ఫేమస్ యాంకర్ ఝాన్సీ మాజీ భర్త జోగినాయుడు తెలుసు కదా. అంటే సినిమాల్లో జోగిబ్రదర్స్ పేరుతో పేరు తెచ్చుకున్న నటుల్లో ఒకరైన జోగినాయుడు వైసీపీకి చేసిన సేవలకు ప్రతిఫలంగా ఓ కొత్త పదవిని క్రియేట్ చేసి మరీ కట్టబెట్టారు జగన్ మోహన్ రెడ్డి. అదే ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ పోస్టు. తాగుడు, వ్యసనాలతో జోగినాయుడు వేధింపులు తాళలేక ఝాన్సీ విడాకులు ఇచ్చేసింది. ఆ తరువాత డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పూరి జగన్నాధ్ పంచన చేరాడు. పూరి సోదరుడు నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యేగా పోటీచేయడంతో ఆయనతోపాటు వైసీపీలో చేరాడు. టీవీ ఆర్టిస్టు జోగినాయుడు తన కెరీర్ మొదలు పెట్టి సినిమాల్లో చిన్న చిన్న వేషాలు సంపాదించాడు. అప్పట్లో ఝాన్సీ కూడా బుల్లితెరపై రాణించింది. ఈ సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతర కాలంలో ఝాన్సీ సంపాదనపై ఆధారపడి జోగినాయుడు వ్యసనాలకు బానిసై ఆమెపై దాడి కూడా చేశాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జోగినాయుడికి విడాకులిచ్చేసింది ఝాన్సీ. వైసీపీలో చేరిన తరువాత నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ మాఫియాకి అండదండలు అందించడం, రంగురాళ్ల ముఠాలతో లావాదేవీలు జోగినాయుడు నడుపుతున్నారనే ఆరోపణలు తెలుగుదేశం క్యాంప్ నుంచి వచ్చాయి. దీనికి ఊతం ఇచ్చేలా భమిడికలొద్ది రిజర్వ్ ఫారెస్టులో బాక్సైట్ తవ్వకాలు పరిశీలించేందుకు ఎన్జీటీ టీము వస్తే వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించి విఫలం అయిన జోగినాయుడు, అక్కడ తవ్వకాలు జరగడంలేదని పెయిడ్ ఆర్టిస్టులతో కమిటీకి చెప్పించారని ప్రచారం ఉంది. మొత్తానికి ఏజెన్సీలో గనుల మాఫియాకి అండగా నిలుస్తూ వచ్చిన క్రియేటివ్ జోగినాయుడుని ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్‌గా నియమించడం జగన్ కే చెల్లిందని టిడిపి ఎద్దేవ చేస్తోంది.
news
తారకరత్న మృతిపై సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వైసీపీ సైకోలు, సాక్షి
తారకరత్న మృతితో తెలుగుదేశం పార్టీలో విషాదఛాయలు అలుముకున్నాయి. నందమూరి-నారా కుటుంబాలు శోకసముద్రంలో మునిగాయి. శవం కనబడితే రాజకీయాలు చేయడం ఆనవాయితీగా మార్చుకున్న వైసీపీలో సంబరాలు మిన్నంటుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా విషప్రచారంతో వైసీపీ వికృతానందం పొందుతోంది. వీరికి తోడు సాక్షి కూడా తారకరత్న మరణంపై పైశాచిక రాతలు అచ్చేస్తోంది. తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే, ఆయన శవం వద్దే సీఎం కావడానికి సంతకాలు సేకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్యాచు నుంచి ఇంతకంటే సంస్కారం ఎక్స్‌పెక్ట్ చేయకూడదంటున్నారు టిడిపి నేతలు. సొంత బాబాయ్ వివేకానందరెడ్డిని చంపేసి, నారాసుర రక్తచరిత్ర అని తమ సాక్షిలో అచ్చేయించిన వైసీపీ పెద్దలు శవరాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. సొంత బాబాయ్ ని చంపుకున్న చరిత్ర వైసీపీది అయితే, అబ్బాయ్ కోసం బాబాయ్‌లు, కుటుంబమంతా ప్రార్థనలు చేసిన చరిత్ర టిడిపిది అని సోషల్ మీడియాలో టిడిపి ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ ఫేక్ నుంచే కాకుండా ప్రభుత్వ పదవుల్లో వున్నవారు సైతం తారకరత్న మృతిపై పెడుతున్న సైకో పోస్టులు చూశాక, తాడేపల్లి కేంద్ర కార్యాలయ ఆదేశాలతోనే ఇలా విషం చిమ్ముతున్నారని అర్థం అవుతోంది. తారకరత్న గుండెపోటుకి గురైన రోజే అల్లుకుని ఉంచిన విషకథనాలు, ఆయన కోలుకుంటుండడంతో ఆపేశారు. 23 రోజుల తరువాత మృత్యువుతో పోరాడి ఓడిపోయాక మళ్లీ మొదలుపెట్టారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె దీర్ఘకాలిక మానసిక అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నప్పుడు వైసీపీ సోషల్ మీడియా తమ సైకో ఆనందాన్ని బయటపెట్టుకున్నాయి. మళ్లీ తారకరత్న విషయంలో వైసీపీ విషనాగులు బుసకొడుతున్నాయి.
