించిన అడ్డంకులతో ఆవేశంతో కూడిన ప్రసంగంతో కేడర్‌లో నూతనోత్తేజం నింపారు. అరాచక ప్రభుత్వంపై ప్రజాతిరుగుబాటుకి అనపర్తిని సంకేతంగా నిలిపారు బాబు. విపక్షాలన్నీ వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుని ముక్తకంఠంతో ఖండించాయి.