అవినాష్ రెడ్డికి వాట్స్ అప్ కి మెసేజ్ పంపిన సిబిఐ... అరెస్టు తప్పదా?
వివేకానందరెడ్డి హ-త్యకేసులో మరోసారి కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పిలుపు వచ్చింది. ఇటీవలే సీబీఐ విచారణలో సంచలన విషయాలు వెల్లడించారని పరిణామాలు స్పష్టం చేశాయి. మళ్లీ విచారణకి పిలవడంతో ఈ సారి అరెస్టు తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హ-త్య కేసులో సిబిఐ దూకుడు పెంచేసింది. మరో మారు విచారణకు హాజరు కావాలంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు వాట్సప్ ద్వారా పంపింది. ఈనెల 24న సాయంత్రం మూడు గంటలకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. హైదరాబాదులోని సిబిఐ కార్యాలయానికి హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది సిబిఐ. గతంలో 9 గంటల పాటు అవినాష్ రెడ్డి ని విచారించిన సీబీఐ, భారతి పీఏ నవీన్, జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని పిలిచింది. ఈ నేపథ్యంలో రెండోసారి అవినాశ్ రెడ్డిని విచారణకి పిలవడంతో కీలక ఆధారాలు దొరికాయని, ఈ సారి అరెస్టు తప్పదని వార్తలు వస్తున్నాయి.
ఏపి పోలీసులకు ఎన్ఎస్జీ షాక్... జెడ్ ప్లస్ కేటగిరి నేతను ఇలా చేస్తారా అని ఆగ్రహం...
అంబేద్కర్ చట్టం ప్రకారం కాకుండా, తాడేపల్లి పెద్దల ఆదేశాలు పాటిస్తూ, కొంత మంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, అందరికీ తెలిసిందే. ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే, చివరకు చంద్రబాబు లాంటి వాడిని కూడా మీటింగ్ లు పెట్టించం, రోడ్డు మీద నడిపించుకుంటూ ఆయన వెళ్ళే దాకా వెళ్ళటం వరకు వ్య్వహరాం వెళ్ళింది. నిన్న చంద్రబాబు పై పోలీసులు వ్యవహరించిన తీరుతో అందరూ షాక్ అయ్యారు. బ్యారికేడ్లు పెట్టటం, లారీలు పెట్టటం, బస్సులు పెట్టటం, పోలీసులు అడ్డుగా కూర్చోవటం, జనరేటర్ లాక్కోవటం, విద్యుత్ ఆపటం, వ్యాన్ లు సీజ్ చేయటం, ఇలా ఇవన్నీ చూసి, పోలీసులు అసలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. అయితే చంద్రబాబు జెడ్ ప్లస్ కేటగిరి కలిగిన నేత. చంద్రబాబుతో పోలీసులు వ్యవహరించిన తీరుతో, ఢీల్లీ ఎన్ఎస్జీ స్పందించింది. రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు నడుచుకుంటూ, రాత్రి పూట నడిచే సందర్భం రావటం పై ఎన్ఎస్జీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జెడ్ ప్లస్ కేటగిరి వ్యక్తికి భద్రత ఇవ్వాలనే కనీస సోయ లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. జామర్లు లేకుండా, అంబులెన్స్ ఇవకుండా, చంద్రబాబుని నడిపించారని, ఎవరైనా రాళ్ళ దా-డి చేసి ఉంటే, ఏమి చేసే వారని, ఏపి పోలీసులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తీరు పై మండిపడింది.